Disturbances
-
కిరాణా కొట్టులా హెచ్‌సీఏ: తీవ్ర స్థాయికి వివాదాలు
సాక్షి, హైదరాబాద్: ఎంతో ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో ప్రస్తుతం పరిస్థితులు సక్రమంగా లేవు. ఎన్నో వివాదాలతో హెచ్‌సీఏ సతమతమవుతోంది. తాజాగా మరో వివాదం రాజుకుంది. హెచ్‌సీఏ సీఈఓ నియామకంపై తలెత్తిన వివాదం ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రస్తుత కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ఈ వివాదం కొనసాగుతోంది. హెచ్‌సీఏ సీఈఓగా సునీల్ కాంతేను నియమించినట్లు ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కార్యదర్శి విజయానంద్ ప్రకటించారు. అయితే ఆ నియామాకం చెల్లదంటూ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న మహ్మద్ అజహరుద్దీన్ ఖండించాడు. నిబంధనలకు విరుద్ధంగా అధ్యక్షుడి అనుమతి లేకుండా సీఈఓ నియామకం చెల్లదంటూ వాదించారు. సభ్యుల తీరుతో హెచ్‌సీఏను ‘కిరాణా కొట్టులా మార్ఛారు’ అంటూ తీవ్రస్థాయిలో అజార్ ధ్వజమెత్తారు. ఈ విధంగా హెచ్‌సీఏ ప్రస్తుతం తీవ్ర విబేధాల మధ్య నడుస్తోంది. పాలకవర్గంలో తారస్థాయికి విబేధాలు జరుగుతున్నాయి. వీటితో హెచ్‌సీఏ చరిత్ర మసకబారుతోందని క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: అజహరుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుల మధ్య వివాదం! చదవండి: హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్.. నా చేతుల్లో మంత్రదండం లేదు -
విభేదాలు సహజమే!
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో భేదాభిప్రాయాలు ఉండొచ్చని.. కానీ ప్రతి ఒక్కరు ఐకమత్యం కోసం కృషిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలోని మూఢవిశ్వాసాలను తరిమేసేందుకు, సమాజంలో మార్పు తీసుకురావటంలో బాధ్యత తీసుకోవాలని ఎన్సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, శకటాల కళాకారులకు ప్రధాని సూచించారు. ‘బలోపేతమైన, ప్రగతిశీల దేశాన్ని నిర్మించేందుకు అవసరమైన శక్తి అందరు ఐకమత్యంగా ఉంటేనే లభిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అభిప్రాయాలు వేర్వేరుగా ఉండటంలో తప్పులేదన్నారు. కులం, మతం, సమాజం వంటి జాఢ్యాలను పక్కనపెట్టి సమాజాన్ని ఏకం చేసేందుకు ప్రతిఒక్కరు ప్రయత్నించాలన్నారు. మూఢనమ్మకాలను పారద్రోలటాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటినుంచే ప్రారంభించాలని యువతకు సూచించారు. 2019 కల్లా స్వచ్ఛభారత్ లక్ష్యాలను చేరటంలో చొరవతీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశసేవలో భాగంగా పౌర,మిలటరీ పురస్కారాలను పొందిన వారి గురించి యువత తెలుసుకుని ప్రేరణ పొందాలని మోదీ తెలిపారు. కంబోడియాతో 4 ఒప్పందాలు భారత్–కంబోడియాల మధ్య రక్షణ బంధాల బలోపేతానికి కృషిచేయాలని ఇరుదేశాల ప్రధానులు నిర్ణయించారు. ఉగ్రవాద నిర్వీర్యం చేయటంలో అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేయటంపై కలిసి పోరాడాలని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య మధ్య రక్షణ, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పరస్పరసాయానికి చర్చలు జరిగాయి. అనంతరం వీరిరువురి సమక్షంలో ఇరుదేశాల మధ్య 4 ఒప్పందాలపై శనివారం ఢిల్లీలో ఒప్పందాలు జరిగాయి. నేరస్తుల అప్పగింత, నేర సంబంధిత విచారణకు న్యాయసాయం, కంబోడియాలోని స్వా హబ్ నీటి వనరుల అభివృద్ధి ప్రాజెక్టుకు భారత రుణసాయం (దాదాపు రూ.234 కోట్లు) అంశాలపై ఈ ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కంబోడియాకు ఆరోగ్యం, రోడ్ల అనుసంధానత, డిజిటల్ అనుసంధానత తదితర అంశాల్లోనూ రుణసాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉగ్రవాదం మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ అని.. ప్రపంచశాంతికి ఇది పెనువిఘాతం కల్గిస్తోందని మండిపడ్డారు. కాగా, ప్రధాని మోదీ ఫిబ్రవరి 9నుంచి నాలుగురోజుల పాటు విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. వరుసగా పాలస్తీనా, యూఏఈ, ఓమన్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. -
ఆ నామమే చాలు...
ఒక వృద్ధుడు చేతిలో జపమాల, మెడలో రుద్రాక్షహారం ధరించి, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపిస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. ఆ తరంగాలు కలిపురుషుని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానదీ తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. ‘ఇతన్ని చూస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు. కాని పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను. ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? లేక ఇదంతా శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవడు? శివుడా? విష్ణువా?’ అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న వేదవ్యాసుడు కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడి దగ్గరికి వెళ్లి ‘‘మహానుభావా! సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చెయ్యి. అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి’’ అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ‘‘ఓహో అదా నీ సందేహం. అయన పరమ విష్ణుభక్తుడు. అయన జపించే నామం వలన విష్ణుశక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించావా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్ధిగా నిత్యం ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు’ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆనాటినుంచి కలిపురుషుడు వీలయినంత వరకు హరినామస్మరణ జరగకుండా అడ్డుపడుతూ, ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నాడు. పుణ్యపురుషులు మాత్రం భగవన్నామ స్మరణ జరిగేలా చూస్తూనే ఉన్నారు. అందుకే ధర్మం ఈ మాత్రం ఒంటి కాలిమీదనైనా నిలబడగలుగుతోంది. -
యువభేరికి ప్రభుత్వం ఆటంకాలు
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరులో ఏర్పాటుచేసిన యువభేరి కార్యక్రమానికి ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోంది. యువభేరి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా భారీగా తరలివస్తున్న విద్యార్థులను అధికారులు అడ్డుకుంటున్నారు. పలుచోట్లు ఆర్టీఏ అధికారులు విద్యార్థుల బస్సులను అడ్డుకున్నారు. బస్సులను వదలకపోతే ధర్నాకు దిగుతామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. -
ప్రశాంత్ న్యాయవాదికి ఆటంకాలు కలిగించవద్దు
హెచ్‌సీయూ వర్గాలకు హైకోర్టు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ పీహెచ్డీ విద్యార్థి ప్రశాంత్‌ను కలిసేందుకు అతని తరఫు న్యాయవాదికి ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దని హైకోర్టు గురువారం యూనివర్సిటీ వర్గాలకు స్పష్టం చేసింది. ప్రశాంత్‌ను కలిసే విషయంలో ముందస్తు సమాచారంతో వెళ్లాలని అతని తరఫు న్యాయవాదికి తేల్చి చెప్పింది. అంతేకాక తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ హెచ్‌సీయూ వీసీ అప్పారావు దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు మరోసారి ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ అప్పారావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ప్రశాంత్ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను గురువారం న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ విచారించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, తన క్లయింట్ ప్రశాంత్‌ను కలిసేందుకు యూనివర్సిటీకి వెళితే వర్సిటీ భదత్రా సిబ్బంది అడ్డుకుని బెదిరించారని తెలిపారు. దీనికి యూనివర్సిటీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా రావడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, క్లయింట్‌ను కలిసే హక్కు న్యాయవాదికి ఉందన్నారు. ప్రశాంత్‌ను కలిసే విషయంలో వర్సిటీ వర్గాలకు ముందస్తు సమాచారం ఇచ్చి వెళ్లాలని అతని తరఫు న్యాయవాదికి స్పష్టం చేశారు. -
బీపీఎస్కెళితే బుక్కే!
విజయవాడ నగరపాలక సంస్థ 2008లో బీపీఎస్ దరఖాస్తులు 15,826 క్లియర్ అయినవి 11,287 ఈ ఏడాది దరఖాస్తులు 5,700 గుంటూరు నగరపాలక సంస్థ 2008లో బీపీఎస్ దరఖాస్తులు 9,965 క్లియర్ అయినవి 9,935 ఈ ఏడాది దరఖాస్తులు 4,750 ఇదీ నల్లకుబేరుల ఆందోళన ఆన్లైన్ విధానంతో ‘బ్లాక్’ భయం మంత్రి దృష్టికి తీసుకెళ్లే యోచనలో అధికారులు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్)కు ఆన్‌లైన్‌తో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. బహుళ అంతస్తుల భవనాల క్రమబద్ధీకరణకు రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఫీజును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంది. ఫీజు మొత్తం ఆన్లైన్లో చెల్లిస్తే బ్లాక్‌మనీ బండారం బద్దలై ఆదాయ పన్ను శాఖ అధికారుల కన్ను తమపై పడుతుందనే భయంతో నల్ల కుబేరులు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం డెడ్లైన్ల పేరిట నెలల తరబడి గడువు పెంచినా టార్గెట్ పూర్తవటం లేదు. విజయవాడ సెంట్రల్ : రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మునిసిపాల్టీల్లో భవన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం మే 27 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 59,600 దరఖాస్తులు అందాయి. 2008తో పోలిస్తే ఇది మూడో వంతేనని అధికారులు చెబుతున్నారు. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల్లో 10,450 దరఖాస్తులు అందాయి. ఈ రెండు నగరాల్లోనే సుమారు 25 వేల దరఖాస్తులు వస్తాయని భావించిన టౌన్‌ప్లానింగ్ అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. ఆన్లైన్ విధానం వల్లే గృహనిర్మాణ యజమానులు ముందుకు రావడం లేదన్న నిర్ధారణకు అధికారులు వచ్చారు. ఈ విషయమై మునిసిపల్ మంత్రి నారాయణతో చర్చించాలని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అసలు కథ ఆన్లైన్ తర్వాతే... బీపీఎస్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయగానే టౌన్‌ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వస్తారు. గృహాన్ని నిశితంగా పరిశీలించి కొలతలు తీసుకుంటారు. దరఖాస్తులో పేర్కొన్న విధంగా అన్నీ సక్రమంగా ఉంటే బీపీఎస్‌ను ఓకే చేస్తారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఆన్లైన్లోనే మిగతా సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం విజయవాడ, గుంటూరు నగరాల్లో కొన్ని బహుళ అంతస్తుల భవనాలను క్రమబద్ధీకరించాలంటూ సుమారు రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బీపీఎస్ కింద సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని అధికారులు లెక్కలేశారు. ఈ మొత్తం సొమ్మును ఆన్లైన్లో ఒకే ఖాతా నుంచి జమచేసినట్లయితే బ్లాక్ మనీ బాగోతం వెలుగుచూసి ఎక్కడ బుక్కయిపోతామోనని నల్లకుబేరులు హడలెత్తుతున్నారు. మాన్యువల్ పద్ధతిలో అయితే వేర్వేరు ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసి బీపీఎస్‌కు చెల్లించే అవకాశం ఉండేదన్నది వారి వాదన. స్పెషల్ డ్రైవ్‌కు అధికారుల నిర్ణయం బీపీఎస్ గడువు డిసెంబర్ 31తో ముగియనుంది. గడచిన ఐదు నెలలుగా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో అధికారుల్లో హైరానా మొదలైంది. 2007 నుంచి ఇప్పటి వరకు మంజూరు చేసిన బిల్డింగ్ ప్లాన్ల ఆధారంగా ముమ్మరంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. డీవియేషన్లు ఉన్న గృహాలకు బీపీఎస్ అని రాసి ‘ఇంటూ మార్క్’ వేస్తున్నారు. ఆ గృహ నిర్మాణదారుడి నుంచి దరఖాస్తు అందిన వెంటనే ‘ఇంటూ మార్క్’ను చెరిపేసే విధంగా ప్లాన్ చేశారు.అప్పుల ఊబిలో ఉన్న విజయవాడ నగరపాలక సంస్థ బీపీఎస్‌పై గంపెడాశ పెట్టుకుంది. సుమారు రూ.100 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా కట్టింది. అయితే బీపీఎస్ ఆదాయానికి ఆన్లైన్ విధానం గండికొడుతోంది. ఆన్లైన్ వల్లే ఇబ్బంది ఆన్లైన్ విధానం వల్లే ఆశించిన స్థాయిలో బీపీఎస్‌కు దరఖాస్తులు రావడం లేదు. మా వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని ఇబ్బందుల వల్ల బహుళ అంతస్తుల భవన యజమానులు ముందుకు రావడం లేదు. గడువులోపు లక్ష్యాన్ని చేరుకొనేందుకు ప్రయత్నిస్తాం. - జి.వి.రఘు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్, విజయవాడ దరఖాస్తు ప్రక్రియ ఇలా... బీపీఎస్ దరఖాస్తుదారులు అప్రూవ్డ్, డీవియేషన్ ప్లాన్లను స్కాన్ చేయాలి. ఆటో క్యాడ్ మ్యాప్ తీసి రిజిస్ట్రేషన్ విలువ ఎంత అనేది స్పష్టంగా పేర్కొనాలి. భవనం ఎలివేషన్ ఫొటోను స్కాన్ చేయాలి. ఆన్లైన్ విధానంలో ఇవన్నీ చేశాక కంప్యూటర్ పేమెంట్ మోడ్ అడుగుతుంది. క్రెడిట్ కార్డు, ఏటీఎం, నెట్ బ్యాంకింగ్‌లలో ఏదో ఒకదాన్ని టిక్ చేయాలి. వెంటనే రూ.10 వేలు దరఖాస్తుదారుడి ఖాతా నుంచి నగదు జమ అవుతుంది. ఆ వెంటనే ఐదు డిజిట్ల నంబర్.. మెసేజ్ రూపంలో ఫోన్‌కు వస్తుంది. దీంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. -
జర ఆగండి..
‘మిషన్’లో మేమూ భాగస్వాములవుతాం ! అధికారులపై ప్రజాప్రతినిధుల ఒత్తిడి.. పూడికతీత పనులకు బ్రేక్ వరంగల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నారుు. ఎన్నికల కోడ్ కారణంగా భాగస్వాములం కాలేకపోతుండడంతో పనులు వారుుదా చేసేలా పలువురు ప్రజాప్రతినిధులు చక్రం తిప్పారు. ఫలితంగా చెరువుల పూడికతీత పనులకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయలో భాగంగా జిల్లాలో ఈఏడాది 1179 చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు పలు విడతలుగా 692 చెరువుల పునురుద్ధరణకు రూ.291కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులు సర్కిల్, డివిజన్ల పరిధిలో 682పనులకు టెండర్లు నిర్వహించారు. దక్కించుకున్న ఏజెన్సీలు ఈనెల 13 వరకు 351 చెరువుల్లో పనులు ప్రారంభించేందుకు అగ్రిమెంటు పూర్తి చేసుకున్నారుు. కానీ... జిల్లా కేంద్రంలోని నీటిపారుదల కార్యాలయంలో మిషన్ కాకతీ పైలాన్ నిర్మాణంలో జాప్యం జరగడం... ఈ లోగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో పైలాన్ ప్రారంభం ఊసే లేకుండా పోయింది. అరుుతే మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల్లో పూడిక తీత పనులను వేగిరం చేయాలని ప్రభుత్వం, సంబంధిత శాఖ మంత్రి హరీష్‌రావు ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రి ఆదేశాలు అమలు చేయాలా.... స్థానిక నేతల మాటలను వినాలో తెలియని సంకటస్థితిలో నీటిపారుదల శాఖ అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. పూడిక తీత పనుల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాకు రావడంతో పనులను ప్రారంభించక తప్పని పరిస్థితి నెలకొనడంతో వారు తలపట్టుకుంటున్నారు. పూడికతీతకు స్వల్ప విరామం... అధికారికంగా మిషన్ కాకతీయ పనులు ప్రారంభమయ్యూరుు. మొదటి రెండు రోజుల్లో 40కి పైగా చెరువుల్లో పూడిక తీత పనులు ప్రారంభం కాగా... గురువారం నాటికి అవి సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. కోడ్ కారణంగా పాల్గొనలేని ప్రజాప్రతినిధులు ఆయా మండలాలకు చెందిన ఇరిగేషన్ అధికారులపై జిల్లా, రాష్ట్ర స్థారుులో ఒత్తిళ్లు తీసుకువచ్చినట్లు సమాచారం. ఫలితంగా ఎమ్మెల్సీ కోడ్ మరో నాలుగు రోజుల్లో తొలగిపోతున్నందున అప్పటివరకు పనులను ప్రారంభించవద్దని మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఇప్పటివరకు ప్రారంభమైన పనులకు బ్రేక్ పడిట్లేనని తెలుస్తోంది. కాగా, చెరువుల పునరుద్ధరణలో ఎలాంటి జాప్యం జరగడం లేదని... చెరువుల్లో ఉన్న చెత్తాచెదారం, కట్టపై ఉన్న జంగిల్ క్లియరెన్స్‌ను పూర్తి చేసిన అనంతరం పూడికతీత పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు సూచించినట్లు అధికారులు చెబుతుండడం విశేషం. -
బీజేపీలో తెలంగాణ చిచ్చు