Parliament building
-
ఆత్మనిర్భర భారత్, డిజిటల్ ఇండియా మన బలం
-
పార్లమెంట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం
-
Parliament : సరికొత్త సంకల్పంతో...
ఎన్నో కీలక ఘట్టాలకు వేదికైన పాత పార్లమెంటు భవనం చరిత్ర ముగిసి, కొత్త పార్లమెంటు భవనం అందుబాటులోకొచ్చింది. అయిదురోజులపాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సోమవారం పాత భవనంలోనే ప్రారంభమైనా, రెండోరోజు కొత్త భవనంలోకి మారాయి. ఇకపై పాత భవనం సంవిధాన్ భవన్‌గా పేరు మార్చుకుని భవిష్యత్తు తరాలకు ఉత్తేజాన్నందిస్తూంటుందని మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయనన్నట్టు దేశ ప్రజాతంత్ర యాత్రలో సామాన్య పౌరుల సంపూర్ణ విశ్వాసాన్ని చూరగొన్న చరిత్ర పార్లమెంటుది. ఇక్కడే వేలాది చట్టాలపై ఎడతెగని చర్చలు జరిగాయి. ఎన్నో కీలక నిర్ణయాలు రూపుదిద్దుకున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పక్షాల మధ్య వాగ్యుద్ధాలు చోటుచేసుకున్నాయి. రాజీలేని ధోరణిలో వాద ప్రతివాదాలు సాగాయి. ఎన్నెన్నో భావోద్వేగాలకు అది వేదికైంది. అదే సమయంలో కీలక సందర్భాల్లో బలమైన స్వరాన్ని వినిపించలేని దాని అశక్తత నిరంకుశ చట్టాలకు కూడా కారణమైంది. అది మౌనం వహించటంవల్ల పాలకపక్షం ఆత్యయిక స్థితి పేరిట దేశ ప్రజల గొంతు నొక్కటానికి అవకాశం ఏర్పడింది. తొలినాళ్లలో ఆరోగ్యకరమైన చర్చలకు చోటిచ్చిన సభే రాను రాను ఉత్త ఉపన్యాస వేదికగా, అప్పుడప్పుడు బలప్రదర్శన రంగస్థలిగా మారుతోంది. దేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో తమకూ భాగస్వామ్యం ఉన్నదని... తమ ఆశలూ, ఆకాంక్షలూ వ్యక్తమవుతున్నాయని సామాన్యులు భావించటానికి వీల్లేని స్థితిగతులు నెలకొంటున్నాయి. ఏ విధాన నిర్ణయంలోని మంచిచెడ్డలనైనా ఆరోగ్యకరమైన చర్చల ద్వారా నిగ్గుతేల్చాల్సి వుండగా చాలా నిర్ణయాలు అరుపులూ, కేకల మధ్య మూజువాణి ఓటుతో గట్టెక్కుతున్నాయి. అంతకన్నా దారుణం లక్షల కోట్ల రూపాయలు వ్యయం కాగల ఆర్థిక పద్దులు సైతం గిలెటిన్ అవుతున్నాయి. అవతలి పక్షాన్ని అవహేళన చేయటం, స్వోత్కర్షలకు పోవటం నిత్యకృత్యమైంది. ఇవన్నీ గమనిస్తే నూతన పార్లమెంటు భవనం సరికొత్త ఆశలకూ, విశ్వాసాలకూ అద్దం పడుతుందా అన్నది సందేహాస్పదమే. అది సాధ్యమేనని ప్రధాని తన ప్రసంగంలో బలంగా చెప్పారు. కానీ అధికార, విపక్షాల మధ్య అంతటి సామరస్యత ఏర్పడుతుందా? మన పార్లమెంటు నడతను నిర్దేశిస్తున్న నిబంధనలు సంతృప్తికరంగా లేకపోవటం కూడా సమస్యలకు దారితీస్తోంది. దేన్ని చర్చించాలి...ఏ రూపంలో చర్చించాలన్న అంశాలు తరచు వివాదాస్పదమవుతున్నాయి. సభాధ్యక్షులకుండే విచక్షణాయుత అధికారాలు ఇందుకు దోహదపడుతున్నాయి. గడిచిన కాలాన్ని బేరీజు వేసుకోకుండా, జరిగిన తప్పొప్పులను నిజాయితీగా సమీక్షించుకోకుండా సరికొత్త ప్రయాణం సులభం కాదు. అధికార, విపక్షాల మధ్య విభేదాలుండటం, అవి ఒక్కో సారి తీవ్ర రూపం దాల్చటం అసాధారణమేమీ కాదు. కానీ సమష్టిగా ఉండటానికి ముందుకు రావలసిన తరుణంలో సైతం పాక్షిక దృక్పథంతో వ్యవహరించే ధోరణి ప్రబలుతోంది. ఎదురు పడినప్పుడు మర్యాదపూర్వకంగా పలకరించుకునే సంస్కృతి కూడా ఆవిరవుతోంది. ఇవన్నీ పార్ల మెంటుపై దేశ ప్రజలకుండే విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. మొన్నటికి మొన్న దేశం మొత్తం సిగ్గుతో తలవంచుకోవాల్సిన మణిపుర్ అకృత్యాలపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాలు రెండూ వ్యవహరించిన తీరు దిగ్భ్రాంతి కలిగించింది. దీన్ని తప్పించుకునే ధోరణిగా చూడాలా లేక ప్రజల మనోభావాలను అవగాహన చేసుకోవటంలోని అశక్తతగా పరిగణించాలా? సమాజంలో భిన్న వర్గాలున్నప్పుడూ, వాటికి భిన్న ప్రయోజనాలున్నప్పుడూ పార్లమెంటులో అవి ప్రతిబింబించటం వింతేమీ కాదు. నిజానికి అలాంటి వైరుధ్యాలకు సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనటమే ప్రజాతంత్ర సంస్థల లక్ష్యం. కానీ బలం ఉంది కదా అని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం, వాటి మంచిచెడ్డల విశ్లేషణకు అవకాశమీయకుండా అసమ్మతికి పాతరేయటం ఇటీవలి కాలంలో రివాజైంది. పార్లమెంటు సజావుగా సాగటానికి, అక్కడ ఆరోగ్యవంతమైన చర్చలు జరగటానికి ప్రస్తుత పాలక్ష పక్ష కూటమికి నేతృత్వం వహిస్తున్న పార్టీగా బీజేపీపై ఎక్కువ బాధ్యత ఉంటుంది. అధికార పక్షంనుంచి అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు దాన్ని స్వాగతించి తమ వంతుగా సకారాత్మక దృక్పథాన్ని ప్రదర్శించటం విపక్షాల వంతు. స్వరూపం, సదుపాయాల కోణంలో మాత్రమేకాదు...స్వభావరీత్యా వర్తమాన ప్రగాఢ ఆకాంక్ష లకు కూడా నూతన పార్లమెంటు భవనం అద్దం పడుతుందన్న గ్రహింపు ఏర్పడినప్పుడు ఇరు పక్షాలూ విజ్ఞతతో మెలుగుతాయి. ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయంటే, ఒక బిల్లు విషయంలో, ఒక విధాన నిర్ణయం విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయంటే దాన్ని కేవలం రాజకీయకోణంలో కాక, ప్రజానీకంలో ఏర్పడిన అభిప్రాయానికి ప్రతిబింబంగా చూడగలిగితే చాలా సమస్యలకు పరిష్కారాలు సాధ్యమవుతాయి. ప్రస్తుత పార్లమెంటు భవనం లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చొనటానికి అనువుగా ఉంది. సెంట్రల్ హాల్ లేకున్నా, ఉభయసభల ఉమ్మడి సమావేశాల సమయంలో 1,272 మంది కూర్చొనేందుకు లోక్‌సభలో అవకాశం ఉంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కల్పించే బిల్లు రాజ్యసభలో మంగళవారం ప్రవేశించటం శుభపరిణామం. బిల్లు ఆమోదం పొంది చట్టమైనా నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఇది అమల్లోకి వస్తుందనటం కొంత నిరాశ కలిగిస్తుంది. ఏదేమైనా కొత్త సభా భవనం సరికొత్త ఆచర ణకు, సమున్నత సంప్రదాయాలకు వేదిక కాగలదని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. దాన్ని నెరవేర్చ వలసిన బాధ్యత శాసనకర్తలదే. -
కొత్త భవనంలో సమావేశాలు: లోక్‌సభ స్పీకర్
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ పాత భవనం శకం ముగిసింది. నేటి నుంచి కొత్త భవనంలోనే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తొలి రోజు సమావేశాలు జరగ్గా.. ముగించే ముందర ఆయన ఈ విషయం సభ్యులకు తెలియజేశారు. సభని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ ఓం బిర్లా.. మంగళవారం నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు నడుస్తాయని తెలిపారు. ముందుగా నేటి ఉదయం 9.30గం. ప్రాంతంలో ఫొటో సెషన్ నిర్వహిస్తారు. ఆపై సెంట్రల్ హాల్లో ఎంపీలు సమావేశం అవుతారు. కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రధాని మోదీ.. ఎంపీలతో పాటు ఎంట్రీ ఇస్తారు. ఈ సందర్భంగా ఎంపీలందరికీ గిఫ్ట్ బ్యాగ్ ఇవ్వనున్నారు. ఆ గిఫ్ట్ బ్యాగ్‌లో రాజ్యాంగం బుక్, పార్లమెంట్ పుస్తకాలు, స్మారక నాణెం, స్టాంప్ ఉండనున్నట్లు సమాచారం. ఆపై మధ్యాహ్నాం 1.15 నిమిషాలకు లోక్‌సభ ప్రారంభం కానుంది. మరోవైపు రాజ్యభస 2.15 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. Special Session of Parliament | Lok Sabha adjourned to meet at 1:15 pm in the new Parliament building tomorrow. — ANI (@ANI) September 18, 2023 క్లిక్ చేయండి: ప్రజాస్వామ్య సౌధం.. 96 ఏళ్ల సేవలు.. ఇక సెలవు -
నూతన పార్లమెంట్: ఆరు దర్వాజలకు ఆరు జంతువులు కాపలా..
ఢిల్లీ: దేశంలో నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలయ్యాయి. రేపు కొత్త పార్లమెంట్లో చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే.. కొత్త పార్లమెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చే గుమ్మాలు చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. పార్లమెంట్ భవనంలో ఆరు దర్వాజలకు ఆరు పౌరాణిక ప్రాణుల పేర్లను పెట్టారు. ఈ ఆరు ప్రాణులు 140 కోట్ల భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ ప్రత్యేకతలను సూచిస్తున్నాయి. అవేంటంటే.. నూతన పార్లమెంట్లో ఆరు ద్వారాలు ఉన్నాయి. అవి.. గజ ద్వారం, అశ్వ ద్వారం, గరుడ ద్వారం, మకర ద్వారం, శార్దూల ద్వారం, హంస ద్వారం. ప్రతి ద్వారం దాని పేరుపై ఉన్న ప్రాణి శిల్పాన్ని కలిగి ఉంది. గజ ద్వారం.. బుద్ధి, జ్ఞాపకశక్తి, సంపద, జ్ఞానాన్ని సూచించేది ఏనుగు. దీని పేరు మీదుగా గజ ద్వారంగా ఓ గుమ్మానికి పేరు పెట్టారు. ఈ ద్వారం భవనానికి ఉత్తరం వైపు ఉంది. ఉత్తరం, వాస్తు శాస్త్రం ప్రకారం, బుధగ్రహంతో సంబంధం కలిగి ఉంది. ఇది తెలివికి మూలం అని విశ్వసిస్తారు. అశ్వ ద్వారం.. రెండవది అశ్వ ద్వారం. గుర్రం పేరు మీదుగా గుమ్మానికి ఈ పేరు పెట్టారు. గుర్రం శక్తి, బలం, ధైర్యాన్ని సూచిస్తుంది. పాలనలో కావాల్సిన లక్షణాలను ఈ గుమ్మం గుర్తుచేస్తుంది. గరుడ ద్వారం.. మూడవ ద్వారానికి గరుడ అనే పేరు పెట్టారు. పక్షుల రాజు గరుడ.. విష్ణువు వాహనంగా నమ్ముతారు. హిందూ త్రిమూర్తులలో సంరక్షకుడు అయిన విష్ణువుతో దానికి అనుబంధం ఉంది. గరుడను శక్తి, ధర్మం (కర్తవ్యం)నికి చిహ్నంగా భావిస్తారు. ఇది అనేక దేశాల చిహ్నాలపై ఎందుకు ఉపయోగించారో కూడా వివరణ ఉంటుంది. గరుడ ద్వారం కొత్త పార్లమెంటు భవనానికి తూర్పు ద్వారం. మకర ద్వారం.. నాలుగో ద్వారం మకర ద్వారం. మకరాన్ని సముద్ర చేపగా పిలుస్తారు. వివిధ జంతువుల కలయికగా దీన్ని గుర్తిస్తారు. దక్షిణ, ఆగ్నేయాసియాలో విస్తరించి ఉన్న హిందూ, బౌద్ధ స్మారక కట్టడాలలో మకరం సాధారణంగా కనిపిస్తాయి. మకరం వివిధ జీవుల కలయికగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. గుమ్మాల వద్ద మకర శిల్పాలు రక్షకులుగా కనిపిస్తాయి. మకర ద్వారం పాత పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వైపు ఉంది. శార్దూల ద్వారం.. ఐదవ ద్వారం శార్దూలం. ఇది సింహం శరీరం, కానీ గుర్రం, ఏనుగు లేదా చిలుక తల. కొత్త పార్లమెంట్ భవనం గేటుపై శార్దూల ఉండటం దేశ ప్రజల శక్తిని సూచిస్తుందని ప్రభుత్వ నోట్ పేర్కొంది. హంస ద్వారం పార్లమెంటు ఆరవ ద్వారానికి హంస ద్వారం అని పేరు పెట్టారు. హంస అనేది హిందూ జ్ఞాన దేవత అయిన సరస్వతి వాహనం. హంస మోక్షాన్ని సూచిస్తుంది. జనన, మరణ చక్రం నుంచి ఆత్మ విముక్తిని సూచిస్తుంది. పార్లమెంటు గేటుపై ఉన్న హంస శిల్పం స్వీయ-సాక్షాత్కారానికి, జ్ఞానానికి చిహ్నం. ఇదీ చదవండి: ఇండియా కూటమిని గొర్రెలు, మేకలతో పోల్చిన ఏక్నాథ్ షిండే -
Old Parliament: ఏకైక ప్రత్యక్ష సాక్షి అదొక్కటే!
పార్లమెంట్ పాతదైపోయింది. హాల్స్ నుంచి ప్రతీది.. ప్రజాప్రతినిధుల అవసరాలకు అనుగణంగా సరిపోవడం లేదు. పైగా సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భవిష్యత్ కోసం కొత్తది కావాల్సిందే.. నరంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ఇలాంటి ప్రకటనే చేసింది. ఆ ప్రకటనకు కట్టుబడి.. భారీ వ్యయంతో పార్లమెంట్ నూతన భవనాన్ని నిర్మించింది కూడా. రేపు(ఆదివారం) పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ తరుణంలో ఆధునిక భారత దేశ చరిత్రలో కీలక ఘట్టాలకు ఏకైక ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన పార్లమెంట్ ప్రస్థానాన్ని తిరగేద్దాం.. కౌన్సిల్ హౌజ్ నుంచి పార్లమెంట్ అనే గుర్తింపు దాకా.. బ్రిటిషర్ల కాలంలో చట్ట సభల ద్వారా మొదలై.. 76 ఏళ్ల ప్రజాసామ్య దేశానికి సంబంధించి మొదటి మీటింగ్ జరిగింది ఈ భవనంలోనే!. ఉభయ సభల్లోని సభ్యుల మధ్య వాదప్రతివాదనలు, చర్చలు, నేతల కీలక ప్రసంగాలు, ప్రభుత్వాల పని తీరుపై ఓటింగ్‌లు.. ఇలాంటి ఎన్నో ఘట్టాల ద్వారా అనుబంధాన్ని అల్లేసుకుంది. దాని చరిత్రను పరిశీలిస్తే.. 👉 1911లో కోల్‌కతా నుంచి రాజధానిని ఢిల్లీకి తరలించాలని నిర్ణయించింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. అందుకోసం న్యూఢిల్లీని నిర్మించాలనుకుంది. రెండేళ్ల తర్వాత న్యూఢిల్లీ ప్రణాళికా దశకి చేరింది. ఆ సమయంలో తక్కువ సభ్యులున్న లెజిస్టేటివ్ కౌన్సిల్ కోసం గవర్నర్ జనరల్ నివాసం (ఇప్పుడున్న రాష్ట్రపతి భవన్) సరిపోతుంది కదా అని బ్రిటిష్ అధికారులు భావించారు. వేసవిలో సిమ్లాలోని వైస్రాయ్ లాడ్జ్‌లో, శీతాకాలంలో అప్పటి ఢిల్లీ సెక్రటేరియెట్ బిల్డింగ్‌లో (ఇప్పుడది ఢిల్లీ అసెంబ్లీగా ఉంది) భేటీ అయ్యేవాళ్లు. అయితే.. 👉 1918లో మాంటెగ్ ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు తెర మీదకు వచ్చాయి. దాని ప్రకారం.. చట్టసభల ప్రాధాన్యంతో పాటు... సభ్యుల సంఖ్యా పెరిగింది. ఎగువ, దిగువ సభలనేవి అమల్లోకి వచ్చాయి. వీటితో పాటు సిబ్బంది సంఖ్యా పెరిగింది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం రెండు ప్రతిపాదనలు చేసింది. ఒకటి.. టెంట్ల కింద సభను నిర్వహించటం. రెండవది.. శాశ్వత భవంతిని నిర్మించడం. అలా.. 1921లో పార్లమెంట్ భవనానికి తొలి అడుగు పడింది. అదే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (దిగువ సభ) తొలి భవంతి. 👉 న్యూ ఢిల్లీ నగర రూపశిల్పులు.. బ్రిటిష్ ఆర్కిటెక్టులు ఎడ్విన్ ల్యూటెన్, హెర్బర్ట్ బేకర్లు ఎగువ, దిగువ చట్టసభలకు శాశ్వత భవన నిర్మాణాలను ప్రతిపాదించారు. ల్యూటన్ గుండ్రంగా, బేకర్ త్రికోణాకారంలో ప్రణాళికలు తయారు చేశారు. చివరకు ల్యూటన్ దానికే బ్రిటిష్ సర్కారు మొగ్గు చూపింది. 👉 1921 ఫిబ్రవరి 12న.. డ్యూక్ ఆఫ్ కానాట్ ‘ప్రిన్స్ ఆర్థర్’ కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేశారు. ఆరేళ్లలో నిర్మితమైన ఈ భవనాన్ని 1927 జనవరి 19న అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో.. 27 అడుగుల ఎత్తైన పిల్లర్లు 144 ను ఉపయోగించి.. ఈ అందమైన భవంతి నిర్మించారు. ప్రకృతి వైపరిత్యాలను తట్టుకునేలా పక్కా ప్లాన్‌తో చాలా బలంగా ఈ నిర్మాణం జరిగింది. బహుశా అందుకేనేమో ఈ 96 ఏళ్ల కాలంలో.. పార్లమెంట్ భవనానికి జరిగిన రిపేర్ సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయి. 👉 మధ్యలో సెంట్రల్ హాల్, దాని పక్కనే మూడు అర్ధవృత్తాకార ఛాంబర్లు... చుట్టూ ఉద్యానవనంతో ఆకట్టుకునేలా నిర్మించారు. సెంట్రల్ హాల్ చుట్టూ ఉండే ఒక ఛాంబర్లో సంస్థానాధీశుల సభ (ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్), మరోదాంట్లో స్టేట్ కౌన్సిల్ (ఎగువ సభ, ప్రస్తుత రాజ్యసభ), మూడోదాంట్లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (దిగువ సభ, ప్రస్తుత లోక్‌సభ) ఉండేవి. 👉 మధ్యప్రదేశ్‌లోని చౌసత్ యోగిని దేవాలయాకృతి స్ఫూర్తితో పార్లమెంట్ భవనం నిర్మించారనే ఒక ప్రచారం కూడా నడుస్తుంటుంది. అలా మన పార్లమెంటు భవనం ప్రారంభం కాగా.. ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. 👉 బ్రిటిషర్ల కాలంలో చట్టసభగా కొనసాగిన ఈ భవనం.. అధికార మార్పిడికి వేదికైంది. అంతేకాదు.. కొత్త ఏర్పాట్లు జరిగేదాకా మొదట్లో సుప్రీంకోర్టు కూడా ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుంచే కార్యకలాపాలు నిర్వహించింది. యూపీఎస్సీ కార్యాలయం కూడా పార్లమెంటు కాంప్లెక్స్‌లోనే ఉండేది. 👉 స్థలాభావాన్ని అధిగమించటం కోసం 1956లో పాత పార్లమెంటులో మరో రెండు అంతస్థులు నిర్మించారు. అయినా స్థలం సరిపోయేది కాదు. 👉 సెంట్రల్ హాల్లో మూడోదైన లెజిస్లేటివ్ అసెంబ్లీలోనే 1929లో విప్లవకారుడు భగత్‌సింగ్, ఆయన సహచరుడు బతుకేశ్వర్ దత్‌లు బాంబు విసిరారు. 👉 2001లో లష్కరే తోయిబా తీవ్రవాదుల దాడి జరిగింది పార్లమెంట్ భవనంపై. స్వతంత్ర భారతంలోని అత్యంత కీలక చట్టాలకు ఈ పార్లమెంట్ భవనమే ప్రత్యక్ష సాక్షి. ఎమర్జెన్సీలాంటి చీకట్లతో పాటు స్వాత్రంత్య దినోత్సవ వేడుకల వెలుగుల్ని వీక్షించింది ఈ భవంతి. మహ మహా మేధావుల నేతృత్వంలో ఆధునిక భారత ప్రస్థానానికి దారితీసిన సంస్కరణలకే కాదు.. వివాదాలకు, నేతల వ్యక్తిగత విమర్శలకూ ఈ ప్రజాస్వామ్య సౌధం వేదికగా మారింది. 👉 నూతన భవన నిర్మాణంలో సుమారు 60,000 మంది కార్మికులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల పాటు నిర్మాణ పనులు సాగాయి. సెంట్రల్ విస్టా వెబ్సైట్ ప్రకారం.. పాత పార్లమెంటు భవన నిర్మాణానికి అవసరమైన రాళ్లు, మార్బుల్స్ కోసమే రాళ్లు కొట్టేవాళ్లను, మేస్త్రీలను కలిపి 2,500 మందిదాకా అప్పట్లో నియమించారట. 👉 కార్యకలాపాలకు కొత్త పార్లమెంట్ భవనం ఉపయోగించినప్పటికీ.. పాత పార్లమెంట్ భవనాన్ని కూల్చబోమని కేంద్రం ఇప్పటికే తెలిపింది. దానికి మరమత్తులు చేసి ప్రత్యామ్నాయ వినియోగానికి అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. పాత పార్లమెంటు భవనాన్ని దేశ పురావస్తు సంపదగా పరిరక్షిస్తామని తెలిపారు. ఆ అవసరం ఉంది కూడా. 👉 మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న టైంలో.. పార్లమెంట్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. 2500 ఏళ్ల నాటి భారతీయ విశిష్ట నాగరికత సంస్కృతులు ఇందులో అద్దంపట్టేలా ఏర్పాటు చేశారు. -
బహిష్కరణ సబబేనా?!
వాకౌట్లు, వాయిదాలు, అరుపులు, కేకలతో తరచు వార్తల్లోకెక్కే పార్లమెంటు కనీసం కొత్త భవనం ప్రారంభోత్సవ సందర్భంలోనైనా పండుగ కళను సంతరించుకుంటుందని ఆశిస్తే అది సాధ్యపడేలా లేదు. నూతన పార్లమెంటు భవనాన్ని ఎవరు ప్రారంభించాలన్న అంశం చుట్టూ ఇప్పుడు వివాదం రాజుకుంది. పనిలో పనిగా రాజ్యాంగ చట్రంలో ఎవరి పాత్రేమిటన్న చర్చ కూడా మొదలైంది. ఈ ఆదివారం నూతన పార్లమెంటు భవనం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతుండటమే తాజా వివాదానికి మూలం. రాజ్యాంగం నిర్దేశించిన మూడు వ్యవస్థల్లో శాసన వ్యవస్థ ఒకటి కనుక రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి ప్రారంభిస్తేనే బాగుంటుందని విపక్షాలు వాదిస్తున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించే ప్రధాని పార్లమెంటులో మెజారిటీ పక్షానికి మాత్రమే నాయకుడని, అందువల్ల ఆయన ప్రారంభించటం సరికాదంటున్నాయి. తమ వాదనకు ప్రభుత్వం సమ్మతించటం లేదని అలిగి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించటానికి నిర్ణయించుకున్నాయి. మొత్తంగా 20 పార్టీలు బహిష్కరణ పిలుపులో భాగం కాగా, 25 పార్టీలు ఈ వేడుకకు హాజరవుతున్నాయి. ఏ నిర్ణయాన్నయినా అందరూ ఆమోదించాలని లేదు. విభేదించే హక్కు, భిన్నా భిప్రాయాన్ని ప్రకటించే హక్కు ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంటుంది. కానీ ఆ పరిధి దాటి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడే సమస్య మొదలవుతుంది. సమస్త అధికార సౌధాలూ ఒకేచోట ఉండాలని నిర్ణయించి అందుకోసం బృహత్తరమైన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూనుకుంది. అందులో నూతన పార్లమెంటు భవనం ఒకటి. పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణిస్తారు. దేశ పౌరుల ప్రయోజనాలు, భద్రతతో ముడిపడివుండే అనేక అంశాలు అక్కడ చర్చకొస్తాయి. చట్టాలు రూపొందుతాయి. ప్రతి పక్షం ఏమి ఆశిస్తున్నదో ప్రభుత్వం తెలుసుకోవటం, ప్రభుత్వ వైఖరేమిటో విపక్షాలు గ్రహించటం ఎక్కడో ఒకచోట రెండు పక్షాలూ అంగీకారానికి రావటం ప్రజాస్వామ్యానికి శోభనిస్తుంది. లేదంటే పరస్పరం విభేదించుకోవటానికైనా ఆ పక్షాల మధ్య అంగీకారం కుదరాలి. ఇవేమీ లేకుండా ఎప్పుడూ కత్తులు నూరుకోవటమే, ఎదుటి పక్షంపై పైచేయి సాధించటమే ధ్యేయంగా మారితే అలాంటిచోట ప్రజాస్వామ్యం బతికి బట్టగడుతుందా? అందుకే బహిష్కరణ నిర్ణయం ఎలాంటి సందేశం పంపుతుందో విపక్షాలు ఆలోచించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తున్న దనో, దాని నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయనో విమర్శిస్తే, నిలదీస్తే అర్థం చేసుకోవచ్చు. అడపా దడపా విపక్షాలు ఆ పని చేస్తూనే ఉన్నాయి. నూతన సౌధాన్ని రాష్ట్రపతి ప్రారంభించటమే సరైందన్న తమ అభిప్రాయాన్ని ప్రజలముందుకు తీసుకువెళ్లటంలో కూడా తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఆ వాదనను ఆమోదించటమో, తిరస్కరించటమో ప్రజలు తేల్చుకుంటారు. జనం తీర్పుకే దాన్ని విడిచిపెట్టి యధావిధిగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటే విపక్షాల హుందాతనం వెల్లడయ్యేది. ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంటు నూతన సౌధం సమకూర్చుకోవటం ఎంతో ప్రాముఖ్యతగల ఘట్టమని విపక్షాలే ప్రకటించివున్నాయి. మరి అటువంటి ముఖ్య ఘట్టానికి ముఖం చాటేయటం ఏం సబబన్న విజ్ఞత వాటికి ఉండొద్దా? స్వాతంత్య్ర వచ్చిన తొలినాళ్లలో పార్లమెంటుతోపాటు రాష్ట్రాల్లోని చట్టసభలన్నిటా పరిణత చర్చలు జరిగేవి. ఆరోగ్యకరమైన విధా నాలూ, సంప్రదాయాలూ అమలయ్యేవి. కానీ రాను రాను అవి బలప్రదర్శనలకు వేదికలవుతు న్నాయి. నేలబారు రాజకీయాలే దర్శనమిస్తున్నాయి. మొన్న మార్చిలో రూ. 45 లక్షల కోట్ల విలువైన కేంద్ర బడ్జెట్ లోక్‌సభలో ఎలాంటి చర్చా లేకుండా గిలెటిన్‌తో ముగిసిపోయిందని గుర్తుంచుకుంటే మన పార్లమెంటు ఎలాంటి దుఃస్థితిలో పడిందో అర్థమవుతుంది. అదానీ వ్యవహారంపై దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటుకు అంగీకరించాలని విపక్షాలూ... దేశ వ్యవ హారాల్లో విదేశీ జోక్యం కోరినందుకు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అధికార పక్షమూ పట్టుబట్టడంతో బడ్జెట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. కనీసం కొత్త పార్లమెంటు భవనంలోనైనా అధికార, విపక్షాలు సరికొత్త ఒరవడికి నాంది పలుకుతాయనుకుని భ్రమించిన వారికి విపక్షాల బహిష్కరణ పిలుపు నిరాశ మిగిల్చింది. పార్లమెంటుపై రాజ్యాంగ నిర్ణాయక సభలో చర్చ జరిగినప్పుడు దాన్ని కేవలం రెండు చట్టసభల సముదాయంగా మాత్రమే పరిగణించటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. దేశంలో మున్ముందు చోటుచేసుకోవాల్సిన సామాజిక, ఆర్థిక మార్పులకు దాన్నొక సాధనంగా రాజ్యాంగ నిర్మాతలు పరిగణించారు. ఈ లక్ష్యసాధనలో పార్లమెంటు విఫలమైతే దేశంలో అశాంతి ప్రబలుతుందని కూడా హెచ్చరించారు. కానీ వర్తమాన రాజకీయ నేతలకు అదేమీ గుర్తున్నట్టు లేదు. వారు ఎదుటి పక్షాన్ని శత్రువుగానే భావిస్తున్నారు. అంతకుముందు సంగతెలావున్నా గత పదేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. ప్రజాస్వామ్యానికి ఈ మాదిరి వైఖరి తోడ్పడుతుందో, దాన్ని కడతేరుస్తుందో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ఇరుపక్షాలూ పరిణతితో మెలగాలి. దేశ ప్రజల విశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి. అలిగిన విపక్షాలను ఒప్పించేందుకు, వాటిని కలుపుకొని పోయేందుకు బీజేపీ ప్రయత్నించాలి. తమ అభ్యంతరాల అంతస్సారం ప్రజల్లోకి వెళ్లింది గనుక అంతకుమించటం మితిమీరడంతో సమానమవుతుందని విపక్షాలు గుర్తించాలి. ప్రజాస్వామిక స్ఫూర్తిని విస్మరించటం సరికాదని గ్రహించాలి. -
India new parliament building: ప్రారంభ ‘గౌరవం’పై.. పెను దుమారం
పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ తీవ్ర రూపు దాలుస్తోంది. కొత్త భవన ప్రారంభోత్సవం ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుండటం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగాధిపతి, దేశాధిపతి, ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని కాదని ప్రధాని ఎలా ప్రారంభిస్తారంటూ ముక్త కంఠంతో ఆక్షేపిస్తున్నాయి. భవనాన్ని ప్రారంభించాల్సిందిగా మోదీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆహ్వానించడంపై మండిపడుతున్నాయి. అంతేగాక వి.డి.సావర్కర్ వంటి హిందూత్వవాది జయంతి రోజునే ప్రారంభోత్సవం జరపనుండటాన్ని కూడా విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని ఒకే వర్గానికి పరిమితయ్యే రోజున చేయనుండటం తప్పేనని వాదిస్తున్నాయి. దాంతో ఈ వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. చివరికి పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్‌తో సహా ఏకంగా 19 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించే దాకా వెళ్లింది. 2024 లోక్‌సభ ఎన్నికలు అంతకంతకూ సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీపై నిర్ణాయకమైన సమైక్య పోరుకు పార్లమెంటు భవనం అంశంతోనే శ్రీకారం చుట్టే యోచనలో విపక్షాలున్నట్టు కనిపిస్తోంది. మొత్తమ్మీద జాతీయ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకునే వాతావరణం కనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏడాది ముందే ఎన్నికల వేడి రాజుకుంటోందనేందుకు దీన్ని స్పష్టమైన సూచికగా భావిస్తున్నారు. ప్రతిపక్షాల అభ్యంతరాలేంటి..? పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతే ప్రారంభించాలని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. అవేమంటున్నాయంటే... ► ఆర్టికల్ 79 ప్రకారం ఉభయ సభలైన లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతి కలిస్తేనే పార్లమెంటు. ► సాధారణంగా అంతా రబ్బరు స్టాంపుగా పరిగణించే భారత రాష్ట్రపతి పదవికి రాజ్యాంగం అంతటి ప్రాధాన్యం కట్టబెట్టింది. ► ఉభయ సభలకు అధిపతి గనుక దేశ ప్రథమ పౌరుని హోదాలో కొత్త భవనాన్ని ప్రారంభించే హక్కు కచ్చితంగా రాష్ట్రపతిదే. ► ఎందుకంటే ప్రధాని పార్లమెంటు లోని ఒక అంగమైన లోక్‌సభకు మాత్రమే నేతృత్వం వహిస్తారు. ► ఆ కోణం నుంచి చూస్తే రాజ్యాంగపరంగా కూడా పార్లమెంటు భవనాన్ని ప్రధాని ఆవిష్కరించడానికి వీల్లేదు. ► ఏటా పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించే అధికారం, సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం ఆర్టికల్ 87 ప్రకారం రాష్ట్రపతిదే. ► పార్లమెంటు ఆమోదించే బిల్లులన్నీ ఆర్టికల్ 111 మేరకు రాష్ట్రపతి సంతకంతో మాత్రమే చట్ట రూపం దాలుస్తాయి. ► అలాంటప్పుడు రాష్ట్రపతిని ఉద్దేశపూర్వకంగా విస్మరించడం అధికార బీజేపీ అహంకారానికి, లెక్కలేనితనానికి తాజా నిదర్శనం. గతానుభవాలు ఏం చెబుతున్నాయి? ఇలాంటి విషయాల్లో నిర్దిష్టంగా ఇలా వ్యవహరించాలంటూ నియమ నిబంధనలేవీ లేవు. కాకపోతే గత ప్రధానులు తమ వ్యవహార శైలి ద్వారా వీటి విషయమై చక్కని సంప్రదాయాలను నెలకొల్పి ఉంచారన్నది విపక్షాలు చెబుతున్న మాట. వారిలో కేంద్రం బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహించిన వాజ్‌పేయి కూడా ఉన్నారని గుర్తు చేస్తున్నాయి. ఆ సంప్రదాయాలను పాటించడం విజ్ఞత అనిపించుకుంటుందని అవి అభిప్రాయపడుతున్నాయి. విపక్షాలు ఏమంటున్నాయంటే... నాడు ‘గాంధీ’ గిరి.. లోక్‌సభ సచివాలయమైన ‘పార్లమెంట్ హౌస్ ఎస్టేట్’ ప్రచురణల రికార్డుల ప్రకారం పార్లమెంటు అనుబంధ భవన నిర్మాణానికి 1970 ఆగస్టు 3న నాటి రాష్ట్రపతి వి.వి.గిరి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయ్యాక భవనాన్ని 1975 అక్టోబర్ 24న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. అంటే రెండు కార్యక్రమాలుగా ఇద్దరూ పంచుకున్నారు. అలా చూసినా పార్లమెంటు కొత్త భవన నిర్మాణానికి 2020 డిసెంబర్ 10న మోదీ భూమి పూజ చేశారు. కనుక ప్రారంభోత్సవం రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా జరగాలన్నది విపక్షాల వాదన. వాజ్‌పేయిదీ అదే బాట... 2002లో వాజ్‌పేయి హయాంలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు లైబ్రరీ భవనాన్ని నాటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ ప్రారంభించారు. లోక్‌సభ సచివాలయం సంప్రదాయాల ప్రకారం భవనాన్ని ప్రారంభించాల్సిందిగా రాష్ట్రపతినే స్పీకర్ ఆహ్వానించారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తూ పార్లమెంటు కొత్త భవనాన్ని రాష్ట్రపతే ప్రారంభించాలన్నది విపక్షాల డిమాండ్. ‘‘2002లో కేంద్రంలో ఉన్నది మీ బీజేపీ ప్రభుత్వమే. వాజపేయి ప్రధాని హోదాలో రాష్ట్రపతి పదవికి అలాంటి గౌరవమిచ్చారు. కనీసం దీన్నుంచైనా మోదీ నేర్చుకోవాలి’’ అని మోదీకి విపక్ష నేతలు హితవు పలుకుతున్నారు. అలాంటి అవమానాలు వద్దు రాష్ట్రపతి కేవలం దేశ ప్రథమ పౌరుడు మాత్రమే కాదు. ఆర్టికల్ 53 ప్రకారం త్రివిధ బలగాలకు సుప్రీం కమాండర్. మోదీ చేయ బోతున్న పని అక్షరాలా అలాంటి దేశ అత్యున్నత పదవిని విస్మరించించడం, కించపరచడమేనని విపక్షాలంటున్నాయి. రాష్ట్రపతిని ఇలా అవమాని స్తుంటే సహించేది లేదంటూ గట్టిగా హెచ్చరిస్తున్నాయి. రాష్ట్రపతినిలా న్యూనత పరచడం మోదీకి కొత్తేమీ కాదంటూ గత ఉదంతాలను గుర్తు చేస్తు న్నాయి. ‘‘2019 ఫిబ్రవరి 25న ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్‌ను ప్రధాని హోదాలో మోదీయే ప్రారంభించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కార్యక్రమానికి దూరం పెట్టి ఘోరంగా అవమానించారు. గణతంత్ర పరేడ్‌లో త్రివిధ బలగాల నుంచి రాష్ట్రపతే గౌరవ వందనం స్వీకరిస్తారు. యుద్ధంలో వీరమరణం పొందే సైనిక యోధులకు వీర చక్ర, అశోక చక్ర వంటి గౌరవ పురస్కారాలనూ ఆయనే ప్రదానం చేస్తారు. అలాంటిది యుద్ధ వీరుల జ్ఞాపకార్థం నిర్మించిన వార్ మెమోరియల్ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతికి భాగస్వామ్య మే లేకుండా చేయడం అతి పెద్ద తప్పిదం. మోదీ లెక్కలేనితనానికి ఇది రుజువు’’ అంటూ మండిపడుతున్నాయి. కనీసం ఇప్పుడైనా అలాంటి తప్పిదాన్ని పునరావృతం చేయొద్దని సూచిస్తున్నాయి. కేంద్రం ఏమంటోంది.? ఎటుపోయి ఎటొస్తుందోనని పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ రగడపై ఇప్పటిదాకా నోరు మెదపని బీజేపీ నేతలు ఇప్పుడిక తప్పనిసరై ఒక్కోలా స్పందిస్తున్నారు. బహిష్కరణ నిర్ణయంపై విపక్షాలు పునరాలోచించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అనునయించే ధోరణిలో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం, ‘కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించాం. రావడం, రాకపోవడమన్నది వారి విజ్ఞతకే వదిలేస్తాం’ అంటూ కుండబద్దలు కొట్టడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది ప్రధాని కాదు: రాహుల్ గాంధీ
