Anup
-
తల్లిదండ్రుల వల్లే నరకం.. వీడిన బెంగళూరు ఫ్యామిలీ డెత్ కేస్ మిస్టరీ
యశ్వంత్ పుర : అమ్మా నాన్న మాట్లాడడం లేదు. నేను కష్టంలో ఉంటే ఎవరూ చేయి పట్టడం లేదు.. అనే ఆవేదనే టెక్కీ కుటుంబం ఉసురు తీసింది. బెంగళూరు సదాశివనగర ఆర్‌ఎంవీ లేఔట్లో ఆదివారం రాత్రి ఇద్దరు పిల్లలను చంపి, ఆపై టెక్కీ దంపతులు ఆత్మహత్య చేసుకున్న కేసులో డెత్‌నోట్‌లో వారి ఆవేదన అందరికీ కంటనీరు తెప్పింది. మానవ సంబంధాలు ఎలా పతనమవుతున్నాయో చాటింది. టెక్కీ అనూప్, భార్య రాఖి తమ పిల్లలు అనుప్రియా, ప్రియాంశ్లకు విషాహారం పెట్టి హత్య చేసి ఆపై వారు ఉరి వేసుకొన్నారు. అనూప్ ఒక పేజీ డెత్‌నోట్‌ను రాసి తన సోదరునికి ఈ మెయిల్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎలా ఉన్నావు అనేవారు లేరు అనూప్ ఉద్యోగరీత్యా ఉత్తరప్రదేశ్ నుంచి బెంగళూరుకు వచ్చాడు. అనూప్ టెక్కీ కాగా, రాఖీ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేది. ఇద్దరూ వర్క్ ఫ్రం హోంలో పని చేస్తున్నారు. రాఖీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ కారణంతో తల్లిదండ్రులు అతన్ని దూరం పెట్టారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్వీకరించలేదు. మాట్లాడితే, ఆస్తిని అడుగుతాడని అనుమానించేవారని లేఖలో రాశాడు. ఇద్దరు పిల్లలు పుట్టినా ఎవరూ మాట్లాడింది లేదు. కుటుంబీకులు ఒక్కరూ వీడియో కాల్ చేసి పలకరించలేదు. దీంతో నా భార్య మానసికంగా కుంగిపోయింది. కూతురు అనుప్రియాకు బుద్ధిమాంద్యం ఉండేది. అందువల్ల నేను, రాఖీ చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు కూడా ఎవరూ మాకు ధైర్యం చెప్పలేదు అని బాధను వెళ్లబోసుకున్నాడు. పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని అనూప్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినా ఎవరూ రాలేదు. మృతదేహాలను ఆస్పత్రిలో భద్రపరిచారు. -
అన్విత గ్రూప్ 2,000 కోట్ల ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ సంస్థ అన్విత గ్రూప్ రూ.2,000 కోట్ల భారీ ప్రాజెక్టు చేపట్టింది. హైదరాబాద్ సమీపంలోని కొల్లూరు వద్ద ఇవానా పేరుతో గృహ నిర్మాణ ప్రాజెక్టును నెలకొల్పుతోంది. 12.9 ఎకరాల్లో రెండు దశల్లో 1,850 ఫ్లాట్లు రానున్నాయి. మొదటి దశలో 15 అంతస్తుల్లో 2 టవర్లలో 450 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి కావస్తోంది. వీటిని ఈ ఏడాది చివరికల్లా కస్టమర్లకు అప్పగిస్తారు. రెండవ దశలో 36 అంతస్తుల్లో 4 టవర్లను నిర్మించనుంది. ఇందులో భాగంగా 1,400 ఫ్లాట్లను 2027లో వినియోగదార్లకు అందజేస్తామని అన్విత గ్రూప్ సీఎండీ అచ్యుతరావు బొప్పన గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. 36 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇవానా ఉంటుందని కంపెనీ డైరెక్టర్ అనూప్ బొప్పన చెప్పారు. భారత్‌లో 6, అమెరికాలో 3 స్థిరాస్తి ప్రాజెక్టులను గ్రూప్ చేపట్టింది. -
ఓటీటీ .. పరిశ్రమ సూపర్ హిట్.. ఆదాయంలో దక్షిణాది సినిమాల జోరు!
