ఆత్మహత్య ఆలోచనలు అందుకేనట!
వాషింగ్టన్: నిద్ర తక్కువయితే ఆత్మహత్య ఆలోచనలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు మిచిగాన్ యూనివర్శిటీ పరిశోథకులు. మామూలు వ్యాధుల కన్నా కూడా మెదడు సంబంధ వ్యాధులతో బాధపడేవారిలో ఆత్యహత్యా ఆలోచనలు తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉంటాయన్న విషయం కూడా వీరి అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు మూడు లక్షల మంది మీద పదమూడు సంవత్సరాల పాటు సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు.
ఈ కాలంలో సుమారు మూడు వేల మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. వీరిలో 19 శాతం మంది మాత్రమే అనారోగ్య కారణాల వలన ఆత్మహత్య చేసుకోగా 20 శాతం మంది మానసిక రుగ్మతల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా వారిలో పదిశాతం మంది నిద్రలేమితో ఆత్మహత్యలకు పాల్పడగా, మరికొందరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిద్రలేమి కారణంగా ఒత్తిడి, ఆందోళన ఎక్కువై ఆత్మహత్య ఆల్చోనలు కలిగి ఉండవచ్చని అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు.