- ‘మిషన్ కాకతీయ’పై ప్రసంగించాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ-చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు తమ విశ్వవిద్యాలయానికి రావాల్సిందిగా రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావును అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ ఆహ్వానించింది. ఈ మేరకు వర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్‌మెంట్ విభాగం మంత్రికి లేఖను పంపింది.
ప్రభుత్వం చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంపై అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన మిషిగన్ వర్సిటీ విద్యార్థి బృందం తెలంగాణలో పరిశోధన చేస్తోంది. ఆగస్టులో వివిధ జిల్లాల్లో పర్యటించిన ఈ బృందం తమ ప్రాథమిక అధ్యయన నివేదికను వర్సిటీకి సమర్పించింది. నివేదికను ఆమోదించిన వర్సిటీ అధికారులు దీనిపై విస్తృత పరిశోధనకు 50 వేల డాలర్లను (సుమారు రూ. 30 లక్షలు) కేటాయించారు.