వాషింగ్టన్: భారత్‌లో 4 లక్షలు దాటిన కరోనా కేసులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. జూలై 1 నాటికి ఈ కేసుల సంఖ్య 6 లక్షలకు చేరుకుంటుందని అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన భారత సంతతి అధ్యయనకారిణి భ్రమర్ ముఖర్జీ వెల్లడించారు. ఈ సందర్భంగా దేశంలో ర్యాపిడ్ పరీక్షల సంఖ్యను పెంచడం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. "భారత్ కేవలం 0.5 శాతం జనాభాకు మాత్రమే పరీక్షలు నిర్వహించింది. వ్యాధి నిర్ధారణకు ఆర్టీ-పీసీఆర్ టెస్టింగ్‌లపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయం వెతకాల్సి ఉంటుంది. లక్షణాలు గుర్తించేందుకు ఉష్ణోగ్రత పరిశీలించడం, ఆక్సిజన్ చెక్ చేయడం, కాంటాక్టులను గుర్తించడం అత్యవసరం". (కరోనా చికిత్సకు గ్లెన్‌మార్క్ ఔషధం)
"అలాగే దేశంలో అధిక జనాభాపై సర్వే చేయడం ద్వారా ఎంతమంది కరోనా బారిన పడే అవకాశం ఉందనేది గుర్తించే అవకాశం ఉంటుంది. మరోవైపు లాక్‌డౌన్ వల్ల ఇతర దేశాల్లో కరోనా కేసులు తగ్గితే, దురదృష్టవశాత్తూ భారత్‌లో మాత్రం అలా జరగలేదు. మనం వైరస్ వ్యాప్తిని మందగించేలా చేశాం కానీ నిర్మూలించలేదు. అయితే న్యూజిలాండ్ లాగా భారత్ కరోనాను పూర్తిగా నియంత్రించకపోవచ్చు" అని భ్రమర్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. కాగా భారత్ కరోనా కేసుల్లో ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. (భారత్‌లో 4 లక్షలు దాటిన కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment