Narsireddy
-
ఐరా రియల్టీ ఎండీ నర్సిరెడ్డికి అవార్డ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఐరా ఎండీ పోశం నర్సిరెడ్డిని చాంపియన్ ఆఫ్ ఛేంజ్ తెలంగాణ అవార్డ్ వరించింది. సుప్రీంకోర్టు్ట మాజీ న్యాయమూర్తి, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ కేజీ బాలక్రిష్ణన్ చేతుల మీదుగా ఈ అవార్డ్‌ను అందుకున్నారు. ధైర్యం, సమాజ సేవ, సమ్మిళిత సామాజిక అభివృద్ధి విలువలను ప్రోత్స హించడంలో వ్యక్తులు, సంస్థ లు చేసిన కృషికి గుర్తింపుగా చాం పియన్స్ ఆఫ్ ఛేంజ్ నేషనల్ అవార్డ్‌లను ప్రదానం చేస్తుంటుంది. నిర్మాణ రంగం నుంచి మైహోమ్ గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావుకు కూడా అవార్డ్ దక్కింది. ఈ అవార్డ్‌తో బాధ్యత పెరిగిందని, నంబర్ 1 రియల్టీ టెక్నాలజీ కంపెనీగా నిలిపేలా కృషి చేస్తానని నర్సిరెడ్డి తెలిపారు. -
నర్సిరెడ్డి సేవలు మరువలేనివి : గుత్తా
చిలుకూరు: ఉపాధ్యాయ వృత్తికి నర్సిరెడ్డి చేసిన సేవలు మరవలేనివని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బేతవోలు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బజ్జూరి నర్సిరెడ్డి అంత్య క్రియల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన మరణం తీరని లోటు అన్నారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, వేనేపల్లి చందర్రావు, తిప్పని విజయసింహారెడ్డి, డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, వైస్ ఎంపీపీ వట్టికూటి నాగయ్య చంద్రకళ, సర్పంచ్ తాళ్లూరి పద్మా శ్రీనివాస్, మాజీ ఎంపీపీ బజ్జూరి వెంకట్‌రెడ్డి , వివిధ పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, గ్రామస్తులున్నారు. -
ప్రజామోదం లేకుండా భూ సేకరణా?
హరీశ్‌కు టీటీడీపీ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి బహిరంగ లేఖ సాక్షి, హైదరాబాద్: గ్రామ సభలు నిర్వహించకుండా, ప్రజల ఆమోదం లేకుండా నిర్బంధంగా భూసేకరణ ఎలా చేపడతారని తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు ఆయన సోమవారం నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు బహిరంగ లేఖ రాశారు. నిరసన తెలిపిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ, భూములు ఇస్తారా, చస్తారా అంటూ బెదిరింపులకు దిగుతున్న ప్రభుత్వం... తన ధోరణిని వెంటనే మానుకోవాలన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేసి, పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయంతో పరిష్కారం చూపాలన్నారు.