
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ సంస్థ అన్విత గ్రూప్ రూ.2,000 కోట్ల భారీ ప్రాజెక్టు చేపట్టింది. హైదరాబాద్ సమీపంలోని కొల్లూరు వద్ద ఇవానా పేరుతో గృహ నిర్మాణ ప్రాజెక్టును నెలకొల్పుతోంది. 12.9 ఎకరాల్లో రెండు దశల్లో 1,850 ఫ్లాట్లు రానున్నాయి. మొదటి దశలో 15 అంతస్తుల్లో 2 టవర్లలో 450 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి కావస్తోంది.
వీటిని ఈ ఏడాది చివరికల్లా కస్టమర్లకు అప్పగిస్తారు. రెండవ దశలో 36 అంతస్తుల్లో 4 టవర్లను నిర్మించనుంది. ఇందులో భాగంగా 1,400 ఫ్లాట్లను 2027లో వినియోగదార్లకు అందజేస్తామని అన్విత గ్రూప్ సీఎండీ అచ్యుతరావు బొప్పన గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. 36 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇవానా ఉంటుందని కంపెనీ డైరెక్టర్ అనూప్ బొప్పన చెప్పారు. భారత్‌లో 6, అమెరికాలో 3 స్థిరాస్తి ప్రాజెక్టులను గ్రూప్ చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment