సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ పాత భవనం శకం ముగిసింది. నేటి నుంచి కొత్త భవనంలోనే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తొలి రోజు సమావేశాలు జరగ్గా.. ముగించే ముందర ఆయన ఈ విషయం సభ్యులకు తెలియజేశారు.
సభని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ ఓం బిర్లా.. మంగళవారం నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు నడుస్తాయని తెలిపారు. ముందుగా నేటి ఉదయం 9.30గం. ప్రాంతంలో ఫొటో సెషన్ నిర్వహిస్తారు. ఆపై సెంట్రల్ హాల్‌లో ఎంపీలు సమావేశం అవుతారు. కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రధాని మోదీ.. ఎంపీలతో పాటు ఎంట్రీ ఇస్తారు. ఈ సందర్భంగా ఎంపీలందరికీ గిఫ్ట్ బ్యాగ్ ఇవ్వనున్నారు.
ఆ గిఫ్ట్ బ్యాగ్‌లో రాజ్యాంగం బుక్, పార్లమెంట్ పుస్తకాలు, స్మారక నాణెం, స్టాంప్ ఉండనున్నట్లు సమాచారం. ఆపై మధ్యాహ్నాం 1.15 నిమిషాలకు లోక్‌సభ ప్రారంభం కానుంది. మరోవైపు రాజ్యభస 2.15 నిమిషాలకు ప్రారంభం అవుతుంది.
Special Session of Parliament | Lok Sabha adjourned to meet at 1:15 pm in the new Parliament building tomorrow.
— ANI (@ANI) September 18, 2023
క్లిక్ చేయండి: ప్రజాస్వామ్య సౌధం.. 96 ఏళ్ల సేవలు.. ఇక సెలవు
Comments
Please login to add a commentAdd a comment