కన్‌స్ట్రక్టర్ కావాలనుకున్నా.... | Constructor want them .... Mumbai Beauty Anaika | Sakshi
Sakshi News home page

కన్‌స్ట్రక్టర్ కావాలనుకున్నా....

Published Sat, Oct 18 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM

కన్‌స్ట్రక్టర్ కావాలనుకున్నా....

కన్‌స్ట్రక్టర్ కావాలనుకున్నా....

ముంబయి బ్యూటీ అనైక హిందీ చిత్రం సత్య-2తో వెండితెరపై మెరిసింది. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్వేషణ ఫలితంగా వెలుగులోకి వచ్చింది ఈ నాయకి. సత్య-2లో తడి తడి అందాలతో కుర్రకారుకు వేడి పుట్టించిన అనైక తాజాగా కోలీవుడ్‌లో రంగస్థల నటిగా తన సత్తా చాటుతానంటోంది. అంతేకాదు చెన్నై సాంబారు, ఇడ్లీ, దోశలు నోరూరిస్తున్నాయంటున్న ఈ అమ్మడి కథేంటో చూద్ధామా!
 
ప్ర: హీరోయిన్ ఎలా అయ్యారు?

జ: మా బంధువు ఒకరి కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగానికి చేరాను. అక్కడ వృత్తిలో నైపుణ్యం పొంది సొంతంగా కంపెనీ ప్రారంభించాలన్నది నా కల. ఒకసారి నటి అయి న స్నేహితురాలిని కలవడానికి వెళ్లాను. అప్పుడామె ఒక సినిమా కంపెనీకి తీసుకెళ్లింది. అక్కడ ఆమె ఆ కార్యాలయంలోకి వెళ్లగా నేను హాలులో వెయిట్ చేస్తున్నాను. సరిగ్గా ఆ సమయంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అక్కడికి వచ్చారు. నన్ను చూసి నువ్వు నటివా? అని అడిగారు. కాదని చెప్పాను. అయితే నా స్నేహితురాలు ఆయనకు తెలుసు. ఆమె ద్వారా నన్ను ఆయన కార్యాలయానికి పిలిపించారు. సత్య-2 చిత్ర కథ వినిపించారు. మరో విషయం ఏమిటంటే సత్యం చిత్రం అంటే మా అమ్మకు చాలా ఇష్టం. దానికి సీక్వెల్ అనగానే నేను నటించడానికి వెంటనే అంగీకరించాను. అలా తారనయ్యూను.
 
ప్ర: నటనలో శిక్షణ లాంటిదేమైనా తీసుకున్నారా?
జ:
నటనలో శిక్షణ తీసుకోమంటారా? అని దర్శకుడు వర్మను అడిగాను. అందుకాయన అలాంటిదేమీ అవసరం లేదు. సహజంగా నటిస్తే చాలు అన్నారు. అలాగే కెమెరా ముందు నిలబెట్టారు. మొదట్లో కాస్త కంగారుపడినా ఆ తరువాత గాడిలో పడిపోయాను.

ప్ర: కోలీవుడ్‌లో ప్రవేశం ఎలా జరిగింది?
జ:
సత్య-2 చిత్రం చూసి దర్శకుడు వసంతబాలన్ పిలిపించారు. జాతీయ అవార్డు పొందిన అంతటి దర్శకుడి అవకాశాన్ని ఎలా నిరాకరించగలను. అందులోను కావ్య తలైవన్ చిత్ర కథ విన్న తరువాత చాలా ఇంట్రస్ట్ ఏర్పడింది. అందులో నా పాత్ర ఇంకా ఆశ్చర్యపరచింది. ఇది రంగస్థల నేపథ్యంలో సాగే కథ. నేను సిద్ధార్థ్‌ను ప్రేమించే పాత్రలో నటించాను. నటనకు అవకాశం వున్న పాత్ర. ఇందులో నా నటనకు ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది.
 
ప్ర: తమిళంలో నటించడం కష్టమనిపించలేదా?
జ: నేను మలేషియాలో మాస్ కమ్యునికేషన్ చదివాను. అప్పుడు నాతో పాటు చదివిన వారిలో మూడొంతులు తమిళులే. వాళ్లతో పరిచయం, స్నేహం నన్ను వాళ్ల ఇళ్లకు కూడా తీసుకెళ్లింది. అంతేకాదు తమిళ పదాలు కూడా కొంచెం నేర్చుకున్నాను. అందువలన తమిళం నాకు పరభాషలా అనిపించలేదు. అయితే కావ్యతలైవన్ చిత్రంలోని సంభాషణలను ముందుగానే చదివి బట్టీపట్టి చెప్పాను. ఈ విషయంలో దర్శకుడు వసంతబాలన్, ఆయన శిష్యులు ఎంతగానో సహకరించారు.
 
ప్ర: నచ్చిన కోలీవుడ్ నటుడు?
జ: సూర్య. అబ్బ ఆయన ఎంత బాగా నటిస్తున్నారు. విజయ్ డాన్స్ చూసి ఆశ్చర్యపోయాను. అదే విధంగా ప్రతిభావంతులైన దర్శకులు, సాంకేతిక వర్గం వున్నారు. దర్శకుడు శంకర్ ఐ చిత్ర ట్రైలర్ చూసి ఆహా అంటూ భ్రమించిపోయాను.

ప్ర: ఎలాంటి పాత్రలు చేయాలని ఆశిస్తున్నారు?
జ: అరుంధతి చిత్రంలో అనుష్క పాత్ర. హిందీ చిత్రం క్వీన్‌లో కంగనారనౌత్ పోషించిన పాత్ర లాంటివి చేయాలని వుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement