old building
-
రాజ్యాంగ వజ్రోత్సవాలు
న్యూఢిల్లీ: రాజ్యాంగానికి ఆమోదముద్ర పడ్డ చరిత్రాత్మక సందర్భానికి మంగళవారంతో 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. దాంతో మంగళవారం నుంచి ఏడాది పొడవునా రాజ్యాంగ దిన వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగ ప్రాశస్త్యానికి ప్రచారం కల్పించడం, దానిపట్ల పౌరుల్లో అవగాహనను మరింతగా పెంచడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు రూపొందించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో రాజ్యాంగ ప్రవేశిక సామూహిక పఠనం వంటివి జరగనున్నాయి. రాజ్యాంగ నిర్మాతల కృషిని పార్లమెంటు మరోసారి నెమరువేసుకోనుంది. వారికి ఘనంగా నివాళులు అర్పించనుంది. ఇందుకోసం ఉభయ సభలు మంగళవారం ప్రత్యేకంగా సమావేశం అవుతున్నాయి. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ తొలిసారి భేటీ అయిన పార్లమెంటు పాత భవనంలోని చారిత్రక సెంట్రల్ హాలే ఇందుకు వేదిక కానుండటం విశేషం. ఇందుకోసం సెంట్రల్ హాల్ సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తమ భావాలను పంచుకుంటారు. రాష్ట్రపతి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఉభయ సభల ఎంపీలంతా పాల్గొంటారు. రాజ్యాంగ దిన వజ్రోత్సవాలను పురస్కరించుకుని కాన్స్టిట్యూషన్75డాట్‌కామ్ పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా కేంద్రం రూపొందించింది. ఆ చరిత్రాత్మక దినాన... 1946 డిసెంబర్ 9న పార్లమెంటు పాత భవనం సెంట్రల్ హాల్లో రాజ్యాంగ పరిషత్ తొలి భేటీ జరిగిన క్షణాలను లోక్‌సభ భావోద్వేగపూరితంగా స్మరించుకుంది. ‘‘చెప్పదగ్గ స్వాతంత్య్ర సమరానికి సారథ్యం వహించిన మహామహులైన నేతలు ఆ రోజున ఇదే హాల్లో అర్ధచంద్రాకృతిలో వరుసలు తీరి ఆసీనులయ్యారు. ముందు వరుసలో జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, ఆచార్య జేబీ కృపాలనీ, అబుల్ కలాం ఆజాద్ తదితరులు కూర్చున్నారు. బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్ష స్థానాన్ని అలంకరించారు’’ అంటూ లోక్‌సభ వెబ్సైట్ నాటి స్మృతులను మరోసారి గుర్తు చేసుకుంది.మోదీ ప్రసంగించరు: రిజిజు ఉభయ సభల సంయుక్త భేటీలో ప్రధాని మోదీ ప్రసంగించబోరని రిజిజు స్పష్టం చేశారు. ఈ భేటీలో ఉభయ సభల విపక్ష నేతలకు కూడా ప్రసంగించే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు తెలిపారు. ‘‘రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్ మాత్రమే మాట్లాడతారు. విపక్ష నేతలిద్దరికీ వేదికపై స్థానముంటుంది. ఇదో చరిత్రాత్మక సందర్భం. దీన్ని వివాదాస్పదంగా మార్చే ప్రయత్నం చేయొద్దు’’ అని విపక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. -
విగ్రహాలకు స్థానచలనం
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ ప్రాంగణంలో చూడగానే ఎదురుగా కనిపించే మహాత్మా గాంధీజీ, బీఆర్ అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ మహరాజ్, జ్యోతిబా ఫూలే సహా పలువురు దేశ ప్రముఖుల విగ్రహాలను ప్రభుత్వం వేరే చోటుకు తరలించింది. ఉన్న చోటు నుంచి పాత పార్లమెంట్(సంవిధాన్ సదన్)లోని ఐదో నంబర్ గేట్ దగ్గరి లాన్ వద్దకు మార్చింది. ఈ లాన్లో ఇప్పటికే గిరిజన యోధుడు బిర్సా ముండా, మహారాణాప్రతాప్‌ల విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాల తరలింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘మహాత్ముడు, అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలను ఉద్దేశపూర్వకంగా అప్రాధాన్య చోట్లో ప్రతిష్టించడం అరాచకం’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు బీజేపీని తిరస్కరించారు. అందుకే మహారాష్ట్రతో అనుబంధమున్న ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్ల విగ్రహాలను వేరే చోటుకు మార్చేశారు. గుజరాత్లో బీజేపీ ఈసారి క్లీన్‌స్వీప్ చేయలేకపోయింది. అందుకే గుజరాతీలపై ఆగ్రహంతో గాం«దీజీ విగ్రహాన్నీ తరలించారు’ అని మరో నేత పవన్ ఖేడా వ్యాఖ్యానించారు. ‘మహానుభావుల విగ్రహాలు తొలగించి గాడ్సే, మోదీ విగ్రహాలు పెడతారా?’ అని టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ ప్రశ్నించారు. విమర్శలపై లోక్‌సభ సచివాలయం స్పందించింది. పార్లమెంట్‌కు విచ్చేసే సందర్శకులు చూసేందుకు అనువుగా ‘ప్రేరణ స్థల్’కు విగ్రహాలను తరలించామని పేర్కొంది. ఏ విగ్రహాన్ని పక్కనపడేయలేదని స్పష్టంచేసింది. -
శాసనసభ పాత భవనం పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్ ఒకే భవన సముదాయంలో ఉండేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం జూబ్లీ హాలులో ఉన్న శాసనమండలిని, పాత భవనంలోకి మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. జూబ్లీహాలును మళ్లీ పునరుద్ధరించి, శాసనసభ, శాసన మండలి, సెంట్రల్ హాలును పాత పద్ధతిలో ఏర్పాటు చేయటంతో పాటు, ఆ ప్రాంగణాన్ని సుందరీకరించటం ద్వారా నగరంలో ఒక ప్రధాన పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆర్అండ్ బీ అధికారులతో కలిసి శాసనసభ ప్రాంగణాన్ని పరిశీలించి మార్పుచేర్పులపై చర్చించనున్నారు. సీఎంతో భేటీ అనంతరం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాలుగు రోజుల్లోనే ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవటం విశేషం. సెంట్రల్ హాల్‌గా ఏపీ అసెంబ్లీ భవనం గతంలో శాసనసభ, శాసనమండలి ఒకే భవనంలో కొనసాగేవి. ఆ భవనం పాతబడటంతో ప్రస్తుత శాసనసభ కొనసాగుతున్న భవనాన్ని నిర్మించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే భవనం కొనసాగింది. పాత భవనంలో శాసనమండలిని నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత పాత భవనంలోని హాలును ఏపీకి కేటాయించారు. అక్కడ శాసనసభ, శాసనమండలి నిర్వహించాల్సి రావటంతో, తెలంగాణ శాసనమండలిని జూబ్లీహాలులోకి మార్చారు. ఇప్పుడు పాత భవనాన్ని పూర్తిగా పునరుద్ధరించనుండటంతో, జూబ్లీ హాలులోని శాసనమండలిని తిరిగి పాత మండలి భవనంలోకే మారుస్తారు. ఏపీకి కేటాయించిన శాసనసభ భవనాన్ని స్వా«దీనం చేసుకుని దాన్ని సెంట్రల్ హాల్‌గా మారుస్తారు. ఇక కొత్త భవనం వెలుపల ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల శాసనసభా పక్ష కార్యాలయాలు, మీడియా సెంటర్ ఉన్న భవనాన్ని తొలగించాలని నిర్ణయించారు. ఆయా కార్యాలయాలను పాత భవనంలో ఏర్పాటు చేస్తారు. భవనం కూల్చిన ప్రాంతంలో పచ్చిక బయళ్లు ఏర్పాటు చేసి పబ్లిక్ గార్డెన్తో అనుసంధానించాలని యోచిస్తున్నారు. గతంలో పబ్లిక్ గార్డెన్‌కు ఎంతో ప్రజాదరణ ఉండేది. సాయంత్రం వేళ ఎంతోమంది సందర్శించి సేద తీరేవారు. తాజాగా మళ్లీ దానికి పర్యాటక కళ తేవాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. మహాత్ముడి విగ్రహం ప్రాంతంలో.. శాసనసభ ముందుభాగంలో గతంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహం రోడ్డుపైకి అంతగా కనిపించటం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రోడ్డుమీద కంచెను ఏర్పాటు చేయటం కూడా దీనికి కారణమైంది. ఇప్పుడు ఆ కంచెను తొలగించి, వీలైతే గాంధీ విగ్రహాన్ని కాస్త ఎత్తు మీదకు మార్చి, ఆ ప్రదేశాన్ని మరింతగా సుందరీకరించి రోడ్డు మీదుగా వెళ్లేవారిని ఆకట్టుకునేలా చేయాలని నిర్ణయించారు. గతంలో జూబ్లీ హాలు ప్రాంగణం సభలు, సందడిగా ఉండేది. శాసనమండలిగా మారిన తర్వాత కళ తప్పింది. ఇప్పుడు దాన్ని మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించారు. కొత్త భవనం నిర్మించే యోచన లేనట్టే..? కొత్త సచివాలయం తరహాలో శాసనసభకు కూడా కొత్త భవనాన్ని నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సచివాలయ భవనానికి పునాది వేసిన రోజునే, ఎర్రమంజిల్ ప్యాలెస్ ప్రాంగణంలో శాసనసభ సముదాయానికి కూడా పునాది వే శారు. కానీ వారసత్వ కట్టడంగా నిలిచిన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చాలన్న నిర్ణయంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ అంశం కోర్టు పరిధిలోకి కూడా వెళ్లింది. దీంతో నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పాత భవనాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించటంతో, ఇక వేరే ప్రాంతంలో నిర్మాణానికి తెరపడినట్టేనని అంటున్నారు. -
పార్లమెంట్ పాత భవనాన్ని ఏం చేయనున్నారు? 10 పాయింట్లలో పూర్తి వివరాలు..
నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కొత్త భవనంలోనే జరగనున్నాయి. దీంతో ఇప్పుడు దేశంలోని చాలా మంది ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే.. పాత భవనాన్ని కూల్చివేస్తారా? లేదా మరేదైనా అవసరాలకు ఉపయోగిస్తారా?. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి 2020, డిసెంబరు 10న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ భవనం అద్భుతంగా ఉండటమే కాకుండా భద్రత కోసం అత్యాధునిక పరికరాలను ఉపయోగించారు. నూతన పార్లమెంట్ భవనం పాత భవనం కంటే చాలా పెద్దది. పాత పార్లమెంట్ భవనంలో ఎంపీలు కూర్చునే ఏర్పాట్లతో పాటు లైబ్రరీ, లాంజ్, ఛాంబర్ ఉన్నాయి. ఇదేకాకుండా ఎంపీలు, జర్నలిస్టులకు రాయితీ ధరలకు ఆహారం అందించే క్యాంటీన్ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ చారిత్రక భవనాన్ని ఏం చేయనున్నారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. పాత పార్లమెంటు భవనానికి సంబంధించిన ప్రభుత్వ ప్రణాళిక ఏమిటో 10 పాయింట్లలో ఇప్పుడు తెలుసుకుందాం. 1) పాత భవనాన్ని 1927లో బ్రిటిష్ వాస్తుశిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్ నిర్మించారు. ఈ భవనానికి ఇప్పుడు 97 ఏళ్లు నిండాయి. 2) ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం పాత భవనాన్ని కూల్చివేయరు. ఈ భవనానికి మరమ్మతులు చేసి, కొత్త అవసరాలకు అనుగుణంగా మార్చనున్నారు. 3) లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనాన్ని పునరుద్ధరించనున్నారు. ఇతర ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. 4) భారత పార్లమెంటరీ చరిత్రను సామాన్య ప్రజలు తెలుసుకునేలా భవనంలోని కొంత భాగాన్ని మ్యూజియంగా మార్చనున్నట్లు సమాచారం. 5) ఈ భవనాన్ని భారతదేశపు ముఖ్యమైన చారిత్రక వారసత్వ సంపదగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని సంబంధిత అధికారవర్గాలు చెబుతున్నాయి. 6) భవన పునరుద్ధరణ కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారు బ్లూప్రింట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. 7) ఈ భవనంలోని నేషనల్ ఆర్కైవ్స్ కొత్త భవనానికి తరలిపోనుంది. దీంతో పాత భవనంలోని ఈ స్థలాన్ని సమావేశ గదిగా లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించనున్నారు. 8) పార్లమెంట్ కొత్త భవనంలో ఎంపీల కోసం ఛాంబర్, విశ్రాంతి స్థలం, లైబ్రరీ, క్యాంటీన్ వంటి అనేక ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. 9) కొత్త పార్లమెంట్ భవనం 64,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యింది. ఇందులో లోక్‌సభకు 880 సీట్లు, రాజ్యసభకు 300 సీట్లు ఉన్నాయి. ఉమ్మడి సమావేశానికి 1280 సీట్లను ఏర్పాటు చేశారు. 10) సౌండ్ సెన్సార్లతో సహా అత్యాధునిక సాంకేతికత కలిగిన కొత్త భవనంలో భద్రత కోసం అనేక లేయర్లు ఉపయోగించారు. ఇది కూడా చదవండి: పాక్ బాంబు దాడికి బలైన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? ఆ రోజు ఏం జరిగింది? -
నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాలు పాత భవనంలో మొదలై మంగళవారం గణేశ్ చతుర్ధి సందర్భంగా కొత్త భవనంలోకి మారనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు పార్లమెంట్లో 75 ఏళ్ల ప్రయాణంపై చర్చతో పాటు పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ప్రత్యేక చర్చ సహా కీలక బిల్లులు... సమావేశాల్లో ప్రధానంగా డిసెంబర్ 9, 1946న తొలిసారి పార్లమెంట్ సమావేశమైంది. అది మొదలు 75 ఏళ్ల ప్రయాణంపై తొలిరోజు చర్చ జరుగనుంది. ఈ 75 ఏళ్ల ప్రస్థానంలో పార్లమెంట్ విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలపై సభ్యులు మాట్లాడనున్నారు. దీంతో పాటే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకానికి సంబంధించిన బిల్లును కూడా ప్రభుత్వం సభ ముందుకు తేనుంది. గత వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ïదీంతో పాటే లోక్‌సభలో ’ది అడ్వొకేట్స్ (సవరణ) బిల్లు, 2023’, ’ది ప్రెస్ అండ్ రిజి్రస్టేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023’ఉన్నాయి. ’ది పోస్టాఫీస్ బిల్లు, 2023’నూ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లులు సైతం ఈ సమావేశాల్లోనే తెస్తారనే ప్రచారం జరుగుతున్నా కేంద్ర వర్గాలు ధ్రువీకరించడం లేదు. నిరుద్యోగం..ద్రవ్యోల్బణంపై విపక్షాల పట్టు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పాల్గొనేందుకు ఇండియా బ్లాక్‌కు చెందిన మొత్తం 24 పారీ్టలు అంగీకరించాయి. చైనా దురాక్రమణ, కుప్పకూలుతున్న ఆర్ధిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అదానీ కంపెనీ అక్రమాలు సహా పలు కీలక అంశాలను సమావేశాల్లో చర్చించాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాం«ధీ ఇదివరకే ప్రధాని మోదీకి లేఖ రాశారు. పార్లమెంట్ నూతన భవనంపై జాతీయ జెండా పార్లమెంట్ నూతన భవనం గజద్వారంపై ఆదివారం సాయంత్రం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన వెంట లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. అంతకుముందు ధన్‌ఖడ్, బిర్లాలకు సీఆర్పీఎఫ్ పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ బలగాలు వేర్వేరుగా గౌరవవందనం సమరి్పంచాయి. రేపు ఎంపీల ఫొటో సెషన్ ఎంపీలందరికోసం మంగళవారం ప్రత్యేక ఫొటో సెషన్ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సభ్యులంతా మంగళవారం ఉదయం 9.30 గంటలకు జరిగే గ్రూప్ ఫొటో సెషన్‌కు రావాల్సిందిగా లోక్‌సభ సెక్రటేరియట్ కోరింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాల్సిందే అఖిలపక్షం భేటీలో రాజకీయ పార్టీల పట్టు సోమవారం నుంచి మొదలయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని పలు రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరాయి. అయితే, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక సెషన్ నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్షం భేటీకి పలు రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ సమావేశంలోనే సభ ముందుంచాలని పలువురు నేతలు కోరారు. బిల్లు ఏకాభిప్రాయంతో ఆమోదం పొందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, కొన్ని ప్రాంతీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలు, ఎస్సీలకు ప్రత్యేక కోటా కావాలంటూ డిమాండ్ చేస్తుండటం అడ్డంకిగా మారింది. -
పాత భవనంలో ప్రారంభమై... కొత్త భవనంలోకి
న్యూఢిల్లీ: ఈ నెల 18న మొదలై ఐదురోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగనున్న విషయం విదితమే. ఈ సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై.. మరుసటి రోజు 19న కొత్త పార్లమెంటు భవనంలోకి మారుతాయని అధికారవర్గాలు బుధవారం తెలిపాయి. 19న వినాయక చవితి శుభదినం కాబట్టి ఆ రోజునుంచి కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 9, 10 తేదీల్లో జరిగే జీ–20 సదస్సు తర్వాత పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా ఖరారు చేస్తారని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. సమావేశాల అజెండాపై స్పష్టత ఇవ్వాలని, అజెండా ఏమిటో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ వివరణ రావడం గమనార్హం. -
పక్క ఇళ్లపై ఒరిగిన పాతభవనం
-
అప్పట్లోనే అదరగొట్టారు.. ఆ గ్రామంలో ఇళ్లను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
ఆ ఊరికి కొత్తగా వెళ్లినవారు, ఆ ఊరి మీదుగా ఇతర గ్రామాలకు వెళ్లేవారు అక్కడి ఇళ్లను చూసి ఆశ్చర్యపోతారు. కొద్దిసేపు అలాగే చూస్తుండిపోతారు. ప్రస్తుతం ఆధునిక ఇళ్లను నిర్మించుకుంటున్న కాలంలోనూ ఆ ఊళ్లో ఇప్పటికీ మిద్దె భవంతులే ఎక్కువగా ఉండడం గమనార్హం. వీటిని స్థానికంగా మిద్దె భవంతులని, మిద్దె ఇళ్లని, హవేలి బాలంగి అని, బంగళా అని పిలుస్తారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఆ ఇళ్లను యజమానులు అలాగే కాపాడుకుంటున్నారు. చిన్నచిన్న మరమ్మతులు చేయించుకుంటూ, ఆధునిక హంగులు సమకూర్చుకుంటూ ఆ ఇళ్లలోనే మూడు నాలుగు తరాలుగా నివసిస్తున్నారు. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మారుమూల గ్రామమైన పేట్‌సంగంలో అడుగు పెట్టగానే రోడ్డుకు ఇరువైపులా మిద్దె భవంతులు (రెండంతస్తులు) కనిపిస్తాయి. ఈ గ్రామంలోని మొత్తం నివాస భవనాల్లో దాదాపు సగం మిద్దె ఇళ్లే. ఊళ్లో మూడు వందల పైచిలుకు కుటుంబాలు నివసిస్తుండగా.. ఆయా కుటుంబాల్లో చాలావరకు తమ తాతల కాలం నుంచి మిద్దె ఇళ్లల్లోనే ఉంటున్నాయి. కొన్ని కుటుంబాల్లోనైతే మూడు, నాలుగు తరాలవారు జీవిస్తున్నారు. కాగా వందల ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. గ్రామంలో పురాతన ‘శ్రీ సంగమేశ్వర దేవాలయం’ ఉంది. దీంతో గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది పేర్లు సంగయ్య, సంగవ్వ అని ఉంటాయి. డూప్లెక్స్ మాదిరి ఇళ్లు.. ఈ పాత కాలం నాటి మిద్దె ఇళ్లకు లోపలి నుంచే (డూప్లెక్స్ మాదిరి) మెట్లు ఉంటాయి. ఇంటి గోడలు నిర్మించిన తర్వాత పెద్దపెద్ద దూలాలు ఏర్పాటు చేసి వాటిపై చెక్కలను కప్పి స్లాబ్‌కన్నా బలంగా తయారు చేశారు. దానిపైన మళ్లీ గోడలు నిర్మించి గదులు నిర్మించుకున్నారు. చాలా ఇళ్లల్లో కర్ర లేదా మట్టితో కట్టిన మెట్లు ఉన్నాయి. పూర్వ కాలంలో రైతులు పంట ఉత్పత్తులను మిద్దె పైన నిల్వ చేసేవారు. నివాసం కూడా ఉండేవారు. పై నుంచి కిందకు చిన్న రంధ్రం ఉండేది. అందులోంచి వడ్లు, మక్కలు, ఇతర పంట ఉత్పత్తులను కిందికి జారవిడిచేవారు. పంట ఉత్పత్తులే కాకుండా, ఇతర వస్తువుల్ని కూడా మిద్దె మీద దాచుకునేవారు. తర్వాతి కాలంలో అంటే ఆరేడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇళ్లకు మాత్రం ముందు భాగం స్లాబ్ వేసి, బయటి నుంచి మెట్లు ఇచ్చారు. పేట్‌సంగంలో నిర్మించిన మిద్దె ఇళ్లు ఎక్కువగా తూర్పు ముఖంతో నిర్మించగా, కొన్ని ఉత్తర(గంగ) ముఖంతో నిర్మించారు. పడమర, దక్షిణ ముఖంతో ఒక్క ఇల్లూ కనిపించదు. చల్లగా వెచ్చగా.. మా నాన్న కట్టిన మిద్దె ఇంట్లోనే పుట్టి, పెరిగినం. మిద్దె ఇల్లు కావడం వల్ల వానాకాలం, చలి కాలంలో వెచ్చగా, ఎండాకాలంలో చల్లగా ఉంటుంది. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా ఇబ్బంది ఉండదు. ఇళ్లకు మంచి రంగులు వేయించుకుని కొత్తదనం తీసుకువచ్చాం. – అన్నారం సంగాగౌడ్, పేట్సంగం తరతరాలుగా ఉంటున్నాం.. మా తాతలు, తండ్రులు, మేము అందరం మిద్దె ఇళ్లల్లోనే పెరిగాం. మా పిల్లలు కూడా ఈ ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఊళ్లో చాలామందికి మిద్దె ఇళ్లు ఉన్నయి. – కూచి హన్మాండ్లు, పేట్సంగం చదవండి: ప్రియుడితో ఉండగా వాట్సాప్‌కి మెసేజ్.. కోపంగా ఇంటికి వెళ్లి -
టప్పాఖానాలకు కొత్త రూపు
సాక్షి, హైదరాబాద్: ఇది షాద్‌నగర్ సమీపంలోని మొగిలిగిద్ద టప్పాఖానా. 1925లో నిజాం ప్రభుత్వం నిర్మించిన భవనం. 97 ఏళ్లుగా అందులోనే తపాలా కార్యాలయం కొనసాగుతోంది. వందేళ్లకు చేరువవుతున్న నేపథ్యంలో దాదాపు రూ.10 లక్షలు వెచ్చించి దీనికి పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని, ప్రస్తుత అవసరాలకు వీలుగా మార్చాలని తపాలాశాఖ నిర్ణయించింది. స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగంగా మరమ్మతులకు శనివారం శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డా‘‘ పీవీఎస్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొగిలిగిద్ద పాత భవనం ముందు పచ్చికతో లాన్ కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తపాలాశాఖ అధికారులు సంతోశ్‌కుమార్ నరహరి, వెంకటేశ్వర్లు, గౌస్ పాషా, జుబేర్, హేమంత్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా... మొగిలిగిద్దతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నిజాం హయాంలో నిర్మించిన టప్పాఖానాలను అభివృద్ధి చేసేందుకు తపాలాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు అందించిన వినతులు, సూచనలకు సంబంధించిన పనులను పూర్తి చేస్తున్నారు. ప్రజలు నేరుగా గానీ, సామాజిక మాధ్యమాల ద్వారా గానీ ఇచ్చిన వినతుల ఆధారంగా పరిష్కరిస్తున్నారు. కార్యాలయాల్లోని తుక్కు, అవసరం లేని కాగితాలు, ఇతర చెత్తను తొలగించి పరిశుభ్రం చేయటంతోపాటు తదుపరి అవసరాలకు వీలుగా ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. -
వరంగల్: మండిబజార్‌లో పాత భవనం కూలి ఇద్దరు మృతి
-
ఓ అజ్ఞాత వాసి నీ వివరాలు పంపు!
లండన్ : 50 ఏళ్ల క్రితం పోయిన ఓ పురాతన భవనానికి చెందిన తాళం చెవి మళ్లీ వెనక్కు వచ్చింది. 1973 తాళం చెవిని తీసుకెళ్లిన?? వ్యక్తి 2020లో క్షమాపణ లేఖతో సహా దాన్ని భవన నిర్వాహకులకు పంపాడు. ఈ వింత సంఘటన ఇంగ్లాండ్‌లోని కెంట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కెంట్లోని పదకొండవ శాతాబ్దానికి చెందిన సెయింట్ లియోనార్డ్ టవర్‌కు చెందిన తాళం చెవి 50 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయింది. కొద్దిరోజుల క్రితం భవన నిర్వాహకులకు ఓ పార్శిల్ వచ్చింది. ఆ పార్శిల్లో ఈ తాళం చెవి ఉంది. దానితో పాటు ఓ క్షమాపణ లేఖ కూడా ఉంది. ( హవ్వా!! పిచ్చి పనికి గిన్నిస్ రికార్డా..) ‘‘ ప్రియమైన ఇంగ్లీష్ హెరిటేజ్.. సెయింట్ లియోనార్డ్ టవర్‌కు చెందిన తాళం చెవిని తీసుకోండి. దీన్ని నేను 1973లో తీసుకున్నాను. 2020లో తిరిగిస్తున్నాను. ఆలస్యం అయినందుకు క్షమించండి!’’ అని ఆ లేఖలో ఉంది. దీనిపై పురాతన భవనాలను నిర్వహిస్తున్న చారిటీ సంస్థ ఇంగ్లీష్ హెరిటేజ్ బుధవారం ట్విటర్ వేదికగా స్పందించింది.. ‘‘50 ఏళ్ల క్రితం నువ్వు తీసుకున్న తాళం చెవిని ఇప్పుడు తిరిగివ్వటం దారుణం. సెయింట్ లియోనార్డ్ టవర్‌కు చెందిన తాళం చెవిని తిరిగిచ్చేసిన అజ్ఞాత వ్యక్తికి కృతజ్ఞతలు. ఆలస్యం అయిందని చింతించకండి! వాటి తాళాలను ఎప్పుడో మార్చేశాము.’’ అని పేర్కొంది. ‘‘తాళం చెవి పంపిన ఓ అజ్ఞాత వాసి.. నీ వివరాలను కూడా పంపు’’ అని కోరింది. That awkward moment when you return a key you borrowed for almost 50 years... 🗝 Thank you to the mysterious individual who recently sent us back a key to St Leonard's Tower in Kent. Don't worry about the delay, we changed the locks long ago! 🤭 pic.twitter.com/XtE7vlXRKA — English Heritage (@EnglishHeritage) December 9, 2020 -
ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి తాళం
అఫ్జల్‌గంజ్: సుమారు వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి తాళం పడింది. ఇన్నాళ్లూ పూర్తిగా శిథిలావస్థకు చేరిన పాత భవనంలో వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఎప్పుడేం జరుగుతుందోననే భయపడుతూ బిక్కుబిక్కుమంటూ కాలంవెళ్లదీశారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు పాత భవనంలోకి నీరు చేరడంతో రోగులు,సహాయకులతో పాటు వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం పాతభవనాన్ని వెంటనే ఖాళీ చేసి సీల్ వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆస్పత్రి పరిపాలనా విభాగం అధికారులు భవనాన్ని ఖాళీ చేసి సోమవారం తాళం వేశారు. పాత భవనంలోని పలు వార్డులను కులీకుతుబ్‌షా భవనంలోకి సర్దుబాటు చేశారు. పాతభవనంలోనే ఉన్న సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ఆస్పత్రి ప్రాంగణంలోనే ఉన్న నర్సింగ్ కళాశాలలోనికి మార్చారు. వెంటనే నూతన భవనం నిర్మించాలి.. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి తాళం వేయడంతో ఇక్కడి రోగులను ఇతర భవనాల్లోని వార్డుల్లోకి సర్దుబాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మంచాల కొరత ఏర్పడుతుండడంతో అవస్థలు పడుతుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పాత భవనాన్ని కూల్చి దాని స్థానంలో ఆధునిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించాలని కోరారు. -
ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం మూసివేత
-
చారిత్రక భవనానికి పూర్వవైభవం కలేనా..!
చార్మినార్: నిజాం కాలంలో పూర్తిగా రాళ్లతో నిర్మించిన పత్తర్గట్టీని ఆధునీకరించడానికి జీహెచ్ఎంసీ అప్పట్లో ప్రణాళికను రూపొందించింది. ఇందుకోసం రూ.1.57 కోట్లను సైతం కేటాయించారు. ఆధునీకరణ పనులను స్థానిక వ్యాపారులకు వివరించడానికి అప్పట్లో జీహెచ్ఎంసీ అధికారులు సభలు, సమావేశాలు నిర్వహించారు. పాదయాత్రలు, పరిశీలనలంటూ తిరిగారు. సహకరించమని వ్యాపారస్తుల వెంటపడ్డారు. నానా హడావుడి చేశారు. ఆతర్వాత అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అప్పటి అధికారులు మారారు. ఇప్పుడున్న అధికారులకు ఆ విషయమే తెలియనట్లు కనిపిస్తోంది. దీంతో పత్తర్‌గట్టీలో కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టి షాపింగ్‌మాల్స్‌ను నిర్మించారు. చార్మినార్ కట్టడానికి 200 మీటర్ల పరిధిలో పాత భవనాలకు మరమ్మతులు చేపట్టాలన్నా, పున:నిర్మించాలన్నా ఆర్కియాలజీ అధికారుల అనుమతి తప్పని సరి. వీటిని బేఖాతరు చేస్తు కొంతమంది వ్యాపారులు తమ ఇష్టానుసారంగా నిర్మాణాలను చేపట్టారు. ఇంకా అక్కడక్కడ పలు నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 2009 అక్టోబర్‌లోనే హడావుడి.. అప్పటి జీహెచ్ఎంసీ (ప్లానింగ్స్) అదనపు కమిషనర్ నీతూ ప్రసాద్, వర్క్స్ అదనపు కమిషనర్ ధనంజయరెడ్డి, సీసీ ముజాఫర్ హుస్సేన్, జీహెచ్ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి అక్టోబర్ 2009లో చార్మినార్‌లోని సనా ఫంక్షన్ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. పత్తర్‌గట్టీలో వ్యాపారాలు నిర్వహిస్తున్న పలువురు వ్యాపారులను ఈ సమావేశానికి పిలిచి పత్తర్‌గట్టీ ఆధునీకరణ పనుల విషయాన్ని వారికి వివరించారు. పెద్ద ఎత్తున సుందరీకరణ చేయనున్నందున వ్యాపారులు తమకు సహకరించాలని కోరారు. సాండ్ ట్రీట్మెంట్తో పాటు పత్తర్‌గట్టీలోని సైన్ బోర్డులన్నింటిటీ యూనిఫాంగా తీర్చిదిద్దడానికి చేపట్టనున్న చర్యలను అధికారులు వ్యాపారులకు వివరించారు. కొన్ని రోజులు తూతూమంత్రంగా కొనసాగిన ఈ పనులు అర్దాంతరంగా ఏళ్లతరబడి కనుమరుగయ్యాయి. మళ్లీ ఇటీవల మరో ఉన్నతాధికారి ప్రత్యక్షమై గుల్జార్‌హౌజ్, పత్తర్‌గట్టి రోడ్డులో కొన్ని సైన్ బోర్డులను తొలగించే ప్రయత్నం చేశారు. అంతే కారణాలేమిటో తెలియజేయకుండానే తిరిగి పనులను నిలిపి వేశారు. తిరిగి ఇటువైపు కన్నెత్తి చూసే అధికారులే కరువయ్యారు. కాగితాలకే పరిమితం పాతబస్తీలోని వారసత్వ కట్టడాలను పరిరక్షించడానికి గతంలో జీహెచ్ఎంసీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలు కార్యరూపం దాల్చకుండానే అటకెక్కాయి. 2009లో ఎంతో హడావుడి చేసినా అప్పటి జీహెచ్ఎంసీ అధికారులు పనులను పూర్తి చేయలేకపోయారు. తూతూమంత్రంగా జరిగిన ఈ పనులు, ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. చార్మినార్‌ను వారసత్వ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేసేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ 2009లో రూ.9.94 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో పాతబస్తీలోని వారసత్వ కట్టడాలను పరిరక్షించడంతో పాటు సుందరీకరణ చేపట్టడానికి ప్రణాళికను రూపొందించారు. పత్తర్గట్టీతో పాటు చార్కమాన్లను ఆధునీకరించడానికి సిద్ధమయ్యారు. అయితే చార్కమాన్ల ఆధునీకరణ పనుల్లో భాగంగా కేవలం మచిలీకమాన్ పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఈ పనులు సైతం నత్తనడకన కొనసాగుతున్నాయి. కాగా పత్తర్‌గట్టీ ఆధునీకరణ పనులు మాత్రం పూర్తిగా అటకెక్కాయి. -
ఉన్నా.. లేనట్లే!
సాక్షి, తిమ్మాజిపేట: రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన తిమ్మాజిపేట ఆర్టీసీ బస్టాండ్ వృథాగా మారింది. మండల కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం రూ.12 లక్షలతో నిర్మించిన బస్టాండ్‌ను అప్పటి ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ 2001 మేలో ప్రారంభించారు. కొంతకాలం పాటు బస్సులు బస్టాండ్‌లోకి రాకపోకలు కొనసాగించాయి. ఆ తర్వాత బస్సులు బస్టాండ్‌లోకి వెళ్లకపోవడంతో ప్రయాణికులు సైతం బస్టాండ్‌లోకి వెళ్లడం లేదు. దీంతో రోడ్డుపైనే బస్సులు ఆపడంతో ప్రయాణికులు సైతం అక్కడే ఎక్కుతున్నారు. అధికారుల హడావుడి.. గత ఏడాది ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడి చేశారు. బస్టాండ్‌కు రంగులు వేయించి అవరణను శుభ్రం చేయించారు. నేల రోజుల పాటు బస్సులను బస్టాండ్‌లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ సిబ్బందిని సైతం నియమించి బస్సుల రాకపోకలకు సాగేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం సిబ్బందిని తొలగించడంతో బస్సుల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఆర్టీసీకి ఆదాయం గండి పడుతుంది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బస్సులను బస్టాండ్‌లోకి వెళ్లే విధంగా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇబ్బంది పడుతున్నాం బస్టాండ్‌లోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుపైనే బస్సుల కోసం నిల్చుని ఎదురుచూస్తున్నాం. వర్షాకాలంలో, వేసవి కాలంలో రోడ్డుపైనే ఉండాల్సి వస్తుంది. అధికారులు చొరవ తీసుకుని బస్టాండ్‌లోకి బస్సులు వెళ్లే విధంగా చూడాలి. – కృష్ణ, కోడవత్ తండా -
పురాతన భవనంలో ‘గ్రంథాలయం’
సాక్షి, దేవరకద్ర రూరల్ : దేవరకద్రలోని శాఖ గ్రంథాలయం పురాతన భవనంలో కొనసాగుతుంది. దీంతో పాఠకులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నప్పటికీ గ్రంథాలయం విషయంలో గ్రామస్థుల తలరాత మారడంలేదు. కొన్నేళ్లుగా గ్రంథాలయం పురాతన భవనంలో కొనసాగుతున్న అడిగే నాథుడే కరువయ్యాడు. భవనం పై కప్పుకున్న సిమెంట్ రేకులకు రంధ్రాలు కావడంతో వర్షాకాలంలో పాఠకులు పడే అవస్థలు వర్ణణాతీతం. అన్నిటికీ అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా గ్రంథాలయం పరిస్థితి మారిపోయింది. పాఠకులకు కావల్సిన పుస్తకాలు అన్ని ఉన్నప్పటికీ భవనం శిథిలావస్థకు చేరడంతో వాటికి భద్రత లేకుండా పోయింది. కొన్నేళ్లుగా గ్రామస్థులు పలు సార్లు సమస్యను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన లాభం లేకుండా పోయింది. ఎన్నికలప్పుడు హామీలిస్తున్న పాలకులు ఎన్నికలైపోయాక వాటి ఊసే ఎత్తడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు వివిధ కార్యాలయాలకు వెళ్లే అధికారులు , ప్రజాప్రతినిధులు గ్రంథాలయం భవనం ముందు నుంచే వెళ్తారు. కానీ ఏ ఒక్కరోజు కూడా గ్రంథాలయం గురించి పట్టించుకొనే నాథుడే లేకుండా పోయారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు పలు గ్రామాలకు కూడలిగా ఉన్న గ్రంథాలయ భవనం ఈ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కావున ఇప్పటికైనా పాఠకుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు తగు చొరవ చూపి శి«థిలావస్థకు చేరిన గ్రంథాలయ భవనాన్ని నూతన భవనంగా మార్చేలా కృషి చేయాలని పాఠకులు కోరుతున్నారు. నెరవేరని చైర్మన్ హామీ.. దేవరకద్ర శాఖ గ్రంథాలయ భవనానికి కొత్త భవనం మంజూరుజేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ హామీ ఇచ్చారు.ఇటీవల గ్రంథాలయ భవనాన్ని చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ సందర్శించి పరిశీలించారు. అప్పుడు పాఠకులు సమస్యను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.త్వరలో కొత్త భవనం మంజూరుచేస్తామని హామీ ఇచ్చారు. కాని ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదు. నిర్లక్ష్యం తగదు గ్రంథాలయ భవనం విషయంలో నిర్లక్ష్యం తగదు. భవనం పక్షులకు నిలయంగా మారింది. వర్షాకాలంలో పరిస్థితి దారుణంగా ఉంటుంది. అయినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం బాధకరం. ఈ విషయంలో నాయకులు తగు చొరవ చూపితే బాగుంటుంది. –నిరంజన్‌రెడ్డి, దేవరకద్ర -
మళ్లీ కూలిన ‘ఉస్మానియా’ పైకప్పు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఓపీ భవనం ప్రవేశద్వారం పైకప్పు మళ్లీ కుప్పకూలింది. వందల మంది చికిత్స పొందుతున్న ఈ భవనంలో సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి పైకప్పు పెచ్చులూడి కింద పడటంతో భారీ శబ్దం వచ్చింది. అదృష్టవశాత్తూ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అసలే వర్షాకాలం..ఆపై రోజుకో చోట పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో రోగులు, వైద్యులు ఆందోళేన చెందుతున్నారు. పాతభవనం శిథిలావస్థకు చేరుకోవడంతో రోగులకు ఇది సురక్షితం కాదని అప్పట్లో ఇంజనీరింగ్ నిపుణులు తెలిపారు. దీంతో అప్పటి సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 4 ఎకరాల విస్తీర్ణంలో ఏడంతస్తుల కొత్త భవనాన్ని నిర్మించాలని భావించి.. 2009లో రూ.5 కోట్లు మం జూరు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన రోశయ్య 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి దీన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. రూ.50 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా ఉస్మానియా ఆస్పత్రికి వచ్చారు. శిథిలావస్థకు చేరుకున్న పాతభవనం స్థానంలో అత్యాధునిక హంగులతో మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు తొలి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ప్రతిపక్షాలుసహా పురావస్తు శాఖ పరిశోధకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గారు. ఆ భవనం జోలికి వెళ్లకుండా అదే ప్రాంగణంలో రెండు 12 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు పునాది రాయి కూడా పడలేదు. -
‘పర్యాటక మండపం’ తెరిచేదెప్పుడో?
కడప కల్చరల్ : నిత్యం పర్యాటకులతోనో, పెళ్లికి వచ్చిన జనం సందడితోనో కళకళలాడుతుండాల్సిన పర్యాటక కల్యాణ మండపం బోసిపోయి కనిపిస్తోంది. చాలా రోజుల నుంచి దీన్ని వాడకపోవడంతో ప్రస్తుతం శిథిల భవనంగా కనిపిస్తోంది. జిల్లాలోని పర్యాటక క్షేత్రాల వద్ద భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించడంలో భాగంగా కొన్ని క్షేత్రాల వద్ద యాత్రికుల వసతి భవనాలు, మరికొన్ని చోట్ల బోటింగ్, ఇంకొన్ని చోట్ల షెల్టర్లు, విశ్రాంతి భవనాలు తదితరాలు నిర్మించారు. దేవునికడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయానికి దగ్గరగా పాత కడప చెరువుకట్టపై పర్యాటక భవనాన్ని నిర్మించారు. నిర్వహణ కోసం వీటిలో కొన్నింటిని కొన్నాళ్ల తర్వాత 2012లో జిల్లా దేవాదాయ శాఖకు అప్పగించారు. తిరోగమనం తొలుత అంతంత మాత్రంగానే ఉన్నా.. ఆ తర్వాత దీన్ని పూర్తి స్థాయి కల్యాణ మండపంగా మార్చుకుని దేవాదాయ శాఖ అధికారులు కూడా ఉత్సాహంగానే నిర్వహించారు. తర్వాత ఏటా దీన్ని కాంట్రాక్టు ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం మొదలైంది. అధికారుల నిర్వహణ లేకపోవడంతో ఈ భవనంలో కల్యాణాలు జరగడం బాగా తగ్గిపోయింది. దీంతో తమకు నష్టం వస్తున్నట్లు కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఆ తర్వాత రెండు సార్లు వేలం పాట నిర్వహించినా.. అధికారులు ఆశించిన మేరకు పాట రాకపోవడంతో కాంట్రాక్టును ఖరారు చేయలేదు. ఈ మధ్యలో ఆ భవనాన్ని తమ శాఖకు చెందిన స్థలంలో అనుమతులు లేకుండా నిర్మించారని, దాన్ని తమ శాఖకు అప్పగించాలని మత్స్యశాఖ అధికారులు అడ్డుచెప్పారు. ఆ శాఖ అధికారులు అటు దేవాదాయ శాఖకు, ఇటు టూరిజం శాఖ అధికారులు ఈ విషయంగా తమ అభ్యంతరాలను తెలుపుతూ లేఖలు రాయడం ప్రారంభించారు. ఈ మధ్యలో దాదాపు ఐదు నెలలుగా భవనం ఖాళీగా ఉంది. వాడుకలో లేకపోవడంతో మెట్లు కొన్ని చోట్ల విరిగిపోయాయి. కారిడార్ లోపలికి కుంగిపోయి పనికి రాకుండా మారింది. సౌకర్యాల లేమి? ప్రస్తుతం అత్యాధునిక కల్యాణ మండపాలు పెరగడంతో.. పర్యాటక మండపంలో వివాహాలు చేసుకునే వారి సంఖ్య తగ్గింది. బాగా ఆదాయం తెస్తున్న ఈ భవనానికి.. ఒక్కసారిగా ఆదాయం పడిపోయింది. దీన్ని వీలైనంత త్వరగా వాడుకలోకి తెచ్చి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి అవసరమైన మేర ఆధునికీకరించి అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. -
పాత భవనంలో పనిచేయలేం..
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలో పనిచేయలేమంటూ వైద్యులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు వైద్య, ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. వైద్యులు, ఉద్యోగులు తొలిరోజు సోమవారం ఉదయం గంటపాటు ఔట్‌పేషంట్ (ఓపీ) సేవలను నిలిపివేశారు. నల్లబ్యాడ్జీలు ధరిం చి పరిపాలనా భవనం ముందు ధర్నా చేశారు. ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరుకుందని, తరచూ పైకప్పు పెచ్చులూడుతున్నాయని వైద్యులు తెలిపారు. బిక్కుబిక్కుమంటూ సేవలందించలేమని స్పష్టం చేశా రు. రోగులకు ఈ భవనం ఏమాత్రం సురక్షితం కాదని, వెంటనే కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు. ప్రభు త్వం హామీ వచ్చేవరకు నిరసన కొనసాగుతుందన్నారు. వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నిరసన లో పాల్గొనడంతో వైద్యసేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. రోగులు ఇబ్బందిపడ్డారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ భవనం నిర్వహణాలోపంతో శిథిలావస్థకు చేరుకుంది. వైద్యచికిత్సలకు ఈ భవ నం సురక్షితం కాదని, వెంటనే ఖాళీ చేయాలని పదేళ్ల క్రితమే ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
వందేళ్ల ఆఫీస్‌కు పొంచి ఉన్న ముప్పు
జనగామ : వందేళ్ల చరిత్ర గలిగిన నాటి నిజాం నవాబు హయాంలో డంగు సున్నంతో నిర్మించిన పురాతన భవనం ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నెర్రలు బారి ప్రమాదంలో ఉన్నానని గుర్తుకు చేస్తోంది తహసీల్ కార్యాలయం. మండల కేంద్రానికి గుండెకాయ లాంటి రెవెన్యూ కార్యాలయానికి భద్రత కరువైంది. భద్రంగా దాచిన రికార్డుల గది మరీ అధ్వానంగా మారింది. పై కప్పు చిల్లులు పడడంతో గొడుగులు , ప్లాస్టిక్ కవర్లు అడ్డం పెట్టుకుని పని చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. పగుళ్లు పట్టిన గోడల మధ్య వేళ్లూరుకుపోతున్న సన్నని వేర్లు ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నాయి. అధికారులు భయందోళనతో విధులు నిర్వర్తిస్తున్నారు. ఫైళ్లు, రికార్డులు తడువకుండా పాలిథీన్ కవర్లను రక్షణగా ఉంచారు. కార్యాలయ ఆవరణ చిన్నపాటి నీటి కుంటను తలపించే విధంగా మారింది. నూతన భవనానికి ప్రతిపాదనలు పంపించాం రెవెన్యూ కార్యాలయ నూతన భవనానికి గతంలోనే రెండుసార్లు ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాలేదు. వర్షం కారణంగా గదుల్లో సిబ్బంది పనులు చేసుకోలేకపోతున్నారు. ఫైళ్లు, ముఖ్యమైన రికార్డులు తడిసిపోకుండా పాలిథీన్ కవర్లు కప్పాం. అక్కడక్కడా మరమ్మతులు చేయిస్తున్నా ఫలితం ఉండడం లేదు. - చెన్నయ్య, తహసీల్దార్ -
శిథిల భవనం కూలి ఇద్దరికి గాయాలు
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పట్టణంలో వర్షాల ధాటికి ఒక భవనం కూలిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో ఓ పాత భవనం వర్షాలకు నాని మంగళవారం మధ్యాహ్నం కూలింది. ఆ భవనంలో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పినట్లయింది.అయితే, అదే సమయంలో అటుగా వెళ్తున్న రాకేష్, మంజుల దంపతులు స్వల్పంగా గాయపడ్డారు. -
'ఉస్మానియా' భవనం తొలగింపు!
-
'ఉస్మానియా' భవనం తొలగింపు!
- ఆసుపత్రి భవనాన్ని వారసత్వ హోదా నుంచి తొలగించే ప్రయత్నాలు షురూ - హెరిటేజ్ కమిటీకి ప్రతిపాదనలు పంపిన సర్కారు - ఆ స్థానంలో 20 అంతస్తులు గల రెండు టవర్లతో భారీ ఆసుపత్రి - నూతన భవనం రూపురేఖలపై ఆర్కిటెక్ట్‌లతో వైద్య మంత్రి భేటీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని తొలగించేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. దాన్ని వారసత్వ హోదా (హెరిటేజ్) నుంచి తొలగించాలని ప్రతిపాదించింది. సంబంధిత ప్రతిపాదనను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలోని వారసత్వ హోదా కమిటీకి పంపారు. ఆ కమిటీ సమావేశమై తొలగింపునకు ఆమోదం తెలపగానే ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని ఇక సాధారణ భవనంగానే పరిగణిస్తారు. ఆ తర్వాత ఆ భవనాన్ని తొలగించి ఆ స్థానంలో 20 అంతస్తులతో అత్యాధునిక ఆసుపత్రి నిర్మిస్తారు. అయితే పాత భవనానికి గుర్తుగా నమూనా భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం రాష్ట్రంలోని ప్రముఖ ఆర్టిటెక్ట్లతో సమావేశం నిర్వహించారు. భవనం లేఔట్ ఎలా ఉండాలో చర్చించారు. నూతన భవన ఊహా చిత్రాలు రూపొందించి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పాత భవనం కంటే అత్యంత వైభవంగా... అత్యాధునికంగా ఉండేలా చేయాలని సూచించారు. వీలైనంత త్వరలో కొత్త భవనాలను నిర్మించాలని సర్కారు భావిస్తోంది. అయితే ఎంతైనా అధిక సమయం తీసుకునే అవకాశం ఉన్నందున పాత భవనాన్ని తొలగించాక వైద్య సేవల కోసం తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంచేయాలన్న అంశంపైనా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. వందేళ్లకు పైగా ఘన చరిత్ర 1910లో ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వైద్య సేవల కోసమే నిర్మించారు. రెండంతస్తులున్న (జి+2) ఈ భవ నాన్ని పురావస్తుశాఖ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రస్తుతం అందులో 1,500 పడకలున్నాయి. నిత్యం 2 వేల మందికిపైగా రోగులు చికిత్స కోసం వస్తుంటారు. నిజాం కాలంలో నిర్మించిన ప్రతీ భవనం కూడా ఇలాంటి ప్రత్యేకతలనే సంతరించుకున్నాయి. చూడ టానికి ఎంతో అపురూపంగా ఉంటుందీ ఈ భవనం. అయితే ప్రస్తుతం దాని పరిస్థితి శిథిలావస్థలో ఉంది. ఐదారేళ్ల కంటే కూడా ఆ భవనం ఉండదని జేఎన్టీయూ నిపుణులు కూడా ప్రభుత్వానికి విన్నవించారు. దాన్ని ఆధునీకరించడానికి కూడా సాధ్యపడటం లేదని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు కూలుతుందోనన్న భయాందోళనలు కూడా అందరినీ వేధిస్తున్నాయి. పైగా అత్యాధునిక వైద్య సేవలు కల్పించడం కష్టంగా మారింది. పారిశుద్ధ్య నిర్వహణ ఇబ్బందిగా ఉంటోంది. అయితే దాన్ని తొలగించాలన్న నిర్ణయంతో వారసత్వ సంపద పరిరక్షకుల నుంచి అనేక విమర్శలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాన్ని కేవలం ఆసుపత్రి కోసమే నిర్మించినందున కూల్చి వేయడం తప్పుకాదని... పైగా దాని స్థానంలో అత్యాధునిక సదుపాయాలతో మరో భవనం నిర్మిస్తామని సర్కారు చెబుతోంది. పైగా వారసత్వ కట్టడాల స్థానంలో కొత్త వాటిని నిర్మించి ప్రజలకు సేవ చేస్తే ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఒకవేళ దాన్ని అలాగే ఉంచి పక్కన మరో భవనం నిర్మించాలన్నా పాత భవనానికి మించి అంతస్తులు కట్టడానికి కూడా వీలుండదంటున్నారు. కాబట్టి దీన్ని తొలగించడమే సరైన నిర్ణయంగా సర్కారు భావిస్తోంది. దీనిపై వారసత్వ హోదా కమిటీ ప్రభుత్వం చెప్పే వాదనలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటుందంటున్నారు. ఇదంతా లాంఛనప్రాయమే కానుంది. -
రేణిగుంట రోడ్డులో కూలిన పాత భవనం, మహిళ మృతి
తిరుపతి: శిధిలావస్థకు చేరిన ఓ పాత భవనం కూలిన ఘటన తిరుపతిలోని రేణిగుంట రోడ్డులో మంగళవారం చోటుచేసుకుంది. ఆకస్మత్తుగా పాత భవనం కూలిపోవడంతో శకలాలు అక్కడ వున్న ఓ మహిళపై పడ్డాయి. దీంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. ఈ ఘటనలో మహిళ మృతిచెందగా, మరోకరికి గాయలయినట్టు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతురాలి వివరాలు తెలియరాలేదు. -
పాత భవనంపైనే నిర్మాణం
-
ఢిల్లీలో కుప్పకూలిన పురాతన భవనం
-
ఢిల్లీలో కుప్పకూలిన పురాతన భవనం
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మరో పురాతన భవనం కుప్పకూలింది. బారా హిందూరావు ప్రాంతంలో ఓ మూడంతస్తుల భవనం ఈరోజు ఉదయం కూలింది. శిధిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. దాంతో శిధిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడినవారిని అధికారులు చికిత్స నిమిత్తం హిందూరావు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆరు అగ్నిమాపక వావహనాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం పురాతన భవనాలను కూల్చివేయాలని అధికారులను సూచించింది.