సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలో పనిచేయలేమంటూ వైద్యులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు వైద్య, ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. వైద్యులు, ఉద్యోగులు తొలిరోజు సోమవారం ఉదయం గంటపాటు ఔట్‌పేషంట్ (ఓపీ) సేవలను నిలిపివేశారు. నల్లబ్యాడ్జీలు ధరిం చి పరిపాలనా భవనం ముందు ధర్నా చేశారు.
ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరుకుందని, తరచూ పైకప్పు పెచ్చులూడుతున్నాయని వైద్యులు తెలిపారు. బిక్కుబిక్కుమంటూ సేవలందించలేమని స్పష్టం చేశా రు. రోగులకు ఈ భవనం ఏమాత్రం సురక్షితం కాదని, వెంటనే కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు. ప్రభు త్వం హామీ వచ్చేవరకు నిరసన కొనసాగుతుందన్నారు.
వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నిరసన లో పాల్గొనడంతో వైద్యసేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. రోగులు ఇబ్బందిపడ్డారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ భవనం నిర్వహణాలోపంతో శిథిలావస్థకు చేరుకుంది. వైద్యచికిత్సలకు ఈ భవ నం సురక్షితం కాదని, వెంటనే ఖాళీ చేయాలని పదేళ్ల క్రితమే ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment