నిజాం కాలంలో 1925లో నిర్మించిన మొగిలిగిద్ద టప్పాఖానా భవనం
సాక్షి, హైదరాబాద్: ఇది షాద్‌నగర్ సమీపంలోని మొగిలిగిద్ద టప్పాఖానా. 1925లో నిజాం ప్రభుత్వం నిర్మించిన భవనం. 97 ఏళ్లుగా అందులోనే తపాలా కార్యాలయం కొనసాగుతోంది. వందేళ్లకు చేరువవుతున్న నేపథ్యంలో దాదాపు రూ.10 లక్షలు వెచ్చించి దీనికి పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని, ప్రస్తుత అవసరాలకు వీలుగా మార్చాలని తపాలాశాఖ నిర్ణయించింది.
స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగంగా మరమ్మతులకు శనివారం శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డా‘‘ పీవీఎస్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొగిలిగిద్ద పాత భవనం ముందు పచ్చికతో లాన్ కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తపాలాశాఖ అధికారులు సంతోశ్‌కుమార్ నరహరి, వెంకటేశ్వర్లు, గౌస్ పాషా, జుబేర్, హేమంత్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా...
మొగిలిగిద్దతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నిజాం హయాంలో నిర్మించిన టప్పాఖానాలను అభివృద్ధి చేసేందుకు తపాలాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు అందించిన వినతులు, సూచనలకు సంబంధించిన పనులను పూర్తి చేస్తున్నారు. ప్రజలు నేరుగా గానీ, సామాజిక మాధ్యమాల ద్వారా గానీ ఇచ్చిన వినతుల ఆధారంగా పరిష్కరిస్తున్నారు. కార్యాలయాల్లోని తుక్కు, అవసరం లేని కాగితాలు, ఇతర చెత్తను తొలగించి పరిశుభ్రం చేయటంతోపాటు తదుపరి అవసరాలకు వీలుగా ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment