మిషన్ కాకతీయ-భావుకత.. వాస్తవికత The mission of the reality of the Kakatiya-romance .. | Sakshi
Sakshi News home page

మిషన్ కాకతీయ-భావుకత.. వాస్తవికత

Published Mon, Feb 2 2015 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM

మిషన్ కాకతీయ-భావుకత.. వాస్తవికత

ప్రస్తుతం చెరువుల పట్ల కాల్పనికతను జోడిస్తున్నారు. గత కాలంలోని వ్యవస్థలను ప్రశంసించడం మంచిదే. కానీ కాలం మారిందని గుర్తించాలి. సామాజిక మార్పుల ను అర్థం చేసుకోకుంటే పాత వ్యవస్థలను పునరుద్ధరించడమే అవుతుంది.
 
తెలంగాణ రాష్ట్రంలో నీరు అతి ప్రధాన సమస్య అవు తోంది. సాగునీటి పారుదలను మెరుగుపర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టులపై దృష్టి పెడుతోంది. నూతన రాష్ట్రం ఏర్పాటుతో వ్యవసా యానికి మరింత నీరు లభ్య మవుతుందని తెలంగాణ ప్రజల్లో ఆశలు పెరిగిపోయా యి. దీంతో ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ను ప్రక టించింది.  వార్తల ప్రకారం మిషన్ కాకతీయ మొత్తం వ్యయం రూ. 20 వేల కోట్లు. ఈ బడ్జెట్‌లో రూ. 2,000 కోట్లను ప్రతిపాదించారు. తెలంగాణ మొత్తం మీద వివిధ రూపాల్లో 46,531 చెరువులు ఉన్నాయని ఇటీవలే అచ్చయిన ఓ పుస్తకం చెబుతోంది.

2015 నుంచి ప్రతి ఏటా 20 శాతం చెరువులను పునరుద్ధరించి వినియోగం లోకి తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. అంటే జనవరి 16 నుండి రోజుకు రూ. 15 కోట్ల వ్యయంతో సగటున ప్రతిదినం 68 గ్రామ చెరువులను పునరుద్ధరిం చనున్నారు. దీంతో భూగర్భ జలాల మట్టం పెరుగుతుం దని, పల్లెల్లో బోరుబావులు, చేతి పంపులు నిరంతరం పనిచేస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ పథకంలో ప్రత్యక్షంగా రైతులు, పరోక్షంగా వ్యవసాయ కూలీలు లబ్ధిదారులు కాగా, పశువుల కాపర్లు, చేతి వృత్తుల వారు కూడా లబ్ధి పొందనున్నారు.
 
ఇంత భారీ ప్రాజెక్టు మదింపునకు ప్రాజెక్టు డాక్యు మెంట్లు, విశ్లేషణలు, ఖర్చు ఆదా అధ్యయనాలు వంటివి చాలా అవసరం. ప్రభుత్వం దీన్ని బహిరంగపర్చనం దున ఈ ప్రాజెక్టు హేతుబద్ధత, దాని ప్రతిపాదిత ప్రయో జనాలపై స్వతంత్ర మదింపు కష్టమవుతోంది. తెలంగా ణలో ప్రతి ఒక్కరూ ఈ ప్రాజెక్టు నుంచి లాభాలను ఆశిస్తున్నారు. అయితే వాస్తవానికి అలానే జరుగుతుం దా? మిషన్ కాకతీయను మరింత ఆచరణాత్మకంగా, సమర్థవంతంగా మలచాలంటే కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
 
గత ఆచరణ సమీక్ష: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోసహా భారత్‌లో చెరువుల పునరుద్ధరణపై అనేక ప్రయత్నాలు జరిగాయి. కొన్ని ప్రాజెక్టులను భారీ పెట్టుబడులతో అమలు చేశారు. తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రపంచ బ్యాంకు, డచ్ ఎయిడ్, జపనీస్ ఎయిడ్ వంటి సంస్థల నిధులతో చెరువుల పునరుద్ధరణకు ఒక ప్రాజెక్టు గతం లో నడిచింది. ప్రస్తుత ప్రాజెక్టు ప్రణాళిక దశతో సంబం ధమున్న వారు తగిన అనుభవాలు, గుణపాఠాల కోసం గతంలో జరిగిన ప్రయత్నాలను పరిశీలించాలి.
 
ప్రస్తుత నేపథ్యంలో చెరువులు : నేటి చెరువుల పట్ల కాస్త కాల్పనికత, భావుకతను జోడిస్తున్నారు. గత వ్యవస్థల ను ప్రశంసించడం మంచిదే. భారత్‌లో చెరువుల వ్యవస్థ లను బాగా రూపొందించారు, అమలు చేశారు కూడా. చెరువుల నిర్మాణంలో తెలంగాణకు కనీసం వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే కాలం మారింది. భౌగోళికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా  పెనుమార్పులకు గురయిన చెరువులను మనం ప్రస్తు తం పరిశీలించాలి. సమాజంలో వచ్చిన మార్పులను మనం అర్థం చేసుకోకుంటే, ప్రస్తుత వాస్తవికతలోకి పాత వ్యవస్థలను బలవంతంగా నెట్టినట్లే కాగలదు. చెరువుల వ్యవస్థ ఏర్పడిన కాలం నుంచి నేటిదాకా జరిగి న మూడు ప్రధాన మార్పులను మనం చూడాలి.
 
(ఎ) ఆనాడు కొన్ని సామాజిక వర్గాలను సేవ చేసేందుకు ఇవి అధికార క్రమంలో,  అణిచివేత క్రమం లో ఇవి ఏర్పడ్డాయి. నాటి చెరువునే నేడూ కోరుకుం టున్నామంటే పెనుమార్పులకు గురయిన సమాజంలో, మారిన ఆర్థిక వాస్తవికతలో ఒక నిర్దిష్ట సాగునీటి వ్యవస్థ ను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామన్న మాట.

(బి) సాంకేతికంగా చూస్తే, నీరు ప్రధాన సమస్యగా అవరోధంగా లేని సందర్భంలోనే చెరువులను రూపొం దించి నిర్మించారు. ఇప్పుడు వివిధ ఉపయోగాలకు నీటి లభ్యత, దాని కేటాయింపులో తీవ్రమార్పులొచ్చాయి. ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణ తనకు తానుగా నీటి లభ్యతను మెరుగుపర్చదు.
 
(సి) భూమి హక్కులు నేడు మారిన స్థితిలో చెరువుల పునరుద్ధరణ చాలా సంక్లిష్టమైనది. ఉదాహ రణకు చెరువుల పరిధిలోని భూము ల్లో చాలాభాగాన్ని ఇప్పటికే ఆక్రమించేశారు. వీటి పునరుద్ధరణలో సామాజిక సమస్యలు పొంచుకుని ఉన్నాయి. నిర్వహణ సమస్యలు చాలా ఉన్నాయి.  ప్రత్యేకించి పేదలకు కేటాయించిన భూములు, వేసవిలో పశువుల మేతకు ఉపయోగించే భూముల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.

(డి) నేటి చెరువులు గతంలో వలే భూ ఉపరితల నీటి  వినియోగం కోసం కాకుండా భూగర్భ జలాల రీచార్జికి ఉపయోగపడు తున్నాయి. కాబట్టి ఉపరితలంలో నీటిని నిలువ చేయ డం కంటే రీచార్జి చేయడానికి చెరువులను డిజైన్ చేయబోతున్నప్పుడు మరింత జాగ్రత్త పాటించాలి. కాబట్టి చెరువులు పూడికతీత, తవ్వడం, కట్టలను, గట్లను బలోపేతం చేయడం, మూల జలాన్ని శుద్ధి చేయ డం ద్వారా ఏదో ఒరిగిపోతుందని, తాగునీటి సమస్య పరిష్కారమై పోతుందనుకుంటే అమాయకత్వమే.
 
నీటి ఉత్పాదకత, సామర్థ్యత: నీరు దాని నిర్వహణ  పట్ల మన అహగాహనకు సంబంధించి ఇది అత్యంత క్లిష్టమై న అంశం. నీటిని తిరిగి ఉత్పత్తి చేయవచ్చు కాని వనరులు తక్కువ. నీరు ఏకైక సహజ వనరు. దాని అపరిమితి, కొరత, నాణ్యత అనేవి దాని ఉపయోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సంవత్సరంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో నీటి లభ్యత, దాని అలభ్యత అనేది అతి ముఖ్యమైన అవరోధంగా పరిణమిస్తోంది. నీటి విషయంలో ఇతర పద్ధతులను చేపట్టకపోతే సమస్య పరిష్కారం కాదు. దీంతో మరింత వరి సాగు, మరింత నీటి వృథా, మరింత డిమాండ్‌కు దారితీయక తప్పదు.
 
వ్యయ, రాబడి నిష్పత్తి ముఖ్యం: నీటి కోసం అపారమైన ప్రజాధనం వెచ్చిస్తున్నారు. భారీ నిధులను వివేకంతో, సమర్థ ఉత్పాదకతతో వెచ్చించాలి. దేశంలో భారీ ప్రాజెక్టులను ఎలాంటి కీలక ప్రశ్నలను సంధించకుం డానే నిర్మిస్తూ పోయిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి రూ.2 వేల కోట్లను ఖర్చుపెట్టే ముందు దాని గుణాత్మక ప్రయోజనాలు ఏవిటనే  ప్రశ్న రావాలి.
 
పైన ప్రస్తావించిన అంశాలను, హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుంటూ తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మిషన్‌ను మరింత స్పష్టమైన, పారదర్శకమైన రీతిలో ప్రారంభించవలసి ఉంది. గందరగోళం, తొందరపాటు అనేవి తరచుగా వాస్తవాలను కప్పిపెట్టడానికే ఉపయోగ పడతాయి. గతంలో ఇదే జరిగి ఉంటే ప్రభుత్వం ఆ మార్గాన్ని వదిలివేయాలి.
 
భారీ నిధులతో ప్రతిపాదిస్తున్న రెండు ప్రాజెక్టులు ఉద్వేగం కంటే మరిన్ని సందేహాలనే లేవనెత్తుతున్నాయి. ఇలాంటి భారీ ప్రాజెక్టులు సహజంగానే విభిన్న ప్రయో జన బృందాలను తప్పకుండా ఆకర్షిస్తాయి. ఇవి మూల లక్ష్యాన్ని పక్కకు నెట్టి గమ్యాన్ని మరోవైపును తీసుకు పోతాయి. గతంలో ఇలాగే జరిగింది కాబట్టి ఈ రెండు ప్రాజెక్టుల భవితవ్యాన్ని, ఈ ప్రాజెక్టుల లక్ష్యసాధనలో తెలంగాణ ప్రభుత్వ సామర్థ్యాన్ని ప్రజలు సందేహి స్తున్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ తన డబ్బును వివేచనతో ఖర్చుపెట్టాలి.  అది తలపెట్టిన ప్రాజెక్టు అందరినీ కలుపుకుని పోవాలి. గుర్తించవలసింది ఏమిటంటే ఇది ప్రభుత్వం ముందు ఉన్న ఐచ్ఛికం కాదు
 
(వ్యాసకర్త అంతర్జాతీయ జల నిర్వహణా నిపుణులు)    
ఈమెయిల్ : bg@agsri.com

Advertisement
 
Advertisement
 
Advertisement