సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాలు పాత భవనంలో మొదలై మంగళవారం గణేశ్ చతుర్ధి సందర్భంగా కొత్త భవనంలోకి మారనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు పార్లమెంట్‌లో 75 ఏళ్ల ప్రయాణంపై చర్చతో పాటు పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
ప్రత్యేక చర్చ సహా కీలక బిల్లులు...
సమావేశాల్లో ప్రధానంగా డిసెంబర్ 9, 1946న తొలిసారి పార్లమెంట్ సమావేశమైంది. అది మొదలు 75 ఏళ్ల ప్రయాణంపై తొలిరోజు చర్చ జరుగనుంది. ఈ 75 ఏళ్ల ప్రస్థానంలో పార్లమెంట్ విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలపై సభ్యులు మాట్లాడనున్నారు. దీంతో పాటే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకానికి సంబంధించిన బిల్లును కూడా ప్రభుత్వం సభ ముందుకు తేనుంది. గత వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ïదీంతో పాటే లోక్‌సభలో ’ది అడ్వొకేట్స్ (సవరణ) బిల్లు, 2023’, ’ది ప్రెస్ అండ్ రిజి్రస్టేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023’ఉన్నాయి. ’ది పోస్టాఫీస్ బిల్లు, 2023’నూ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లులు సైతం ఈ సమావేశాల్లోనే తెస్తారనే ప్రచారం జరుగుతున్నా కేంద్ర వర్గాలు ధ్రువీకరించడం లేదు.
నిరుద్యోగం..ద్రవ్యోల్బణంపై విపక్షాల పట్టు..
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పాల్గొనేందుకు ఇండియా బ్లాక్‌కు చెందిన మొత్తం 24 పారీ్టలు అంగీకరించాయి. చైనా దురాక్రమణ, కుప్పకూలుతున్న ఆర్ధిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అదానీ కంపెనీ అక్రమాలు సహా పలు కీలక అంశాలను సమావేశాల్లో చర్చించాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాం«ధీ ఇదివరకే ప్రధాని మోదీకి లేఖ రాశారు.
పార్లమెంట్ నూతన భవనంపై జాతీయ జెండా
పార్లమెంట్ నూతన భవనం గజద్వారంపై ఆదివారం సాయంత్రం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన వెంట లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. అంతకుముందు ధన్‌ఖడ్, బిర్లాలకు సీఆర్‌పీఎఫ్ పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ బలగాలు వేర్వేరుగా గౌరవవందనం సమరి్పంచాయి.
రేపు ఎంపీల ఫొటో సెషన్
ఎంపీలందరికోసం మంగళవారం ప్రత్యేక ఫొటో సెషన్ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సభ్యులంతా మంగళవారం ఉదయం 9.30 గంటలకు జరిగే గ్రూప్ ఫొటో సెషన్‌కు రావాల్సిందిగా లోక్‌సభ సెక్రటేరియట్ కోరింది.
మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాల్సిందే
అఖిలపక్షం భేటీలో రాజకీయ పార్టీల పట్టు
సోమవారం నుంచి మొదలయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని పలు రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరాయి. అయితే, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక సెషన్ నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్షం భేటీకి పలు రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ సమావేశంలోనే సభ ముందుంచాలని పలువురు నేతలు కోరారు. బిల్లు ఏకాభిప్రాయంతో ఆమోదం పొందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, కొన్ని ప్రాంతీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలు, ఎస్‌సీలకు ప్రత్యేక కోటా కావాలంటూ డిమాండ్ చేస్తుండటం అడ్డంకిగా మారింది.
నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక భేటీ
Published Mon, Sep 18 2023 6:21 AM | Last Updated on Mon, Sep 18 2023 6:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment