కృష్ణరాజపురం : తాము అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కుమార్తెను హత్య చేసి మృతదేహాన్ని ఇంటిలోపెట్టి ఉడాయించిన భార్యభర్తలను వారికి సహకరించిన మరో వ్యక్తిని మహాదేవపుర పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు... హోడిలో నివాసం ఉంటున్న ట్యాంకర్ మంజునాథ్, లక్ష్మీ దంపతులకు ఆరేళ్ల కుమార్తె ఉంది. వీరి ఇంటిలోనే సురేష్‌కుమార్, అతని బార్య ప్రతిమాదేవి అద్దెకు ఉంటున్నారు.
ఇదిలా ఉంటే లక్ష్మి, ప్రతిమల మధ్య కొన్ని రోజుల క్రితం గొడవ జరిగింది. దాన్ని మనసులో పెట్టుకున్న ప్రతిమ తన పరిచయం ఉన్న మహ్మద్ మున్నాను వ్యక్తిని పిలిపించి ఈనెల ఒకటిన బాలికపై అత్యాచారం చేయించింది. అనంతరం ఇద్దరు కలిసి బాలిక గొంతు పిసికి హత్య చేసి ఇంటి తాళం వేసి లక్ష్మికి ఇచ్చి తాము బయటకు వెళ్లి వస్తామని చెప్పి భర్తతో కలిసి వెళ్లిపోయింది.
ఇదిలా ఉంటే తన ఆరేళ్ల కుమార్తె కనిపించకపోవడంతో చివరికి ప్రతిమ ఇంటితాళం తీసి చూడటంతో బాలిక మృతదేహం బయటపడింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు శుక్రవారం ప్రతిమ, సురేష్‌లతో పాటు మున్నాను కూడా అరెస్ట్ చేశారు.
బాలిక హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
Published Sun, Sep 14 2014 3:03 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement