భార్యను గొంతు నులిమి చంపిన భర్త? | husband killed his wife | Sakshi
Sakshi News home page

భార్యను గొంతు నులిమి చంపిన భర్త?

Published Thu, Dec 25 2014 11:01 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

భార్యను గొంతు నులిమి చంపిన భర్త? - Sakshi

భార్యను గొంతు నులిమి చంపిన భర్త?

రామచంద్రాపురం : భార్యను గొంతు నులుమి హత్య చేసిన సంఘటన పట్టణంలోని కానుకుంటలో గురువారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మెదక్ జిల్లా పుల్కల్ మండలానికి చెందిన లక్ష్మి (24)కు రంగారెడ్డి జిల్లాకు చెందిన మహేందర్‌తో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నం కింద రూ.4 లక్షల నగదు ఇవ్వగా.. కొన్ని రోజుల తరువాత బైక్‌ను కూడా అంద జేశారు.

పెళ్లి అనంతరం కొత్త జంట రామచంద్రాపురం పట్టణంలోని కానుకుంటలో కాపురం పెట్టారు. కాగా కొన్ని రోజులు సాఫీగా సాగిన వీరి సంసారంలో అదనపు కట్నం చిచ్చు పెట్టింది. కొన్ని రోజులుగా భర్త అదనపు కట్నం తేవాలని భార్య లక్ష్మిని వేధించేవాడు. ఈ విషయమై కులపెద్దలు పంచాయితీ పెట్టి మహేందర్‌కు నచ్చజెప్పారు.

తిరిగి ఇద్దరు కలిసి ఉంటున్నారు. కాగా గురువారం ఉదయం మహేందర్.. తన మామ నరసింహులుకు ఫోన్ చేసి ఏడ్చా డు. దీంతో బాధిత తండ్రి ఏం జరిగిందో తె లియక ఇంటి ల్యాండ్ లైన్‌కు ఫోన్ చేశా డు. ఆ ఫోన్‌ను కూడా మహేందర్ ఎత్తాడు. దీంతో అనుమనంతో బాధిత తండ్రి కానుకుంటకు వచ్చారు. కాగా అల్లుడు, అతడి తమ్ముడు కలిసి తన కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement