సమస్య తీరదు.. ఆశ చావదు!
►ప్రజావాణికి తిరిగి తిరిగి అలిసిపోతున్న పిర్యాదుదారులు
►గ్రమాల్లో అధికారులు అందుబాటులో ఉండకపోవడమే కారణం
►నేడు జిల్లాకేంద్రంలో ప్రజావాణి
♦ పరిష్కారానికినోచుకోని సమస్యలు
♦ ప్రజావాణికి తిరిగి వేసారిపోతున్న బాధితులు
♦ క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యమే కారణం
♦ నేడు ప్రజావాణి
గ్రామాల్లో అధికారులు అందుబాటులో ఉండటంలేదు. దీంతో ఎంతో ఆశతో ప్రతిసోమవారం సమస్యలపై ఫిర్యాదు చేయడానికి జిల్లాకేంద్రానికి వస్తున్న వారికీ ఇక్కడా నిరాశే ఎదురవుతోంది. వినతులను స్వీకరిస్తున్న జిల్లా అధికారులు అలా తీసుకొని ఇలా మండలాలకు పంపించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. - మహబూబ్‌నగర్ న్యూటౌన్
కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తు న్న ప్రజావాణిలో వినతులిచ్చిన బాధితులు స మస్య పరిష్కారం కాకపోవడంతో చాలామంది మళ్లీమళ్లీ వచ్చి తమ గోడును అధికారులకు వెల్లబోసుకుంటున్నారు. ఇక్కడ అధికారులు ఆదేశాలు జారీచేసినా మండల స్థాయిలో అధికారులు పట్టిం చుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తరచూ మంచినీటి సమస్య, పింఛన్ల మంజూరి, భూముల సమస్యలు, రుణాల మం జూరీ, ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అక్రమా లు, నిరుద్యోగుల సమస్యలపై ప్రజావాణికి వినతులు అధిక సంఖ్యలో వస్తున్నాయి. ఫిబ్రవరి నె లలో వందల్లో ఫిర్యాదులు అందక వాటిలో ప దిశాతం కూడా సమస్యలను పరిష్కరించలేదు. గ తనెల 1న నిర్వహించిన ప్రజావాణిలో 314 దరఖాస్తులు, 8న 339, 15న 300, 22న 305, 29న జరి గిన ప్రజావాణిలో 320 ఫిర్యాదులు, వినతులు అందాయి.
ఉద్యోగం కోసం..
అమ్రాబాద్ మండలం దోమలపెంటకు చెందిన కె. సంతోషమ్మ 2002కు ముందు ఏపీ జెన్‌కోలో వాచ్‌మెన్‌గా పని చేసింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఆమెనున తొలగించారు. తనను తెలంగాణలో ఉద్యోగం కల్పించాలని విన్నవిస్తే హైదరాబాద్ జల సౌదకు వెళ్లమని చెబుతున్నారు. ఆమె కొన్నిరోజులుగా ఫిర్యాదు తీసుకొని తిరుగుతున్నా ఇక్కడి అధికారులు పట్టించుకోవడంలేదు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
కలెక్టర్ టికె.శ్రీదేవి ప్రజావాణి, పల్లెవికాసం, రెవెన్యూ దర్బార్ వంటి కార్యక్రమాల్లో వచ్చిన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని మండల అధికారులకు ఆదేశిస్తున్నా ఎవరూ స్పందించడంలేదు. మండలకేంద్రాల్లో జరిగే ప్రజావాణిలో పదుల సంఖ్యలోకూడా దరఖాస్తులు రావడంలేదంటే ప్రజలకు అధికారులపై ఏమేరకు నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ పని కావడంలేదని జిల్లాకేంద్రానికి వస్తుండటంతో ఇక్కడ వందల సంఖ్యలో దరఖాస్తులు పేరుకపోతున్నాయి. కానీ అవికూడా తిరిగి మండలాలకు వెళ్లడంతో అక్కడే ఉండిపోతున్నాయి. స్థానిక రాజకీయాలు, నిర్లక్ష్యం కారణంగా సమస్యలు తీరడంలేదని ఫిర్యాదు దారులు వాపోతున్నారు.
ప్రేమ్‌కుమార్ పరేషాన్..
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని బోయపల్లి గ్రామ శివారులో రాజేంద్రనగర్‌కు చెందిన జె.ప్రేమ్‌కుమార్‌కు సర్వే నెం.134లో 1.20 ఎకరాల భూమి ఉంది. అయితే అందులోంచి 0.10 గుంటల భూమిని రెవెన్యూ అధికారులు రికార్డుల్లో ఇతరుల పేరుమీద మార్చారు. ఇందుకు కారణాలు చెప్పి తన భూమిని తన పేరుమీదకు మార్చాలని ప్రేమ్‌కుమార్ కొన్నిరోజులుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా పని కావడంలేదు.