Unemployment problems
-
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించండి
గన్‌ఫౌండ్రి /సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.మహేందర్ డిమాండ్ చేశారు. శనివారం బీజే వైఎం ఆధ్వర్యంలో నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచి్చన హామీని నెరవేర్చక పోవడం దుర్మార్గమన్నారు. గ్రూప్–2, 3 పోస్టులను పెంచాలని, 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం టీఎజీపీఎస్సీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేసి అడ్డుకున్నారు. లాఠీచార్జీలో బీజేవైఎం అ ధ్యక్షుడు సెవెళ్ల మహేశ్, నాయకులు అనితారెడ్డితోపాటు పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. మరికొంతమంది నిరుద్యోగ సంఘం నాయకు లను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పవన్‌రెడ్డి, గణేశ్, బి.సురేశ్, ఉపాధ్యక్షుడు ఎన్.మహేశ్ తదితరులు పాల్గొన్నారు. లాఠీచార్జీని ఖండించిన కిషన్‌రెడ్డి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీపీఎస్సీ ఎదుట ధర్నా నిర్వహించిన బీజేవైఎం కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జీని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కాగా లాఠీచార్జీలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేవైఎం అధ్యక్షుడు సెవెళ్ల మహేశ్, నాయకులు అనితా రెడ్డి తది తరులను మహేశ్వర్‌రెడ్డి పరామర్శించారు. -
మార్చిలో 3 నెలల గరిష్టానికి ‘నిరుద్యోగం’
ముంబై: దేశంలో నిరుద్యోగ సమస్య మార్చిలో తీవ్రమైంది. మూడు నెలల గరిష్ట స్థాయిలో 7.8 శాతంగా నమోదయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు వెల్లడించాయి. 2022లో డిసెంబర్లో 8.30 శాతానికి పెరిగి న నిరుద్యోగితా రేటు జనవరిలో 7.14 శాతానికి తగ్గింది. అయితే మరుసటి రెండు నెలల్లో మళ్లీ పెరుగుదల ప్రారంమైంది. ఫిబ్రవరిలో 7.5 శాతం అన్ఎంప్లాయ్మెంట్ రేటు నమోదయితే, మార్చితో మరింత పెరిగి 7.8 శాతానికి ఎగసింది. మార్చిలో పట్టణ ప్రాంతాల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 8.4 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 7.5 శాతంగా నమోదయ్యింది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► మార్చిలో నిరుద్యోగం విషయంలో హర్యానా 26.8%తో అగ్ర స్థానంలో ఉంది. రాజస్తాన్ (26.4%), జమ్మూ, కశ్మీర్ (23.1%), సిక్కిం (20.7%), బీహార్ (17.6%), జార్ఖండ్ (17.5%) తరువాతి స్థానాల్లో నిలిచాయి. ► తక్కువ నిరుద్యోగితా రేటు (0.8 శాతం) ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గడ్‌లో నమోదయితే, అటుపైన పుదుచ్చేరి (1.5 శాతం), గుజరాత్ (1.8 శాతం), కర్ణాటక (2.3 శాతం), మేఘాలయ, ఒడిస్సా (2.6 శాతం) ఉన్నాయి. పండుగ సీజన్ తర్వాత డౌన్ అక్టోబర్–జనవరి పండుగ సీజన్ తర్వాత రిటైల్, సప్లై చైన్, లాజిస్టిక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ–కామర్స్ రంగాల్లో ఉపాధి తగ్గింది. ఐటీ, టెక్నాలజీ, స్టార్టప్‌ల్లో క్రియాశీలత తగ్గింది. ఇది తాజా నియామకాలలో మందగమనానికి దారితీసింది. ఇక మార్చి ఆర్థిక సంవత్సరాంతము, పరీక్షల నెల కావడంతో ప్రమాణాలు, పర్యాటకం, వినోదం, ఆతిథ్య రంగాల్లో అధిక డిమాండ్ కనిపించ లేదు.ఇది నిరుద్యోగితా శాతం పెరుగుదలకు దారితీసింది. తయారీ, ఇంజనీరింగ్, నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాల్లో కూడా ఉపాధి కల్పన అంతంతమాత్రంగానే ఉంది. ఆయా అంశాలు ఉద్యోగ మార్కెట్ వేగాన్ని తగ్గించాయి. అయితే ఏప్రిల్‌లో పురోగమనం ఉంటుందని భావిస్తున్నాం. – ఆదిత్య మిశ్రా, సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈఓ, డైరెక్టర్ తాత్కాలికమే కావచ్చు... నిరుద్యోగ డేటా ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి వాతావరణానికి అద్దం పడుతోంది. భారత్ కార్పొరేట్ రంగం వ్యయాల విషయంలో చాలా విచక్షణతో వ్యవహరిస్తోంది. ప్రతి అడుగును జాగ్రత్తగా బేరీజు వేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భారత్‌నూ ప్రభావం చూస్తుంది కాబట్టి, దేశంలో కార్కొరేట్ రంగం నియామకాలను తాత్కాలికంగా తగ్గించింది. అయితే భారత్ సవాళ్లను అధిగమించే పరిస్థితిలో ఉంది కాబట్టి, తాజా నిరుద్యోగ సమస్య తాత్కాలికమే అని నేను భావిస్తున్నాను. – రితుపర్ణ చక్రవర్తి, టీమ్‌లీజ్ సర్వీసెస్ కో–ఫౌండర్ -
పతనం అంచున పాక్
‘‘భారత్‌తో మూడు యుద్ధాలు చేశాం. సాధించింది ఏమీ లేదు. దేశంలో మరింత విధ్వంసం జరిగింది. నిరుద్యోగం పేదరికం మీద పడ్డాయి. యుద్ధానికి కారణమైన కశ్మీర్ వంటి అంశాలపై భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నాం’’ ‘‘అణ్వాయుధాలు కలిగిన మన దేశం అన్నవస్త్రాల కోసం ప్రపంచ దేశాల ముందు దేహి అంటూ చేయి చాపడం నిజంగా సిగ్గు చేటు. అంతర్జాతీయ సంస్థల్ని రుణాలు అడగాలన్నా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇలా ప్రపంచ దేశాలను భిక్షమడిగి దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించడం పరిష్కారం కాదు’’ ఈ వ్యాఖ్యలు చేసినది ఎవరో కాదు. సాక్షాత్తూ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్. రోజు రోజుకీ దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారి పోతూ ఉండడంతో మరో దారి లేక షరీఫ్ శాంతి మంత్రం జపిస్తున్నారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతామన్న భావనలో పాక్ సర్కార్ ఉంది. గోధుమల లారీని వెంబడించి.. ! పాకిస్తాన్లో ప్రధాన ఆహారమైన గోధుమ పిండికి విపరీతమైన కొరత ఏర్పడింది. నిరుపేదలు గోధుమ పిండి కొనుక్కోవడానికి గంటల తరబడి దుకాణాల దగ్గర క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కరాచీలో ఒక గోధుమ పిండి లారీ వెళుతూ ఉంటే దాని వెనక ప్రజలు పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఒక్క వీడియో చాలు పాక్‌లో ఆహార సంక్షోభం ఏ స్థాయికి చేరుకుంటోందో చెప్పడానికి. బియ్యం, గోధుమలు, కూరగాయలు డిమాండ్‌కు తగ్గ సప్లయి కావడం లేదు. ఇరుగు పొరుగు దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే డాలర్ నిల్వలు తరిగిపోతున్నాయి. కరాచీలో కేజీ గోధుమ పిండి రూ.160 ధర పలుకుతూ ఉండడంతో ప్రజలు కడుపు నింపుకోవడమెలాగ అని ఆందోళన చెందుతున్నారు. కొన్ని రెస్టారెంట్లలో ఒక భోజనం ఖరీదు ఏకంగా రూ.800కి చేరుకుంది. విద్యుత్ సంక్షోభంతో మార్కెట్లను, రెస్టారెంట్లను రాత్రి 8 గంటలకే మూసేస్తూ ఉండడంతో జనం కూడా చేసేదేమి లేక త్వరగా నిద్రపోతున్నారు. దీంతో పాక్‌లో చీకటి పడగానే విద్యుత్ వెలుగులు లేక కారు చీకట్లోకి దేశం వెళ్లిపోతోంది. పెట్రోల్ ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్ రూ.200కి పైనే ఉండడంతో సామాన్యులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. మరోవైపు ప్రాణావసరమైన మందులకి కూడా కొరత ఏర్పడడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరాచీలో ఇన్సులిన్ లభించకపోవడంతో మధుమేహ రోగులు నానా తంటాలు పడుతున్నారు. ఇక సైనికులకి రెండు పూటలా తిండి పెట్టే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. దేశంలో టాప్‌లో ఉన్న 8 తయారీ సంస్థలు ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు లేక మూతపడ్డాయి. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి వివిధ దేశాల్లో రాయబార కార్యాలయాలను కూడా పాక్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంతో ఆర్థిక సంక్షోభం పరాకాష్టకు చేరుకున్నట్టయింది. ►పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంకులో నిల్వలు నిండుకుంటున్నాయి. స్టేట్ బ్యాంకులో 420 కోట్ల డాలర్లే ఉన్నాయి. ఇవి 25 రోజుల దిగుమతి అవసరాలకు మాత్రమే సరిపోతాయి. ►విదేశీ మారక నిల్వలు 2022 జనవరిలో 1660 కోట్లు ఉంటే ఈ ఏడాది జనవరి నాటికి కాస్త 560 కోట్ల డాలర్లకి పడిపోయాయి. ►ఈ ఆర్థిక సంవత్సరం జనవరి –మార్చి మధ్య పాకిస్తాన్ 830 కోట్ల డాలర్ల విదేశీ అప్పులు తీర్చవలసి ఉంది. ►2022–23లో జీడీపీలో 2.8% ఉన్న రక్షణ బడ్జెట్‌ను 2.2శాతానికి తగ్గించారు. ►2022 ఆకస్మిక వరదలు 3.8 కోట్ల మందిని ప్రభావితం చేశాయి. దేశం విలవిలలాడింది. ► స్టేట్ బ్యాంకు ఆఫ్ పాకిస్తాన్ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు. ►వాణిజ్య లోటు ఒక్కసారిగా 57% పెరిగిపోయింది. అత్యవసర జాబితాలో లేని లగ్జరీ వస్తువులు 800కి పైగా రకాల వస్తువుల దిగుమతులపై నిషేధం విధించినప్పటికీ వాణిజ్య లోటు పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం పాక్ వాణిజ్య లోటు 4.866 కోట్ల డాలర్లుగా ఉంది. భారతే దిక్కా ..? పాకిస్తాన్‌కు అండదండ అందించే చైనా ఈ సారి ఆ దేశాన్ని గట్టెక్కించే పరిస్థితులు కనిపించడం లేదు. పాకిస్తాన్ ప్రాంతంలో చైనా చేపట్టిన చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టుకు సంబంధించిన భద్రతాపరమైన ముప్పు కనిపిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టు కోసం వందల కోట్ల డాలర్లను వెచ్చించిన చైనా ఇంక ఆర్థికంగా ఆదుకుంటుందన్న నమ్మకం లేదు. యూఏఈ, సౌదీ అరేబియాలు ముస్లిం దేశాలు కావడంతో పాక్‌కు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చాయి. యూఏఈ 200 కోట్ల డాలర్ల సాయాన్ని చేయడానికి కూడా అంగీకరించింది. కరోనా విలయం, రష్యా, అమెరికా యుద్ధంతో అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వంటి దేశాలు కూడా సాయం చేసే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే భారత్‌తో బలమైన సంబంధాలు కలిగి ఉంటే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చునని పాక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మన దేశంతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరిస్తే నిత్యావసరాలైన బియ్యం, గోధుమ పిండి, కూరగాయలు, మందులు వంటివి తీసుకురావడం అత్యంత సులభంగా మారుతుంది. వాఘా–అట్టారి, ఖోఖర్పార్–మునాబావో సరిహద్దుల నుంచి నిత్యావసర సామగ్రి తరలించడం సులభతరంగా ఉంటుందని పాక్‌లో ఆర్థిక నిపుణులు ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు. దక్షిణాసియాలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థ దక్షిణాసియాలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం పాకిస్తానేనని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఆ దేశ వృద్ధి రేటు గతంలో వేసిన అంచనాల కంటే 2%‘ నెమ్మదిస్తుందని తెలిపింది. పాక్ ఆర్థిక వ్యవస్థ కారణంగా దక్షిణాసియా ప్రాంత పురోగతి రేటు కూడా తగ్గిపోతోందని పేర్కొంది. పాకిస్తాన్‌ను గత ఏడాది ముంచెత్తిన వరదలే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషించింది. ఇప్పటికిప్పుడు పాకిస్తాన్‌కు 3,300 కోట్ల డాలర్లు రుణంగా వస్తే తప్ప ఆ దేశం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Bharat Jodo Yatra: చీతాలు సరే, కొలువులేవి?
హరిపాద్ (కేరళ)/న్యూఢిల్లీ: ‘‘దేశంలో ఒకవైపు నిరుద్యోగం, మరోవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జనం ఇక్కట్ల పాలవుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను ప్రధాని గాలికొదిలేశారు. చీతాలను తెప్పించడంలో, వాటిని ఫొటోలు తీయడంలో బిజీగా ఉన్నారు’’ అంటూ కాంగ్రెస్‌నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఇది అర్థంపర్థం లేని పని అని వ్యాఖ్యానించారు. రాహుల్ భారత్ జోడో యాత్ర శనివారం కేరళలోని అలప్పుజ జిల్లా చేప్పాడ్‌లోకి ప్రవేశించింది. యువత ‘జాతీయ నిరుద్యోగ దినం’ అని తమ ఒంటిపై రాసుకొని ఆయనకు దారిపొడవునా స్వాగతం పలికారు. అనంతరం భారీ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. చీతాలను రప్పించానంటున్న మోదీ గత 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీ నెరవేర్చడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. ముందు నిరుద్యోగం, ధరల కట్టడిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ‘‘చిన్న, మధ్య తరహా వ్యాపారులు, రైతులు, శ్రామికులపై కేంద్రం వ్యవస్థీకృతంగా దాడి చేస్తోంది. ఇద్దరు ముగ్గురు బడా వ్యాపారవేత్తలే దేశ సంపదనంతా నియంత్రిస్తున్నారు. వారు ఏ వ్యాపారంలోకైనా ప్రవేశించి, అప్పటికే ఉన్నవారిని వెళ్లగొట్టగలరు. ఉద్యోగాలు దొరక్క యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కోట్లాది జనం పేదరికంలోకి జారుకుంటున్నారు. ఈ బడా వ్యాపారులు మాత్రం దేశంలో ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, రోడ్లు, విద్యుత్, వ్యవసాయం వంటి అన్ని రంగాలను సొంతం చేసుకుంటున్నారు’’ అంటూ వాపోయారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ గత ఎనిమిదేళ్లలో ఇచ్చింది కేవలం 7 లక్షల కొలువులంటూ మండిపడ్డారు. ‘‘ఉద్యోగాలు సాధించే తీరతామంటూ యువత నినదిస్తోంది. వినిపిస్తోందా?’’ అంటూ ట్వీట్ చేశారు. జాతీయ నిరుద్యోగ దినం అంటూ హాష్టాగ్ జత చేశారు. మోదీ జన్మదినం సందర్భంగా శనివారాన్ని జాతీయ నిరుద్యోగ దినంగా యువత జరుపుకుంటోందని కాంగ్రెస్ పేర్కొంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతా అమృతానందమయిని కరునాగపల్లి సమీపంలోని ఆమె ఆశ్రమంలో రాహుల్ కలుసుకున్నారు. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమమానికి ఎనలేని కృషి సాగిస్తున్నారని కొనియాడారు. నల్ల దుస్తులతో కాంగ్రెస్ నిరసనలు నిరుద్యోగ సమస్యను తక్షణం పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. యువజన కాంగ్రెస్ నేతలు శనివారం దేశవ్యాప్తంగా నల్ల దుస్తులు ధరించి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరుద్యోగ మేళాలు నిర్వహించారు. ‘‘దేశంలో నిరుద్యోగిత రేటు కరోనాకు ముందే 45 ఏళ్ల గరిష్టానికి చేరింది. 20–24 ఏళ్ల వయసువారిలో 42 శాతం నిరుద్యోగులే’’ అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రినేట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘కుబేరుల వ్యాపారాలే ముందుగా లబ్దిపొందుతున్నాయి. దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మోదీ సర్కార్ పథకాల ప్రయోజనాలు చిట్టచివరన దక్కుతున్నాయి’’ అని అన్నారు. మోదీ ప్రభుత్వమొచ్చి యువతకు నిరుద్యోగాన్ని బహుమతిగా ఇచ్చిందని ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ అన్నారు. -
కాంగ్రెస్ మెగా ర్యాలీ వాయిదా
న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యకు నిరసనగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ నెల 28వ తేదీన తలపెట్టిన తలపెట్టిన మెగా ర్యాలీ వాయిదా పడింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సెప్టెంబర్ 4వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ గురువారం తెలిపారు. దేశ రాజధానిలో కరోనా మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని మెగా ర్యాలీని వాయిదా వేసినట్లు వెల్లడించారు. వచ్చే నెల 4న నిర్వహించబోయే భారీ ర్యాలీతో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బలమైన సందేశం పంపిస్తామని అన్నారు. ప్రజా సమస్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 22న రాష్ట్ర స్థాయిలో, 25న జిల్లా స్థాయిలో, 27న బ్లాక్ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే నిర్ణయించింది. అలాగే సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యే భారత్ జోడో యాత్రకు సిద్ధమవుతోంది. కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీర్ దాకా ఆ యాత్ర సాగనుంది. -
మోదీజీ... ఉపాధి కల్పనలో మీరు విఫలం.. కేటీఆర్ ఘాటు లేఖ
సాక్షి, హైదరాబాద్: దేశంలోని నిరుద్యోగ యువత ఆశలను కేంద్ర ప్రభుత్వం అడియాసలు చేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొ డుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశ పరపతి పాతాళంలోకి పడిపోతోందని, పారిశ్రామి కంగా దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి లేక విదేశాల బాట పడుతోందని, ఎన్డీఏ ప్రభుత్వ వైఖరితో విదేశాల్లోనూ భారతీయుల ఉద్యోగా లు సంకటంలో పడ్డాయన్నారు. ఈమేరకు కేటీఆర్ ప్రధానికి బహిరంగలేఖ రాశారు. ఇందులో అంశాలు ఆయన మాటల్లోనే... పకోడీ ఉద్యోగాలే మిగిలాయి మోదీజీ.. మీరు యువతకు ఉపాధి కల్పించే విషయంలో విఫలమయ్యారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వాగ్దానాలు, చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చిన తరువాత మర్చిపోయారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నదంతా డాంభికమేనని మీ ఎనిమిదేళ్ల పాలనే చెబుతోంది. మీ అసమర్థ నిర్ణయాలు, ఆర్థిక విధానాల తో కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న ఉపా ధి అవకాశాలకు గండికొట్టారు. ఉన్న ఉద్యో గాలు కోల్పోయి పకోడీ ఉద్యోగాలే మిగిలాయన్నది వాస్తవం. కేంద్రం ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిద్రపోతోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ లక్షలాది ఉద్యోగాలను రద్దు చేస్తున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం ఖాళీగా ఉన్న 16 లక్షల కేంద్ర ఉద్యోగాల భర్తీ ఎప్పుడు అన్నది భేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది. విదేశాల్లోని ఉద్యోగాలకూ ముప్పు ఎన్డీఏ ప్రభుత్వం ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ అని ఓ వైపు గప్పాలు కొడుతుండగా... మరోవైపు మీ పార్టీ నేతలు మాత్రం సబ్ కో సత్తేనాశ్ కరో అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ వైఖరితో దేశంలోనే కాకుండా విదేశాల్లోని భారతీయుల ఉపాధికి ప్రమా దం ఏర్పడుతోంది. మీ పార్టీ జాతీయ కార్యవర్గాల్లోనైనా.. తెలంగాణ గడ్డ నుంచి దేశ యువతకు ఉపాధి–ఉద్యోగ కల్పనపై వైఖరి స్పష్టం చేయండి. దేశ యువత ఉద్యోగాల పైన నేను లేవనెత్తిన అంశాలకు సమాధా నమివ్వండి. లేదా తెలంగాణ యువతతో కలిసి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేలా, ఉద్యోగాలు భర్తీ అయ్యేవరకు ఉద్యమిస్తాం. ‘తెలంగాణ పోలీసుల తీరును స్వాగతించడంతోపాటు మద్దతునిస్తున్నా. అత్యాచారం వంటి తీవ్ర నేరాలకు పాల్పడేంత పెద్దవారైనప్పుడు జువెనైల్ చట్టాల కింద కాకుండా పెద్దలకు వర్తించే చట్టాల కిందే శిక్షించాలి’ – ట్విట్టర్లో కేటీఆర్ వీటికీ బదులివ్వండి... ►ఏటా మీరు ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు దక్కే, దక్కిన ఉద్యోగాలు ఎన్ని? ►ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయడంతో ఆయా సంస్థల్లో రిజర్వేషన్ అమలుకాదు. ఫలితంగా కోట్లాది దళిత, గిరిజన, బీసీ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు దక్కవు. ►ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇతో«థికంగా చేయూతనిస్తున్నతెలంగాణకు మీరు ఇవ్వాలనుకుంటున్న ప్రాధాన్యం ఏంటి? ►హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరుద్ధరణ లేదా ప్రత్యామ్నాయంగా