huge project
-
అన్విత గ్రూప్ 2,000 కోట్ల ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ సంస్థ అన్విత గ్రూప్ రూ.2,000 కోట్ల భారీ ప్రాజెక్టు చేపట్టింది. హైదరాబాద్ సమీపంలోని కొల్లూరు వద్ద ఇవానా పేరుతో గృహ నిర్మాణ ప్రాజెక్టును నెలకొల్పుతోంది. 12.9 ఎకరాల్లో రెండు దశల్లో 1,850 ఫ్లాట్లు రానున్నాయి. మొదటి దశలో 15 అంతస్తుల్లో 2 టవర్లలో 450 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి కావస్తోంది. వీటిని ఈ ఏడాది చివరికల్లా కస్టమర్లకు అప్పగిస్తారు. రెండవ దశలో 36 అంతస్తుల్లో 4 టవర్లను నిర్మించనుంది. ఇందులో భాగంగా 1,400 ఫ్లాట్లను 2027లో వినియోగదార్లకు అందజేస్తామని అన్విత గ్రూప్ సీఎండీ అచ్యుతరావు బొప్పన గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. 36 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇవానా ఉంటుందని కంపెనీ డైరెక్టర్ అనూప్ బొప్పన చెప్పారు. భారత్‌లో 6, అమెరికాలో 3 స్థిరాస్తి ప్రాజెక్టులను గ్రూప్ చేపట్టింది. -
భారీ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్న హెచ్‌సీఎల్ టెక్
ప్రముఖ టెక్నాలజీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Tech) భారీ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక సంస్థలలో ఒకటైన బ్యాంకో డో బ్రెజిల్ (Banco do Brasil) సేల్స్‌ఫోర్స్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్లను మెరుగుపరిచేందుకు హెసీఎల్ టెక్నాలజీస్‌ను ఎంచుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. సేల్స్‌ఫోర్స్‌తో భాగస్వామ్యం ద్వారా హెచ్‌సీఎల్ టెక్.. బ్యాంకో డో బ్రెజిల్ కస్టమర్ రిలేషన్స్, సర్వీస్ సొల్యూషన్లను మెరుగుపరచనుంది. తమ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వనరులు, డేటా ఇంటిగ్రేషన్, ఇంటెలిజెంట్ గైడ్‌లైన్స్‌ను ఉపయోగించి కస్టమర్ సంతృప్తి, ఎంగేజ్‌మెంట్‌ను పెంచడంలో సహాయపడుతుంది. లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక సంస్థ లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక సంస్థలలో ఒకటైన బ్యాంకో డో బ్రెజిల్ దాని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సేల్స్‌ఫోర్స్ అమలుకు హెచ్‌సీఎల్ టెక్‌ను పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంచుకుంది. (టీసీఎస్‌లో మరో కొత్త సమస్య! ఆఫీస్‌కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..) బ్యాంకో డో బ్రెజిల్ అవసరాలకు అనుగుణంగా సేల్స్‌ఫోర్స్ సొల్యూషన్స్‌ను అమలు చేయడానికి హెసీఎల్ టెక్ కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ అనుభవం ఉన్న ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే సంపూర్ణ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి నాలుగు సేల్స్‌ఫోర్స్ పరిష్కారాలను ఉపయోగించనుంది. అయితే ఈ భారీ ఒప్పందం విలువ ఎంత అనేది వెల్లడించలేదు. ఇదీ చదవండి: 70 hours work: ఆయనైతే 90 గంటలు పనిచేసేవారు.. భర్తకు అండగా సుధామూర్తి -
షాద్‌నగర్‌లో గోల్డెన్ గ్రీన్ కౌంటీ
సాక్షి, హైదరాబాద్: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని అభిరామన్ డెవలపర్స్ పలు వెంచర్లకు శ్రీకారం చుట్టింది. అందుబాటు ధరల్లో సామాన్యుల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా పలు భారీ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేస్తున్నామని పదమూడేళ్లుగా స్థిరాస్తి రంగంలో అనుభవమున్న సంస్థ ఎండీ టీ మహేందర్ తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ♦ షాద్‌నగర్‌లోని సోలిపూర్ గ్రామంలో 25 ఎకరాల్లో గోల్డెన్ గ్రీన్ కౌంటీ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో మొత్తం 289 ఓపెన్ ప్లాట్లుంటాయి. 147 నుంచి వెయ్యి గజాల మధ్య ప్లాట్లున్నాయి. ధర గజానికి రూ.6,500. ♦ ఇప్పటికే వందకు పైగా ప్లాట్లు బుకింగ్ అయ్యాయి. 40, 60 ఫీట్ల రోడ్లు, పార్క్, ఓవర్ వాటర్‌హెడ్ ట్యాంక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటి వసతులుంటాయి. ♦ రావిర్యాలలోని వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్‌కు ఎదురుగా 6 ఎకరాల్లో వండర్ విల్లాస్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. ఇందులో 66 ప్లాట్లుంటాయి. 200 గజాల నుంచి 680 గజాల మధ్య ప్లాట్ల విస్తీర్ణాలున్నాయి. ధర గజానికి రూ.19 వేలు. ఇప్పటికే 40 ప్లాట్లు బుకింగ్ అయ్యాయి. ♦ శ్రీశైలం హైవే లోని ఫ్యాబ్‌సిటీ ప్రధాన ద్వారం ఎదురుగా డైమండ్ విల్లాస్ పేరిట 54 ఎకరాల్లో భారీ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందు లో మొత్తం 218 ప్లాట్లుంటాయి. 120 గజాల నుంచి 1,200 గజాల మధ్య ప్లాట్లుంటాయి. ధర గజానికి రూ.10 వేలు. ఇప్పటికే 50 శాతం బుకింగ్ పూర్తయ్యాయి. రోడ్లు, పార్క్ వంటి అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యాయి. అందుబాటుకే ఆదరణ సాక్షి, హైదరాబాద్: మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయని సర్వేలు చెబుతున్నాయి. దీంతో బడా డెవలపర్లు పునరాలోచనలో పడ్డారు. దిగ్గజాలైన నిర్మాణ సంస్థలు ఆర్ధిక మాంద్యం దెబ్బతో నీరసపడ్డాయి. ప్రవాస భారతీయులు, ఐటీ నిపుణులు అనుకున్నంత స్థాయిలో కొనుగోళ్లు జరపకపోవటమే ఇందుకు కారణం. దీంతో తక్కువ విస్తీర్ణం గల ఇళ్లకు శ్రీకారం చుట్టాయి. నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి. విస్తీర్ణం తక్కువ గల ఫ్లాట్లను నిర్మించడానికి ప్రజయ్, జనప్రియ సంస్థలు ముందుకొచ్చాయి. కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో రూ.25 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడుమంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య తక్కువ. హైదరాబాద్ నిర్మాణ రంగం ఐటీ నిపుణుల మీదే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఆర్థిక మాంద్యం కనుమరుగు కావటంతో ఐటీ నిపుణులు అధికంగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఇందుకు పలు కారణాలున్నాయి. వీరికి స్థానిక అంశంతో సంబంధం లేదు. పైగా పుణె, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో రేట్లు తక్కువగా ఉండటం. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నగరం వైపు దృష్టి సారిస్తున్నారు. -
మెగా ప్రాజెక్టుల్లోకి పెట్టుబడులు రావాలి
అన్నిరకాలుగా సహకరిస్తాం: నిర్మలా మదురై: భారీ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం ఆశిస్తోందని, ఇందుకు అవసరమైన తోడ్పాటును అందించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. బీహెచ్ఈఎల్ లాంటి భారీ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలతో ప్రైవేట్ సంస్థలు గానీ వస్తే.. తగు సహాయ, సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ.. కార్పొరేట్ ఎంగేజ్మెంట్ అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్మికులను సుశిక్షితులుగా తీర్చిదిద్దేందుకు నైపుణ్యాల అభివృద్ధి పథకం ద్వారా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. -
రూటు మారిందా.. గోవిందా..!
రూ. వంద కోట్ల వ్యయంతో గుంటూరులో ఏర్పాటు కానున్న భారీ ప్రాజెక్టు ‘డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్’ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు....ఇందులో ఆయన సఫలీకృతులవుతున్నట్టు ఆ శాఖ ఉన్నతాధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. ఆయన సొంత జిల్లా ప్రకాశంలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం నిర్మాణానికి మార్గం సుగమం అయినట్టేనని చెపుతున్నారు. సాక్షి, గుంటూరు : రాష్ట్రంలోనే మొట్టమొదట ఏర్పాటు కానున్న అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన ‘డ్రైవింగ్ శిక్షణ కేంద్రం’ను నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం జరగనున్న గుంటూరు జిల్లాలో ఏర్పాటుకు రవాణాశాఖ ఉన్నతాధికారులు ఆరు నెలల క్రితమే ప్రతిపాదనలు పంపారు. ఇందుకోసం గుంటూరులోని అడవితక్కెళ్లపాడు వద్ద ఐదెకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులతో కలసి అప్పటి డీటీసీ సుందర్ పరిశీలించారు. సుమారు రూ. వంద కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ కేంద్రాన్ని రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఆంధ్రాలోని 13 జిల్లాలకు సౌకర్యంగా ఉంటుందనేది ఉన్నతాధికారుల ఉద్దేశం. దీనికి సంబంధించి నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. గుంటూరులో నెలకొల్పడం దాదాపు ఖాయమనుకుంటున్న తరుణంలో రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు మంత్రాంగం నడిపి తన సొంత జిల్లా అయిన ప్రకాశంకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం స్థలాన్ని సైతం సిద్ధం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. మంత్రి స్వయంగా ప్రతిపాదనలు పంపించిన తరువాత ఉన్నతాధికారులు సైతం ఆయన మాట కాదనలేక గుంటూరు ఊసు ఎత్తడం లేదని తెలుస్తోంది. గుంటూరులో ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళ్లిన తరువాత మంత్రి దీనిని ప్రకాశం జిల్లాకు తరలిస్తున్నట్లు తె లిసి కూడా గుంటూరు జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు మిన్న కుండటం విమర్శలకు తావిస్తోంది. గుంటూరు జిల్లాలో రాజధానికి భూములు సమీకరించి ప్రాజెక్ట్‌లను మాత్రం లేకుండా చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తమ సొంత పనులు చూసుకోవడమే సరిపోతుందని, ఉపాధి కల్పించే ప్రాజెక్ట్‌లను జిల్లాకు తేవడంలో విఫలమౌతున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఇప్పటికైనా మంత్రులు స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి శిక్షణ కేంద్రం ప్రకాశం జిల్లాకు తరలిపోకుండా చూడాలని కోరుతున్నారు. డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగాలు .... రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్మించే డ్రైవింగ్ శిక్షణ కేంద్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే ఉంటుంది. అత్యాధునిక హంగులతో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఐదు నుంచి పదెకరాల స్థలంలో సువిశాలంగా నిర్మించే ఈ కేంద్రంలో ఐదు హెవీ డ్రైవింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తారు. రోజుకు సుమారు 20 మందికి పైగా శిక్షణ పొందే విధంగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్కరికీ వారం నుంచి పది రోజుల పాటు శిక్షణ ఇస్తారు. కేంద్రంలో ఇన్‌బుల్ట్ కెమెరాలు ఏర్పాటు చేసి డ్రైవింగ్ నైపుణ్యాన్ని కంప్యూటర్లో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇక్కడ శిక్షణ పొందే వారికి వైద్య సేవలు అందించడంతోపాటు బీమా కూడా వర్తింపజేస్తారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అన్ని హంగులతో రూ. వంద కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న శిక్షణ కేంద్రం గుంటూరు నుంచి తరలివెళ్లనుందన్న వార్త జిల్లా ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. -
మిషన్ కాకతీయ-భావుకత.. వాస్తవికత
ప్రస్తుతం చెరువుల పట్ల కాల్పనికతను జోడిస్తున్నారు. గత కాలంలోని వ్యవస్థలను ప్రశంసించడం మంచిదే. కానీ కాలం మారిందని గుర్తించాలి. సామాజిక మార్పుల ను అర్థం చేసుకోకుంటే పాత వ్యవస్థలను పునరుద్ధరించడమే అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నీరు అతి ప్రధాన సమస్య అవు తోంది. సాగునీటి పారుదలను మెరుగుపర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టులపై దృష్టి పెడుతోంది. నూతన రాష్ట్రం ఏర్పాటుతో వ్యవసా యానికి మరింత నీరు లభ్య మవుతుందని తెలంగాణ ప్రజల్లో ఆశలు పెరిగిపోయా యి. దీంతో ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ను ప్రక టించింది. వార్తల ప్రకారం మిషన్ కాకతీయ మొత్తం వ్యయం రూ. 20 వేల కోట్లు. ఈ బడ్జెట్లో రూ. 2,000 కోట్లను ప్రతిపాదించారు. తెలంగాణ మొత్తం మీద వివిధ రూపాల్లో 46,531 చెరువులు ఉన్నాయని ఇటీవలే అచ్చయిన ఓ పుస్తకం చెబుతోంది. 2015 నుంచి ప్రతి ఏటా 20 శాతం చెరువులను పునరుద్ధరించి వినియోగం లోకి తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. అంటే జనవరి 16 నుండి రోజుకు రూ. 15 కోట్ల వ్యయంతో సగటున ప్రతిదినం 68 గ్రామ చెరువులను పునరుద్ధరిం చనున్నారు. దీంతో భూగర్భ జలాల మట్టం పెరుగుతుం దని, పల్లెల్లో బోరుబావులు, చేతి పంపులు నిరంతరం పనిచేస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ పథకంలో ప్రత్యక్షంగా రైతులు, పరోక్షంగా వ్యవసాయ కూలీలు లబ్ధిదారులు కాగా, పశువుల కాపర్లు, చేతి వృత్తుల వారు కూడా లబ్ధి పొందనున్నారు. ఇంత భారీ ప్రాజెక్టు మదింపునకు ప్రాజెక్టు డాక్యు మెంట్లు, విశ్లేషణలు, ఖర్చు ఆదా అధ్యయనాలు వంటివి చాలా అవసరం. ప్రభుత్వం దీన్ని బహిరంగపర్చనం దున ఈ ప్రాజెక్టు హేతుబద్ధత, దాని ప్రతిపాదిత ప్రయో జనాలపై స్వతంత్ర మదింపు కష్టమవుతోంది. తెలంగా ణలో ప్రతి ఒక్కరూ ఈ ప్రాజెక్టు నుంచి లాభాలను ఆశిస్తున్నారు. అయితే వాస్తవానికి అలానే జరుగుతుం దా? మిషన్ కాకతీయను మరింత ఆచరణాత్మకంగా, సమర్థవంతంగా మలచాలంటే కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. గత ఆచరణ సమీక్ష: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోసహా భారత్‌లో చెరువుల పునరుద్ధరణపై అనేక ప్రయత్నాలు జరిగాయి. కొన్ని ప్రాజెక్టులను భారీ పెట్టుబడులతో అమలు చేశారు. తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రపంచ బ్యాంకు, డచ్ ఎయిడ్, జపనీస్ ఎయిడ్ వంటి సంస్థల నిధులతో చెరువుల పునరుద్ధరణకు ఒక ప్రాజెక్టు గతం లో నడిచింది. ప్రస్తుత ప్రాజెక్టు ప్రణాళిక దశతో సంబం ధమున్న వారు తగిన అనుభవాలు, గుణపాఠాల కోసం గతంలో జరిగిన ప్రయత్నాలను పరిశీలించాలి. ప్రస్తుత నేపథ్యంలో చెరువులు : నేటి చెరువుల పట్ల కాస్త కాల్పనికత, భావుకతను జోడిస్తున్నారు. గత వ్యవస్థల ను ప్రశంసించడం మంచిదే. భారత్‌లో చెరువుల వ్యవస్థ లను బాగా రూపొందించారు, అమలు చేశారు కూడా. చెరువుల నిర్మాణంలో తెలంగాణకు కనీసం వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే కాలం మారింది. భౌగోళికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పెనుమార్పులకు గురయిన చెరువులను మనం ప్రస్తు తం పరిశీలించాలి. సమాజంలో వచ్చిన మార్పులను మనం అర్థం చేసుకోకుంటే, ప్రస్తుత వాస్తవికతలోకి పాత వ్యవస్థలను బలవంతంగా నెట్టినట్లే కాగలదు. చెరువుల వ్యవస్థ ఏర్పడిన కాలం నుంచి నేటిదాకా జరిగి న మూడు ప్రధాన మార్పులను మనం చూడాలి. (ఎ) ఆనాడు కొన్ని సామాజిక వర్గాలను సేవ చేసేందుకు ఇవి అధికార క్రమంలో, అణిచివేత క్రమం లో ఇవి ఏర్పడ్డాయి. నాటి చెరువునే నేడూ కోరుకుం టున్నామంటే పెనుమార్పులకు గురయిన సమాజంలో, మారిన ఆర్థిక వాస్తవికతలో ఒక నిర్దిష్ట సాగునీటి వ్యవస్థ ను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామన్న మాట. (బి) సాంకేతికంగా చూస్తే, నీరు ప్రధాన సమస్యగా అవరోధంగా లేని సందర్భంలోనే చెరువులను రూపొం దించి నిర్మించారు. ఇప్పుడు వివిధ ఉపయోగాలకు నీటి లభ్యత, దాని కేటాయింపులో తీవ్రమార్పులొచ్చాయి. ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణ తనకు తానుగా నీటి లభ్యతను మెరుగుపర్చదు. (సి) భూమి హక్కులు నేడు మారిన స్థితిలో చెరువుల పునరుద్ధరణ చాలా సంక్లిష్టమైనది. ఉదాహ రణకు చెరువుల పరిధిలోని భూము ల్లో చాలాభాగాన్ని ఇప్పటికే ఆక్రమించేశారు. వీటి పునరుద్ధరణలో సామాజిక సమస్యలు పొంచుకుని ఉన్నాయి. నిర్వహణ సమస్యలు చాలా ఉన్నాయి. ప్రత్యేకించి పేదలకు కేటాయించిన భూములు, వేసవిలో పశువుల మేతకు ఉపయోగించే భూముల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. (డి) నేటి చెరువులు గతంలో వలే భూ ఉపరితల నీటి వినియోగం కోసం కాకుండా భూగర్భ జలాల రీచార్జికి ఉపయోగపడు తున్నాయి. కాబట్టి ఉపరితలంలో నీటిని నిలువ చేయ డం కంటే రీచార్జి చేయడానికి చెరువులను డిజైన్ చేయబోతున్నప్పుడు మరింత జాగ్రత్త పాటించాలి. కాబట్టి చెరువులు పూడికతీత, తవ్వడం, కట్టలను, గట్లను బలోపేతం చేయడం, మూల జలాన్ని శుద్ధి చేయ డం ద్వారా ఏదో ఒరిగిపోతుందని, తాగునీటి సమస్య పరిష్కారమై పోతుందనుకుంటే అమాయకత్వమే. నీటి ఉత్పాదకత, సామర్థ్యత: నీరు దాని నిర్వహణ పట్ల మన అహగాహనకు సంబంధించి ఇది అత్యంత క్లిష్టమై న అంశం. నీటిని తిరిగి ఉత్పత్తి చేయవచ్చు కాని వనరులు తక్కువ. నీరు ఏకైక సహజ వనరు. దాని అపరిమితి, కొరత, నాణ్యత అనేవి దాని ఉపయోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సంవత్సరంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో నీటి లభ్యత, దాని అలభ్యత అనేది అతి ముఖ్యమైన అవరోధంగా పరిణమిస్తోంది. నీటి విషయంలో ఇతర పద్ధతులను చేపట్టకపోతే సమస్య పరిష్కారం కాదు. దీంతో మరింత వరి సాగు, మరింత నీటి వృథా, మరింత డిమాండ్‌కు దారితీయక తప్పదు. వ్యయ, రాబడి నిష్పత్తి ముఖ్యం: నీటి కోసం అపారమైన ప్రజాధనం వెచ్చిస్తున్నారు. భారీ నిధులను వివేకంతో, సమర్థ ఉత్పాదకతతో వెచ్చించాలి. దేశంలో భారీ ప్రాజెక్టులను ఎలాంటి కీలక ప్రశ్నలను సంధించకుం డానే నిర్మిస్తూ పోయిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి రూ.2 వేల కోట్లను ఖర్చుపెట్టే ముందు దాని గుణాత్మక ప్రయోజనాలు ఏవిటనే ప్రశ్న రావాలి. పైన ప్రస్తావించిన అంశాలను, హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుంటూ తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మిషన్‌ను మరింత స్పష్టమైన, పారదర్శకమైన రీతిలో ప్రారంభించవలసి ఉంది. గందరగోళం, తొందరపాటు అనేవి తరచుగా వాస్తవాలను కప్పిపెట్టడానికే ఉపయోగ పడతాయి. గతంలో ఇదే జరిగి ఉంటే ప్రభుత్వం ఆ మార్గాన్ని వదిలివేయాలి. భారీ నిధులతో ప్రతిపాదిస్తున్న రెండు ప్రాజెక్టులు ఉద్వేగం కంటే మరిన్ని సందేహాలనే లేవనెత్తుతున్నాయి. ఇలాంటి భారీ ప్రాజెక్టులు సహజంగానే విభిన్న ప్రయో జన బృందాలను తప్పకుండా ఆకర్షిస్తాయి. ఇవి మూల లక్ష్యాన్ని పక్కకు నెట్టి గమ్యాన్ని మరోవైపును తీసుకు పోతాయి. గతంలో ఇలాగే జరిగింది కాబట్టి ఈ రెండు ప్రాజెక్టుల భవితవ్యాన్ని, ఈ ప్రాజెక్టుల లక్ష్యసాధనలో తెలంగాణ ప్రభుత్వ సామర్థ్యాన్ని ప్రజలు సందేహి స్తున్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ తన డబ్బును వివేచనతో ఖర్చుపెట్టాలి. అది తలపెట్టిన ప్రాజెక్టు అందరినీ కలుపుకుని పోవాలి. గుర్తించవలసింది ఏమిటంటే ఇది ప్రభుత్వం ముందు ఉన్న ఐచ్ఛికం కాదు (వ్యాసకర్త అంతర్జాతీయ జల నిర్వహణా నిపుణులు) ఈమెయిల్ : bg@agsri.com -
నిను మరువం రాజన్నా..
మంకమ్మతోట, న్యూస్‌లైన్: నమస్తే అన్నా.. నమస్తే అక్కా.. నమస్తే చెల్లెమ్మా.. అంటూ ఆప్యాయంగా పలకరించే వైఎస్.రాజశేఖరరెడ్డి గొంతు మూగబోయి నేటికి నాలుగేళ్లవుతోంది. తాను ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో స్వర్ణయుగానికి బాటలు వేసిన ఆ మహానేత ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారు. ముఖ్యమంత్రిగా తన పాలనా కాలంలో జిల్లాకు ఆయన చేసిన మేలు మరువలేనిది. ఉచిత విద్యుత్ మొదలు జలయజ్ఞం వరకూ నిరంతరం రైతుల కోసం తపిస్తూ.. దండగన్న వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత ఆయనదే. రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లాలో రెండున్నర లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ఇందులో సుమారు రెండు లక్షల కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందుతోంది. దీనిద్వారా వేలాది మంది రైతులు బావులు, బోర్ల కింద రెండు పంటలు పండించుకుంటున్నారు. తమ కడుపు నింపుకోవడంతోపాటు నలుగురికి అన్నం పెడుతున్నారంటే అది మహానేత చలవే. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, యంత్రపరికరాలు, పంట రుణాలు అందించడంతోపాటు పండించిన ధాన్యానికి మద్దతుధర కల్పించి అన్నదాతలకు ఆత్మబంధువయ్యారు. జలయజ్ఞం పథకం కింద జిల్లాలో ఎల్లంపల్లి, ప్రాణహిత-చేవెళ్ల భారీ ప్రాజెక్టులకు పునాది వేశారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సారెస్పీ వరదకాల్వ పనులను వేగవంతం చేశారు. మధ్యమానేరు, తోటపల్లి, గండిపల్లి, గౌరవెల్లి జలాశయాల ద్వారా సాగుభూములను సస్యశ్యామలం చేయాలని సంకల్పించారు. పేదలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు రూపొందించిన ఆరోగ్యశ్రీ పథకంలో జిల్లాలో ఇప్పటివరకు పదివేల మందికి పైగా వైద్యసహాయం పొందారు. వారంతా వైఎస్సార్‌ను ప్రాణదాతగా కొలుస్తున్నారు. పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత చదువులకు దూరం కారాదనే ఉద్దేశంతో వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ పథకం ద్వారా వేలాది మంది లబ్ధిపొందారు. ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకున్నారు. అంతకుముందు రూ.75 ఉన్న సామాజిక పింఛన్లను రూ.200కు పెంచడం, రూ.2కే కిలో బియ్యం వంటి పథకాల ద్వారా వేలాది మంది పేదలకు పస్తులుండాల్సిన బాధలు తప్పాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధితోపాటు ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు రూ.లక్షన్నర ప్యాకేజీ అందించడంతో ఆపద నుంచి గట్టెక్కారు. సింగరేణి కార్మికులకిచ్చే లాభాల వాటా పెంచడంతోపాటు గోదావరిఖనిలో 40 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయడంతో వారికి శాశ్వతంగా ఆశ్రయం లభించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో వేలాది మంది నిరుపేదల సొంతింటి కల నెరవేరింది. వైఎస్సార్ అందించిన చేయూత వల్ల స్వశక్తి సంఘాల మహిళలు నేడు సొంతంగా పలు వ్యాపారాలు నిర్వహించే స్థాయికి ఎదిగారు. పావలా వడ్డీ రుణాలు, 60 ఏళ్లు నిండిన మహిళలకు అభయహస్తం పింఛన్లు ఇచ్చి ఆదుకున్న ఘనత కూడా వైఎస్సార్‌కే దక్కుతుంది. సంక్షేమ పథకాలే కాకుండా జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు వైఎస్.రాజశేఖరరెడ్డి బాటలు వేశారు. ఆయన పథకాలతో ఇంటింటికీ ఏదో విధంగా లబ్ధి జరిగిందంటే అతిశయోక్తికాదు. అందుకే ఆ మహానేతను ‘నిను మరువం రాజన్నా’ అంటూ జనం గుండెల్లో దాచుకున్నారు. నేడు వర్ధంతి కార్యక్రమాలు వైఎస్సార్ నాలుగో వర్ధంతిని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ అక్కెనపల్లి కుమార్ తె లిపారు. కరీంనగర్ వావిలాలపల్లిలో గల తేజ హై స్కూల్ వద్ద జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యాలయంలో జరిగే వై ఎస్సార్ వర్ధంతి వేడుకల్లో వైఎస్సార్సీపీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. నగరంలోని హౌసింగ్‌బోర్డు కా లనీలో గల శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అనాథ వృద్ధుల ఆశ్రమంలో పార్టీ జిల్లా నాయకుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో వైఎస్సార్సీపీతోపాటు పలు సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. -
తీరని నష్టం