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) కంటెంట్ పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ విలువ రూ.10,000 కోట్లుగా ఉంటే, 2030 నాటికి రూ.30,000 కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2024 మార్చి నాటికి రూ.12,000 కోట్లకు చేరుకుంటుందని, ఏటా 20 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఐఎన్10మీడియా సీవోవో, సీఐఐ దక్షిణ్ స్టీరింగ్ కమిటీ సభ్యుడైన అనూప్ చంద్రశేఖరన్ తెలిపారు. ఓటీటీ పరిశ్రమపై చెన్నైలో దక్షిణాది మీడియా, ఎంటర్టైన్మెంట్ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సీఐఐ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘‘ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలవుతున్న వాటితో పోలిస్తే.. వచ్చే 12 నెలల్లో దక్షిణాది భాషల్లో పెద్ద సంఖ్యలో వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి’’అని స్టార్/డిస్నీ ఇండియా బిజినెస్ హెడ్ కృష్ణన్ కుట్టి తెలిపారు. దక్షిణాది సినిమాల జోరు దేశం మొత్తం మీద దక్షిణాది సినిమాలు అత్యధిక ఆదాయాన్ని సృష్టిస్తున్నాయి. 2022లో దక్షిణాది సినిమాలు రూ.7,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి. అంతకుముందు ఏడాది ఆదాయంతో పోలిస్తే రెట్టింపు అయింది. అంతేకాదు గతేడాది దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ ఆదాయంలో దక్షిణాది సినిమాల వాటాయే 50 శాతంగా ఉండడం గమనార్హం. ఈ వివరాలను సీఐఐ దక్షిణాది విభాగం రూపొందించిన నివేదికలో పేర్కొంది. ‘తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంతో కూడిన దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆదాయం 2022లో రూ.7,836 కోట్లుగా ఉంది. 2021లో ఆదాయం రూ.3,988 కోట్టే. 2022లో మొత్తం భారత సినీ పరిశ్రమ ఆదాయం రూ.15,000 కోట్లు. దక్షిణాదిలోనూ తమిళ సినిమా రూ.2,950 కోట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రూ.2,500 కోట్లతో తెలుగు సినీ పరిశ్రమ ఉంటే, కన్నడ పరిశ్రమ ఆదాయం రూ.1,570 కోట్లు, మలయాళ పరిశ్రమ ఆదాయం రూ.816 కోట్లు. ముఖ్యంగా కన్నడ నాట కేజీఎఫ్:చాప్టర్ 1, కాంతార సినిమాలు బంపర్ వసూళ్లతో పరిశ్రమ రూపాన్ని మార్చేశాయి’అని నివేదిక తెలిపింది. మలయాళ పరిశ్రమ స్థానికంగా, విదేశాల్లోనూ ఆదాయాన్ని పెంచుకుంది. దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ఒక్కటే రూ. 1,200 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. కమల్ హాసన్ విక్రమ్, మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాలు తమిళనాట ఆదాయాన్ని పెంచాయి. 2022 లో దక్షిణాదిన 916 సినిమాలు విడుదలయ్యాయి. థియేటర్, ఓటీటీలో విడుదలైనవీ ఇందులో ఉన్నాయి. కంటెంట్‌కు డిమాండ్ స్క్రిప్ట్‌ను అందించేందుకు తాము ఒక నెల సమయం తీసుకుంటున్నామని అర్హ మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ సహ వ్యవస్థాపకుడు అజిత్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం ఏటా వివిధ ప్లాట్‌ఫామ్‌ల కోసం 60 ఒరిజినల్స్ అవసరం ఉంటోందన్నారు. నిర్మాతలు దీన్ని అవకాశంగా తీసుకోవాలని కోరారు. ‘‘తమిళం, తెలుగు ఓటీటీపైనే జీ ఓటీటీ ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించింది. ప్రస్తుతం కన్నడ ఓటీటీ మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. మలయాళం ఓటీటీ పరిశ్రమకు కావాల్సిన కంటెంట్‌ను ప్రస్తుతం నిర్మాతలు అందించే స్థితిలో ఉన్నారు’’అని జీ5 ఓటీటీ చీఫ్ క్లస్టర్ ఆఫీసర్ సిజు ప్రభాకరన్ వివరించారు. -
ఆటో డ్రైవర్‌కు రూ.25 కోట్ల లాటరీ
తిరువనంతపురం: కేరళలోని శ్రీవరాహం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ అనూప్‌కు ఓనమ్ బంపర్ లాటరీలో రూ.25 కోట్ల జాక్‌పాట్ తగిలింది. మలేసియా వెళ్లి చెఫ్‌గా స్థిరపడాలనుకుని ఏర్పాట్లు చేసుకుంటున్న ఇతడు 22 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొని అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. అన్ని పన్నులు పోను అనూప్ చేతికి రూ.15 కోట్లు అందుతాయని నిర్వాహకులు చెప్పారు. ఈ డబ్బుతో అప్పులు తీర్చి, ఇల్లు కట్టుకుంటానని అనూప్ తెలిపాడు. -
నిహారిక తన 70 వేల రూపాయల వెడ్డింగ్ డ్రెస్‌ను విరాళంగా ఇచ్చింది.. ఆ తర్వాత
Noida Anup Khanna Wedding Wear Banks And Dadi Ki Rasoi Inspiring Journey: ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్ ఉంటే అందంగా రెడీ అవుతుంటాము. ఇక పెళ్లి అంటే...జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగేది. అందులోనూ అతిరథమహారథులు హాజరై ఆశీర్వదించే అపూర్వ ఘట్టం. ఈ ఘట్టంలో వధూవరులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఆహూతులందరిని ఆకర్షించేందుకు ఆర్థిక స్థాయిని బట్టి ఒక్కొక్కరు ఒక్కోరకంగా తయారవుతుంటారు. అయితే కొందరికి అందంగా తయారవ్వాలని ఉన్నా... ఆకర్షణీయంగా కనిపించే వెడ్డింగ్ డ్రెస్ కొనే స్థోమత ఉండదు. దీంతో ఆశ కలగానే మిగిలిపోతుంటుంది. అయితే ఇటుంవంటి వారి కోరికలను నిజం చేస్తోంది ‘వెడ్డింగ్ వేర్ బ్యాంక్’. వెడ్డింగ్ బ్యాంక్ ఏంటీ? అనిపిస్తుంది కదూ! అవును మీరు చదివింది అక్షరసత్యమే. వెడ్డింగ్ వేర్ బ్యాంక్... పెళ్లిలో వధూవరులు ధరించడానికి డిజైనర్ దుస్తులను కొన్నింటిని ఉచితంగా, మరికొన్నింటిని నామమాత్రపు రుసుముకు అద్దెకు ఇస్తుంది. పెళ్లి లేదా ఏదైనా ఫంక్షన్ మగిసిన తరువాత డ్రెస్‌లను వెనక్కి తిరిగిచ్చేయాలి. ప్రస్తుతం ఈ బ్యాంక్‌లో ఉన్న డ్రెస్‌లను వధువులేగా పెళ్లికుమారులు కూడా వాడుకుంటున్నారు. ఇక్కడ అద్దెకు ఇచ్చే లెహంగాల ఖరీదు ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. నిహారిక ఆలోచనతో.. నోయిడాకు చెందిన అనూప్ ఖన్నా 2017లో ఈ బ్యాంక్‌ను ప్రారంభించి, నిర్వహిస్తున్నారు. తొలిసారి ఈ బ్యాంక్‌కు నిహారిక అనే అమ్మాయి తన 70 వేల రూపాయల వెడ్డింగ్ డ్రెస్‌ను విరాళంగా ఇచ్చింది. నిహారిక తన పెళ్లి తరువాత.. ‘‘ఈ డ్రెస్‌ను ఎవరైనా నిరుపేద అమ్మాయి పెళ్లికి వేసుకోవడానికి ఇవ్వండి’’ అని చెప్పి అనూప్ కు ఇచ్చింది. అప్పుడు చుట్టుపక్కల మురికివాడల్లోని అమ్మాయిల పెళ్లిళ్లకు అనూప్ డ్రెస్‌ను ఇచ్చారు. ఈ విషయం ఆనోటా ఈనోటా మరికొంతమందికి తెలియడంతో బాగా పాపులర్ అయ్యింది. బ్యాంక్ గురించి తెలిసిన కొందరు తమ పెళ్లిలో ధరించిన ఖరీదైన దుస్తులను విరాళంగా ఇస్తున్నారు. వీటిలో లక్షరూపాయలు ఖరీదు చేసే డ్రెస్‌లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దీనిలో పదిహేను రకాల లెహంగాలు, ఇరవై షేర్వానీలు అద్దెకు లేదా ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వీటిలో నచ్చిన రంగు, డిజైన్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. పెళ్లికేగాక నిశ్చితార్థం, దీపావళి, దాండియా నైట్ వంటి ఈవెంట్లకు సైతం వీటిని వినియోగిస్తున్నారు. నిబంధనలు తప్పనిసరి.. వెడ్డింగ్ బ్యాంక్ నుంచి డ్రెస్‌లు తీసుకోవాలంటే...కొన్ని నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే. ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డును హామీగా తీసుకుని డ్రెస్ ఇస్తారు. ఒకసారి డ్రెస్ తీసుకున్న తరువాత పదిహేను రోజుల వరకు మరో డ్రెస్ తీసుకునే అవకాశం ఉండదు. తీసుకున్న డ్రెస్‌ను తిరిగి ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా డ్రైక్లీనింగ్ చేసి ఇవ్వాలి. డ్రెస్ తీసుకున్న వాళ్లు మాత్రమే వాడుకోవాలే తప్ప వేరే వాళ్లకు ఇవ్వకూడదు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోనే గాక..మహారాష్ట్ర, జమ్ము అండ్ కశ్మీర్, పంజాబ్, మధ్యప్రదేశ్లనుంచి కూడా కొందరు తమ వెడ్డింగ్ డ్రెస్‌లను విరాళంగా ఇస్తున్నారు. పెళ్లిబట్టలతోపాటు ఇమిటేషన్ జ్యూవెలరీ, చెప్పులు, మేకప్ యాక్ససరీస్ వంటి వాటిని కూడా ఇస్తున్నారు. దాదీకా రసోయి అనూప్ వెడ్డింగ్ వేర్ బ్యాంక్ నిర్వహణతోపాటు రుచికరమైన ఆహారం పెట్టి నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు. వాళ్ల ‘గ్రాండ్ మదర్స్ కిచెన్ (దాదీకా రసోయి)’ ద్వారా దేశ విదేశాల్లోని వలసకూలీలకు కరోనా లాక్డౌన్ సమయంలో ఆహారం అందించారు. అంతేగాక పేదలకు నామమాత్రము రుసుము పదిరూపాయలకే మందులు, బట్టలు అందిస్తున్నారు. ఈ సేవలు గుర్తించిన రాష్ట్రపతి భవన్ అనూప్‌ను సత్కరించింది. అంతేగాక ‘కౌన్ బనేగా కరోర్‌పతి’ షోకు వెళ్లినప్పుడు అనూప్ సేవలను అమితామ్ బచ్చన్ కొనియాడారు. చదవండి: ‘గైడ్’ సినిమాను తలపించే ప్రేమ కథ.. ఫ్రెంచ్ అమ్మాయి మనసు దోచిన బిహారీ -
2209కి తీసుకెళ్తాను
టైమ్ మిషన్ ఎక్కి 200 సంవత్సరాలు ముందుకు వెళ్లడానికి సిద్ధమయ్యారు కన్నడ హీరో సుదీప్. ఆయన వెళ్లడమే కాదు ప్రేక్షకుల్ని కూడా తనతో పాటు తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు. ‘బిల్లా రంగా భాషా’ చిత్రం కోసమే ఈ టైమ్ మిషన్ ప్రయాణం. 2209లో ఈ చిత్రకథ సాగనుంది. అనూప్ బండారీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. ‘‘190 ఏళ్ల తర్వాత జీవన విధానం ఎలా ఉండబోతోందనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రత్యేకంగా 2209 అనే సంవత్సరాన్నే ఎందుకు చూపిస్తున్నామో సినిమా చూసి తెలుసుకోవాలి. సుదీప్ సరికొత్త గెటప్స్‌లో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
1.09 కోట్ల ఓట్లలో 24 లక్షల ఓట్లు తొలగింపు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇంటింటికీ సర్వే జరిపి ఓటరు జాబితాల సవరణ జరుపుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనూప్ సింగ్ తెలిపారు. 36 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,09,44,968 ఓట్లు ఉండగా ఇంటింటికీ సర్వే జరిపి పలు కారణాలతో 24,20,244 (22.11శాతం) ఓట్లు తొలగించినట్లు వెల్లడించారు. మరో 29,93,777 (27.35 శాతం) ఓటర్లు వేరే చిరునామాలకు తమ ఓట్లను బదిలీ చేసుకున్నారని చెప్పారు. సర్వే తర్వాత 55,30,947 (50.53 శాతం) ఓట్లు ఎలాంటి మార్పులు లేకుండా ఉన్నాయన్నారు. కొత్తగా 5,82,138 (6.4 శాతం) నమోదు చేసుకున్నారని తేలినట్లు వివరించారు. ఇంటింటి సర్వే ముగిశాక మొత్తం 91,06,862 ఓట్లు మిగిలినట్లు చెప్పారు. ఓటరు జాబితా సవరణపై మంగళవారం సచివాలయంలో మాట్లాడుతూ.. ప్రత్యేకంగా రూపొం దించిన వెబ్ ఆధారిత అప్లికేషన్ ద్వారా ఓటరు జాబితాల సవరణ చేపట్టినట్లు తెలిపారు. సర్వే అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను గత నెల 27న ప్రచురించినట్లు చెప్పారు. ఈ జాబితాను www.ceotelangana.nic.in వెబ్సైట్లో చూడొచ్చని సింగ్ చెప్పారు. దీనిపై అభ్యంతరాలు, కొత్త ఓట్ల నమోదు, తొలగింపులు, సవరణల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 2018 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు వచ్చే వారందరూ కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. 36 నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను 2018 జనవరి 20న ప్రచురించనున్నట్లు తెలిపారు. సాధారణ సవరణ అనంతరం మిగిలిన నియోవకవర్గాలకు సంబంధించిన ముసాయిదా జాబితాను ఈ నెల 15న ప్రచురించనున్నట్లు వివరించారు. గతంలో ఏపీలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పైలట్ ప్రాజెక్టు కింద ఓటరు జాబితాల సవరణ నిర్వహించినట్లు గుర్తు చేశారు. సర్వే జరిగింది ఈ స్థానాల్లోనే.. ఆదిలాబాద్, కరీంగనర్, సంగారెడ్డి, పటాన్చెరు, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, మలక్‌పేట, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పూర, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మహబూబ్‌నగర్, నల్లగొండ, స్టేషన్ ఘన్పూర్, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, ఖమ్మం, పాలేరు. -
అనూప్, శివలకు ‘శాట్స్’ ఎండీ ప్రశంస
సాక్షి, హైదరాబాద్: ఇటీవల అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు గెలుపొందిన స్కేటర్ అనూప్ కుమార్ యామ, లిఫ్టర్ శివ కుమార్‌లను ‘శాట్స్’ మేనేజింగ్ డెరైక్టర్ ఎ. దినకర్‌బాబు అభినందించారు. అర్జున అవార్డీ అనూప్ కుమార్ ఆసియా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో సీనియర్ పురుషుల ఫిగర్ స్కేటింగ్, కంబైన్డ ఈవెంట్లలో రెండు బంగారు పతకాలు గెలిచాడు. దీంతో పాటు ఇన్లైన్ ఆర్టిస్టిక్ స్కేటింగ్, సోలో డాన్స ఈవెంట్లో చెరో రజతం నెగ్గాడు. వెరుుట్లిఫ్టర్ శివ కుమార్ అంతర్జాతీయ యూనివర్సిటీ పోటీల్లో 56 కేజీ కేటగిరీలో రజత పతకం గెలుపొందాడు. -
అనూప్‌తో ’సాక్షి’ ఫేస్ టు ఫేస్
-
స్కేటింగ్ స్టార్
టాలెంట్ స్కేటింగ్‌లో ఎన్నో బంగారు పతకాలు సాధించి విదేశాల్లో భారత దేశ పతాకాన్ని ఎగురవేశాడు 30ఏళ్ల అనూప్ కుమార్ యామా. రోలర్ స్కేటింగ్‌లో ఇండియా నెం.1, ఆసియా నెం.1, వరల్డ్ నెం.1గా నిలిచి తన సత్తా చాటాడు అనూప్... అనూప్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాలుగేళ్ల వయసు నుంచే స్కేటింగ్ చేయడం ప్రారంభించాడు. స్కేటింగ్‌లో రెండు రకాలైన రోలర్, ఐస్ స్కేటింగ్‌లోనూ అనూప్‌కు ప్రావీణ్యం ఉంది. రోలర్‌లో భాగమైన ఆర్టిస్టిక్ స్కేటింగ్‌లో దిట్టైన అనూప్ తన ఆటలో భారత దేశ సంస్కృతి ఉట్టిపడేలా ప్రతిభ కనబరుస్తున్నాడు. ‘‘రోలర్ స్కేటింగ్‌లో ఎన్ని విజయాలు సాధించినా నాకు మంచు మీద చేసే ఐస్ స్కేటింగ్ అంటే బాగా ఇష్టం’’ అంటున్నాడు ఈ తెలుగు తేజం. అనూప్ నాన్న వీరేశ్ కూడా స్కేటింగ్‌లో దిట్టే. ప్రస్తుతం ఆయన స్కేటింగ్ నేషనల్ కోచ్‌గా, ఆ క్రీడాపోటీల్లో జడ్జిగా వ్యవహరిస్తుంటారు. వాళ్లింట్లో మరో స్కేటింగ్ స్టార్ ఉన్నాడు. అతనే అనూప్ అన్నయ్య అమర్‌నాగ్ యామా. మనదేశం నుంచి ఇంకెంతో మంది తనలా స్కేటింగ్‌లో వరల్డ్ ఛాంపియన్లు కావాలనే ఉద్దేశంతో సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన ఇంట్లోనే ‘యామా స్కేటింగ్ అకాడమీ’ని స్థాపించాడు. ఈ ఆటపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నో సెమినార్లూ ఇచ్చాడు. 60 దేశాలు పాల్గొన్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో వరల్డ్ నెం.1 స్థానాన్ని చేజిక్కించుకుని విదేశాల్లో భారతదేశ సత్తా చాటిన అనూప్ ప్రస్తుతం కొలంబియా(దక్షిణాఫ్రికా)లో జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్-2015లో విజయం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. అలాగే ఈ నెల ముంబైలో జరిగే జాతీయ స్కేటింగ్ పోటీలకు తన అకాడమీ నుంచి 16మందిని సిద్ధం చేస్తున్నాడు. 2018లో జరిగే శీతాకాల క్రీడల ఒలంపిక్స్‌లో పాల్గొని వరల్డ్ నెం.1 అయ్యేందుకు విదేశాల్లో శిక్షణకు వెళుతున్నట్లు అనూప్ తెలిపాడు. అనూప్ 2010లో విడుదలైన ‘లఫంగే పరిందే’ చిత్రంలో హీరో నీల్నితీశ్ దేశ్‌ముఖ్, హీరోయిన్ దీపికా పదుకొనెకు రెండు నెలలు స్కేటింగ్‌లో శిక్షణ కూడా ఇచ్చాడు. ఫొటో: ఎన్.రాజేశ్‌రెడ్డి తైవాన్(చైనా)లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్- 2013లో బంగారు పతకం న్యూజిలాండ్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్- 2012లో కాంస్య పతకం స్పెయిన్‌లోని 2014 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం జాతీయ స్థాయిలో, ఆసియా ఛాంపియన్ షిప్లో ఎన్నో బంగారు పతకాలు గెలుచుకున్నాడు.