mahadevapura
-
కర్ణాటక సర్కారుకు సొంతపార్టీ ఎమ్మెల్యే షాక్.. అసెంబ్లీలోనే ఫైర్
బెంగళూరు: పాడైపోయిన రోడ్లు, గుంతలు పడిన రోడ్లపై ప్రయాణం చేయడమంటే సవాలుతో కూడుకొని ఉన్నదే. ఆ దారుల్లో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. రోడ్లు సరిగా లేకపోడం కూడా రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుంది. అయినా నేతలకు చీమ కుట్టిన్నట్లు కూడా ఉండదు. తాజాగా బెంగుళూరులోని రోడ్ల పరిస్థితి కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు దారితీసింది. చెడిపోయిన, గుంతలమయమైన రోడ్ల వల్ల బెంగళూరు వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రతిపక్షాలతోపాటు అధికార ఎమ్మెల్యే సైతం విమర్శలు గుప్పించారు. బెంగుళూరులో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే మండిపడ్డారు. అయితే రాష్ట్రంలో బీజీపీ అధికారంలో ఉండగా.. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచి ప్రభుత్వంపై విమర్శలు రావడం హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటక అసెంబ్లీలో శీతాకాల సమావేశాల సందర్భంగా.. బెంగళూరుతో పాటు చుట్టు పక్కల రోడ్ల పరిస్థితి గురించి బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నగరంలో రోడ్లను మెరుగు పరేచేందుకు తక్కువ నిధులు కేటాయిస్తున్నారంటూ మండిపడ్డారు. చదవండి: పెళ్లి ఊరేగింపులో అపశృతి.. తృటిలో తప్పింది లేదంటే వరుడికి.. బెంగళూరులోని మహదేవపుర నియోజకవర్గం ఎమ్మెల్యే అరవింద్ లింబావలి మాట్లాడుతూ.. తన నియోజవవర్గంలో బెంగళూరు చుట్టుపక్కల గ్రామాలను అభివృద్ధి చేసేందుకు మంజూరు చేస్తున్న ఆర్థికసాయం నిధులు సరిపోవడం లేదన్నారు. తన నియోజకవర్గంలో అత్యధిక గ్రామలు ఉన్నాయని కానీ తక్కువ నిధులు ఇచ్చారన్నారు. ఈ విషయాన్ని నేను సీఎంకు కూడా వివరించానని, రోడ్లను పునరుద్ధరిండడానికి కేవలం రూ. 1,000 కోట్లు కేటాయిస్తే సరిపోదన్నారు. వర్షాలు తగ్గడంతో బెంగళూరులో రోడ్లను పునరుద్ధరించాలని అరవింద్ లింబావలి కోరారు.. చదవండి: Sania Mistry: స్లమ్ సెన్సేషన్... ర్యాపర్ సానియా.. ఒక్కసారి వింటే! రోడ్లు వేయడం, రోడ్ల నిర్వహణలో ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం లోపించిందని మండిపడ్డారు. బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు పైప్లైన్లను వేస్తోంది. బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (బెస్కామ్) కూడా రోడ్లను తవ్వుతోంది. వారి మధ్య పూర్తిగా సమన్వయం లోపించింది. వీరి మధ్య కాస్త సమన్వయం ఉంటేనే బెంగళూరు నగరం, రోడ్లు బాగుంటాయన్నారు. బెంగళూరు రోడ్ల పరిస్థితి గురించి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారని, దీనిపై ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు. కాగా రోడ్ల పరిస్థితిపై బీజేపీ ఎమ్మెల్యేతోపాటు రోడ్డు పనులకు నిధుల మంజూరులో జాప్యంపై జేడీఎస్‌కు చెందిన దాసరహళ్లి ఎమ్మెల్యే ఆర్ మంజునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బైటరాయణపురకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ బైరేగౌడ కూడా మండిపడ్డారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. -
కాళేశ్వరం ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్
మహదేవపూర్ : జిల్లాకు మరో ప్రతిష్టాత్మకమైన సాగు, తాగునీటి ప్రాజెక్టు దక్కింది. కొద్ది రోజులుగా తర్జనభర్జన పడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్టకేలకు ఖరారైంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా గోదావరినదిపై మహదేవపూర్ మండలం మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా సిద్దిపేటలో శనివారం జరిగిన హరితహారం సభలో ప్రకటించడంతో జిల్లా ప్రజలు హర్షిస్తున్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును గతంలో ప్రతిపాదించిన ఆదిలాబాద్ జిల్లా తుమ్మడిహట్టి వద్ద కాకుండా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీ పేరున నిర్మించనున్నారు. గతంలో ప్రతిపాదించిన తుమ్మడిహట్టి వద్ద నిర్మాణం వల్ల మహారాష్ట్రలో ముంపు ప్రాంతం ఎక్కువగా ఉంటున్న కారణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీనికి ప్రత్యామ్నాయంగా అనువైన స్థలం ఎంపిక చేసే బాధ్యతను తెలంగాణ నీటిపారుదల శాఖ రిటైడ్ ఇంజనీర్ల బృందానికి ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు పది మంది ఇంజనీర్ల బృదం మార్చి నెలలో ఖమ్మం జిల్లా దుమ్మగూడెం నుంచి మొదలుకుని ఎల్లంపల్లి వరకు గోదావరినదిపై సర్వే నిర్వహించి మేడిగడ్డను అనువైన ప్రాంతంగా గుర్తించారు. మేడిగడ్డ వద్ద నీటి లభ్యత, ఎంత ఎత్తున ప్రాజెక్టు నిర్మాణం చేయవచ్చనే విషయాలను సర్వే చేసేందుకు ప్రభుత్వం వాస్కోప్ అనే సంస్థకు అప్పగించింది. సదరు సంస్థ పలుమార్లు మేడిగడ్డ వద్ద సర్వే చేసి ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా ప్రభుత్వం మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. మేడిగడ్డ వద్ద 110 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవచ్చని వాస్కోప్ సంస్థ మొదటగా సూచించినప్పటికీ దాని వల్ల దాదాపు 5 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో డిజైన్‌ను మార్చాలని సీఎం సూచించారు. ఈ మేరకు ఏవిధమైన ముంపు లేకుండా ఉండేలా 99 మీటర్లకు మార్చి డిజైనింగ్ చేయడంతో ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుత ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలం తుమ్మడిహట్టికి దాదాపు 100 కిలోమీటర్ల దిగువన, కాళేశ్వరం నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరాన ఉంది. మేడిగడ్డ వద్ద సంవత్సరంలో రెండు వందల రోజులు నీటి లభ్యత ఉంటుందని, ఇక్కడినుంచి 160 టీఎంసీల నీటిని పంపింగ్ చేసుకునే అవకాశం ఉందని సర్వే సంస్థ స్పష్టం చేసింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి, మధ్యమానేరు ప్రాజెక్టులకు నీటిని పంపింగ్ చేస్తారు. కొంత ఓపెన్ కాల్వల ద్వారా, మరికొంత సొరంగ మార్గం ద్వారా పంపింగ్ చేయూల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుతో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాలకు తాగునీటిని అందించే అవకాశం ఉంటుంది. -
బాలిక హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
కృష్ణరాజపురం : తాము అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కుమార్తెను హత్య చేసి మృతదేహాన్ని ఇంటిలోపెట్టి ఉడాయించిన భార్యభర్తలను వారికి సహకరించిన మరో వ్యక్తిని మహాదేవపుర పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు... హోడిలో నివాసం ఉంటున్న ట్యాంకర్ మంజునాథ్, లక్ష్మీ దంపతులకు ఆరేళ్ల కుమార్తె ఉంది. వీరి ఇంటిలోనే సురేష్‌కుమార్, అతని బార్య ప్రతిమాదేవి అద్దెకు ఉంటున్నారు. ఇదిలా ఉంటే లక్ష్మి, ప్రతిమల మధ్య కొన్ని రోజుల క్రితం గొడవ జరిగింది. దాన్ని మనసులో పెట్టుకున్న ప్రతిమ తన పరిచయం ఉన్న మహ్మద్ మున్నాను వ్యక్తిని పిలిపించి ఈనెల ఒకటిన బాలికపై అత్యాచారం చేయించింది. అనంతరం ఇద్దరు కలిసి బాలిక గొంతు పిసికి హత్య చేసి ఇంటి తాళం వేసి లక్ష్మికి ఇచ్చి తాము బయటకు వెళ్లి వస్తామని చెప్పి భర్తతో కలిసి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే తన ఆరేళ్ల కుమార్తె కనిపించకపోవడంతో చివరికి ప్రతిమ ఇంటితాళం తీసి చూడటంతో బాలిక మృతదేహం బయటపడింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు శుక్రవారం ప్రతిమ, సురేష్‌లతో పాటు మున్నాను కూడా అరెస్ట్ చేశారు.