సాక్షి, హైదరాబాద్: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని అభిరామన్ డెవలపర్స్ పలు వెంచర్లకు శ్రీకారం చుట్టింది. అందుబాటు ధరల్లో సామాన్యుల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా పలు భారీ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేస్తున్నామని పదమూడేళ్లుగా స్థిరాస్తి రంగంలో అనుభవమున్న సంస్థ ఎండీ టీ మహేందర్ తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
♦ షాద్‌నగర్‌లోని సోలిపూర్ గ్రామంలో 25 ఎకరాల్లో గోల్డెన్ గ్రీన్ కౌంటీ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో మొత్తం 289 ఓపెన్ ప్లాట్లుంటాయి. 147 నుంచి వెయ్యి గజాల మధ్య ప్లాట్లున్నాయి. ధర గజానికి రూ.6,500.
♦ ఇప్పటికే వందకు పైగా ప్లాట్లు బుకింగ్ అయ్యాయి. 40, 60 ఫీట్ల రోడ్లు, పార్క్, ఓవర్ వాటర్‌హెడ్ ట్యాంక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటి వసతులుంటాయి.
♦ రావిర్యాలలోని వండర్‌లా అమ్యూజ్‌మెంట్ పార్క్‌కు ఎదురుగా 6 ఎకరాల్లో వండర్ విల్లాస్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. ఇందులో 66 ప్లాట్లుంటాయి. 200 గజాల నుంచి 680 గజాల మధ్య ప్లాట్ల విస్తీర్ణాలున్నాయి. ధర గజానికి రూ.19 వేలు. ఇప్పటికే 40 ప్లాట్లు బుకింగ్ అయ్యాయి.
♦ శ్రీశైలం హైవే లోని ఫ్యాబ్‌సిటీ ప్రధాన ద్వారం ఎదురుగా డైమండ్ విల్లాస్ పేరిట 54 ఎకరాల్లో భారీ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందు లో మొత్తం 218 ప్లాట్లుంటాయి. 120 గజాల నుంచి 1,200 గజాల మధ్య ప్లాట్లుంటాయి. ధర గజానికి రూ.10 వేలు. ఇప్పటికే 50 శాతం బుకింగ్ పూర్తయ్యాయి. రోడ్లు, పార్క్ వంటి అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యాయి.
అందుబాటుకే ఆదరణ
సాక్షి, హైదరాబాద్: మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయని సర్వేలు చెబుతున్నాయి. దీంతో బడా డెవలపర్లు పునరాలోచనలో పడ్డారు. దిగ్గజాలైన నిర్మాణ సంస్థలు ఆర్ధిక మాంద్యం దెబ్బతో నీరసపడ్డాయి. ప్రవాస భారతీయులు, ఐటీ నిపుణులు అనుకున్నంత స్థాయిలో కొనుగోళ్లు జరపకపోవటమే ఇందుకు కారణం.
దీంతో తక్కువ విస్తీర్ణం గల ఇళ్లకు శ్రీకారం చుట్టాయి. నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి. విస్తీర్ణం తక్కువ గల ఫ్లాట్లను నిర్మించడానికి ప్రజయ్, జనప్రియ సంస్థలు ముందుకొచ్చాయి. కూకట్‌పల్లి, మియాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో రూ.25 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడుమంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య తక్కువ.
హైదరాబాద్ నిర్మాణ రంగం ఐటీ నిపుణుల మీదే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఆర్థిక మాంద్యం కనుమరుగు కావటంతో ఐటీ నిపుణులు అధికంగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఇందుకు పలు కారణాలున్నాయి. వీరికి స్థానిక అంశంతో సంబంధం లేదు. పైగా పుణె, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో రేట్లు తక్కువగా ఉండటం. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నగరం వైపు దృష్టి సారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment