రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ని అరెస్టే చేయాల్సిందే అంటూ జంతర్‌మంతర్ వద్ద భారత అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం జరగుతున్నందున్న ఒలింపియన్లు, కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్‌లతో సహా భారత అగ్రశ్రేణి రెజ్లర్లంతా అక్కడే నిరసనలు చేసేందుకు ప్లాన్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని, నిరసనను ఆపించేశారు. ఈ నేపథ్యంలో కొందరు రెజ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లు నిర్వహిస్తున్న మహిళా మహా పంచాయత్ కోసం వేలాదిగా భద్రతా సిబ్బంది మోహరించారు. అదీగాక పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం కోసం అదనపు పోలీసులు ఢిల్లీ సరిహద్దుల వెంబడి మెహరింపు తోపాటు బహుళ బారికేడ్లు, కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేసేలా డిల్లీ మెట్రోలోని సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ భవన్ స్టేషన్లలోని అన్ని ప్రవేశ మార్గాలను అదికారులు మూసేశారు.
#WATCH | Delhi: Security personnel stop & detain protesting wrestlers as they try to march towards the new Parliament from their site of protest at Jantar Mantar.
— ANI (@ANI) May 28, 2023
Wrestlers are trying to march towards the new Parliament as they want to hold a women's Maha Panchayat in front of… pic.twitter.com/3vfTNi0rXl
ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్ దేవేంద్ర పాఠక్ మీడియాతో మాట్లాడుతూ..రెజ్లర్ల నిరసనకు అనుమతి నిరాకరించినప్పటికీ..వారంతా కొత్త భవనం సమీపంలో మహిళా మహా పంచాయత్‌ను నిర్వహించాలని పట్టుబట్టారు. ఐతే తాము అథ్లెట్లను గౌరవిస్తాం. కానీ లా అండ్ ఆర్డర్‌కి విఘాతం కలిగించే పనులకు అనుమతివ్వం. అలాగే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో ఎలాంటి ఆటంకాలు రానివ్వం అని చెప్పారు.
మరోవైపు రెజ్లర్లకు సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీలోని ఘాజీపూర్ సరిహద్దు వద్ద వేలాది మంది రైతులు తరలివస్తారని ప్రముఖ రైతు నాయకుడు రాకేష్ టికైత్ ప్రకటించారు. ఈ రైతులు వివిధ సరిహద్దు ప్రాంతాల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించాలని ప్లాన్ చేసుకున్నారు. దీంతో భద్రత బలగాలు ఢిల్లీ సరిహద్దుల వెంబడి నిఘా ఉంచడమే గాక తనిఖీలు నిర్వహించకుండా ఎవ్వరినీ అనుమతించకుండా గట్టి పహారా నిర్వహించారు.
(చదవండి: కొత్త పార్లమెంట్ భవనం కోసం షారూఖ్, అక్షయ్ కూమార్‌ల వాయిస్ ఓవర్)
Comments
Please login to add a commentAdd a comment