న్యూఢిల్లీ: ఈ నెల 18న మొదలై ఐదురోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగనున్న విషయం విదితమే. ఈ సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై.. మరుసటి రోజు 19న కొత్త పార్లమెంటు భవనంలోకి మారుతాయని అధికారవర్గాలు బుధవారం తెలిపాయి.
19న వినాయక చవితి శుభదినం కాబట్టి ఆ రోజునుంచి కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 9, 10 తేదీల్లో జరిగే జీ–20 సదస్సు తర్వాత పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా ఖరారు చేస్తారని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. సమావేశాల అజెండాపై స్పష్టత ఇవ్వాలని, అజెండా ఏమిటో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ వివరణ రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment