Mission of the Kakatiya
-
‘మిషన్ కాకతీయ’ దేశానికే ఆదర్శం: హరీశ్
హైదరాబాద్: మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఆసక్తిగా గమనిస్తున్నందున అత్యంత జాగ్రత్తగా పనులు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చిన్న నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. మిషన్ కాకతీయ పనులతీరు దేశానికే ఆదర్శంగా ఉండాలన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ జలసౌధలో అధికారులతో కలసి మిషన్ కాకతీయ పనుల పురోగతిపై సమీక్షించారు. గతంలో చిన్ననీటి పారుదలపై ఉన్న తప్పుడు భావనను తొలగించేందుకు ఇంజనీర్లు సహకరించాలని సూచించా రు. కష్టపడిన ఇంజనీర్లను కాపాడుకుంటామని, తప్పు చేసిన అధికారులను శిక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రజల విన్నపాలను చెత్తబుట్టలో వేయకుండా మానవతాదృష్టితో వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశిం చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస కమీషన్ ప్రకటించబోయే మొదటి బ్యాచ్ ఇం జనీర్ల నియామకంలో సాగునీటి శాఖ ఖాళీలను నింపడానికి ముఖ్యమంత్రి అనుమతించారని మంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన దస్త్రాన్ని సిద్ధం చేయాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఖాళీ లను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో, సీఎం జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలను అత్యంత శ్రద్ధతో అమలు పరచాలని, ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకోవడం కాకుండా పరిపాలనా అనుమతులు వచ్చే వరకు వెంటపడాలన్నారు. -
‘మిషన్’ పైలాన్ సంగతేంది!
జిల్లాలో జోరుగా ‘మిషన్ కాకతీయ’ ముమ్మరంగా సాగుతున్న చెరువుల పనులు పడావుగా రూ.30 లక్షలతో నిర్మించిన పైలాన్ ఆవిష్కరణపై అధికారుల్లో అనుమానం! వరంగల్ : మిషన్ కాకతీయ పేరిట నిర్వహిస్తున్న చెరువుల పునరుద్ధరణ స్ఫూర్తిని అందరికీ చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలోని చిన్న నీటివనరుల శాఖ జిల్లా కార్యాలయంలో పైలాన్ నిర్మించింది. ప్రస్తుతం జిల్లాలో చెరువుల పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నారుు. మిషన్ కాకతీయ స్ఫూర్తిని తెలిపేందుకు అన్ని హంగులతో నిర్మించిన పైలాన్ మాత్రం పడావుగా మారింది. పైలాన్ ఆవిష్కరణతోనే మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం మొదట భావించింది. కాకతీయుల పరిపాలన కేంద్రంగా ఉన్న జిల్లా కేంద్రంలోని పైలాన్ నిర్మాణాన్ని ఈ ఏడాది జనవరి 6న చేపట్టింది. రూ.30 లక్షలతో పైలాన్‌ను అద్భుతంగా నిర్మించారు. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతితో జనవరి 29 ఈ పైలాన్‌ను ఆవిష్కరించి పథకం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర మంత్రి పర్యటనలో జాప్యం కావడం, వెంటనే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక నియమావళి అమల్లోకి రావడంతో పైలాన్ ఆవిష్కరణ జరగలేదు. చెరువుల పునరుద్ధరణ పనులు ఎండాకాలంలోనే చేయాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వేచి చూస్తే ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో జిల్లాలో అధికారులే చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు అందరు ఇదే బిజీలో ఉన్నారు. పైలాన్ విషయాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జిల్లాకు వచ్చినా పైలాన్ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొత్తంగా పైలాన్‌ను ఆవిష్కరణకు నోచుకుంటుందా లేదా అనేది అనుమానంగా మారింది. ముమ్మరంగా ‘చెరువు’ పనులు జిల్లాలో 5,839 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులతో 3,55,037 ఎకరాల సాగు భూమికి నీటిని అందించే అవకాశం ఉంది. మొదటి దశలో జిల్లాలోని 1,173 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 845 చెరువుల పునరుద్ధరణ కోసం రూ.330.64 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వాటిలో 562 చెరువుల పనుల నిర్వహణకు కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ ప్రక్రియ ముగిసింది. 289 చెరువల పనులు మొదలయ్యాయి. ఇన్నాళ్లు శాసనమండలి ఎన్నిక కారణంగా పనుల ప్రారంభం నెమ్మదిగా సాగింది. -
వేగంగా ‘మిషన్ కాకతీయ’
ఒక్కరోజే వంద చెరువుల పనులు ప్రారంభించిన ఎమ్మెల్యేలు 5,915 చెరువులకు అనుమతులు సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పనులు మరింత వేగం పుంజుకున్నాయి. శాసనసభ సమావేశాలు ముగియడంతో ఎమ్మెల్యేలు శుక్రవారం తమ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున చెరువు పనులను ప్రారంభించారు. శుక్రవారం ఒక్కరోజే వంద చెరువుల పనులు ఆరంభమయ్యాయని నీటి పారుదల శాఖ వెల్లడించింది. ఈ నెలాఖరు వరకు సుమారు 3వేల చెరువుల పనులు ఆరంభమయ్యే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 5,915 చెరువులకు పరిపాలన పరమైన అనుమతులు రాగా, 2,464 చెరువుల ఒప్పందాలు పూర్తయ్యాయని, అందులో 798 చెరువుల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అత్యధికంగా ఖమ్మంలో 235 చెరువులు ఆరంభం కాగా, అత్యల్పంగా (25) రంగారెడ్డిలో, తర్వాతి స్థానంలో మహబూబ్‌నగర్ (51) ఉంది. కలెక్టర్ల నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ మిషన్ కాకతీయ పనుల తీరును పర్యవేక్షించేందుకు పది జిల్లాలకు గానూ ఆ జిల్లాల కలెక్టర్ల అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. వీరు పనులు జరిగే రోజుల్లో వారానికోసారి, పనుల్లేని సమయంలో నెలకోసారి సమావేశమై పనుల పురోగతిపై సమీక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిధుల మంజూరులో అధికారులకు బాధ్యతలు వరదల కారణంగా జరిగే నష్టాన్ని తాత్కాలిక పునరుద్ధరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధుల మంజూరులో వివిధ స్థాయిల్లోని అధికారులకు బాధ్యతలు కట్టబెడుతూ ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇచ్చింది. దీని ప్రకారం నామినేషన్‌పై పనులు ఇచ్చేందుకు ఈఎన్సీ రూ.5 లక్షలు, ఎస్ఈ రూ.2 లక్షలు, ఈఈ రూ.లక్ష వరకు మంజూరు చేసేందుకు అనుమతించారు. సాంకేతిక అనుమతులకు ఈఎన్సీకి పూర్తిస్థాయి అధికారాలివ్వగా, ఎస్ఈకి రూ.50 లక్షలు, ఈఈకి రూ.10 లక్షల వరకు అధికారం ఇచ్చారు. పరిపాలనా అనుమతులకు ఈఎన్సీకి రూ.10 లక్షలు, ఎస్ఈకి రూ.5 లక్షలు, ఈఈకి రూ.2 లక్షల వరకు అధికారం కల్పించారు. -
‘మిషన్’ను పనికి ఆహార పథకం కానివ్వొద్దు
ప్రభుత్వానికి కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఉమ్మడి రాష్ట్రంలో అవినీతి ముద్రపడిన పనికి ఆహార పథకంలా కానివ్వకుండా చూడాలని కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు తగ్గించడాన్ని తప్పుబట్టారు. గత బడ్జెట్లో వ్యవసాయ ప్రణాళిక బడ్జెట్ రూ. 3,061 కోట్లు కాగా ఈ ఏడాది అది రూ. 2,575 కోట్లు మాత్రమేనని, దీన్ని రైతులు ఏమాత్రం క్షమించరన్నారు. జాతీయ క్రైం బ్యూరో రికార్డుల ప్రకారం రాష్ట్రంలో 760 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం మాత్రం 97 మందే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతోందని ఆరోపించారు. ప్రభుత్వ నిరాదరణ వల్లే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. వ్యవసాయశాఖను రైతు సంక్షేమశాఖగా మార్చాలని కోరారు. సన్నచిన్నకారు రైతులకు కల్యాణలక్ష్మిని వర్తింపచేయడంతోపాటు వారి పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేయగా మరో కాంగ్రెస్ సభ్యుడు కృష్ణారెడ్డి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్ మాట్లాడుతూ మిషన్ కాకతీయతో ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తోందన్నారు. వర్షం లేకుంటే చెరువులకు నీరు ఎలా వస్తుందో చెప్పాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో లక్ష నాగళ్లు ఎక్కడ? ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానన్నారన్న విషయాన్ని కాంగ్రెస్ సభ్యుడు రాంరెడ్డి వెంకటరెడ్డి సభలో ప్రస్తావించారు. అయితే దీనిపై మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుంటూ సీఎం ఆ మాట అన్నట్లు ఆధారాలుంటే సభలో పెట్టాలని, సీఎం అనని మాటలను అన్నట్లు చెప్పడం తగదన్నారు. అలాగే బడ్జెట్‌కు సంబంధం లేని ప్రసంగం చేయడం బాగోలేదన్నారు. అనంతరం రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చకుండా ప్రస్తుతమున్న చోటే కొత్తగా నిర్మించాలని కోరారు. దళితులకు మూడెకరాలు ఎప్పుడు ఇస్తారో నిర్ణీత సమయం చెప్పాలని కోరారు. కాగా, సింగపూర్ మాజీ ప్రధాని లీ కున్ యూ మృతికి రాష్ట్ర అసెంబ్లీ సంతాపం తెలిపింది. -
చెరువు కబ్జాలపై ఉక్కుపాదం
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సెమినార్లో మంత్రి హరీశ్‌రావు చెరువులకు కొత్త రూపునిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో కబ్జాలకు గురైన చెరువులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని, కబ్జాదారులపట్ల కఠినంగా వ్యవహరిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. ‘మిషన్ కాకతీయ’లో భాగంగా పారిశ్రామీకరణ వల్ల కాలుష్యంతో నిం డిన చెరువులను పునరుద్ధరించడం ద్వారా కొత్తరూపునిస్తామని వెల్లడించారు. ఆదివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కృష్ణా, గోదావరిలో ఉన్న పూర్తిస్థాయి కేటాయింపులను వినియోగించుకొని రాష్ట్రంలోని 46 వేల చెరువులను నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. చెరువు నీటిని ఒడిసిపట్టగలిగితే గ్రామంలోని అన్ని కులాలకు పని దొరుకుతుందని, అదే జరిగితే సుస్ధిర సమగ్రాభివృధ్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. చెరువుల అభివృద్ధితోపాటే హరితహారం పేరిట చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి పారిశ్రామిక వర్గాలు సహకరించాలన్నారు. మిషన్ కాకతీయలో అన్ని జిల్లాలను చేర్చి హైదరాబాద్‌ను విస్మరించడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో మున్సిపల్‌శాఖతో చెరువులను పునరుద్ధరించాలని సూచించారు. ఇదే సమయంలో పర్యావరణ సమతౌల్యత పాటించేం దుకు వీలుగా అడవులు తక్కువగా ఉన్న నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింతగా చేపట్టాలన్నారు. చెరువుల పునరుద్ధరణ జరగాల్సిన తీరు, భూగర్భ జల రక్షణ, జల భద్రత, జల కాలుష్యంపై వంటి అంశాలపై పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, మరో పర్యావరణవేత్త సుబ్బారావు, సీపీఎం ప్రతినిధి వరప్రసాద్, సీపీఐ ప్రతినిధి నరసింహా రావు, సోల్ సంస్థ కన్వీనర్ లుగ్నా, సాక్షి రెసిడెంట్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి ఈ సెమినార్లో ప్రసంగించగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ అధ్యక్షురాలు కె.లీలా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సింహారెడ్డి, గేయ రచయిత అంద్శైపాల్గొన్నారు. -
‘మిషన్’కు మరో రూ.108.63 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయకు రూ. 108.63 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ గురువారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. మిషన్ కాకతీయలో ఇప్పటి వరకు 288 చెరువుల పనులు ఆరంభమయ్యాయి. గ్రామీణ నీటి సరఫరా పనులకు రూ.199 కోట్లు రాష్ట్రంలో గ్రామీణ నీటి సరఫరా విభాగంలో వివిధ మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 199.92 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం గ్రా మీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ ఉత్తర్వులు జారీ చే శారు. -
జర ఆగండి..
‘మిషన్’లో మేమూ భాగస్వాములవుతాం ! అధికారులపై ప్రజాప్రతినిధుల ఒత్తిడి.. పూడికతీత పనులకు బ్రేక్ వరంగల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నారుు. ఎన్నికల కోడ్ కారణంగా భాగస్వాములం కాలేకపోతుండడంతో పనులు వారుుదా చేసేలా పలువురు ప్రజాప్రతినిధులు చక్రం తిప్పారు. ఫలితంగా చెరువుల పూడికతీత పనులకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయలో భాగంగా జిల్లాలో ఈఏడాది 1179 చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు పలు విడతలుగా 692 చెరువుల పునురుద్ధరణకు రూ.291కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులు సర్కిల్, డివిజన్ల పరిధిలో 682పనులకు టెండర్లు నిర్వహించారు. దక్కించుకున్న ఏజెన్సీలు ఈనెల 13 వరకు 351 చెరువుల్లో పనులు ప్రారంభించేందుకు అగ్రిమెంటు పూర్తి చేసుకున్నారుు. కానీ... జిల్లా కేంద్రంలోని నీటిపారుదల కార్యాలయంలో మిషన్ కాకతీ పైలాన్ నిర్మాణంలో జాప్యం జరగడం... ఈ లోగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో పైలాన్ ప్రారంభం ఊసే లేకుండా పోయింది. అరుుతే మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల్లో పూడిక తీత పనులను వేగిరం చేయాలని ప్రభుత్వం, సంబంధిత శాఖ మంత్రి హరీష్‌రావు ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రి ఆదేశాలు అమలు చేయాలా.... స్థానిక నేతల మాటలను వినాలో తెలియని సంకటస్థితిలో నీటిపారుదల శాఖ అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. పూడిక తీత పనుల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాకు రావడంతో పనులను ప్రారంభించక తప్పని పరిస్థితి నెలకొనడంతో వారు తలపట్టుకుంటున్నారు. పూడికతీతకు స్వల్ప విరామం... అధికారికంగా మిషన్ కాకతీయ పనులు ప్రారంభమయ్యూరుు. మొదటి రెండు రోజుల్లో 40కి పైగా చెరువుల్లో పూడిక తీత పనులు ప్రారంభం కాగా... గురువారం నాటికి అవి సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. కోడ్ కారణంగా పాల్గొనలేని ప్రజాప్రతినిధులు ఆయా మండలాలకు చెందిన ఇరిగేషన్ అధికారులపై జిల్లా, రాష్ట్ర స్థారుులో ఒత్తిళ్లు తీసుకువచ్చినట్లు సమాచారం. ఫలితంగా ఎమ్మెల్సీ కోడ్ మరో నాలుగు రోజుల్లో తొలగిపోతున్నందున అప్పటివరకు పనులను ప్రారంభించవద్దని మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఇప్పటివరకు ప్రారంభమైన పనులకు బ్రేక్ పడిట్లేనని తెలుస్తోంది. కాగా, చెరువుల పునరుద్ధరణలో ఎలాంటి జాప్యం జరగడం లేదని... చెరువుల్లో ఉన్న చెత్తాచెదారం, కట్టపై ఉన్న జంగిల్ క్లియరెన్స్‌ను పూర్తి చేసిన అనంతరం పూడికతీత పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు సూచించినట్లు అధికారులు చెబుతుండడం విశేషం. -
పని తక్కువ..ప్రచారం ఎక్కువ
ప్రభుత్వ తీరుపై విపక్షాల ధ్వజం సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పథకాల అమలులో ఎలాంటి పురోగతి లేకపోయినా, ప్రభుత్వం ప్రచారం ఎక్కువ చేసుకుంటోంది. ఇదేదో బ్రహ్మపదార్థమంటూ ప్రజలను భ్రమల్లో ముంచుతోంది. వాటర్ గ్రిడ్ ద్వారా మూడేళ్లలో ఇంటింటికి నీళ్లు ఇస్తామని, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని సీఎం కేసీఆర్ అంటున్నారు.. అదీ సాధ్యం కాదు.. ఇదీసాధ్యం కాదు’ అని టీడీపీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి పేర్కొన్నారు. ‘ఓ వైపు రాష్ట్రంలో ప్రజలు తాగునీరందక అవస్థలు పడుతుంటే .. వాటర్ గ్రిడ్ నిర్మించి మూడేళ్ల తర్వాత నీళ్లిస్తామనడం.. ఆకలితో ఉన్నవారికి కారంతోనైనా అన్నం పెట్టకుండా మూడేళ్ల తర్వాత బిర్యానీ పెడతాం’ అన్నట్టుగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. శాసనమండలిలో సోమవా రం బడ్జెట్‌పై నిర్వహించిన చర్చలో.. కొత్త పథకాల అమలులో జాప్యం, గత బడ్జెట్లో కేటాయింపుల్లో 43శాతానికి మించని ఖర్చు లు, తాజా బడ్జెట్లో లోపించిన వాస్తవికత తదితర అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎండగట్టాయి. వాటర్ గ్రిడ్‌పై ప్రభుత్వ హామీని నెరవేరుస్తామని, ఒకవేళ నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ అంశాన్ని విపక్షాలు ఓ ఆయుధంగా వాడుకోవచ్చని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విపక్షాలకు సలహాఇచ్చారు. అధ్యయన కమిటీ ల పేరుతో కేజీ టు పీజీ ఉచిత పథకం అమలును ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ తప్పుపట్టారు. గతంలో హేతుబద్ధీకరణ జరిపి ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని, మళ్లీ ప్రభుత్వం అందుకు సిద్ధమైందని ఆరోపించారు. కడియం శ్రీహరి సమాధానమిస్తూ ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిని సరిచేసేందుకే ఉపాధ్యాయుల హేతబద్ధీకరణ చేపడుతామని, ఒక్క పాఠశాలను మూసివేయమని చెప్పారు. కార్పొరేట్ విద్య, వైద్య విధానాన్ని రద్దు చేసి ఆ సంస్థలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని కె.దిలీప్‌కుమార్ సూచించారు. ప్రమాదాలపై ఏర్పాటు చేసే ఎంక్వైరీ కమిటీ చట్టం కింద మైనారిటీల స్థితిగతులపై అధ్యయనం కోసం రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కి చట్టబద్ధత లేదని షబ్బీర్ విమర్శించారు.ఈ కమిటీ సిఫారసులు చెల్లుబాటు కావన్నారు. -
బ్రాందీ, విస్కీ, ఇసుక మరియు మట్టి
