Updates..
► ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రతీ దేశ చరిత్రలో కొన్ని సందర్భాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. అమృత్‌మహోత్సవ్ వేళ నూతన పార్లమెంట్ భవనాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇది కేవలం భవనం మాత్రమే కాదు. 140 కోట్ల భారతీయుల ఆక్షాంకలకు ప్రతీక. కొత్త పార్లమెంట్ భవనం భారతీయల ధృడ సంకల్పాన్ని చాటి చెబుతుంది.
#WATCH | This new Parliament will become witness to the rise of a self-reliant India: PM Narendra Modi pic.twitter.com/NXKMeVSmoh
— ANI (@ANI) May 28, 2023
► స్వాతంత్ర్య పోరాట ఆకాంక్షలను పూర్తి చేసేందుకు కొత్త పార్లమెంట్ భవనం సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ భవనం పూరాతన నుంచి నూతనత్వానికి మాధ్యమం. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఆధునిక భారత్‌కు కొత్త పార్లమెంట్ అద్దం పడుతుంది.
► ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం. ప్రవితమైన సెంగోల్‌ను పార్లమెంట్‌లో ప్రతిష్టించాం. సెంగోల్.. చోళుల కాలంలో కర్తవ్య నిష్టకు ప్రతీక. ఆత్మనిర్భర్ భారత్‌కు సాక్షిగా పార్లమెంట్ నిలుస్తుంది. భారత్ కొత్త లక్ష్యాలను ఎంచుకుంది. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిది. భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలను పార్లమెంట్ గౌరవిస్తుంది.
► పార్లమెంట్‌లో రూ.75 కాయిన్, స్టాంప్ రిలీజ్ చేసిన ప్రధాని మోదీ.
#WATCH | Prime Minister Narendra Modi releases a stamp and Rs 75 coin in the new Parliament. pic.twitter.com/7YSi1j9dW9
— ANI (@ANI) May 28, 2023
► లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సంకల్పంతోనే రెండున్నర ఏళ్ల తక్కువ సమయంలోనే పార్లమెంట్ నూతన భవన నిర్మాణం జరిగింది. ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకత విషయంలో ప్రపంచానికి భారతదేశం ఆదర్శంగా నిలిచింది. భిన్నత్వంలో ఏకత్వం భారత్ ప్రత్యేకత. పర్యావరణానికి అనుకూలంగా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం జరిగింది. దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం. ప్రజాస్వామ్య సమస్యలకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది. మన దేశంలో ప్రజాస్వామ్యం ఎంతో ధృడమైనది.
In this Amrit Kaal, India's prestige in the world has increased. Our parliament has the ability to convert challenges into opportunities. Democracy is the foundation of our strong future. Unity in diversity is our strength: Lok Sabha Speaker Om Birla in the new Parliament pic.twitter.com/aZNGi7Us0i
— ANI (@ANI) May 28, 2023
► రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ కొత్త పార్లమెంట్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశాన్ని చదవి వినిపించారు.
► దేశంలో పార్లమెంట్‌కు ఎంతో విశిష్ట స్థానం ఉంది. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ ఒక ధృవతార లాంటిది. గత ఏడు దశాబ్దాల్లో మన పార్లమెంట్ ఎన్నో ఒడిదొడుకులను చూసింది. ప్రధాని మోదీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషం. పార్లమెంట్ భవన నిర్మాణానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. కొత్త పార్లమెంట్ భవనం ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని మరింత పెంచుతుందని ఆశిస్తున్నాను.- ద్రౌపది ముర్ము.
#WATCH | Rajya Sabha Deputy Chairman Harivansh reads out a message of President Droupadi Murmu in the new Parliament building pic.twitter.com/8kupF9h0h8
— ANI (@ANI) May 28, 2023
► నూతన పార్లమెంట్‌లో సభ ప్రారంభం
12:33 PM
► కొత్త పార్లమెంట్ ఆరంభ వేడుకలకు పలు దేశాల ప్రతినిధులు హాజరు.
► నూతన పార్లమెంట్ భవనంలో జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు.
► కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్.
► ఆత్మ నిర్బర్ భారత్‌కు ప్రతీక కొత్త పార్లమెంట్ భవనం. 2020 డిసెంబర్ 10న కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన. భవన నిర్మాణ సమయం 2ఏళ్ల 5నెలల 18 రోజులు. నిర్మాణ వ్యయం దాదాపు రూ.1200 కోట్లు.
► నాలుగు అంతస్తుల్లో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం. లోక్‌సభలో 888 సీట్లు, రాజ్యసభలో 384 సీట్లు. లోక్‌సభ హాల్‌లో 1272 సీట్లు ఏర్పాట్లు చేసే వెసులుబాటు. ప్రతీ సభ్యుడి సీటు వద్ద మల్టీ మీడియా డిస్‌ప్లే సిస్టమ్.
► జాతీయ పక్షి నెమలి ఆకృతిలో లోక్‌సభ ఛాంబర్. జాతీయ పుష్పం కమలం ఆకృతిలో రాజ్యసభ ఛాంబర్. కొత్త భవనంలో మంత్రుల కోసం 92 గదులు. పార్లమెంట్ సభ్యుల సీట్లకు డిజిటల్ టచ్ స్క్రీన్లు.
► నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.
#WATCH | PM Modi unveils the plaque to mark the inauguration of the new Parliament building pic.twitter.com/quaSAS7xq6
— ANI (@ANI) May 28, 2023
► నూతన పార్లమెంట్ భవనం శిలాఫలకం ఆవిష్కరించిన ప్రధాని మోదీ.
#WATCH | PM Narendra Modi felicitates the workers who helped in the building and development of the new Parliament House. pic.twitter.com/r6TkOQp4PX
— ANI (@ANI) May 28, 2023
► కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కార్మికులకు ప్రధాని మోదీ సత్కారం.
► అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా.
► స్పీకర్ కుర్చీ వద్ద సెంగోల్‌ను ప్రతిష్టించిన ప్రధాని మోదీ.
#WATCH | PM Modi installs the historic 'Sengol' near the Lok Sabha Speaker's chair in the new Parliament building pic.twitter.com/Tx8aOEMpYv
— ANI (@ANI) May 28, 2023
#WATCH | PM Modi carries the historic 'Sengol' into the Lok Sabha chamber of the new Parliament building pic.twitter.com/wY206r8CUC
— ANI (@ANI) May 28, 2023
► పూజ తర్వాత సెంగోల్‌కు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం.
► ప్రధాని మోదీకి సెంగోల్‌ను అందజేసిన వేద పండితులు.
#WATCH | PM Narendra Modi carries the historic 'Sengol' post the pooja ceremony after it is handed over to him by the Adheenam seers. pic.twitter.com/FCAkjD90jK
— ANI (@ANI) May 28, 2023
► నూతన పార్లమెంట్ భవన మండపాల్లో పూజా కార్యక్రమం జరుగుతోంది.
#WATCH PM Modi and Lok Sabha Speaker Om Birla begin pooja for the inauguration of the new Parliament building
The puja ceremony will continue for about an hour. After the puja, the PM will receive the 'Sengol' and install it in the new Parliament. pic.twitter.com/S13eVwZZD3— ANI (@ANI) May 28, 2023
► పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా.
► జాతిపిత మహాత్మా గాంధీకి వందనం చేసిన ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా.
#WATCH | PM Modi and Lok Sabha Speaker Om Birla pay floral tributes to Mahatma Gandhi at the Parliament House, ahead of the inauguration of the new building pic.twitter.com/NCt7kf5xQj
— ANI (@ANI) May 28, 2023
► కొత్త పార్లమెంట్ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ.
#WATCH PM Modi and Lok Sabha Speaker Om Birla arrive at the new Parliament building for the inauguration ceremony pic.twitter.com/nHbfqFFYZh
— ANI (@ANI) May 28, 2023
ఇలలో ఇంద్రభవనం: నూతన పార్లమెంట్ భవన విశేషాలు
►ఉదయం 7.30 గంటలకు నూతన పార్లమెంటు భవన మండపాల్లో పూజ ప్రారంభం.
►ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
►ఉదయం 8.30 గంటలకు పార్లమెంట్ ఛాంబర్లను సందర్శించనున్న ప్రధానమంత్రి మోదీ, ప్రముఖులు
►ఉదయం 9.00 గంటలకు ప్రార్థన సభ
►ఉదయం 9.30 గంటలకు వేదిక నుంచి బయలుదేరనున్న ప్రధాని
►11.30 గంటలకు అతిథుల రాక ప్రారంభం
►మధ్యాహ్నం 12.00 గంటలకు వేదికపైకి ప్రధాని రాక
►మధ్యాహ్నం 12.07 గంటలకు జాతీయ గీతం
►మధ్యాహ్నం 12.10 గంటలకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ స్వాగత ప్రసంగం
►మధ్యాహ్నం 12.29కి ఉపరాష్ట్రపతి సందేశం
►మధ్యాహ్నం 12.33 గంటలకు రాష్ట్రపతి సందేశం
►12.38 గంటలకు ప్రతిపక్ష నేతల ప్రసంగం
►మధ్యాహ్నం 12.43 గంటలకు లోక్‌సభ స్పీకర్ ప్రసంగం
►మధ్యాహ్నం 1.00 గంటలకు 75 రూపాయల నాణెం మరియు స్టాంపును విడుదల చేయనున్న ప్రధాని
►మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. షెడ్యూల్ ప్రకారం తెల్లవారుజాము నుంచే యాగం, పూజలు, ప్రార్థనలతో ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ పార్టీల నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరవుతారు.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు..
పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో లుటెన్స్ ఢిల్లీ ప్రాంతంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్లమెంట్ చుట్టుపక్కల ఏరియాలను పోలీసుల తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదనపు బలగాలను మోహరించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగిస్తున్నారు. సెంట్రల్ ఢిల్లీలో ప్రత్యేకంగా పికెట్లు ఏర్పాటు చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో కొత్త భవనం వద్ద ధర్నా చేస్తామని మహిళా రెజ్లర్లు ప్రకటించగా, అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.
India’s magnificent #NewParliamentBuilding stands as tall as India’s resolve to go all guns blazing into a glorious future, & embodies the spirit of the India growth story, under the visionary leadership of PM @narendramodi Ji, that has captivated the world.#MyParliamentMyPride pic.twitter.com/z3n8e7tznM
— Hardeep Singh Puri (@HardeepSPuri) May 26, 2023
Delhi | The arrival of VIPs at the new Parliament House begins ahead of the inauguration ceremony
Visuals from Vijay Chowk pic.twitter.com/COD31un8HO— ANI (@ANI) May 28, 2023
Delhi | Adheenams from different mutts across Tamil Nadu leave for the new Parliament building to attend the inauguration ceremony pic.twitter.com/PnUv8wd8Ou
— ANI (@ANI) May 28, 2023
Comments
Please login to add a commentAdd a comment