గురువారం ఢిల్లీలో బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తే, బోయింగ్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్క్ అలెన్‌ను మంత్రి కేటీఆర్ కలిశారు.
సాక్షి, హైదరాబాద్: దేశంలోని నిరుద్యోగ యువత ఆశలను కేంద్ర ప్రభుత్వం అడియాసలు చేసిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొ డుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశ పరపతి పాతాళంలోకి పడిపోతోందని, పారిశ్రామి కంగా దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి లేక విదేశాల బాట పడుతోందని, ఎన్‌డీఏ ప్రభుత్వ వైఖరితో విదేశాల్లోనూ భారతీయుల ఉద్యోగా లు సంకటంలో పడ్డాయన్నారు. ఈమేరకు కేటీఆర్ ప్రధానికి బహిరంగలేఖ రాశారు. ఇందులో అంశాలు ఆయన మాటల్లోనే...
పకోడీ ఉద్యోగాలే మిగిలాయి
మోదీజీ.. మీరు యువతకు ఉపాధి కల్పించే విషయంలో విఫలమయ్యారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వాగ్దానాలు, చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చిన తరువాత మర్చిపోయారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నదంతా డాంభికమేనని మీ ఎనిమిదేళ్ల పాలనే చెబుతోంది. మీ అసమర్థ నిర్ణయాలు, ఆర్థిక విధానాల తో కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న ఉపా ధి అవకాశాలకు గండికొట్టారు.
ఉన్న ఉద్యో గాలు కోల్పోయి పకోడీ ఉద్యోగాలే మిగిలాయన్నది వాస్తవం. కేంద్రం ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిద్రపోతోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ లక్షలాది ఉద్యోగాలను రద్దు చేస్తున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం ఖాళీగా ఉన్న 16 లక్షల కేంద్ర ఉద్యోగాల భర్తీ ఎప్పుడు అన్నది భేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది.
విదేశాల్లోని ఉద్యోగాలకూ ముప్పు
ఎన్‌డీఏ ప్రభుత్వం ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ అని ఓ వైపు గప్పాలు కొడుతుండగా... మరోవైపు మీ పార్టీ నేతలు మాత్రం సబ్ కో సత్తేనాశ్ కరో అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ వైఖరితో దేశంలోనే కాకుండా విదేశాల్లోని భారతీయుల ఉపాధికి ప్రమా దం ఏర్పడుతోంది. మీ పార్టీ జాతీయ కార్యవర్గాల్లోనైనా.. తెలంగాణ గడ్డ నుంచి దేశ యువతకు ఉపాధి–ఉద్యోగ కల్పనపై వైఖరి స్పష్టం చేయండి. దేశ యువత ఉద్యోగాల పైన నేను లేవనెత్తిన అంశాలకు సమాధా నమివ్వండి. లేదా తెలంగాణ యువతతో కలిసి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేలా, ఉద్యోగాలు భర్తీ అయ్యేవరకు ఉద్యమిస్తాం.
‘తెలంగాణ పోలీసుల తీరును స్వాగతించడంతోపాటు మద్దతునిస్తున్నా. అత్యాచారం వంటి తీవ్ర నేరాలకు పాల్పడేంత పెద్దవారైనప్పుడు జువెనైల్ చట్టాల కింద కాకుండా పెద్దలకు వర్తించే చట్టాల కిందే శిక్షించాలి’
– ట్విట్టర్‌లో కేటీఆర్
వీటికీ బదులివ్వండి...
►ఏటా మీరు ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు దక్కే, దక్కిన ఉద్యోగాలు ఎన్ని?
►ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయడంతో ఆయా సంస్థల్లో రిజర్వేషన్ అమలుకాదు. ఫలితంగా కోట్లాది దళిత, గిరిజన, బీసీ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు దక్కవు.
►ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇతో«థికంగా చేయూతనిస్తున్నతెలంగాణకు మీరు ఇవ్వాలనుకుంటున్న ప్రాధాన్యం ఏంటి?
►హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరుద్ధరణ లేదా ప్రత్యామ్నాయంగా మరో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని తెలంగాణ యువత తరఫున మేం చేస్తున్న డిమాండ్ల్‌పై మీ దగ్గర సమాధానం ఉందా?
కొత్త రాష్ట్రమైనా ఎంతో సాధించాం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన కొన్ని నెలల్లోనే కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని కేటీఆర్ వివరించారు. ‘‘తెలంగాణ ఉద్యమానికి ప్రాతిపదికైన నీళ్లు–నిధులు–నియామకాలు అనే కీలక అంశాల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఎనిమిదేళ్లుగా మా ప్రభుత్వం అద్భుతమైన కృషి చేస్తోంది.
ముఖ్యంగా తెలంగాణ యువతకు కావాల్సిన ఉపాధి అవకాశాల కల్పన కోసం రెండంచెల వ్యూహంతో పనిచేస్తున్నాం. వినూత్న, విప్లవాత్మక పారిశ్రామిక విధానాలతో లక్షల కోట్ల రూపాయలను తెలంగాణకు పెట్టుబడులుగా తెచ్చాం. ప్రైవేటురంగంలో సుమారు 16 లక్షల ఉపాధి అవకాశాలను యువత అందిపుచ్చుకుంది’అని లేఖలో వివరించారు.
ఆత్మ పరిశీలన చేసుకోవాలి
‘ఎన్విరాన్‌మెంటల్ పర్‌ఫార్మెన్స్ ఇండెక్స్ 2022’లో భారత్ 180వ స్థానంలో అట్టడుగు స్థానంలో నిలవడంపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం తరహాలో కార్యాచరణ చేపట్టడంతోపాటు కేంద్రం, రాష్ట్రాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని ఈ నివేదిక వెల్లడిస్తోంది’అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment