
సాక్షి, హైదరాబాద్: చుట్టూ పచ్చని ప్రకృతి.. అందమైన గృహాలు.. ఆధునిక వసతులు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆరోగ్యానికి, ఆనందానికి దగ్గర నివాసమంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు చెప్పండి. అచ్చం ఇలాంటి ప్రాజెక్ట్‌నే అభివృద్ధి చేస్తోంది మ్యాక్ నిర్మాణ సంస్థ. శ్రీశైలం జాతీయ రహదారిలో బీటీఆర్ గ్రీన్స్ పేరిట రూపుదిద్దుకుంటోంది.
♦రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 15 నిమి షాలు, ఔటర్ రింగ్ రోడ్డుకు 5 నిమిషాల ప్రయాణ వ్యవధి దూరంలో ఉంది ఈ ప్రాజెక్ట్. 200 ఎకరాల్లో రానున్న బీటీఆర్ గ్రీన్స్‌లో మొత్తం 300 ప్రీమియం విల్లాలుంటాయి. 2,900 చ.అ. నుంచి 3,600 చ.అ.ల్లో 3, 4 పడక గదులుంటాయి. మలేషియాకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ ఎస్‌ఏ ఆర్కిటెక్ట్స్ ఎస్‌డీఎన్ బీహెచ్‌డీ ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేసింది. ప్రీమియం విల్లాలతో పాటూ 325 గజాల నుంచి 1,000 గజాల్లో ఓపెన్ ప్లాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
♦ ఇక వసతుల విషయానికొస్తే.. ల్యాండ్ స్కేపింగ్, నిత్యావసర దుకాణాలు, ఏటీఎం వంటి వసతులతో పాటూ క్లబ్ హౌస్, స్పా అండ్ సెలూన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మల్టిపర్పస్ ప్లే గ్రౌండ్, గోల్ఫ్ కోర్ట్ వంటివి ఉంటాయి.
♦ ప్రాజెక్ట్‌కు చేరువలో అంతర్జాతీయ విద్యా సంస్థలున్నాయి. నివాసితులకు వైద్య సేవలందించేందుకు బీటీఆర్ ప్రత్యేకంగా అపోలో హెల్త్ సర్వీసెస్‌తో ఒప్పందం చేసుకుంది. ప్రాజెక్ట్‌లో 24 గంటల పాటు అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment