టీజీపీఎస్సీ కార్యాలయాన్నిముట్టడించిన బీజేవైఎం కార్యకర్తలు
పోలీసుల లాఠీచార్జీ...పలువురి అరెస్టు... లాఠీచార్జీని ఖండించిన బీజేపీ నాయకులు
గన్‌ఫౌండ్రి /సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.మహేందర్ డిమాండ్ చేశారు. శనివారం బీజే వైఎం ఆధ్వర్యంలో నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచి్చన హామీని నెరవేర్చక పోవడం దుర్మార్గమన్నారు.
గ్రూప్–2, 3 పోస్టులను పెంచాలని, 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం టీఎజీపీఎస్సీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేసి అడ్డుకున్నారు.
లాఠీచార్జీలో బీజేవైఎం అ ధ్యక్షుడు సెవెళ్ల మహేశ్, నాయకులు అనితారెడ్డితోపాటు పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. మరికొంతమంది నిరుద్యోగ సంఘం నాయకు లను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పవన్‌రెడ్డి, గణేశ్, బి.సురేశ్, ఉపాధ్యక్షుడు ఎన్.మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
లాఠీచార్జీని ఖండించిన కిషన్‌రెడ్డి
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీపీఎస్సీ ఎదుట ధర్నా నిర్వహించిన బీజేవైఎం కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జీని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కాగా లాఠీచార్జీలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేవైఎం అధ్యక్షుడు సెవెళ్ల మహేశ్, నాయకులు అనితా రెడ్డి తది తరులను మహేశ్వర్‌రెడ్డి పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment