హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఊరెల్లిలో విషాదం నెలకొంది. కట్టుకున్న భార్య, రక్తం పంచుకు పుట్టిన బిడ్డలను విషమిచ్చి...హతమార్చేందుకు ప్రయత్నించాడో ప్రబుద్దుడు. ఈ దారుణ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఆనంద్ కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. శిరీష (౩), అనూష (2)లను మృతి చెందగా, భార్య లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భార్య, పిల్లలకు విషమిచ్చాడు, ఇద్దరు మృతి
Published Fri, Jan 16 2015 10:17 AM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM
Advertisement
Advertisement