Mahender
-
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించండి
గన్‌ఫౌండ్రి /సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.మహేందర్ డిమాండ్ చేశారు. శనివారం బీజే వైఎం ఆధ్వర్యంలో నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచి్చన హామీని నెరవేర్చక పోవడం దుర్మార్గమన్నారు. గ్రూప్–2, 3 పోస్టులను పెంచాలని, 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం టీఎజీపీఎస్సీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేసి అడ్డుకున్నారు. లాఠీచార్జీలో బీజేవైఎం అ ధ్యక్షుడు సెవెళ్ల మహేశ్, నాయకులు అనితారెడ్డితోపాటు పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. మరికొంతమంది నిరుద్యోగ సంఘం నాయకు లను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పవన్‌రెడ్డి, గణేశ్, బి.సురేశ్, ఉపాధ్యక్షుడు ఎన్.మహేశ్ తదితరులు పాల్గొన్నారు. లాఠీచార్జీని ఖండించిన కిషన్‌రెడ్డి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీపీఎస్సీ ఎదుట ధర్నా నిర్వహించిన బీజేవైఎం కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జీని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కాగా లాఠీచార్జీలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేవైఎం అధ్యక్షుడు సెవెళ్ల మహేశ్, నాయకులు అనితా రెడ్డి తది తరులను మహేశ్వర్‌రెడ్డి పరామర్శించారు. -
మహేందర్‌ది హత్యా ? ఆత్మహత్యా ?
నందిపేట్(ఆర్మూర్): సుపారీ హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు.. పలు కేసుల్లో అత్యంత వివాదాస్పదుడు నందిపేట మండలం లక్కంపల్లి తాజామాజీ సర్పంచు సుమలత భర్త మూడ మహేందర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆర్మూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడిగా పేరుపొందిన ఆయన శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్లు మొదట ప్రచారం జరిగింది. అయితే శనివారం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో పోస్టుమా ర్టం నిర్వహించడంతో మహేందర్‌ది హత్యా ? ఆత్మహత్యా ? అనుమానాలతో చర్చనీయాంశమైంది. గత నెల 22న ఇద్దరు స్నేహితులు, ఇద్దరు పోలీసు శాఖకు చెందిన వారితో కలిసి గోవాకు వెళ్లిన మహేందర్ అక్కడ నిషేధిత డ్రగ్స్ అతిగా తీసుకుని పక్షవాతానికి గురైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసి ఆయన భార్య మరుసటి రోజు గోవాకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడి ఆస్పత్రిలో నాలుగు రోజుల చికిత్స అనంతరం ఒక పోలీస్ అధికారి సహాయంతో హైదారాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరిన మహేందర్ మృతి చెందాడు. కాగా ఆయనకు పక్షవాతం వచ్చిన విషయాన్ని, చివరికి చనిపోయిన మూడు గంటల వరకు ఎందుకు ఎవరికీ తెలియనీయలేదని, గుండె పోటుతో మరణిస్తే ఎందుకు పోస్టు మార్టం చేస్తారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భార్య ఫిర్యాదు.. గోవాలో మెడికల్ లీగల్ కేసుగా నమోదైనందున ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మహేందర్ మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు నందిపేట ఎస్సై రాహుల్ తెలిపారు. ఫిట్స్‌తో పాటు గుండెపోటుతో మృతి చెందినట్లు మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శనివారం స్వగ్రామంలో జరిగిన మహేందర్ అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పలువురు తాజా మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. స్టేటస్‌లో ఫొటోలు.. ఓ వైపు పక్షవాతానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. మరోవైపు మహేందర్ ఫోన్ స్టేటస్‌లో ప్రతిరోజు గోవాలో తిరుగుతున్నట్లు ఆయన ఫొటోలు దర్శన మిచ్చాయి. చివరికి ఆయన చనిపోయిన రోజు కూడా ఉదయం 10.36 గంటలకు స్టేటస్‌లో గోవా బీచ్ ఫొటోలు కనిపించాయి. మహేందర్ మృతి ఘటన వెనుక రహస్యాలను మరుగు పర్చడానికే ఇలా స్టేటస్‌లో ఫొటోలు అప్లోడ్ చేసి ఉంటారని అంటున్నారు. గోవాలో నిషేధిత డ్రగ్స్ స్వయంగా తీసుకున్నాడా.. అతనికి ఉన్న క్రిమినల్ నేపథ్యం వెనుక సూత్రధారులెవరైనా బలవంతంగా ఎక్కువ డోసులు ఇచ్చారా అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. -
తాంత్రికుడు వస్తున్నాడు
మహేందర్ వడ్లపట్ల, సన్నీ కునాల్, రాజేష్, అనూష, త్రివేణి నటించిన చిత్రం ‘తాంత్రికుడు’. సౌమ్య వడ్లపట్ల సమర్పణలో మహేందర్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం టీజర్‌ని మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాల చారి రిలీజ్ చేశారు. ‘‘మంచి చిత్రం తీయాలని అమెరికా నుండి వచ్చి, ‘తాంత్రికుడు’ తీశా’’ అన్నారు మహేందర్ వడ్లపట్ల. ఈ చిత్రానికి సంగీతం: కె. ఆనంద్, కెమెరా: వంశీ. -
ఉద్యోగం రాలేదని దివ్యాంగుడి ఆత్మహత్య
హైదరాబాద్: ఉద్యోగం రాలేదని మనస్తాపం చెందిన ఓ దివ్యాంగుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం కోదాశపల్లికి చెందిన బి.మహేందర్(28) వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మెడికేర్ ఆస్పత్రి సమీపంలోని దివ్యాంగుల వసతి గృహంలో పదేళ్లుగా ఉంటూ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ప్రభుత్వోద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందామనుకున్న ఆ యువకుడి యత్నాలు తరచూ విఫలమ వుతుండటంతో మనస్తాపానికి గురై మంగళవారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతకూ తలుపు తీయకపోవడంతో తోటి విద్యార్థులు కిటికీలో నుంచి చూడగా మహేందర్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
షాద్‌నగర్‌లో గోల్డెన్ గ్రీన్ కౌంటీ
సాక్షి, హైదరాబాద్: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని అభిరామన్ డెవలపర్స్ పలు వెంచర్లకు శ్రీకారం చుట్టింది. అందుబాటు ధరల్లో సామాన్యుల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా పలు భారీ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేస్తున్నామని పదమూడేళ్లుగా స్థిరాస్తి రంగంలో అనుభవమున్న సంస్థ ఎండీ టీ మహేందర్ తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ♦ షాద్‌నగర్‌లోని సోలిపూర్ గ్రామంలో 25 ఎకరాల్లో గోల్డెన్ గ్రీన్ కౌంటీ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో మొత్తం 289 ఓపెన్ ప్లాట్లుంటాయి. 147 నుంచి వెయ్యి గజాల మధ్య ప్లాట్లున్నాయి. ధర గజానికి రూ.6,500. ♦ ఇప్పటికే వందకు పైగా ప్లాట్లు బుకింగ్ అయ్యాయి. 40, 60 ఫీట్ల రోడ్లు, పార్క్, ఓవర్ వాటర్‌హెడ్ ట్యాంక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటి వసతులుంటాయి. ♦ రావిర్యాలలోని వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్‌కు ఎదురుగా 6 ఎకరాల్లో వండర్ విల్లాస్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. ఇందులో 66 ప్లాట్లుంటాయి. 200 గజాల నుంచి 680 గజాల మధ్య ప్లాట్ల విస్తీర్ణాలున్నాయి. ధర గజానికి రూ.19 వేలు. ఇప్పటికే 40 ప్లాట్లు బుకింగ్ అయ్యాయి. ♦ శ్రీశైలం హైవే లోని ఫ్యాబ్‌సిటీ ప్రధాన ద్వారం ఎదురుగా డైమండ్ విల్లాస్ పేరిట 54 ఎకరాల్లో భారీ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందు లో మొత్తం 218 ప్లాట్లుంటాయి. 120 గజాల నుంచి 1,200 గజాల మధ్య ప్లాట్లుంటాయి. ధర గజానికి రూ.10 వేలు. ఇప్పటికే 50 శాతం బుకింగ్ పూర్తయ్యాయి. రోడ్లు, పార్క్ వంటి అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యాయి. అందుబాటుకే ఆదరణ సాక్షి, హైదరాబాద్: మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయని సర్వేలు చెబుతున్నాయి. దీంతో బడా డెవలపర్లు పునరాలోచనలో పడ్డారు. దిగ్గజాలైన నిర్మాణ సంస్థలు ఆర్ధిక మాంద్యం దెబ్బతో నీరసపడ్డాయి. ప్రవాస భారతీయులు, ఐటీ నిపుణులు అనుకున్నంత స్థాయిలో కొనుగోళ్లు జరపకపోవటమే ఇందుకు కారణం. దీంతో తక్కువ విస్తీర్ణం గల ఇళ్లకు శ్రీకారం చుట్టాయి. నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి. విస్తీర్ణం తక్కువ గల ఫ్లాట్లను నిర్మించడానికి ప్రజయ్, జనప్రియ సంస్థలు ముందుకొచ్చాయి. కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో రూ.25 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడుమంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య తక్కువ. హైదరాబాద్ నిర్మాణ రంగం ఐటీ నిపుణుల మీదే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఆర్థిక మాంద్యం కనుమరుగు కావటంతో ఐటీ నిపుణులు అధికంగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఇందుకు పలు కారణాలున్నాయి. వీరికి స్థానిక అంశంతో సంబంధం లేదు. పైగా పుణె, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో రేట్లు తక్కువగా ఉండటం. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నగరం వైపు దృష్టి సారిస్తున్నారు. -
ఆర్టీసీ డిపో మేనేజర్ ఆత్మహత్య
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఆర్టీసీ డిపో మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్టీసీ డిపో మేనేజర్ మహేందర్ మంగళవారం ఉదయం రోడ్డుపై శవమై కనిపించారు. ఆయన పక్కనే పురుగుల మందు డబ్బా కూడా ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మహేందర్ రెండు రోజులుగా సెలవులో ఉన్నారు. కరీంనగర్-2 డిపోలో పనిచేసి పదోన్నతిపై మే నెలలో నారాయణ ఖేడ్ కు వచ్చారు. సోమవారం కరీంనగర్ నుంచి వచ్చిన ఆయన తన జీపు డ్రైవర్‌కు కొడుకు ఫోన్ నెంబరు ఇచ్చారని, మధ్యాహ్నం డిపో అసిస్టెంట్ మేనేజర్‌కు తన సెల్‌ఫోన్ అప్పగించాడని చెబుతున్నారు. ఈ ఉదయం వాకింగ్‌కు వెళ్లిన మహేందర్ రోడ్డుపై పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు డిపో అసిస్టెంట్ మేనేజర్ ద్వారా మహేందర్ గా గుర్తించారు. అతని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మహేందర్ స్వస్థలం కరీంనగర్. -
భర్త మందలించడంతో.. భార్య ఆత్మహత్యాత్నం
తనకు తెలియకుండా సెల్‌ఫోన్ ఎలా కోనుగోలు చేసావని భర్త మందలించినందుకు భార్య ఆత్మహత్యానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవి కథనం ప్రకారం... వరంగల్ జిల్లాకు చెందిన మహేందర్, స్రవంతి(23) దంపతులు. వీరు జీవనోపాధి కోసం ఏడాదిన్నర క్రితం నగరానికి వచ్చి బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీలో ఓ అపార్ట్మెంటులో వాచ్‌మెన్‌గా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా స్రవంతి రెండు రోజుల క్రితం కొత్త సెల్‌ఫోన్ కోనుగోలు చేసింది. దానిని శనివారం భర్త గమనించి నాకు తెలియకుండా సెల్‌ఫోన్ ఏలా కోనుగోలు చేశావని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం రాత్రి గుర్తు తెలియని విషం సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించి కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పదోతరగతి విద్యార్థినితో ప్రేమాయణం..
ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణం తీసింది. అభం శుభం తెలియని చిన్నారిని ప్రేమ పేరుతో వాడుకుంటున్నాడని ఓ యువకుడి పై గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డళ్లతో దాడి చేసి హతమార్చారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా గుండాల మండలం సీతారాంపురంలో గురువారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన వంపు మహేందర్(25) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలిక(15)ను తన ఆటోలో ప్రతిరోజు మోత్కూరులోని పాఠశాలలో దింపేవాడు. ఈ క్రమంలో ఆ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఈ ఏడాది బాలిక పాఠశాల మారడంతో.. ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట గ్రామం మొత్తం పాకడంతో.. ఈ రోజు గుర్తుతెలియని వ్యక్తులు మహేందర్‌పై గొడ్డళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఇది గుర్తించిన కొందరు అతన్ని భువనగిరి ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా.. అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దాడి కేసులో ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్
చాంద్రాయణగుట్ట: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో బీజేపీ నాయకులపై దాడి చేసిన కేసులో ఎంఐఎం పార్టీ కార్పొరేటర్‌తో పాటు మరో నలుగురిని చాంద్రాయణగుట్ట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 2వ తేదీన జంగమ్మెట్ డివిజన్ ఘాజీమిల్లత్ కాలనీలో బీజేపీ అభ్యర్థి కౌడి మహేందర్‌తో పాటు ఆయన అనుచరులపై ఎంఐఎం అభ్యర్థి ఎం.ఎ.రెహమాన్(49), అతని నలుగురి అనుచరులు దాడికి పాల్పడ్డారు. మహేందర్ ఫిర్యాదు మేరకు నిందితులపై 143, 147, 323, 181, 506 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇదే ఘటనలో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కూడా కేసు నమోదైంది. -
మద్యం మత్తులో ఉరేసుకున్నాడు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామానికి చెందిన తన్నీరు మహేందర్ (30) అనే యువకుడు మద్యం మత్తులో శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి బానిస అయిన మహేందర్ ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా మహేందర్ ఉరి వేసుకున్నాడు. దాంతో అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మద్యానికి బానిస అయిన మహేందర్ కుటుంబ పోషణను పట్టించుకోకుండా ఉండేవాడని గ్రామస్థులు వెల్లడించారు. మద్యం మత్తులోనే అతడు ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారని చెప్పారు. మహేందర్ భార్య భారతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆశపడితే అసలుకే మోసం..
♦ నకిలీ బంగారు కడ్డీలు ఎరవేసి ♦ అసలు బంగారం దోచుకుంటున్న మహిళలు ♦ ధర్మపురిలో యథేచ్ఛగా సంచారం నకిలీ బంగారు కడ్డీలను ఎరవేసి అసలు బంగారం ఎత్తుకుపోతున్న సంఘటనలు ధర్మపురిలో తరచూ జరుగుతున్నారుు. మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు మహిళా దొంగలు. ధర్మపురి పుణ్యక్షేత్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ప్రతి శనివారం ఇక్కడ సంత జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారిలో ఎవరైనా మహిళలు అమాయకంగా కనిపిస్తే చాలు.. వారిని బురిడీ కొట్టించి అసలు బంగారం ఎత్తుకెళ్తున్నారు. గతంలో ఇలాంటి మోసాలకు పాల్పతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. తాజాగా నాలుగు రోజుల క్రితం ధర్మపురికి చెందిన ఓ అవ్వను మోసం చేసి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు అపహరించిన సంఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -ధర్మపురి ఇదీ మోసం చేసే విధానం.. మహిళా దొంగలు ఇద్దరు, ముగ్గురు కలిసి జట్టుగా ఏర్పడతారు. పథకం ప్రకారం ముందుగా పరిసర ప్రాంతాలను పరిశీలించి ఒంటరిగా మహిళలు దొరికే ప్రాంతాన్ని ఎంచుకుంటారు. ఒంటిపై నగలు ఉన్న అమాయకులను ఎంచుకుని అనుసరిస్తారు. వారి పక్కనుంచే వెళ్లి వెంట తెచ్చుకున్న బంగారం పూత ఉన్న కడ్డీని కింద జారవిడుస్తారు. తర్వాత వారే ఆ కడ్డీని చేతికి తీసుకుని ఇది నీదేనా.. మరెవరైనా పడేసుకున్నారా.. అంటూ మాటల్లో దింపి ఎవరైనా చూస్తే బాగుండదు.. ఈకడ్డీని నీవే తీసికో.. పది తులాల వరకు ఉంటుంది. దానికి బదులు నీమెడలో ఉన్న కొద్దిపాటి నగలు ఇస్తే సరిపోతుందని చెబుతారు. అత్యాశతో కొంత మంది ఒంటిమీదున్న నగలిచ్చి మోసపోరుున సంఘటనలు ధర్మపురిలో తరుచుగా జరుగుతున్నారుు. గతంలో దొరికిన ముఠా ఇంతకు ముందు ఇక్కడ సీఐగా పనిచేసిన మహేందర్ ఆధ్వర్యంలో బంగారు కడ్డీల పేరుతో మోసం చేస్తున్న ముఠాను పట్టుకుని మొత్తం 8 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో హైదరాబాద్‌లోని ఫత్తే నగర్‌కు చెందిన గుంజ శ్రీనివాస్‌తోపాటు అతడి భార్య ప్రమీల, మరో మహిళ కొమిరె రేణుక, మరో ఐదుగురు ఉన్నారు. జామీనుపై బయటకు వచ్చిన ఈ మూఠానే మళ్లీ మోసాలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. జరిగిన సంఘటనలు ►2012 ఫిబ్రవరి 25న జగిత్యాలకు చెం దిన అత్తె రాజవ్వ నుంచి రెండు తులా ల బంగారు పుస్తెలతాడు తీసుకెళ్లారు. ►2012 నవంబర్ 24న ఆదిలాబాద్ జిల్లాలోని దండెపెల్లికి చెందిన గాజుల రాజవ్వ రెండున్నర తులాల పుస్తెల తాడు, వెండి పట్టాగొలుసులు అపహరించారు. ►2015 అగస్టు 1న ధర్మపురికి చెందిన మాదాసు నర్సవ్వ నుంచి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. మూడున్నర తులాలు మోసపోరుున మాది ధర్మపురిలోని కాశెట్టివాడ. ఈనెల ఒకటో తారీఖున శనివారం ఇక్కడ సంతల కూరగాయలు కొనుక్కొని ఇంటికి పోతున్న. నా పక్కనుంచి వచ్చిన ఇద్దరు ఆడోళ్లు ఆగి కిందినుంచి బంగారు కడ్డీ తీసి అబ్బ దొరికిందే.. బరువు బాగనే ఉన్నది. నీదేనా.. అని మాటల్ల దింపిండ్లు. నీమీదున్న నగలు ఇచ్చి బంగారు కడ్డీ తసుకొనిపో.. ఎవలైన సూత్తరని చెప్పిండ్లు. నమ్మి అది తీసుకొని ఇంటికి పోరుు చూసుకునే సరికి నకిలీదని తెలిసింది. మూడున్నర తులాల నగలు పోరుునరుు. పోలీసులకు చెప్పిన. - మాదాసు నర్సవ్వ, ధర్మపురి బంధువుల ఇంటికి పోతే.. ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామంలో ఉంటున్న బంధువుల ఇంటికి చుట్టపుచూపుగా 2012 నవంబర్ 11న వచ్చిన. కూరగాయలు కొనుక్కుని తిరిగి వస్తుండగా ముగ్గురు మహిళలు బంగారు కడ్డీ దొరికిందని చెప్పిండ్లు. ఇది పది తులాలుంటది. ఇది తీసికొని నీ ఒంటిమీదున్న పుస్తెలతాడు ఇరుు్వమని తొందరపెట్టిండ్లు. ఏంచెయ్యూల్నో తోచక రెండున్నర తులాల పుస్తెలతాడు తీసిచ్చిన. ఆ కడ్డీ నాచేతుల పెట్టి పోరుుండ్లు. అవుసులారుున దగ్గరికి పోరుు చూపించిన. బంగారం కాదని చెప్పిండు. - గాజుల రాజవ్వ, దండెపెల్లి, ఆదిలాబాద్ జిల్లా -
భార్యను గొంతు నులిమి చంపిన భర్త?
రామచంద్రాపురం : భార్యను గొంతు నులుమి హత్య చేసిన సంఘటన పట్టణంలోని కానుకుంటలో గురువారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మెదక్ జిల్లా పుల్కల్ మండలానికి చెందిన లక్ష్మి (24)కు రంగారెడ్డి జిల్లాకు చెందిన మహేందర్‌తో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నం కింద రూ.4 లక్షల నగదు ఇవ్వగా.. కొన్ని రోజుల తరువాత బైక్‌ను కూడా అంద జేశారు. పెళ్లి అనంతరం కొత్త జంట రామచంద్రాపురం పట్టణంలోని కానుకుంటలో కాపురం పెట్టారు. కాగా కొన్ని రోజులు సాఫీగా సాగిన వీరి సంసారంలో అదనపు కట్నం చిచ్చు పెట్టింది. కొన్ని రోజులుగా భర్త అదనపు కట్నం తేవాలని భార్య లక్ష్మిని వేధించేవాడు. ఈ విషయమై కులపెద్దలు పంచాయితీ పెట్టి మహేందర్‌కు నచ్చజెప్పారు. తిరిగి ఇద్దరు కలిసి ఉంటున్నారు. కాగా గురువారం ఉదయం మహేందర్.. తన మామ నరసింహులుకు ఫోన్ చేసి ఏడ్చా డు. దీంతో బాధిత తండ్రి ఏం జరిగిందో తె లియక ఇంటి ల్యాండ్ లైన్‌కు ఫోన్ చేశా డు. ఆ ఫోన్‌ను కూడా మహేందర్ ఎత్తాడు. దీంతో అనుమనంతో బాధిత తండ్రి కానుకుంటకు వచ్చారు. కాగా అల్లుడు, అతడి తమ్ముడు కలిసి తన కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మను చంపింది.. నాన్నే !
ఫిర్యాదు చేసి, సాక్ష్యం చెప్పిన కుమారులు నేరస్తుడికి యూవజ్జీవ శిక్ష విధించిన కోర్టు నాలుగేళ్ల క్రితం పందికుంటలో జరిగిన ఘటన వరంగల్ లీగల్ : కళ్లెదురుగా.. కోర్టు బోనులో కన్నతండ్రి. మరో బోనులో అతడి కుమారులు. వారు ఇచ్చే వాంగ్మూలమే న్యాయమూర్తి తీర్పునకు కీలకం. తమ తల్లిని అతికిరాతకంగా చంపిన తండ్రిని ఆ కుమారులు క్షమించలేదు. అమ్మను నాన్నే చంపాడని చెప్పారు. దీంతో సాక్ష్యాధారాలన్ని పరిశీలించిన ఎనిమిదో అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జ్ జడ్జి ఎన్.సాల్మన్‌రాజు ఆ నేరస్తుడికి యూవజ్జీవ శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ములుగు మండలం పందికుంట గ్రామానికి చెందిన జన్ను సూదయ్య, సరోజన దంపతులకు కుమారులు దేవేందర్(కూలీ), మహేందర్(విద్యార్థి) ఉన్నారు. సూదయ్య ఏటూరునాగారానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయమై భార్య, పిల్లలు నిలదీయడంతో సరోజనకే ఇతరులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని వేధించసాగాడు. ఈ క్రమంలో ఆగస్టు 11, 2010న పెద్ద కుమారుడు కూలీకి వెళ్లగా, చిన్న కుమారుడు కాలేజీకి వెళ్లాడు. ఇంట్లో సూదయ్య, సరోజన దంపతులే ఉన్నారు. అదే రోజు మధ్యాహ్నం పొలం వద్దకు వెళదామని చెప్పి నమ్మించి సూదయ్య భార్యను వెంట తీసుకెళ్లాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని విపరీతంగా కొట్టాడు. మెడ చుట్టూ కమిలిపోయి చెవువెంట రక్తం కారుతూ సృ్పహ లేకుండా సరోజన పడిపోయి ఉంది. చిన్నకుమారుడికి గ్రామస్తుల ద్వారా విషయం తెలియడంతో పొలం వద్ద గాయాలతో ఉన్న తల్లిని ఇంటికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలను(రూ.20వేల విలువ) తమ తండ్రి తీసుకెళ్లాడని నిర్ధారించుకున్న మహేందర్, దేవేందర్‌కు పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు కుమారులతోపాటు 12 మంది సాక్షుల వాంగ్మూలాలను విచారించిన కోర్టు నేరస్తుడు ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేసి, హత్య చేశాడని రుజువు కావడంతో సూదయ్యకు ఐపీసీ సెక్షన్ 302 హత్యా నేరం కింద యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1000 జరిమానా, ఐపీసీ సెక్షన్ 498(ఏ), భార్యను వేధింపులకు గురిచేసిన నేరం కింద ఒక ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ జడ్జి సాల్మన్‌రాజు తీర్పు వెల్లడించారు. శిక్షలు ఏకకాలంలో అమలు చేయూలని, గతంలో జైలులో ఉన్న కాలాన్ని శిక్షా కాలం నుంచి మినహాయించాలని తీర్పులో పేర్కొన్నారు. కేసు విచారణను లైజన్ ఆఫీసర్ రఘుపతిరెడ్డి పర్యవేక్షించగా, కానిస్టేబుల్ లింగాల రాంబాబు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ పోతరాజు రవి వాదించారు.