120కి పైగా డెవలపర్లు, 600 ప్రాజెక్ట్‌లల్లో సుమారు 20 వేలకు పైగా వీలుంటుంది. బెంగళూరు, చెన్నై, ముంబై వంటి ఇతర నగరాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని ధరలు కూడా హైదరాబాద్‌లో లేవు. ఇప్పటికే హైదరాబాద్‌లో కార్యాలయాల స్థలం 70 లక్షల చ.అ.లకు చేరింది. మరో ఆరేడు లక్షల చ.అ. స్థలం నిర్మాణంలో ఉంది. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎస్ రాంరెడ్డి, తెలంగాణ ప్రెసిడెంట్ జి. రాంరెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలను ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్–ఐపాస్)లో నిర్మాణ రంగాన్ని కూడా చేర్చాల్సిన అవసరముందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) అభిప్రాయపడింది. రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉండే చిన్న పరిశ్రమలకు సైతం ఎలాగైతే 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నారో.. అలాగే రూ.100 కోట్లకు పైగా ఇన్వెస్ట్‌మెంట్స్ ఉండే రియల్టీ ప్రాజెక్ట్‌లకు కూడా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని క్రెడాయ్ హైదరాబాద్ ముక్తకంఠంతో కోరింది. అనుమతులు జాప్యం కారణంగా నిర్మాణ వ్యయం పెరుగుతుందని.. అంతిమంగా ధరలు పెరిగి కొనుగోలుదారులకు భారమవుతుందని పేర్కొంది. శుక్రవారమిక్కడ క్రెడాయ్ 6వ ఎడిషన్ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం జీఎస్‌డీపీ రూ.40 లక్షల కోట్లుంటే.. ఇందులో రూ.8 లక్షల కోట్లు నిర్మాణ రంగం వాటా ఉందని తెలిపారు. నిరక్షరాస్యులకు సైతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేది నిర్మాణ రంగమే. ప్రస్తుతం ఈ రంగం మీద 10 లక్షలకు పైగా ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఇలాంటి నిర్మాణ రంగ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానిది మూడేళ్ల ఎనిమిది నెలల వయసు. అతి తక్కువ కాలంలోనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావటానికి ప్రధాన కారణాలు ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహమేనని తెలిపారు.
క్రెడాయ్ డిమాండ్లివే
►నిర్మాణ సంస్థలకు ప్రాజెక్ట్ ఫండ్ అందించడంలో బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలకు చిన్నచూపే. అందుకే నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదాను అందించాలి. అప్పుడే నిధుల లభ్యత పెరుగుతుంది. దీంతో అందుబాటు గృహాల నిర్మాణం మరింత ఊపందుకుంటుంది.
►నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లకు తాత్కాలిక విద్యుత్ సరఫరా చార్జీలు యూనిట్‌కు రూ.13–14 విధిస్తున్నారు. ఇతర పరిశ్రమలకైతే ఇది కేవలం రూ.2–3గా ఉంది. దీంతో నిర్మాణ ప్రాజెక్ట్‌ల వ్యయం తడిసిమోపడవుతుంది. అంతిమంగా ఈ భారం గృహ కొనుగోలుదారుల మీదే పడుతుంది.
►నగరంలో చాలా వరకు ప్రాజెక్ట్‌లల్లో డెవలపర్లు సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టీపీ)లను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా నీటిని శుద్ధి చేసి మొక్కలకు, ల్యాండ్ స్కేపింగ్ ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తున్నారు. ఆయా ఎస్‌టీపీ నిర్వహణకయ్యే విద్యుత్‌కు వాణిజ్య చార్జీలను విధిస్తున్నారు. దీంతో అపార్ట్‌మెంట్‌ను నిర్వహణ బాధ్యతలను సంక్షేమ సంఘానికి అప్పగించాక.. విద్యుత్ చార్జీల భారంతో ఎస్‌టీపీలను సరిగా నిర్వహించడం లేదు. దీంతో సమీప కొలనులు కాలుష్యమవుతున్నాయి. అందుకే ఎస్‌టీపీలున్న ప్రాజెక్ట్‌లకు నామమాత్రపు విద్యుత్ చార్జీలను కేటాయించాలి.
►హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి నీటి లభ్యత పెరిగింది. ఇకనైనా భవన నిర్మాణాలకు బయటి నుంచి నీటిని తీసుకొచ్చే ఇబ్బందులను తొలగించి నామమాత్రపు చార్జీలకు నీటి సరఫరా చేయాలి.
►నాలా చార్జీలను హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ లేదా స్థానిక మున్సిపల్ అథారిటీ వద్దే చెల్లించే వెసులుబాటును కల్పించాలి. అపార్ట్‌మెంట్లకు వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ని 12 శాతంగా కేటాయించారు. దీనికి తోడు రిజిస్ట్రేషన్ 6 శాతంగా ఉంది. మొత్తంగా 18 శాతం పన్నులు కట్టేందుకు కొనుగోలుదారులకు భారంగా మారుతోంది. అందుకే 12 శాతంగా ఉన్న జీఎస్‌టీని 6 శాతానికి తగ్గించాలి.
Comments
Please login to add a commentAdd a comment