‘మిషన్’లో మేమూ భాగస్వాములవుతాం !
అధికారులపై ప్రజాప్రతినిధుల ఒత్తిడి.. పూడికతీత పనులకు బ్రేక్
వరంగల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నారుు. ఎన్నికల కోడ్ కారణంగా భాగస్వాములం కాలేకపోతుండడంతో పనులు వారుుదా చేసేలా పలువురు ప్రజాప్రతినిధులు చక్రం తిప్పారు. ఫలితంగా చెరువుల పూడికతీత పనులకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయలో భాగంగా జిల్లాలో ఈఏడాది 1179 చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు పలు విడతలుగా 692 చెరువుల పునురుద్ధరణకు రూ.291కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులు సర్కిల్, డివిజన్ల పరిధిలో 682పనులకు టెండర్లు నిర్వహించారు. దక్కించుకున్న ఏజెన్సీలు ఈనెల 13 వరకు 351 చెరువుల్లో పనులు ప్రారంభించేందుకు అగ్రిమెంటు పూర్తి చేసుకున్నారుు.
కానీ... జిల్లా కేంద్రంలోని నీటిపారుదల కార్యాలయంలో మిషన్ కాకతీ పైలాన్ నిర్మాణంలో జాప్యం జరగడం... ఈ లోగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో పైలాన్ ప్రారంభం ఊసే లేకుండా పోయింది. అరుుతే మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల్లో పూడిక తీత పనులను వేగిరం చేయాలని ప్రభుత్వం, సంబంధిత శాఖ మంత్రి హరీష్‌రావు ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రి ఆదేశాలు అమలు చేయాలా.... స్థానిక నేతల మాటలను వినాలో తెలియని సంకటస్థితిలో నీటిపారుదల శాఖ అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. పూడిక తీత పనుల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాకు రావడంతో పనులను ప్రారంభించక తప్పని పరిస్థితి నెలకొనడంతో వారు తలపట్టుకుంటున్నారు.
పూడికతీతకు స్వల్ప విరామం...
అధికారికంగా మిషన్ కాకతీయ పనులు ప్రారంభమయ్యూరుు. మొదటి రెండు రోజుల్లో 40కి పైగా చెరువుల్లో పూడిక తీత పనులు ప్రారంభం కాగా... గురువారం నాటికి అవి సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. కోడ్ కారణంగా పాల్గొనలేని ప్రజాప్రతినిధులు ఆయా మండలాలకు చెందిన ఇరిగేషన్ అధికారులపై జిల్లా, రాష్ట్ర స్థారుులో ఒత్తిళ్లు తీసుకువచ్చినట్లు సమాచారం. ఫలితంగా ఎమ్మెల్సీ కోడ్ మరో నాలుగు రోజుల్లో తొలగిపోతున్నందున అప్పటివరకు పనులను ప్రారంభించవద్దని మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఇప్పటివరకు ప్రారంభమైన పనులకు బ్రేక్ పడిట్లేనని తెలుస్తోంది. కాగా, చెరువుల పునరుద్ధరణలో ఎలాంటి జాప్యం జరగడం లేదని... చెరువుల్లో ఉన్న చెత్తాచెదారం, కట్టపై ఉన్న జంగిల్ క్లియరెన్స్‌ను పూర్తి చేసిన అనంతరం పూడికతీత పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు సూచించినట్లు అధికారులు చెబుతుండడం విశేషం.
జర ఆగండి..
Published Fri, Mar 20 2015 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM
Advertisement
Advertisement