మరో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని తెలంగాణ యువత తరఫున మేం చేస్తున్న డిమాండ్ల్పై మీ దగ్గర సమాధానం ఉందా? కొత్త రాష్ట్రమైనా ఎంతో సాధించాం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన కొన్ని నెలల్లోనే కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని కేటీఆర్ వివరించారు. ‘‘తెలంగాణ ఉద్యమానికి ప్రాతిపదికైన నీళ్లు–నిధులు–నియామకాలు అనే కీలక అంశాల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఎనిమిదేళ్లుగా మా ప్రభుత్వం అద్భుతమైన కృషి చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ యువతకు కావాల్సిన ఉపాధి అవకాశాల కల్పన కోసం రెండంచెల వ్యూహంతో పనిచేస్తున్నాం. వినూత్న, విప్లవాత్మక పారిశ్రామిక విధానాలతో లక్షల కోట్ల రూపాయలను తెలంగాణకు పెట్టుబడులుగా తెచ్చాం. ప్రైవేటురంగంలో సుమారు 16 లక్షల ఉపాధి అవకాశాలను యువత అందిపుచ్చుకుంది’అని లేఖలో వివరించారు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి ‘ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022’లో భారత్ 180వ స్థానంలో అట్టడుగు స్థానంలో నిలవడంపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం తరహాలో కార్యాచరణ చేపట్టడంతోపాటు కేంద్రం, రాష్ట్రాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని ఈ నివేదిక వెల్లడిస్తోంది’అని కేటీఆర్ ట్వీట్ చేశారు. -
టీజేఎస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: రైతులు, నిరుద్యోగుల సమస్యలపై పోరుబాటకు తెలంగాణ జన సమితి (టీజేఎస్) సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారంలో ముందుండేలా ఏర్పాట్లు చేస్తోంది. ముందస్తు ఎన్నికల ఆలోచనల నేపథ్యంలో పార్టీని వీలైనంతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచించింది. ఆ తరువాత జిల్లాల్లో బస్సుయాత్రకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నా.. కలసి వచ్చే పక్షాలనూ కలుపుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే ముందు సొం త కార్యాచరణే చేపట్టాలని ఇటీవల ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు టీజేఎస్ అధికార ప్రతినిధి జి.వెంకట్‌రెడ్డి వెల్లడించారు. సకల జనుల సమ్మె రోజునే.. పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులను ఎత్తిచూపుతూ వాటి సవరణ కోసం మండల కేంద్రాల్లో రైతులతో విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 20 నుంచి చేపట్టాలని టీజేఎస్ నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి వారం రోజులు.. రైతు బంధులో జరుగుతున్న అవకతవకలు, నష్టపోయిన రైతులతో మండల అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యాచరణను అమలు చేయనుంది. ఆ బాధ్యతలను టీజేఎస్ అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డికి అప్పగించింది. రైతులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై వచ్చేనెల 12న హైదరాబాద్‌లో దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. సకల జనుల సమ్మె చేపట్టిన సెప్టెంబర్ 12వ తేదీనే ఈ దీక్ష చేపట్టాలని తీర్మానించింది. రాజీవ్ లేదా విజయవాడ రహదారిపై భూములు తీసుకున్న వివిధ కంపెనీలను పరిశీలించి ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారో ఈ నెల 27 నుంచి 31 వరకు కార్యక్రమం నిర్వహించి చర్చించాలని టీజేఎస్ నిర్ణయించింది. భూములు కోల్పోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో నిరుద్యోగుల నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 30న రాజీవ్ రహదారి, విజయవాడ హైవేపై సడక్ బంద్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యాచరణ విజయవంతం కోసం అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. తరువాత పార్టీ అధ్యక్షుడు కోదండరాం నేతృత్వంలో ప్రజల్లోకి వెళ్లాలని, జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. -
సమస్య తీరదు.. ఆశ చావదు!
►ప్రజావాణికి తిరిగి తిరిగి అలిసిపోతున్న పిర్యాదుదారులు ►గ్రమాల్లో అధికారులు అందుబాటులో ఉండకపోవడమే కారణం ►నేడు జిల్లాకేంద్రంలో ప్రజావాణి ♦ పరిష్కారానికినోచుకోని సమస్యలు ♦ ప్రజావాణికి తిరిగి వేసారిపోతున్న బాధితులు ♦ క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యమే కారణం ♦ నేడు ప్రజావాణి గ్రామాల్లో అధికారులు అందుబాటులో ఉండటంలేదు. దీంతో ఎంతో ఆశతో ప్రతిసోమవారం సమస్యలపై ఫిర్యాదు చేయడానికి జిల్లాకేంద్రానికి వస్తున్న వారికీ ఇక్కడా నిరాశే ఎదురవుతోంది. వినతులను స్వీకరిస్తున్న జిల్లా అధికారులు అలా తీసుకొని ఇలా మండలాలకు పంపించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. - మహబూబ్‌నగర్ న్యూటౌన్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తు న్న ప్రజావాణిలో వినతులిచ్చిన బాధితులు స మస్య పరిష్కారం కాకపోవడంతో చాలామంది మళ్లీమళ్లీ వచ్చి తమ గోడును అధికారులకు వెల్లబోసుకుంటున్నారు. ఇక్కడ అధికారులు ఆదేశాలు జారీచేసినా మండల స్థాయిలో అధికారులు పట్టిం చుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తరచూ మంచినీటి సమస్య, పింఛన్ల మంజూరి, భూముల సమస్యలు, రుణాల మం జూరీ, ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అక్రమా లు, నిరుద్యోగుల సమస్యలపై ప్రజావాణికి వినతులు అధిక సంఖ్యలో వస్తున్నాయి. ఫిబ్రవరి నె లలో వందల్లో ఫిర్యాదులు అందక వాటిలో ప దిశాతం కూడా సమస్యలను పరిష్కరించలేదు. గ తనెల 1న నిర్వహించిన ప్రజావాణిలో 314 దరఖాస్తులు, 8న 339, 15న 300, 22న 305, 29న జరి గిన ప్రజావాణిలో 320 ఫిర్యాదులు, వినతులు అందాయి. ఉద్యోగం కోసం.. అమ్రాబాద్ మండలం దోమలపెంటకు చెందిన కె. సంతోషమ్మ 2002కు ముందు ఏపీ జెన్కోలో వాచ్‌మెన్‌గా పని చేసింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఆమెనున తొలగించారు. తనను తెలంగాణలో ఉద్యోగం కల్పించాలని విన్నవిస్తే హైదరాబాద్ జల సౌదకు వెళ్లమని చెబుతున్నారు. ఆమె కొన్నిరోజులుగా ఫిర్యాదు తీసుకొని తిరుగుతున్నా ఇక్కడి అధికారులు పట్టించుకోవడంలేదు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ కలెక్టర్ టికె.శ్రీదేవి ప్రజావాణి, పల్లెవికాసం, రెవెన్యూ దర్బార్ వంటి కార్యక్రమాల్లో వచ్చిన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని మండల అధికారులకు ఆదేశిస్తున్నా ఎవరూ స్పందించడంలేదు. మండలకేంద్రాల్లో జరిగే ప్రజావాణిలో పదుల సంఖ్యలోకూడా దరఖాస్తులు రావడంలేదంటే ప్రజలకు అధికారులపై ఏమేరకు నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ పని కావడంలేదని జిల్లాకేంద్రానికి వస్తుండటంతో ఇక్కడ వందల సంఖ్యలో దరఖాస్తులు పేరుకపోతున్నాయి. కానీ అవికూడా తిరిగి మండలాలకు వెళ్లడంతో అక్కడే ఉండిపోతున్నాయి. స్థానిక రాజకీయాలు, నిర్లక్ష్యం కారణంగా సమస్యలు తీరడంలేదని ఫిర్యాదు దారులు వాపోతున్నారు. ప్రేమ్‌కుమార్ పరేషాన్.. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని బోయపల్లి గ్రామ శివారులో రాజేంద్రనగర్‌కు చెందిన జె.ప్రేమ్‌కుమార్‌కు సర్వే నెం.134లో 1.20 ఎకరాల భూమి ఉంది. అయితే అందులోంచి 0.10 గుంటల భూమిని రెవెన్యూ అధికారులు రికార్డుల్లో ఇతరుల పేరుమీద మార్చారు. ఇందుకు కారణాలు చెప్పి తన భూమిని తన పేరుమీదకు మార్చాలని ప్రేమ్‌కుమార్ కొన్నిరోజులుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా పని కావడంలేదు.