సాక్షి, హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్ అయ్యింది. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం మే 28(ఆదివారం)న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఇక, పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించడాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో ప్రధానిపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఏవిధంగా ఉండాలో ఆర్టికల్ 79 స్పష్టంగా వివరించింది. పార్లమెంట్ వ్యవస్థలో రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ ఉంటాయన్నారు. పార్లమెంట్ సమావేశాలకు అతి తక్కువ రోజులు హాజరైన ప్రధానమంత్రులలో నరేంద్ర మోదీ మొదటి స్థానంలో ఉన్నారన్నారు. పార్లమెంట్ అందరిదీ.. మోదీనే పార్లమెంట్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ ఎంపీలు హాజరు కావడం లేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: కొత్త పార్లమెంట్ ఇన్‌సైడ్ ఫస్ట్ లుక్.. వీడియో అదుర్స్
Comments
Please login to add a commentAdd a comment