గద్వాల/ధరూరు, న్యూస్‌లైన్: కరువు జిల్లాలో ఏకైక భారీ ప్రాజెక్టు వద్ద నిర్మితమైన జూరాల జలవిద్యుత్ కేంద్రానికి పునాదిరాయి నుంచి ఇప్పటి వరకు అడుగడుగునా అడ్డంకులు, సాంకేతిక లోపాలు, వరద గండం ఇలా ఒకటి తీరిందంటే మరొకటి అడ్డు తగులుతున్నాయి. దీంతో 2008 నుంచి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణంతో నిర్మితమైన జూరాల జలవిద్యుత్ కేంద్రం వద్ద 234 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో ఆరు బల్బుటైప్ చైనా టర్బైన్లను ఏర్పాటు చేశారు. 2008 అక్టోబర్ 5న రెండు టర్బైన్లతో జాతికి అంకితమైన జూరాల జలవిద్యుత్ కేంద్రంలో నాటినుంచి అన్ని సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. జూరాల ప్రాజెక్టు 1996లో జాతికిఅంకితం కాగా, సివిల్ బ్లాకులు సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 2002 వరకు జూరాల జలవిద్యుత్ కేంద్రానికి మంజూరు లభించలేదు. పీఎఫ్సీ నుంచి రుణం లభించడంతో 2004 డిసెంబర్లో జలవిద్యుత్ కేంద్రం పనులు ప్రారంభించారు. నాలుగేళ్ల అనంతరం రెండు టర్బైన్లను 2008లో సిద్ధం చేశారు. ఈ టర్బైన్లను జాతికి అంకితం చేసిన ఏడాది కూడా విద్యుదుత్పత్తి చేయకుండానే సాంకేతిక లోపంతో నిలిచిపోయాయి. ప్రతి నాలుగు నెలలకు మరొక టర్బైన్ను సిద్ధం చేస్తామన్న చైనా కంపెనీ, సాంకేతిక లోపం తలెత్తిన 1,2వ టర్బైన్లను పూర్తి చేసేందుకు రెండేళ్లకాలం పట్టింది. మిగతా నాలుగు టర్బైన్లను ఎలాగోలా పూర్తి చేస్తూ 2012 చివరి నాటికి ఆరు టర్బైన్లను సిద్ధంచేశారు. ఈ ఏడాది వరద ప్రవాహం లేకపోవడంతో పూర్తి స్థాయి విద్యుదుత్పత్తి చేయలేకపోయారు. 2009లో కృష్ణానదికి వరదలు పూర్తిస్థాయిలో రావడంతో జలవిద్యుత్ కేంద్రంలో టర్బైన్లు పనిచేయకుండా ఎదురు వరద గండం ఏర్పడింది. ఇలా నదిలో వరద పెరిగితే విద్యుదుత్పత్తి తగ్గిపోవడం మరో అడ్డంకిగా మారింది. ఆరు టర్బైన్లు సిద్ధంకావడం ఈ ఏడాది ఖరీఫ్‌కు నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండి జూరాలకు జూలై 21న వరద వచ్చి చేరింది. ఆరు టర్బైన్లను ప్రారంభించి జలవిద్యుదుత్పత్తిని పూర్తిస్థాయిలో చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. ఇంతలోనూ నదికి లక్షన్నర క్యూసెక్కుల వరద పెరగడంతో పూర్తి స్థాయి విద్యుదుత్పత్తి కాకుండా 200 మెగావాట్లకు మించలేదు. జెన్కోకు భారీ నష్టం... 2008లో ప్రారంభమైన జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ప్రతి నాలుగు నెలలకు ఒక టర్బైన్ చొప్పున 2009 చివరి నాటికి ఆరు టర్బైన్లను విద్యుదుత్పత్తికి సిద్ధం చేసి ఉంటే జెన్కోకు విద్యుత్ ద్వారా మేలు జరిగేది. అలా కాకుండా సాంకేతిక సమస్యలతో ప్రారంభించిన యూనిట్లే మళ్లీ నిలిచిపోవడం, వాటిని బాగు చేయడం ఇలా ఐదేళ్ల కాలం పట్టింది. ఇంత జరిగినా ఈ ఏడాది అయినా పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరిగి జెన్కోకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందనుకున్న తరుణంలో మళ్లీ సాంకేతిక సమస్యలతో నాలుగు యూనిట్లు నిలిచిపోయాయి. వర్షాకాలంలో నాలుగు నెలల పాటు పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరుగుతుందని ఆశించిన ఆశలన్నీ అడియాసలయ్యాయి. జూరాల జలవిద్యుత్ కారణంగా ఆశించిన దానికన్నా జెన్కోకు భారీ నష్టమే మిగిలింది.