Mumbai Beauty
-
ఆమె కంటే మంచి నటి కావాలంట..
మణిరత్నం చిత్రంలో నటి సాయిపల్లవి లేదట. ఆయన స్క్రిప్ట్ అంతకంటే బెటర్ నటిని డిమాండ్ చేస్తోందట. పాపం మణిరత్నం ఓ కాదల్ కణ్మణి చిత్రం తరువాత తన నూతన చిత్రం గురించి ఏ ముహూర్తాన అనుకున్నారోగానీ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నా ఇంత వరకూ ఒక కొలిక్కి రాలేదు. మొదట టాలీవుడ్ స్టార్ నాగార్జున, మహేశ్‌బాబు, ఐశ్వర్యారాయ్ వంటి వారితో మల్టీస్టారర్ చిత్రం చేయాలనుకున్నారు. ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ తరువాత అదే కథతో కార్తీ, దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ లాంటి యువ తారలతో చిత్రం చేయాలనుకున్నారు. అదీ సెట్ కాలేదు. ఆ తరువాత దుల్కర్‌సల్మాన్‌కు బదులు తెలుగు నటుడు నానీ నటించనున్నారనే ప్రచారం జరిగింది. అదీ ప్రచారం వరకే పరిమితమైంది. ఇటీవల కార్తీ, మలయాళ చిత్రం ప్రేమమ్ చిత్రం హీరోయిన్ సాయిపల్లవి జంటగా వేరే ఫ్రెష్ కథతో మణిరత్నం చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.అయితే తాజాగా మణిరత్నం చిత్రంలో సాయిపల్లవి లేదని ఆమె పర్ఫార్మెన్స్ మణిరత్నం చిత్రంలోని హీరోయిన్ పాత్రకు చాలవని, అందువల్ల ఆమె కంటే బెటర్ నటి కోసం అన్వేషిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం మణిరత్నం తన చిత్రంలోని హీరోయిన్ కోసం ముంబై బ్యూటీని ఎంపిక చేసేపనిలో ఉన్నారని తెలుస్తోంది. చిత్రం సెప్టెంబర్‌లో సెట్‌పైకి వెల్లనుందని సమాచారం. దీనికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు, రవివర్మన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ను అధిక భాగం కశ్మీర్లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కన్స్ట్రక్టర్ కావాలనుకున్నా....
ముంబయి బ్యూటీ అనైక హిందీ చిత్రం సత్య-2తో వెండితెరపై మెరిసింది. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్వేషణ ఫలితంగా వెలుగులోకి వచ్చింది ఈ నాయకి. సత్య-2లో తడి తడి అందాలతో కుర్రకారుకు వేడి పుట్టించిన అనైక తాజాగా కోలీవుడ్‌లో రంగస్థల నటిగా తన సత్తా చాటుతానంటోంది. అంతేకాదు చెన్నై సాంబారు, ఇడ్లీ, దోశలు నోరూరిస్తున్నాయంటున్న ఈ అమ్మడి కథేంటో చూద్ధామా! ప్ర: హీరోయిన్ ఎలా అయ్యారు? జ: మా బంధువు ఒకరి కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగానికి చేరాను. అక్కడ వృత్తిలో నైపుణ్యం పొంది సొంతంగా కంపెనీ ప్రారంభించాలన్నది నా కల. ఒకసారి నటి అయి న స్నేహితురాలిని కలవడానికి వెళ్లాను. అప్పుడామె ఒక సినిమా కంపెనీకి తీసుకెళ్లింది. అక్కడ ఆమె ఆ కార్యాలయంలోకి వెళ్లగా నేను హాలులో వెయిట్ చేస్తున్నాను. సరిగ్గా ఆ సమయంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అక్కడికి వచ్చారు. నన్ను చూసి నువ్వు నటివా? అని అడిగారు. కాదని చెప్పాను. అయితే నా స్నేహితురాలు ఆయనకు తెలుసు. ఆమె ద్వారా నన్ను ఆయన కార్యాలయానికి పిలిపించారు. సత్య-2 చిత్ర కథ వినిపించారు. మరో విషయం ఏమిటంటే సత్యం చిత్రం అంటే మా అమ్మకు చాలా ఇష్టం. దానికి సీక్వెల్ అనగానే నేను నటించడానికి వెంటనే అంగీకరించాను. అలా తారనయ్యూను. ప్ర: నటనలో శిక్షణ లాంటిదేమైనా తీసుకున్నారా? జ: నటనలో శిక్షణ తీసుకోమంటారా? అని దర్శకుడు వర్మను అడిగాను. అందుకాయన అలాంటిదేమీ అవసరం లేదు. సహజంగా నటిస్తే చాలు అన్నారు. అలాగే కెమెరా ముందు నిలబెట్టారు. మొదట్లో కాస్త కంగారుపడినా ఆ తరువాత గాడిలో పడిపోయాను. ప్ర: కోలీవుడ్‌లో ప్రవేశం ఎలా జరిగింది? జ: సత్య-2 చిత్రం చూసి దర్శకుడు వసంతబాలన్ పిలిపించారు. జాతీయ అవార్డు పొందిన అంతటి దర్శకుడి అవకాశాన్ని ఎలా నిరాకరించగలను. అందులోను కావ్య తలైవన్ చిత్ర కథ విన్న తరువాత చాలా ఇంట్రస్ట్ ఏర్పడింది. అందులో నా పాత్ర ఇంకా ఆశ్చర్యపరచింది. ఇది రంగస్థల నేపథ్యంలో సాగే కథ. నేను సిద్ధార్థ్‌ను ప్రేమించే పాత్రలో నటించాను. నటనకు అవకాశం వున్న పాత్ర. ఇందులో నా నటనకు ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది. ప్ర: తమిళంలో నటించడం కష్టమనిపించలేదా? జ: నేను మలేషియాలో మాస్ కమ్యునికేషన్ చదివాను. అప్పుడు నాతో పాటు చదివిన వారిలో మూడొంతులు తమిళులే. వాళ్లతో పరిచయం, స్నేహం నన్ను వాళ్ల ఇళ్లకు కూడా తీసుకెళ్లింది. అంతేకాదు తమిళ పదాలు కూడా కొంచెం నేర్చుకున్నాను. అందువలన తమిళం నాకు పరభాషలా అనిపించలేదు. అయితే కావ్యతలైవన్ చిత్రంలోని సంభాషణలను ముందుగానే చదివి బట్టీపట్టి చెప్పాను. ఈ విషయంలో దర్శకుడు వసంతబాలన్, ఆయన శిష్యులు ఎంతగానో సహకరించారు. ప్ర: నచ్చిన కోలీవుడ్ నటుడు? జ: సూర్య. అబ్బ ఆయన ఎంత బాగా నటిస్తున్నారు. విజయ్ డాన్స్ చూసి ఆశ్చర్యపోయాను. అదే విధంగా ప్రతిభావంతులైన దర్శకులు, సాంకేతిక వర్గం వున్నారు. దర్శకుడు శంకర్ ఐ చిత్ర ట్రైలర్ చూసి ఆహా అంటూ భ్రమించిపోయాను. ప్ర: ఎలాంటి పాత్రలు చేయాలని ఆశిస్తున్నారు? జ: అరుంధతి చిత్రంలో అనుష్క పాత్ర. హిందీ చిత్రం క్వీన్‌లో కంగనారనౌత్ పోషించిన పాత్ర లాంటివి చేయాలని వుంది. -
త్వరలో కనవు నెడుంశాలై
ఆసక్తి కరమయిన కథ కథనాలతో తెరకెక్కిస్తున్న చిత్రం కనవు నెడుంశాలై అని దర్శకుడు టి.కృష్ణసామి తెలిపారు. ఎంజీకే మూవీ మేకర్, పతాకంపై ఎస్.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయరుద్ర, వంశీ కృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. హీరోయిన్గా ముంబాయి బ్యూటీ ఖుషీ పరిచయం అవుతున్నారు. ముఖ్య పాత్రల్లో దర్శకుడు ఎం.కళంజియం నటించగా ఇతర పాత్రల్లో నటరాజ్ పాండియన్, సెంథిల్, రేణుక తదితరులు నటించారు. హరీష్ జయరాజ్ శిష్యుడు శ్యామ్ బెజమిన్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి యోగా భాస్కర్ ఛాయాగ్రహణం నెరిపారు. చిత్రం గురించి దర్శకుడు తెలిపుతూ ఇది అంతర్జాతీయ స్థాయిలో జరిగే శిలల అక్రమ వ్యాపారం నేపథ్యంలో సాగే కథా చిత్రం అని తెలిపారు. ఇందులో మూడు పాటలుంటాయని తెలిపారు. అందులో ఒక పాట ఫుట్‌బాల్ క్రీడను కీర్తించే విధంగా ఉంటుందన్నారు. ఈ పాట కోసం 150 మంది ఫుట్‌బాల్ క్రీడాకారులను నటింపచేసినట్లు చెప్పారు. త్వరలో అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీ జరగనున్న నేథ్యంలో ఈ పాట ఫుట్‌బాల్ క్రీడ అభిమానుల్ని అలరించే విధంగా ఉంటుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.