రుణమాఫీ ప్రస్తావన రెండు బడ్జెట్లు తీసుకురాలేదు. ఇది పచ్చి దగా అంటున్నాయి ప్రతిపక్షులు. ప్రతివారూ ఒక్క నిజం గ్రహించాలి. పార్టీ మేనిఫెస్టోలు ఉత్తమస్థాయి కాల్పనిక సాహిత్యమని గ్రహించాలి. హమ్మయ్య! ఒక పని అయిపోయింది. తెలుగు బ్రదర్స్ బడ్జెట్ పాఠాలు వినిపించడం విజయ వంతంగా పూర్తయింది. ప్రతి ఏటా మార్చిలో ఇదొక జాతర. బడ్జెట్లో అంకెలు చూస్తుంటే కడుపు నిండిపోతూ ఉంటుం ది సామాన్యుడికి. అయితే, మనం ఎన్నుకున్న మన సర్కార్లు ఈ ఏడాది ఖర్చు చేసే సొమ్ము లక్షా పదిహేను వేల కోట్లు! పైగా ఏదో మొద్దంకెలు కాకుండా రూపాయి అణాపైసలతో సహా విడివిడిగా పద్దుల్ని చూసి నివ్వెరపోతుంటే, ‘‘ఏముందిరా! మన కుటుంబ లెఖ్ఖలు మనం వేసు కోమూ! ఇదీ అంతే!’’ అన్నాడు మా బాబాయ్. అస లు మా బాబాయ్‌కి ఏదీ ఆశ్చర్యంగా అనిపించదు. ‘‘పంట రైతులం. మనం ఏటా పప్పులకు ఇంత, ఉప్పులకింత, పండుగలకింత, ప్రయాణాలకింత అని అనుకుంటాం కదా! అన్నీ అనుకున్నట్టు జర గవు. పంట దిగుబళ్లు మన లెఖ్ఖల ప్రకారం ఉండవు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్టుండి ఓ చిన్నపిల్ల పెద్దపిల్ల అవుతుంది. మూడో పిల్ల మళ్లీ పురిటికి వస్తుంది. బోరుబావి ఎండిపోతుంది. ఇలాగే సవా లక్ష అనుకోనివి మనకే ఉంటే, యనమలకి ఎన్ని ఉంటాయి పాపం! అరవై ఏళ్ల నుంచి ఒకే మాట- ఇది పేదవాడి బడ్జెట్ అని. అయినా ఈ దరిద్రం దేనికంటే, అది మన ప్రార బ్ధం. చూడగా చూడగా మన రాష్ట్ర భవిష్యత్తు బ్రాందీ, విస్కీల మీద, ఇసుక మీద ఆధారపడి ఉండేటట్టుంది. తెలంగాణ ఫ్యూచర్ పూడిక మట్టి మీద కేంద్రీకృతమై ఉందని నిశ్చయమైపోయింది. లోపాయికారీగా అందిన సమాచారమేమంటే, మిషన్ కాకతీయ వాస్తుకి ముడి పడి తెరమీదకు వచ్చిందని! గ్రామానికి ఈశాన్య మూల పల్లం ఉండాలని, అది నీరు నిండిన తటాకమైతే ప్రశస్థ మని వాస్తు ఘోషిస్తోంది. నైజాం నవాబు 1945 తరు వాత చెరువుల్ని అలక్ష్యం చేశాడట. క్రమేపి మేటవేసి మెరకలైనాయి. దాంతో జలావాసాలు జనావాసాలుగా మారాయి. ఆ వాస్తు దెబ్బతోనే నైజాం రాజ్యాన్ని కోల్పో యాడట. అందుకే తెలంగాణ సర్కార్ ఈ మహో ద్యమానికి గడ్డ ఎత్తింది. పైగా ప్రయోజనం ఉభయ తారకం. అన్నట్టు బడ్జెట్లో ఎన్ని దుక్కుల వర్షం కురిపిస్తారో స్పష్టంగా చెప్పలేదు. ఎంతమందిని అక్షరాస్యులని చేస్తారో సెలవియ్యలేదు. ఎందర్ని లక్షాధికారుల్ని చేయ నున్నారో అంకెలు ఇవ్వలేదు. ‘జాబు-బాబు’ మాట మర్చేపోయారు. ఒక్కసారిగా విజన్ 2050 కి మహా జంప్ చేశారు. ‘‘అప్పటికి చాలామంది రాలిపోతారు, అడిగేవాళ్లుండరు’’ అన్నాడు బాబాయ్. రుణమాఫీ ప్రస్తావన రెండు బడ్జెట్లు తీసుకురాలేదు. ఇది పచ్చి దగా అంటున్నాయి ప్రతిపక్షులు. ప్రతివారూ ఒక్క నిజం గ్రహించాలి. పార్టీ మేనిఫెస్టోలు ఉత్తమ స్థాయి కాల్పనిక సాహిత్యమని గ్రహించాలి. ఆ సినిమా ఎందుకంత బాగా ఆడింది? మనదెందుకు ఆడలే దని ఆలోచన చేసుకోవాలి. అందులో కథ బావుంది, డైలాగులు అదిరాయి, పాటలు వినసొంపుగా ఉన్నాయి. మరింక ఆడకేంచేస్తుంది? అందుకని ఊరికే వాగ్దానాలు నెరవేర్చ లేదని వేష్ట పడకూడదు. నన్ను గెలిపిస్తే సముద్రాలని మంచినీటి సము ద్రాలుగా మారుస్తానని అంటే ఎవరైనా నమ్మి ఓటే స్తారా? ఒకవేళ గెలిపిస్తే ఆ నాయకుడు ఏమంటాడో తెలుసా? ‘‘ఇట్లాంటి శుష్క వాగ్దానాలు నమ్మి మోస పోకండి. ప్రజారాజ్యంలో దగాపడద్దు తమ్ము లారా!’’ అని హెచ్చరించడానికే చేశానంటాడు. ప్రతి ఏటా ఈ వసంతరుతువులో గవర్నర్ ప్రసంగాన్ని తీర్చి దిద్దడం, బడ్జెట్ అంకెల్ని పూరించడం, వ్యతిరేకతల మధ్య గవర్నర్‌కి ధన్యవాదాలు చెప్పడం తప్పనిసరి విధి. కాదంటే తిథి. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
దండం పెడతా..
సక్రమంగా పనిచేయండి.. సీఎం రుణం తీర్చుకోండి ఉద్యోగులకు శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ పిలుపు సిద్దిపేట: ‘దండం పెడుతున్నా.. ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించండి. వివిధ పనుల కోసం వచ్చే వారికి సకాలంలో పనులు చేసి పంపండి. ప్రభుత్వానికి పేరు, ప్రతిష్టలు తీసుకురండి’ అని శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. సోమవారం ఆయన మెదక్ జిల్లా సిద్దిపేటలో ఎన్జీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు మిషన్ కాకతీయ పథకంపై నిర్వహించిన అవ గాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను గత ఐదు పీఆర్సీలలో ప్రత్యక్షంగా పాల్గొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ప్రస్తుత సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, రుణం తీర్చుకుందామని చెప్పారు. ఉద్యోగులను అవినీతిపరులుగా మార్చవద్దని రాజకీయ నాయకులను కోరారు. రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే: హరీశ్ రైతుల ఆత్మహత్యలను ఆపి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే మిషన్ కాకతీయ లక్ష్యమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని తెలిపారు. ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి అవలంబిస్తున్న విధానాల వల్లే దేశానికి కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి శ్రమించాలి: దేవీప్రసాద్ మిషన్ కాకతీయను విజయవంతం చేసేందుకు ప్రతి ఉద్యోగి శ్రమించాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు అన్నారు. మిషన్ కాకతీయ ప్రజాసంక్షేమ కార్యక్రమమని ఇందులో ప్రజలనూ భాగస్వామ్యం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, జేసీ శరత్‌లు తదితరులు మాట్లాడారు. అనంతరం టీఎన్జీవో కేలెండర్‌ను ఆవిష్కరించారు. -
మిషన్ కాకతీయ-భావుకత.. వాస్తవికత
ప్రస్తుతం చెరువుల పట్ల కాల్పనికతను జోడిస్తున్నారు. గత కాలంలోని వ్యవస్థలను ప్రశంసించడం మంచిదే. కానీ కాలం మారిందని గుర్తించాలి. సామాజిక మార్పుల ను అర్థం చేసుకోకుంటే పాత వ్యవస్థలను పునరుద్ధరించడమే అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నీరు అతి ప్రధాన సమస్య అవు తోంది. సాగునీటి పారుదలను మెరుగుపర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టులపై దృష్టి పెడుతోంది. నూతన రాష్ట్రం ఏర్పాటుతో వ్యవసా యానికి మరింత నీరు లభ్య మవుతుందని తెలంగాణ ప్రజల్లో ఆశలు పెరిగిపోయా యి. దీంతో ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ను ప్రక టించింది. వార్తల ప్రకారం మిషన్ కాకతీయ మొత్తం వ్యయం రూ. 20 వేల కోట్లు. ఈ బడ్జెట్లో రూ. 2,000 కోట్లను ప్రతిపాదించారు. తెలంగాణ మొత్తం మీద వివిధ రూపాల్లో 46,531 చెరువులు ఉన్నాయని ఇటీవలే అచ్చయిన ఓ పుస్తకం చెబుతోంది. 2015 నుంచి ప్రతి ఏటా 20 శాతం చెరువులను పునరుద్ధరించి వినియోగం లోకి తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. అంటే జనవరి 16 నుండి రోజుకు రూ. 15 కోట్ల వ్యయంతో సగటున ప్రతిదినం 68 గ్రామ చెరువులను పునరుద్ధరిం చనున్నారు. దీంతో భూగర్భ జలాల మట్టం పెరుగుతుం దని, పల్లెల్లో బోరుబావులు, చేతి పంపులు నిరంతరం పనిచేస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ పథకంలో ప్రత్యక్షంగా రైతులు, పరోక్షంగా వ్యవసాయ కూలీలు లబ్ధిదారులు కాగా, పశువుల కాపర్లు, చేతి వృత్తుల వారు కూడా లబ్ధి పొందనున్నారు. ఇంత భారీ ప్రాజెక్టు మదింపునకు ప్రాజెక్టు డాక్యు మెంట్లు, విశ్లేషణలు, ఖర్చు ఆదా అధ్యయనాలు వంటివి చాలా అవసరం. ప్రభుత్వం దీన్ని బహిరంగపర్చనం దున ఈ ప్రాజెక్టు హేతుబద్ధత, దాని ప్రతిపాదిత ప్రయో జనాలపై స్వతంత్ర మదింపు కష్టమవుతోంది. తెలంగా ణలో ప్రతి ఒక్కరూ ఈ ప్రాజెక్టు నుంచి లాభాలను ఆశిస్తున్నారు. అయితే వాస్తవానికి అలానే జరుగుతుం దా? మిషన్ కాకతీయను మరింత ఆచరణాత్మకంగా, సమర్థవంతంగా మలచాలంటే కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. గత ఆచరణ సమీక్ష: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోసహా భారత్‌లో చెరువుల పునరుద్ధరణపై అనేక ప్రయత్నాలు జరిగాయి. కొన్ని ప్రాజెక్టులను భారీ పెట్టుబడులతో అమలు చేశారు. తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రపంచ బ్యాంకు, డచ్ ఎయిడ్, జపనీస్ ఎయిడ్ వంటి సంస్థల నిధులతో చెరువుల పునరుద్ధరణకు ఒక ప్రాజెక్టు గతం లో నడిచింది. ప్రస్తుత ప్రాజెక్టు ప్రణాళిక దశతో సంబం ధమున్న వారు తగిన అనుభవాలు, గుణపాఠాల కోసం గతంలో జరిగిన ప్రయత్నాలను పరిశీలించాలి. ప్రస్తుత నేపథ్యంలో చెరువులు : నేటి చెరువుల పట్ల కాస్త కాల్పనికత, భావుకతను జోడిస్తున్నారు. గత వ్యవస్థల ను ప్రశంసించడం మంచిదే. భారత్‌లో చెరువుల వ్యవస్థ లను బాగా రూపొందించారు, అమలు చేశారు కూడా. చెరువుల నిర్మాణంలో తెలంగాణకు కనీసం వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే కాలం మారింది. భౌగోళికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పెనుమార్పులకు గురయిన చెరువులను మనం ప్రస్తు తం పరిశీలించాలి. సమాజంలో వచ్చిన మార్పులను మనం అర్థం చేసుకోకుంటే, ప్రస్తుత వాస్తవికతలోకి పాత వ్యవస్థలను బలవంతంగా నెట్టినట్లే కాగలదు. చెరువుల వ్యవస్థ ఏర్పడిన కాలం నుంచి నేటిదాకా జరిగి న మూడు ప్రధాన మార్పులను మనం చూడాలి. (ఎ) ఆనాడు కొన్ని సామాజిక వర్గాలను సేవ చేసేందుకు ఇవి అధికార క్రమంలో, అణిచివేత క్రమం లో ఇవి ఏర్పడ్డాయి. నాటి చెరువునే నేడూ కోరుకుం టున్నామంటే పెనుమార్పులకు గురయిన సమాజంలో, మారిన ఆర్థిక వాస్తవికతలో ఒక నిర్దిష్ట సాగునీటి వ్యవస్థ ను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామన్న మాట. (బి) సాంకేతికంగా చూస్తే, నీరు ప్రధాన సమస్యగా అవరోధంగా లేని సందర్భంలోనే చెరువులను రూపొం దించి నిర్మించారు. ఇప్పుడు వివిధ ఉపయోగాలకు నీటి లభ్యత, దాని కేటాయింపులో తీవ్రమార్పులొచ్చాయి. ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణ తనకు తానుగా నీటి లభ్యతను మెరుగుపర్చదు. (సి) భూమి హక్కులు నేడు మారిన స్థితిలో చెరువుల పునరుద్ధరణ చాలా సంక్లిష్టమైనది. ఉదాహ రణకు చెరువుల పరిధిలోని భూము ల్లో చాలాభాగాన్ని ఇప్పటికే ఆక్రమించేశారు. వీటి పునరుద్ధరణలో సామాజిక సమస్యలు పొంచుకుని ఉన్నాయి. నిర్వహణ సమస్యలు చాలా ఉన్నాయి. ప్రత్యేకించి పేదలకు కేటాయించిన భూములు, వేసవిలో పశువుల మేతకు ఉపయోగించే భూముల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. (డి) నేటి చెరువులు గతంలో వలే భూ ఉపరితల నీటి వినియోగం కోసం కాకుండా భూగర్భ జలాల రీచార్జికి ఉపయోగపడు తున్నాయి. కాబట్టి ఉపరితలంలో నీటిని నిలువ చేయ డం కంటే రీచార్జి చేయడానికి చెరువులను డిజైన్ చేయబోతున్నప్పుడు మరింత జాగ్రత్త పాటించాలి. కాబట్టి చెరువులు పూడికతీత, తవ్వడం, కట్టలను, గట్లను బలోపేతం చేయడం, మూల జలాన్ని శుద్ధి చేయ డం ద్వారా ఏదో ఒరిగిపోతుందని, తాగునీటి సమస్య పరిష్కారమై పోతుందనుకుంటే అమాయకత్వమే. నీటి ఉత్పాదకత, సామర్థ్యత: నీరు దాని నిర్వహణ పట్ల మన అహగాహనకు సంబంధించి ఇది అత్యంత క్లిష్టమై న అంశం. నీటిని తిరిగి ఉత్పత్తి చేయవచ్చు కాని వనరులు తక్కువ. నీరు ఏకైక సహజ వనరు. దాని అపరిమితి, కొరత, నాణ్యత అనేవి దాని ఉపయోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సంవత్సరంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో నీటి లభ్యత, దాని అలభ్యత అనేది అతి ముఖ్యమైన అవరోధంగా పరిణమిస్తోంది. నీటి విషయంలో ఇతర పద్ధతులను చేపట్టకపోతే సమస్య పరిష్కారం కాదు. దీంతో మరింత వరి సాగు, మరింత నీటి వృథా, మరింత డిమాండ్‌కు దారితీయక తప్పదు. వ్యయ, రాబడి నిష్పత్తి ముఖ్యం: నీటి కోసం అపారమైన ప్రజాధనం వెచ్చిస్తున్నారు. భారీ నిధులను వివేకంతో, సమర్థ ఉత్పాదకతతో వెచ్చించాలి. దేశంలో భారీ ప్రాజెక్టులను ఎలాంటి కీలక ప్రశ్నలను సంధించకుం డానే నిర్మిస్తూ పోయిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి రూ.2 వేల కోట్లను ఖర్చుపెట్టే ముందు దాని గుణాత్మక ప్రయోజనాలు ఏవిటనే ప్రశ్న రావాలి. పైన ప్రస్తావించిన అంశాలను, హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుంటూ తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మిషన్‌ను మరింత స్పష్టమైన, పారదర్శకమైన రీతిలో ప్రారంభించవలసి ఉంది. గందరగోళం, తొందరపాటు అనేవి తరచుగా వాస్తవాలను కప్పిపెట్టడానికే ఉపయోగ పడతాయి. గతంలో ఇదే జరిగి ఉంటే ప్రభుత్వం ఆ మార్గాన్ని వదిలివేయాలి. భారీ నిధులతో ప్రతిపాదిస్తున్న రెండు ప్రాజెక్టులు ఉద్వేగం కంటే మరిన్ని సందేహాలనే లేవనెత్తుతున్నాయి. ఇలాంటి భారీ ప్రాజెక్టులు సహజంగానే విభిన్న ప్రయో జన బృందాలను తప్పకుండా ఆకర్షిస్తాయి. ఇవి మూల లక్ష్యాన్ని పక్కకు నెట్టి గమ్యాన్ని మరోవైపును తీసుకు పోతాయి. గతంలో ఇలాగే జరిగింది కాబట్టి ఈ రెండు ప్రాజెక్టుల భవితవ్యాన్ని, ఈ ప్రాజెక్టుల లక్ష్యసాధనలో తెలంగాణ ప్రభుత్వ సామర్థ్యాన్ని ప్రజలు సందేహి స్తున్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ తన డబ్బును వివేచనతో ఖర్చుపెట్టాలి. అది తలపెట్టిన ప్రాజెక్టు అందరినీ కలుపుకుని పోవాలి. గుర్తించవలసింది ఏమిటంటే ఇది ప్రభుత్వం ముందు ఉన్న ఐచ్ఛికం కాదు (వ్యాసకర్త అంతర్జాతీయ జల నిర్వహణా నిపుణులు) ఈమెయిల్ : bg@agsri.com -
మంత్రి హరీశ్‌కు మిషిగన్ వర్సిటీ ఆహ్వానం
‘మిషన్ కాకతీయ’పై ప్రసంగించాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ-చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు తమ విశ్వవిద్యాలయానికి రావాల్సిందిగా రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావును అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ ఆహ్వానించింది. ఈ మేరకు వర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగం మంత్రికి లేఖను పంపింది. ప్రభుత్వం చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంపై అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన మిషిగన్ వర్సిటీ విద్యార్థి బృందం తెలంగాణలో పరిశోధన చేస్తోంది. ఆగస్టులో వివిధ జిల్లాల్లో పర్యటించిన ఈ బృందం తమ ప్రాథమిక అధ్యయన నివేదికను వర్సిటీకి సమర్పించింది. నివేదికను ఆమోదించిన వర్సిటీ అధికారులు దీనిపై విస్తృత పరిశోధనకు 50 వేల డాలర్లను (సుమారు రూ. 30 లక్షలు) కేటాయించారు. -
29న ‘మిషన్ కాకతీయ’ పైలాన్ ఆవిష్కరణ
వరంగల్: చిన్న నీటి వనరుల పునరుద్ధరణకు చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్మిస్తున్న పైలాన్‌ను ఈనెల 29న అవిష్కరించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ పైలాన్ ఆవిష్కరణకు కేంద్ర మంత్రి ఉమా భారతి వస్తున్నట్లు అధికార యంత్రాంగం నుంచి సమాచారం అందించడంతో పనులు వేగవంతమయ్యాయి. ఈనెల 6వ తేదీన పైలాన్ నిర్మాణం ప్రారంభం కాగా, సంక్రాంతి పండుగ ఉన్నప్పటికీ పనుల్లో ఎలాంటి జాప్యం జరుగలేదు. మరో మూడు రోజుల్లో పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈనెల 22 నాటికి పైలాన్ ఆవిష్కరణకు సిద్ధం చేస్తామని ఉన్నతాధికారులకు జిల్లా మైనర్ ఇరిగేషన్ అధికారులు సమాచారం అందించారు. దేశంలోనే చిన్న నీటి వనరుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినందున కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా పైలాన్ ఆవిష్కరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. 26న గణతంత్ర దినోత్సవం ఉన్నందున 29వ తేదీన పైలాన్‌ను ఆవిష్కరించేందుకు ఉమాభారతి అంగీకారం తెలిపినట్లు సమాచారం. -
‘కాకతీయ’కు ముంచుకొస్తున్న గడువు!
పది రోజుల్లో 4వేల చెరువులకు పరిపాలనా అనుమతులే లక్ష్యం అనుమతులు లభించినవి 480 చెరువులు మాత్రమే అనుమతుల కోసం ఆర్థిక శాఖ వద్ద మరో 678 చెరువుల అంచనాలు నేటి నుంచి పుంజుకోనున్న ప్రక్రియ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకం ఆరంభానికి ఓ పక్క గడువు ముంచుకొస్తుం డగా, మరో పక్క ముందుకు కదలని పనులు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. తొలి ఏడాది పునరుద్ధరించనున్న తొమ్మిది వేల చెరువుల్లో సగానికిపైగా పనులను జనవరి మూడో వారంలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, ఇప్పటివరకు కేవలం ఐదు వందల చెరువులకు మాత్రమే పరిపాలనా అనుమతు లు లభించడం, ఇంకా చాలా పనులు పెండిం గ్లో ఉండటం చిన్న నీటి పారుదల శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పనుల సర్వే పూర్తయిన వాటికి, పరిశీలన(స్క్రూటినీ) పూర్తికాకపోవడం, పరిశీలన పూర్తయిన వాటికి పరిపాలనా అనుమతులు లభించకపోవడం, అనుమతులు లభించిన వాటికి టెండర్లు పిలవకపోవడం ఆ శాఖను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పది రోజుల్లో సగానికి పైగా చెరువుల పనులను ప్రారంభించాలని భావిస్తున్న ప్రభుత్వం అధికారుల సెలవు దినాలను సైతం కత్తరించి ప్రక్రియను వేగిరం చేసేలా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఆటంకాలు అనేకం.. సమగ్ర చెరువుల సర్వే ద్వారా గుర్తించిన 46,531 చెరువుల్లో ప్రస్తుత ఏడాది 9,305 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ మూడోవారం నుంచే పనులను ప్రారంభించి జూన్‌లో వ ర్షాలు కురిసే సమయానికి పునరుద్ధరణ ప్రక్రియ ముగించాలని అంచనాలు సిద్ధం చేసుకుంది. అయితే పనుల అంచనాలు, పరిశీలన, పనుల అనుమతుల ఆమోదంలో జరిగిన ఆలస్యం మొత్తం ప్రక్రియనే జాప్యం చేసింది. అదీగాక అడ్డదిడ్డంగా వచ్చిన పనుల అంచనాలను పునఃపరిశీలన చేయాల్సి రావడం సైతం ప్రక్రియ జాప్యానికి కారణమైంది. ఇప్పుడు కూడా నీటిపారుదల శాఖ రాష్ట్ర కార్యాలయానికి చేరిన మొత్తం అంచనాల్లో 213 అంచనాలను తిరిగి సూపరింటెండెంట్ ఇంజనీర్ పరిశీలనకు తిప్పిపంపారు. ఈ కారణాల దృష్ట్యా ఇప్పటివరకు కేవలం 1,158 చెరువుల అంచనాలు మాత్రమే అన్ని దశలు దాటుకొని పరిపాలనా అనుమతుల కోసం ఆర్థిక శాఖను చేరాయి. ఇందులో రూ.190.17కోట్ల విలువ ఉన్న 480 చెరువుల పనులకు మాత్రం ఆమోదం లభించగా, మరో 678 చెరువుల అంచనాలు ఇంకా ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి. ఇక చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలకు రూ.1,076కోట్ల అంచనా వ్యయంతో చేరిన 2,036 చెరువుల పనులను పూర్తిస్థాయిలో స్క్రూటినీ చేయాల్సి ఉండగా, స్క్రూటినీ చేసిన మరో రూ.880.33కోట్ల అంచనాలతో కూడిన 1,729 చెరువు పనుల నివేదికను ఆర్థిక శాఖకు పంపాల్సి ఉంది. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడిఉన్న ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి జనవరి మూడో వారానికి సుమారు 4వేల చెరువుల పనులను ఆరంభించాలని భావిస్తున్నారు. మొదటగా పరిపాలనా ఆమోదం దక్కిన చెరువులకు టెండర్ల ప్రక్రియలో ఇదివరకున్న 15 రోజుల గడువును వారం రోజులకు కుదించి ప్రక్రియ ముగించేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇప్పటికే దీనిపై నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రత్యేకంగా అధికారులతో అనునిత్యం సమావేశాలు నిర్వహిస్తూ పనుల్లో వేగం పెం చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఆర్థిక శాఖకు చేరుతున్న అంచనాలకు వెంటనే అనుమతులు లభించేలా సచివాలయంలో ప్రత్యేక లైజనింగ్ అధికారిని నియమించి పర్యవేక్షణ చేస్తున్నారు. సోమవారం నుంచి మిషన్ కాకతీయ పనులు మరింత వేగంగా జరుగుతాయని, అవసరమైతే ఆదివారాలు, సంక్రాంతి సెలవు దినాల్లోనూ అధికారులు తమ విధులను కొనసాగిస్తారని నీటి పారుదల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
20 నాటికి 50 శాతం టెండర్లు పూర్తి
చిన్న నీటి పారుదల శాఖ అధికారులకు హరీశ్‌రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయకు సంబంధించి 50 శాతం చెరువు పనులను ఈ నెల 20 నాటికి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి హరీశ్‌రావు చిన్ననీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. లక్ష్యం విధించుకున్న చెరువు పనులను వచ్చే వర్షాకాలానికి పూర్తి చేయాలని నిర్ణయించుకున్న దృష్ట్యా అధికారులు తమ కసరత్తును వేగిరం చేయాలని సూచించారు. శనివారం హరీశ్‌రావు నీటి పారుదల శాఖ అధికారులు, కలెక్టర్లు, జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. చెరువుల అంచనాల తయారీ, పరిపాలనా అనుమతులు, టెండర్ల అనుమతులపై చర్చించారు. ఈ ఏడాది పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్న 9,300 చెరువుల్లో ఇప్పటి వరకు 5,322 చెరువుల పనుల సర్వే పూర్తయిందని, 3,051 చెరువుల అంచనాలు సిద్ధమయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 480 చెరువులకు రూ.170 కోట్ల పరిపాలనా అనుమతులు లభించాయన్నారు. వచ్చే శనివారానికి మరిన్ని చెరువులకు పరిపాలనా అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ, ‘టెండర్లు పిలవనున్న గ్రామాల్లో కళాజాత, గ్రామసభలు నిర్వహించాలని, జనవరి 26 సందర్భంగా విద్యార్థులకు చెరువులపై వ్యాస, ఉపన్యాస, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించాం. ట్రిపుల్ఆర్ కింద కేంద్రానికి పంపాల్సిన చెరువుల అంచనాలను త్వరగా పూర్తి చేయాలని, వెయ్యి కోట్లతో కూడిన నాబార్డ్ నిధుల కోసం ప్రతిపాదనలు పూర్తి చేయాలని సూచించాం. ప్రతి శనివారం మిషన్ కాకతీయపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామ’ని చెప్పారు. సమావేశంలో ఇసుక పాలసీపైనా చర్చించామని, త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు చేస్తామని మంత్రి చెప్పారు. -
ఇక వేగంగా ‘మిషన్ కాకతీయ’ పనులు
279 చెరువుల పనులకు రూ.123కోట్ల పరిపాలనా అనుమతులు రెండు మూడు రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం ఈనెల రెండో వారంలో పనులు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘మిషన్ కాకతీయ’ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు కసరత్తును వేగిరం చేసింది. జనవరి రెండో వారానికి కనీసం 50 శాతం పనులను ఆరంభించాలని దృఢ సంకల్పంతో ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం 279 చెరువుల పునరుద్ధరణ పనులకోసం రూ.123 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూ రుచేసింది. శుక్రవారం నుంచి వరుసగా ఎలాంటి అభ్యంతరాలు లేని చెరువులన్నింటికీ పరిపాలనా అనుమతులు ఇచ్చే దిశగా ఆర్థిక శాఖ సైతం సన్నాహాలు చేస్తోంది. మిషన్ కాకతీయలో భాగంగా తొలి దశలో పనులు చేపట్టనున్న 9వేల చెరువుల్లో సర్వే, అంచనాల తయారీ, పరిశీలన పూర్తి చేసుకున్న సుమారు 600 చెరువులకు రూ.230 కోట్ల అంచనాలు సిద్ధం చేసిన నీటి పారుదల శాఖ 15 రోజుల కిందటే ఆర్థిక శాఖకు పంపిన విషయం తెలిసిందే. అయితే వివిధ కారణాలను చూపుతూ చెరువుల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంలో ఆర్థిక శాఖ అలసత్వం ప్రదర్శించడంతో స్వయంగా మంత్రి టి.హరీశ్‌రావు కల్పించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ రూ.123.06 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. మరమ్మతు పనులకు అనుమతులు లభించిన చెరువులన్నింటికీ 48 గంటల్లో టెండర్లు పిలవాలని నీటి పారుదల శాఖ భావిస్తోంది. వారం రోజుల్లో టెండర్ల ప్రక్రియను ముగించి జనవరి రెండో వారానికి పనులు ప్రారంభిస్తామని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది తొలి దశలో గోదావరి, కృష్ణా బేసిన్ల పరిధిలో రూ.500కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు అవుతాయని, అనంతరమే మిగతా పనులను చేపడతారని ఆ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర మంత్రి ఉమాభారతికి ఆహ్వానం! జనవరి రెండోవారంలో చెరువుల పనుల ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ఉమాభారతిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ నెల 4 లేదా 5న ఢిల్లీకి వెళ్లనున్న ఆయన ఉమాభారతిని కలుస్తారని సమాచారం. -
మిషన్ కాకతీయకు బడా కాంట్రాక్టర్ల గండం
భారీగా చెరువు పనులు దక్కించుకునేందుకు యత్నాలు వివిధ వర్గాల నుంచి సర్కార్‌కు ఫిర్యాదులు క్లాస్-5 కాంట్రాక్టర్ల అర్హతను రూ.50 లక్షలకు పెంచాలని ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో బడా కాంట్రాక్టర్లంతా ‘మిషన్ కాకతీయ’ కోసం రింగ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. చిన్న కాంట్రాక్టర్లకు పనులేవీ దక్కకుండా తామే మొత్తం పనులు చేజిక్కించుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. దీంతో ఈ వ్యూహానికి విరుగుడును ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా సీ-5 కాంట్రాక్టర్ల టెండర్ అర్హతను ఇప్పుడున్న పదిలక్షల రూపాయల వరకే పనిచేసే స్థాయి నుంచిరూ.50 లక్షల వరకు పెంచడానికి సిద్ధమైంది. కాంట్రాక్టర్లు రింగ్ కాకుండా ఉండేం దుకు, ఒక్కో కాంట్రాక్టరు వేసే టెండర్ల సంఖ్యపై పరిమితి విధించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. రూ.రెండు వేల కోట్లతో చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం తొలి దశలో 600 చెరువులకు రూ.230 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించనుంది. జనవరి మొదటివారం నుంచి టెండర్లు పిలిచి, రెండోవారం నుంచి పనులు ప్రారంభించేలా ప్రణాళికలు వేస్తోంది. మరోవైపు ఒకే జిల్లాలోని అరవై నుంచి డెభ్భై చెరువుల పనులు చేజిక్కించుకోవడం కోసం, ఇతరులెవరూ పోటీకి రాకుండా చూసేందుకు బడా కాంట్రాక్టర్లు కొద్దిమంది సిండికేట్ అవుతున్నట్టు ప్రభుత్వానికి వివిధ వర్గాల నుంచి సమాచారం అందింది. పనులు దక్కించుకునే బడా కాంట్రాక్టర్లు గరిష్టం, కనిష్ట విలువకు టెండర్లు ఒక్కరే దాఖలు చేసి, మధ్యలో ఉన్న వారిని పక్కకు తప్పించేలా చేయడం వీరి వ్యూహంలో భాగమని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకే కాంట్రాక్టర్ల అర్హతా ప్రమాణాలను సవరించాలని, క్లాస్-5 కాంట్రాక్టర్ల అర్హతా ప్రమాణాల్ని సడలించి టెండర్లు దాఖలు చేయడానికి అర్హత కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ రకంగా స్థానిక కాంట్రాక్టర్లందరికీ పనులు దక్కే విధంగా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. మంగళవారం చిన్న నీటి పారుదల శాఖపై సమీక్షించనున్న మంత్రి టి.హరీశ్‌రావు ఈ విషయం చర్చించనున్నట్టు తెలిసింది. -
మిషన్ కాకతీయకు సహకరించండి
ప్రవాస భారతీయులకు మంత్రి హరీశ్‌రావు లేఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో భాగస్వాములైన విధంగానే తెలంగాణ పునర్నిర్మాణంలోనూ భాగస్వాములు కావాలని ప్రవాస భారతీయులకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పిలుపునిచ్చారు. చెరువుల పునరుద్ధరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయకు సహాయ, సహకారాలు అందించాలని కోరారు. సొంత గ్రామంలోని చెరువులను దత్తత తీసుకుని నిధులు సమకూర్చగలిగే అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వం తరఫున ప్రవాస భారతీయులకు ఆరు పేజీల బహిరంగ లేఖ రాశారు. చెరువుల పునరుద్ధరణకు గల ప్రాముఖ్యాన్ని, అందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని అందులో వివరించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సహకరించాలని కోరారు. ‘ఊరికి, స్వదేశానికి దూరంగా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని మీరు పడిన తపన, రాష్ట్ర సాధనకు మీరిచ్చిన ప్రత్యక్ష, పరోక్ష సహకారాన్ని తెలంగాణ సమాజం మరవదు. ప్రపంచవ్యాప్తంగా సంఘాలు స్థాపించుకుని ప్రజల ఆకాంక్షకు మద్దతు కూడగట్టడానికి మీరు చేసిన కృషి వెలకట్టలేనిది. ప్రస్తుతం తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగంగా చెరువుల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి మీ ఊరి చెరువును దత్తత తీసుకొని నిధులు సమకూర్చగలిగే అవకాశాన్ని పరిశీలించండి. వ్యక్తిగతంగా కానట్లయితే మీ సంఘం, సంస్థ తరపున ఆ అవకాశాన్ని పరిశీలించండి... దత్తత తీసుకున్న చెరువుకు మీరు కోరుకున్న పేరు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఊరి చెరువుల దత్తతకు ముగ్గురు వ్యక్తులు ముందుకువచ్చారు. వారిని అభినందిస్తున్నాం.. జనవరిలో కార్యక్రమం ప్రారంభం అయ్యాక మీతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలని భావిస్తున్నా’ అని లే ఖలో పేర్కొన్నారు. -
కోట్లు కురిపిస్తున్న మట్టి!
పటాన్చెరు : చంద్ర మండలంపై భూములు అమ్మకానికి ఉన్నాయని నెట్లో కొందరు దళారులు అమ్మకానికి పెట్టగా క్రయ విక్రయాలు జరిగాయని కూడా విన్నాం. కొనే వాళ్లుంటే అమ్మేందుకు ఏదైనా దొరుకుతుందని చెప్పేందుకు తాజా ఉదాహరణ ఇది. పటాన్చెరు మండలంలో ముత్తంగి చెరువులో మట్టిని గ్రామ పెద్దలు అమ్మకానికి పెట్టారు. ఎకరం విస్తీర్ణంలో మట్టిని తవ్వేందుకు రూ. 6 లక్షలుగా నిర్ణయించారు. ఇలా కొనుగోలు చేసిన వారు మట్టిని బుధ, గురువారాల్లో రాత్రిళ్లు మట్టిని గుట్టు చప్పుడు కాకుండా తరలించారు. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్లుగా.. చప్పుడు చేయకుండా ఉండిపోయారు. వివరాలిలా ఉన్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించ బోతున్న ‘మిషన్ కాకతీయ’ కింద నిధులు కాజేసేందుకు పెద్దలు ప్రణాళికలు రచించారు. అందులో భాగంగానే పటాన్చెరు మండలం ముత్తంగి వెనుక గల చెరువు మట్టితో కోట్లాది రూపాయల సంపాదనకు ఎత్తు వేశారు. అనుకున్నదే తడువుగా.. చెరువు మట్టి క్రయవిక్రయాలకు సంబంధించి రెవెన్యూ అధికారి నుంచి అన్ని స్థాయిల్లో అధికారులను మచ్చిక చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా మొత్తం వ్యవస్థను సిద్ధం చేసుకుని చెరువు మట్టిని ముత్తంగి నుంచి మేడ్చల్‌కు బుధవారం, గురువారం రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా వందలాది లోడ్ల మట్టిని తరలించారు. స్థానికుల వత్తిళ్ల మేరకు శుక్రవారం రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో సందర్శించి మట్టి తరలింపును అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయమై తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి వివరణ కోరగా.. మట్టి తరలింపు విషయం తమ దృష్టికి రాలేదని కాని ఇక నుంచి మట్టి తవ్వకాలను అడ్డుకుంటామన్నారు. గ్రామంలో సభ : మట్టి తవ్వకాలపై ముత్తంగిలోని గ్రామ పెద్దలంతా కూర్చొని వెనుక చెరువును అమ్ముకున్నారని గ్రామంలో చర్చోప చర్చలు జరుగుతున్నాయి. శుక్రవారం స్థానికులు కొందరు విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలోని కొందరు పార్టీలకు అతీతంగా కలిసిపోయి చెరువు అమ్మకానికి పెట్టారని, ఎకరా భూమి రూ. ఆరు లక్షలకు విక్రయానికి పెట్టారని మొత్తం 15 ఎకరాల భూమిని తవ్వుకునేందుకు అనుమతి ఇచ్చారని చెప్పారు. గ్రామ సేవకులు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. అయితే మిషన్ కాకతీయ కింద ఈ చెరువు తవ్వకాలకు మరో విధంగా నిధులు కాజేసేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారని గ్రామంలో పుకార్లు పుట్టాయి.