
ఆమె కంటే మంచి నటి కావాలంట..
మణిరత్నం చిత్రంలో నటి సాయిపల్లవి లేదట. ఆయన స్క్రిప్ట్ అంతకంటే బెటర్ నటిని డిమాండ్ చేస్తోందట. పాపం మణిరత్నం ఓ కాదల్ కణ్మణి చిత్రం తరువాత తన నూతన చిత్రం గురించి ఏ ముహూర్తాన అనుకున్నారోగానీ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నా ఇంత వరకూ ఒక కొలిక్కి రాలేదు. మొదట టాలీవుడ్ స్టార్ నాగార్జున, మహేశ్‌బాబు, ఐశ్వర్యారాయ్ వంటి వారితో మల్టీస్టారర్ చిత్రం చేయాలనుకున్నారు. ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ తరువాత అదే కథతో కార్తీ, దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ లాంటి యువ తారలతో చిత్రం చేయాలనుకున్నారు. అదీ సెట్ కాలేదు.
ఆ తరువాత దుల్కర్‌సల్మాన్‌కు బదులు తెలుగు నటుడు నానీ నటించనున్నారనే ప్రచారం జరిగింది. అదీ ప్రచారం వరకే పరిమితమైంది. ఇటీవల కార్తీ, మలయాళ చిత్రం ప్రేమమ్ చిత్రం హీరోయిన్ సాయిపల్లవి జంటగా వేరే ఫ్రెష్ కథతో మణిరత్నం చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.అయితే తాజాగా మణిరత్నం చిత్రంలో సాయిపల్లవి లేదని ఆమె పర్ఫార్మెన్స్ మణిరత్నం చిత్రంలోని హీరోయిన్ పాత్రకు చాలవని, అందువల్ల ఆమె కంటే బెటర్ నటి కోసం అన్వేషిస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం మణిరత్నం తన చిత్రంలోని హీరోయిన్ కోసం ముంబై బ్యూటీని ఎంపిక చేసేపనిలో ఉన్నారని తెలుస్తోంది. చిత్రం సెప్టెంబర్‌లో సెట్‌పైకి వెల్లనుందని సమాచారం. దీనికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు, రవివర్మన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ను అధిక భాగం కశ్మీర్‌లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.