Updates: పార్లమెంట్‌ సమావేశాలు | parliament monsoon session updates 5 august 2024 | Sakshi
Sakshi News home page

Updates: పార్లమెంట్‌ సమావేశాలు

Published Mon, Aug 5 2024 10:27 AM | Last Updated on Mon, Aug 5 2024 1:06 PM

parliament monsoon session updates 5 august 2024

Updates

  • ఇంటర్ మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి సోమవారం పార్లమెంటులో డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం కోసం ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిరోజూ తిరుపతికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారని సభ దృష్టికి తీసుకెళ్లారు. 

 

  • ఆయిల్ ఫీల్డ్స్ (నియంత్రణ మరియు అభివృద్ధి) చట్ట సవరణ బిల్లును రాజ్యసభలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రవేశపెట్టనున్నారు.
  • కాంగ్రెస్‌ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. లోక్‌సభలో ‘సరిహద్దు పరిస్థితి, చైనాతో భారీ వాణిజ్య లోటుపై చర్చ జరగాలని వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

  • ఓబీసీలను క్రిమిలేయర్‌ నుంచి తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

      

  • పార్లమెంట్‌లో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు
    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో విభజన బిల్లు, ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టనున్నారు. న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గోవా అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) ప్రాతినిధ్యాన్ని పునర్వ్యవస్థీకరించే చట్టాన్ని సమర్పించనున్నారు. 
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement