ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముస్తాబైంది. అధికార బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆధునిక హంగులతో పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది. ఇక, కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం మే 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది.
ఈ నేపథ్యంలో కొత్త భవనం ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో పార్లమెంట్ లోపలి, బయటి దృశ్యాలు ఉన్నాయి. లోక్‌సభ, రాజ్యసభ.. ఆ రెండు సభల్లో సీటింగ్ అమరికకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. కాగా, కొత్త పార్లమెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- పార్లమెంట్ లోపలి భాగంలో మూడు జాతీయ చిహ్నాలు ఉన్నాయి.
- కమలం, నెమలి, మర్రి చెట్టు - దాని ఇతివృత్తాలు.
- త్రిభుజాకారంలో నాలుగు అంతస్తుల పార్లమెంటు భవనం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది.
- ఈ భవనంలో మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి - జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్ మరియు కర్మ ద్వార్.
- స్పీకర్ కుర్చీకి సమీపంలో సెంగోల్‌ను ఏర్పాటు చేస్తారు.
#WATCH | Delhi: First look at the New Parliament building that will be inaugurated by Prime Minister Narendra Modi on May 28.#NewParliamentBuilding pic.twitter.com/ouZoz6dLgu
— ANI (@ANI) May 26, 2023
ఇది కూడా చదవండి: రెగ్యులర్ పాస్‌పోర్టు కోసం రాహుల్ గాంధీ.. లైన్ క్లియర్
Comments
Please login to add a commentAdd a comment