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. కాగా, నూతన పార్లమెంట్ భవనాన్ని ఈనెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం, రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, రాహుల్ ట్విట్టర్ వేదికగా.. ‘కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలి. ప్రధానమంత్రి కాదు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై స్పందించింది. అదే రోజున వీడీ సావర్కర్ జయంతి. కేంద్రం చర్య జాతి నిర్మాతలను అవమానించడమేనని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా, అంతకుముందు.. పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడంపై ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ప్రధాని పార్లమెంట్‌ను ప్రారంభించడమేంటని ప్రశ్నించారు. ప్రధాని కార్యనిర్వహక వర్గానికి అధిపతి అని, రాజ్యాంగం ప్రకారం అధికారాల విభజన స్పష్టంగా ఉందన్నారు. పార్లమెంట్‌కు అధిపతులు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అని, వారితో పార్లమెంట్‌ను ప్రారంభించవచ్చన్నారు. नए संसद भवन का उद्घाटन राष्ट्रपति जी को ही करना चाहिए, प्रधानमंत्री को नहीं! — Rahul Gandhi (@RahulGandhi) May 21, 2023 Why should PM inaugurate Parliament? He is head of the executive, not legislature. We have separation of powers & Hon’ble @loksabhaspeaker & RS Chair could have inaugurated. It’s made with public money, why is PM behaving like his “friends” have sponsored it from their private… https://t.co/XmnGfYFh6u — Asaduddin Owaisi (@asadowaisi) May 19, 2023 ఇది కూడా చదవండి: కవిత అరెస్ట్ మా చేతుల్లో లేదు: కిషన్‌రెడ్డి సంచలన కామెంట్స్ -
అదానీపై విచారణ డిమాండ్‌తో... ఈడీ ఆఫీసుకు విపక్షాల ర్యాలీ
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు అవకతవకలపై ఈడీతో లోతుగా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ విపక్ష పార్టీలు సమైక్యంగా కదం తొక్కాయి. ఈ ఉదంతంపై ఈడీకి ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు 18 విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో పార్లమెంటు భవనం నుంచి ఈడీ ప్రధాన కార్యాలయం వైపు ర్యాలీగా బయల్దేరారు. ఈడీ కార్యాలయానికి వెళ్తున్న ఎంపీలను మార్గమధ్యంలోనే విజయ్ చౌక్ సమీపంలో పోలీసులు అడ్డుకుని ముందుకు వెళ్లకుండా నిలువరించారు. బారికేడ్లతో రోడ్లను మూసేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ర్యాలీని అనుమతించబోమని చెప్పారు. దీనిపై నేతలంతా మండిపడ్డారు. అదానీపై విచారణ కోరుతూ ఈడీకి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే మోదీ సర్కారు నిరంకుశంగా అడ్డుకుందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. దాదాపు 200 మంది ఎంపీల శాంతియుత ర్యాలీని అమానుషంగా అడ్డుకున్నారంటూ దుయ్యబట్టారు. అనంతరం ఎంపీలంతా పార్లమెంటు ప్రాంగణానికి వెనుదిరిగారు. ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు పాల్గొనకపోవడం విశేషం. అంతకుముందు తృణమూల్ విడిగా ఎల్పీజీ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం ముందు ధర్నా చేసింది. -
మీ త్యాగాన్ని జాతి మరువదు
న్యూఢిల్లీ: 2001లో పార్లమెంట్‌పై ఉగ్ర దాడి ఘటనలో నేలకొరిగిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా జాతి యావత్తూ మంగళవారం నివాళులర్పించింది. పార్లమెంట్ భవనం వెలుపల జరిగిన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అన్ని పార్టీల ఎంపీలు ఘనంగా నివాళులర్పించారు. 2001 పార్లమెంట్ దాడి ఘటనలో వీరమరణం పొందిన వారికి జాతి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాష్ట్రపతి ముర్ము అనంతరం ట్వీట్ చేశారు. దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వారి త్యాగాన్ని, ధైర్యసాహసాలను ఎన్నడూ మరువబోమని ప్రధాని మోదీ ట్విట్టర్లో తెలిపారు. ఘనంగా నివాళులర్పించిన రాజ్యసభ అంతకుముందు, పార్లమెంట్‌పై దాడి ఘటనలో ప్రాణాలర్పించిన వారికి రాజ్యసభ నివాళులర్పించింది. సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నిలబడి మౌనం పాటించారు. సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాయ్ మాట్లాడారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో డిసెంబర్ 13వ తేదీ ఎప్పటికీ విషాదకరమైన రోజుగానే గుర్తుండిపోతుందన్నారు. 2001 డిసెంబర్ 13వ తేదీన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థలకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంట్ వద్ద కాల్పులకు తెగబడ్డారు. పార్లమెంట్ భవనంలోకి చొచ్చుకుపోయేందుకు వారు చేసిన యత్నాన్ని బలగాలు తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ మహిళా జవాను ఒకరు, పార్లమెంట్ సిబ్బంది ఇద్దరు, జర్నలిస్ట్ ఒకరు ప్రాణాలు కోల్పోగా భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాదులందరూ హతమయ్యారు. -
‘పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలి’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తోన్న పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బి.ఆర్.అంబేడ్కర్ పేరు పెట్టాలని ప్రజాగాయకుడు గద్దర్ కోరారు. ఈ మేరకు ఆలిండియా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర చైర్మన్ మహేశ్‌రాజ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవితో కలిసి గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. రేవంత్ స్పందిస్తూ గద్దరన్న వినతిపై కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ కమిటీ నివేదికపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయి అఖిలపక్షం తీర్మానాన్ని సోనియాగాంధీకి అందజేస్తానని, పార్లమెంటులో ఈ అంశంపై చర్చ జరిగి నూతన పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టేలా కృషి చేస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: బీజేపీవి వేషాలు.. టీఆర్ఎస్ది అతి తెలివి: రేవంత్ రెడ్డి -
శతమానం భారతి: కొత్త పార్లమెంట్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12 కంటే నాలుగు రోజులు ముందుగానే ముగిశాయి. ఈ సమావేశాల్లోనే కొత్త బిల్లులు ఆమోదం పొందాయి. దేశానికి కొత్త రాష్ట్రపతి వచ్చారు. కొత్త ఉపరాష్ట్రపతి వచ్చారు. ఇక మిగిలింది కొత్త పార్లమెంటు! రానున్న శీతాకాల సమావేశాలను కొత్త పార్లమెంటు భవనంలో నిర్వహిం చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రు. 13,450 కోట్ల అంచనాతో మోదీ ప్రభుత్వం తలపెట్టిన ‘సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టు’లో భాగంగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణం జరిగింది. ప్రాజెక్టులోని మొత్తం నిర్మాణాలు 2026 నాటికి పూర్తి చెయ్యాలన్న సంకల్పంతో సెంట్రల్ విస్టా పనులు జరుగుతున్నాయి. చదవండి: ఉళ్లాల రాణి అబ్బక్క.. ఐదు యుద్ధాల విజేత ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న కొత్త పార్లమెంటు భవనంపై దేశ జాతీయ చిహ్నమైన అశోకస్తంభం ఆవిష్కరణ ఇటీవలే జరిగింది. ప్రధాని మోదీ సూచించిన విధంగా నవ, స్వయం సమృద్ధ భారతదేశపు మౌలిక ఆలోచనా విధానాలను ప్రతిబింబించే రీతిలో ఈ కొత్త పార్లమెంటు భవన నిర్మాణం జరిగింది. ఈ నేపథ్యంలోనే జూలై 11న మోదీ అక్కడ అశోక స్తంభాన్ని ఆవిష్కరించారు. కాంస్యంతో తయారు చేసిన ఈ జాతీయ చిహ్నం 21 అడుగుల పొడవు, 9500 కిలోల బరువు, 3.3–4.3 మీటర్ల చుట్టు కొలతతో ఉంటుంది. నవ భారతం ఆకాంక్షలు ఇకపై ఈ కొత్త పార్లమెంటు ద్వారా నెరవేరనున్నాయి. భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాల పరిరక్షణ దిశగా జాతీయ చిహ్నం ఉత్తేజం ఇస్తూ ఉంటుంది. అమృతోత్సవాల ముగింపు నాటికి కాస్త ముందే నిర్మాణం పూర్తి చేసుకున్న కొత్త పార్లమెంటు భవనం.. భారత్ పురోగతికి ఒక ముందడుగు సంకేతంగా భాసిల్లుతోంది. -
Iraq: పార్లమెంట్లో నిరసనకారుల రచ్చ
బాగ్దాద్: నిరసనకారుల రంగప్రవేశంతో ఇరాక్ పార్లమెంట్ భవనం దద్దరిల్లిపోయింది. ఇరాన్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు నిరసనకారులు. భవనంలోని ప్రతీ గదిలోకి దూసుకెళ్లి.. ఇరాకీ జెండాలతో రచ్చ రచ్చ చేశారు. ఇరాక్ రాజకీయ-ఆర్థిక సంక్షోభాలను కారణాలుగా చూపిస్తూ.. మాజీ మిలిటెంట్, ప్రస్తుత మతపెద్ద మోఖ్వాతదా సద్ర్ మద్దతుదారులు ఈ చేష్టలకు దిగారు. ఇరాక్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు ఏడాది కావస్తున్నా.. కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు. ఈ క్రమంలో.. కోఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్ బ్లాక్ తరపున మహ్మద్ అల్-సుడానీ అధికారికంగా ప్రధాని పదవికి నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న ఇరాకీ మతపెద్ద, ఇరాకీ షీతే నిర్వాహకుడు మోఖ్వాతదా సద్ర్‌కు చెందిన మద్దతుదారులు వందల మంది ఒక్కసారిగా పార్లమెంట్‌లోకి దూసుకొచ్చారు. హై సెక్యూరిటీ జోన్ దాటుకుని.. అల్-సుడానీ నామినేషన్ సంగతి తెలుసుకున్న మోఖ్వాతదా మద్దతుదారులు.. పార్లమెంట్ భవనం వైపు దూసుకొచ్చారు. రాజధాని బాగ్దాద్‌లో ఉన్న హై సెక్యూరిటీగా పేర్కొనే గ్రీన్ జోన్‌ను దాటుకుని.. ముందుకొచ్చారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించినా లాభం లేకుండా పోయింది. ఇక పార్లమెంట్ భవనం వద్ద ఆ టైంలో కొద్దిమంది మాత్రమే సెక్యూరిటీ గార్డులు ఉండగా.. వాళ్లు భయంతో ప్రతిఘటించకుండా నిరసనకారుల్ని లోపలికి అనుమతించారు. బెంచ్‌ల ఎక్కి.. పార్లమెంట్ భవనంలో టేబుళ్ల మీద నడుస్తూ.. నానా రభస సృష్టించారు నిరసనకారులు. ఇరాన్‌కు శాపనార్థాలు పెడుతూ.. ఇరాకీ జెండాలు ప్రదర్శించారు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి విధ్వంసానికి పాల్పడలేదు నిరసనకారులు. రాజకీయంగానే కాదు.. చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలోనూ ఇరాక్ లాంటి చమురు ఆధారిత దేశం ఆర్థికంగా దిగజారిపోతోందని నిరసనకారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో.. ఇరాన్ అనుకూల వ్యక్తి ప్రధాని పదవి చేపట్టేందుకు తాము ఒప్పుకోబోమని అంటున్నారు. ఇక నిరసకారులు తక్షణమే బయటకు వచ్చేయాలంటూ ప్రధాని ముస్తఫా అల్-కధెమి పిలుపు ఇచ్చారు. దౌత్యపరమైన ఇబ్బందులూ తలెత్తే అవకాశం ఉంటుందని, అది గమనించాలని నిరసనకారులకు పిలుపు ఇచ్చాడు ఆయన. రాజకీయ సంక్షోభం మాజీ ఉగ్రవాది, ఇరాకీ మతపెద్ద మోఖ్వాతదా సద్ర్‌కు చెందిన విభాగం.. 2021 అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 329 సీట్లకుగానూ 73 స్థానాలు గెల్చుకుంది. అయితే అప్పటి నుంచి ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో తాజాగా ప్రధాని నామినేషన్ వేయడానికి వెళ్లిన మహ్మద్ అల్-సుడానీ మాజీ మంత్రి, మాజీ గవర్నర్ కూడా. అయితే.. ఆయన ఇరాన్ అనుకూల వ్యక్తి అని, అక్కడి పార్టీల మద్దతు కూడా ఉందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం ఒత్తిడి పెంచే క్రమంలో సద్ర్ తీసుకున్న ఓ నిర్ణయం బెడిసి కొట్టింది. తన బ్లాక్‌కు చెందిన 73 మంది చట్ట సభ్యులు రాజీనామా చేశారు. దీంతో 63 మంది కొత్త చట్ట సభ్యులు మొన్న జూన్‌లో ప్రమాణం చేయగా.. ఇరాన్ అనుకూల ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. -
కొత్త పార్లమెంట్: రోమాలు నిక్కబొడిచేలా.. నాలుగు సింహాల చిహ్నం
New Parliament building.. దేశంలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ భవన నిర్మాణాన్ని చేపట్టింది. ఈ భవన నిర్మాణాన్ని అక్టోబర్‌లోగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కాగా, ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా పార్లమెంట్ భవనంపై అశోక స్థంభాన్ని(నాలుగు సింహాలతో) ఆవిష్కరించారు. కాగా, జాతీయ చిహాన్ని కాంస్యంతో తయారు చేశారు. 9,500 కిలోల బరువు, 6.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ కార్యక్రమంలో మోదీతో పాటుగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. కొత్త పార్లమెంట్ భవనం స్పెషల్ ఇదే.. - కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం రూ.971 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా ఈ ఖర్చు 29 శాతం పెరిగి రూ. 1,250 కోట్లకు చేరుకున్నట్టు తెలుస్తోంది. 13 ఎకరాల విస్తీర్ణంలో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వాస్తు రీతులు, సాంస్కృతిక వైవిద్యం కొత్త పార్లమెంట్లో కనిపించనుంది.దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా కళాకారులు భవన నిర్మాణంలో పని చేస్తన్నారు. - ఈ ప్రాజెక్ట్ డిజైన్‌ను హెచ్సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్(టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్) రూపొందించనున్నారు. - కొత్త పార్లమెంట్ భవనంలోని ఆరు ప్రవేశ మార్గాలు ఉన్నాయి. 1. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, 2. లోక్‌సభ సభాపతి, రాజ్యసభ చైర్పర్సన్, ఎంపీలు, 3. సాధారణ ప్రవేశ మార్గం, 4. ఎంపీల కోసం మరొక ప్రవేశ మార్గం, 5,6. పబ్లిక్ ఎంట్రన్స్‌లుగా నిర్ణయించారు. కాగా.. లోక్‌సభ ఛాంబర్లో 888 సీట్లు ఉంటాయి. దీని మొత్తం వైశాల్యం 3,015 చదరపు మీటర్లు ఉండనుంది. రాజ్యసభ చాంబర్లో 384 సీట్లు ఉంటాయి. దీని వైశాల్యం 3,220 చదరపు మీటర్లు ఉండనుంది. భూకంపాలను సైతం తట్టుకునే విధంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. Hon’ble PM Shri @narendramodi ji unveiled the 'National Emblem' cast at New Parliament Building. सत्यमेव जयते। 🇮🇳 pic.twitter.com/b2VOPkFHAx — Darshana Jardosh (@DarshanaJardosh) July 11, 2022 -
దక్షిణాఫ్రికా ‘పార్లమెంట్’లో అగ్ని ప్రమాదం
కేప్ టౌన్: కేప్‌టౌన్‌లోని దక్షిణాఫ్రికా పార్లమెంట్ భవన సముదాయంలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలున్న పురాతన పార్లమెంట్ భవనం మూడో అంతస్తులో మొదటగా మంటలు ప్రారంభమయ్యాయి. అనంతరం అగ్ని కీలలు పక్కనే ఉన్న ప్రస్తుత పార్లమెంట్ నేషనల్ అసెంబ్లీ భవనానికి వ్యాపించాయి. పార్లమెంట్ కార్యాలయ భవనం పైకప్పు కూలింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారని మంత్రి పాట్రీసియా చెప్పారు. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయా లేదా విద్రోహ చర్యా అనేది ఇప్పుడే చెప్పలేమని పార్లమెంట్ స్పీకర్ నొసివివే అన్నారు. అగ్ని కీలల వేడికి ఆ కాంప్లెక్స్‌లోని మిగతా భవనాలు దెబ్బతినడంతోపాటు, అందులోని కళాఖండాలు ధ్వంసమయ్యే ప్రమాదముందని మంత్రి పాట్రీసియా ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన ప్రాంతాన్ని అధ్యక్షుడు సిరిల్ రమఫోసా సందర్శించారు. ఘటనకు సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మంటలు మొదట ప్రారంభమైన పార్లమెంట్ పాత భవనం 1880ల నాటిది కాగా, దాని వెనుక ఉన్న నేషనల్ అసెంబ్లీ భవనం ఇటీవలి కాలంలో నిర్మించింది. కాగా, దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయి. కేప్‌టౌన్ నగరం లెజిస్లేటివ్ రాజధాని కాగా, ప్రిటోరియా పరిపాలన కేంద్రంగా, బ్లోమ్ ఫోంటెన్ న్యాయ రాజధానిగాను ఉన్నాయి. #BREAKING: Firefighters are battling a large fire that has ripped through the Houses of Parliament in Cape Town, South Africa "There have been reports of some walls showing cracks, which could indicate a collapse” Jermaine Carelse, of CT fire servicepic.twitter.com/LZTNH0Dzmu — Stefan Simanowitz (@StefSimanowitz) January 2, 2022 -
కొత్త పార్లమెంట్ కాంట్రాక్టు టాటాలకే
న్యూఢిల్లీ: కొత్తగా కట్టే పార్లమెంట్ భవనాల నిర్మాణ బాధ్యతలను టాటా ప్రాజెక్ట్స్ బుధవారం గెలుచుకుంది. కొత్తగా పార్లమెంట్ భవన సముదాయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకొని బిడ్లు ఆహ్వానించింది. ఇందుకోసం టాటా ప్రాజెక్ట్స్ రూ. 861.90 కోట్లతో బిడ్‌వేయగా, ఎల్అండ్టీ రూ. 865 కోట్లకు బిడ్ ధాఖలు చేసింది. దీంతో ప్రాజెక్టును టాటాలకు ఖరారు చేశారు. ప్రస్తుత పార్లమెంట్‌కు దగ్గరోనే సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద కొత్త భవనాలు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ సెక్రటేరియట్ భవనం నిర్మించడమే కాకుండా రాజ్‌పథ్ రోడ్‌ను మెరుగుపరుస్తారు. అంతేకాకుండా ప్రధాని నివాసం, కార్యాలయాలను సౌత్‌బ్లాక్ దగ్గరకు, ఉపరాష్ట్రపతి నూతన నివాసాన్ని నార్త్‌బ్లాక్ దగ్గరలోకి మారతాయి. గుజరాత్‌కు చెందిన హెచ్సీపీ సంస్థ ప్రాజెక్టు నిర్మాణాల ఆర్కిటెక్చర్‌ను సమకూరుస్తోంది. ప్రాజెక్టు కోసం ప్రస్తుత ఉపరాష్ట్రపతి నివాస బంగ్లా, ఉద్యోగ భవన్, కృషి భవన్, శాస్త్రీ భవన్ తదితరాలను కూల్చనున్నారు. 21 నెలల్లో పార్లమెంట్ నిర్మాణం పూర్తవుతుందని అంచనా. అయితే ఇంకా నిర్మాణ ఆరంభ తేదీని నిర్ణయించలేదు. పార్లమెంట్ హౌస్ ఎస్టేట్‌లోని ప్లాట్ నంబర్ 118లో ఈ భవన నిర్మాణం జరుగుతుందని సీపీడబ్లు్యడీ తెలిపింది. కొత్త భవనాలు పూర్తయ్యేవరకు పాత భవనాల్లోనే కార్యకలాపాలు కొనసాగిస్తారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల సంఖ్య పెరుగనుంది. కొత్త పార్లమెంట్ భవనంలో దాదాపు 1400 మంది ఎంపీలు కూర్చునే వీలుంటుంది. ఈ ప్రాజెక్టు చేపట్టే ప్రాంతం ల్యూటెన్ ఢిల్లీలో ఉంది. -
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై స్టేకు నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని లుటియెన్స్ జోన్లో కొత్త పార్లమెంట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించే సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిలిపివేయాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురవారం కొట్టివేసింది. ‘ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఇప్పటికే ఒక పిటిషన్ పెండింగ్‌లో ఉంది. కరోనా వైరస్(కోవిడ్-19) వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇది అత్యవసరం కాదు’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ఏ బాబ్డే స్పష్టం చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పేరుతో పార్లమెంటు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన విషయం తెలిసిందే. కేంద్రం రెండు వేల కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణానికి వ్యతిరేకంగా పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం భూ వినియోగ మార్పిడి చేస్తూ రీ డెవలప్మెంట్ ప్లాన్ చేసింది. కేంద్రం చేసిన భూ వినియోగ మార్పిడిని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా ఈ పిటిషన్‌పై గురువారం సుప్రీకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఐ బాబ్డే, జస్టిస్ అనిరుద్ద బోస్‌ల ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చెపట్టింది. ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్‌ను నిర్మిస్తున్నప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు. పిటిషనర్ల వాదనలు విన్న సుప్రీంకోర్టు కొత్త పార్లమెంటు నిర్మాణం ప్రాజెక్టుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. -
అధికార పీఠాల్లో మార్పులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా పునః అభివృద్ధి ప్రణాళిక వివరాలు ఒక్కటొక్కటిగా వెల్లడవుతున్నాయి. శతాబ్దాల చరిత్రగల ల్యూటెన్స్ ఢిల్లీలో సరికొత్త పార్లమెంటు భవనంతోపాటు సెంట్రల్ సెక్రటేరియట్, మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గత ఏడాది డిజైన్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. హెచ్సీపీ డిజైన్స్ అనే గుజరాతీ సంస్థ డిజైన్, కన్సల్టెన్సీ, ఇంజినీరింగ్ ప్లానింగ్ హక్కులు సాధించుకుంది. మొత్తం ప్రాజెక్టు ఫీజు రూ. 229.75 కోట్లు కాగా.. నిర్మాణ వ్యయం రూ. 12,879 కోట్లు అని అంచనా. హెచ్సీపీ సంస్థ మాస్టర్ ప్లాన్‌తోపాటు డిజైన్లు, నిర్మాణ వ్యయం, ల్యాండ్‌స్కేపింగ్, ట్రాఫిక్, పార్కింగ్ వంటి అంశాలపై నివేదిక ఇవ్వనుంది. ఈ మెగా ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు...సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రధానమంత్రి నివాసాన్ని, కార్యాలయాన్ని సౌత్‌బ్లాక్‌కు దగ్గరగా మార్చనున్నారు. అలాగే ఉపరాష్ట్రపతి కోసం నార్త్ బ్లాక్ పరిసరాల్లో కొత్తగా ఒక ఇంటిని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి నివాసం ఉన్న భవనాన్ని కూల్చి వేయనున్నారు. రాష్ట్రపతి భవన్, ఇండియాగేట్‌ల మధ్య ఉన్న మూడు కిలోమీటర్ల పొడవైన రాజ్‌పథ్‌లో కొత్త నిర్మాణాలు జరపాలన్నది హెచ్సీపీ ప్రణాళిక. ప్రస్తుత పార్లమెంటు భవనం పక్కనే త్రికోణాకారంలో ఉండే సరికొత్త పార్లమెంటు భవనం, సెంట్రల్ సెక్రటేరియట్లు ఇక్కడ నిర్మాణమవుతాయి. స్వాతంత్య్రం 75వ వార్షికోత్సవాల సందర్భంగా అంటే 2022 ఆగస్టు నాటికి కొత్త పార్లమెంటు భవనాన్ని సిద్ధం చేయాలన్నది లక్ష్యం. కామన్ సెక్రటేరియట్‌ను 2024 నాటికల్లా అందుబాటులోకి తెస్తారు. ప్రధాని, ఉప రాష్ట్రపతి ఇళ్లను సౌత్, నార్త్ బ్లాక్‌లకు దగ్గరగా మార్చడం వల్ల వీఐపీల కోసం ట్రాఫిక్‌ను ఆపాల్సిన అవసరం తగ్గనుంది. పైగా ప్రధాని ఇల్లు, కార్యాలయం దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాని ఇంటి నుంచి కార్యాలయానికి నడిచి వెళ్లేందుకూ అవకాశం ఉంటుంది. 8 భవనాలుగా సెంట్రల్ సెక్రటేరియట్.. కొత్త సెంట్రల్ సెక్రటేరియట్లో.. సెంట్రల్ విస్టాకు ఇరువైపులా నాలుగు భవనాల చొప్పున మొత్తం ఎనిమిది భవనాలు ఉంటాయి. ఒక్కో భవనంలో ఎనిమిది అంతస్తుల్లో వేర్వేరు మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటవుతాయి. మంత్రిత్వశాఖల్లో సుమారు 25 నుంచి 32 వేల మంది ఉద్యోగులు ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తున్నారు. ఆయా శాఖల కార్యాలయాల కోసం ఏటా రూ.వెయ్యి కోట్లు అద్దెల కోసమే చెల్లిస్తున్నట్లు అంచనా. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం పూర్తయితే అద్దె ఆదా అవడమే కాకుండా ఉద్యోగులందరూ ఒకే చోట పనిచేస్తారు. -
పార్లమెంటులో పార్టీ కార్యాలయాల కేటాయింపు
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంటులోని వివిధ రాజకీయ పార్టీలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయాలను కేటాయించారు. మొత్తం పదిహేను పార్టీలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో గదులు కేటాయించారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఉత్వర్వులు జారీ చేశారు. పార్లమెంటులోని గ్రౌండ్ ష్లోర్‌లోని అయిదవ నెంబర్ గదిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. గతంలో ఆ గదిలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం కొనసాగింది. ఎంపీల సంఖ్య ఆధారంగా చేసుకొని పార్లమెంటులో ఈ పార్టీ కార్యాలయాలు కేటాయించారు. పార్టీకి ఐదుగురు ఎంపీల కంటే ఎక్కవ ఉంటేనే పార్టీ కార్యాలయాలు కేటాయిస్తున్న లోక్‌సభ కార్యాలయం. -
'వారికి సెల్యూట్ చేస్తూనే ఉంటాను'
న్యూఢిల్లీ: పార్లమెంటుపై దాడి జరిగిన ఘటనలో పాకిస్థాన్ ముష్కరులకు ఎదురొడ్డి పోరాడి అమరులైనవారి త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై దాడి జరిగి పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నాటి అమరవీరులకు అంజలి ఘటించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. దాడి సమయంలో ధీటుగా పోరాడి పార్లమెంటులోకి ఉగ్రవాదులను అడుగుపెట్టకుండా చేసి ప్రాణాలు తృణపాయంగా వదిలేసిన వారి త్యాగాలకు తానెప్పుడూ సెల్యూట్ చేస్తూనే ఉంటానని అన్నారు. వారి త్యాగం భారత్ ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. తమ ప్రభుత్వం దేశంలో అసహనాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ఉగ్రవాదాన్ని రూపు మాపేందుకు నిరంతరం కృశిచేస్తుందని అన్నారు. భారత్ ను మరింత సురక్షితమైన దేశంగా మార్చేందుకు, మరింత లౌకిక రాజ్యంగా తీర్చి దిద్దేందుకు అనునిత్యం ప్రయత్నిస్తామని అన్నారు. -
నాటి వీరులకు ఘన నివాళి
న్యూఢిల్లీ: పార్లమెంటుపై 2001, డిసెంబర్ 13న పాకిస్థాన్ ముష్కరులు జరిపిన దాడిని ధీటుగా ఎదుర్కొని అమరవీరులైన వారికి దేశం ఆదివారం ఘన నివాళి అర్పించింది. ఆదివారం పార్లమెంటు భవన్ వద్ద అమరవీరుల చిత్రపటాలకు ప్రధాని నరేంద్రమోదీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్, రాజ్యసభ స్పీకర్ కురియన్ తోపాటు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, గులాంనబీ అజాద్, ఇతర బీజేపీ, కాంగ్రెస్ నేతలు అమరుల చిత్రపటాలపై పూలు జల్లి నివాళులు అర్పించారు. బీజేపీ నేత అద్వానీ కూడా నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. ఈ సందర్బంగా నాటి మృతవీరుల కుటుంబాల సభ్యులు అద్వానీని మర్యాదపూర్వకంగా కలిశారు. -
పార్లమెంట్ సమీపంలో డ్రోన్ కలకలం
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమీపంలో విజయ్ చౌక్ వద్ద డ్రోన్లను శనివారం పోలీసులు గుర్తించారు. దీంతో పార్లమెంట్ వద్ద భద్రతను అధికారులు పటిష్టం చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు పార్లమెంట్ లోని నార్త్, సౌత్ బ్లాక్ మీదుగా వెళ్లిన డ్రోన్ ను అక్కడున్న వారు గుర్తించారు. అది నో ఫ్లైయింగ్ జోన్ కావడంతో పోలీసులు ఈ సంఘటన పై అప్రమత్తమయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రాజ్యసభ చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
భారత రాజ్యాంగంలోని అయిదో భాగంలో 79 నుంచి 123 వరకు ఉన్న అధికరణలు పార్లమెంట్ నిర్మాణం, విధులు, అధికారాలు తదితర అంశాల గురించి వివరిస్తాయి. కేంద్రంలో ద్విసభ విధానాన్ని 1919 చట్టం ద్వారా మనదేశంలో ప్రవేశపెట్టారు. అధికరణ 79 ప్రకారం పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభ. దీని ప్రకారం రాష్ట్రపతి కూడా పార్లమెంట్లో అంతర్భాగమే. ఆయన ప్రమేయం లేకుండా ఏ బిల్లూ శాసనం కాదు. పార్లమెంట్ నిర్మాణం పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి. అవి: 1. లోక్‌సభ, 2. రాజ్యసభ. లోక్‌సభ లోక్‌సభను ‘దిగువ సభ’, ‘ప్రజా ప్రాతినిధ్య సభ’ అని కూడా పేర్కొంటారు. దీని నిర్మాణం గురించి అధికరణం 81 తెలియజేస్తుంది. ఇందులో గరిష్ట సభ్యుల సంఖ్య 552. వీరిలో 550 మంది ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. ఇద్దరిని నిబంధన 331 ప్రకారం ఆంగ్లో ఇండియన్ వర్గం నుంచి రాష్ట్రపతి నియమిస్తారు. ఈ 550 మందిలో రాష్ట్రాల నుంచి 530, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 20 మందికి మించకూడదు. లోక్‌సభ ప్రస్తుత సభ్యుల సంఖ్య 545. వీరిలో 543 మందిని ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాష్ట్రాల నుంచి 530 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 13 మంది ఎన్నికవుతున్నారు. ప్రారంభంలో లోక్‌సభ సభ్యుల సంఖ్య 525 మంది. 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సంఖ్యను 545కు పెంచారు. 2026 వరకూ ఈ సంఖ్యను పెంచకూడదని 2001లో 84వ సవరణ ద్వారా నిర్ణయించారు. లోక్‌సభకు ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువగా (80 మంది) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ట్ర - 48, పశ్చిమ బెంగాల్ - 42, బీహార్ - 40, తమిళనాడు - 39, మధ్యప్రదేశ్ - 29, కర్ణాటక - 28 ఉన్నాయి. అతి తక్కువగా సిక్కిం-1, మిజోరాం-1, నాగాలాండ్-1, గోవా-2, అరుణాచల్ ప్రదేశ్-2, మణిపూర్-2, మేఘాలయ-2, త్రిపుర-2 రాష్ట్రాల నుంచి ఎన్నికవుతున్నారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో.. అత్యధికంగా ఢిల్లీ నుంచి ఏడుగురు మిగిలిన వాటి నుంచి ఒక్కొక్కరూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికరణం 330 ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక సీట్లు కేటాయించారు. ప్రస్తుతం ఎస్సీలకు 84, ఎస్టీలకు 47 స్థానాలను కేటాయించారు. ఈ రిజర్వేషన్లు పదేళ్ల వరకూ కొనసాగుతాయి. ఇప్పటివరకూ వీటిని ఆరు పర్యాయాలు పొడిగించారు. 1. 1960లో 8వ రాజ్యాంగ సవరణ ద్వారా 1970 వరకు. 2. 1969లో 23వ రాజ్యాంగ సవరణ ద్వారా 1980 వరకు 3. 1980లో 45వ రాజ్యాంగ సవరణ ద్వారా 1990 వరకు 4. 1989లో 62వ రాజ్యాంగ సవరణ ద్వారా 2000 వరకు 5. 1999లో 79వ రాజ్యాంగ సవరణ ద్వారా 2010 వరకు 6. 2009లో 95వ రాజ్యాంగ సవరణ ద్వారా పొడిగించారు. ఎస్సీ స్థానాలు అధికంగా ఉత్తరప్రదేశ్‌లో 17, ఎస్టీ స్థానాలు ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో 6 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ-2014 చట్టం ద్వారా అంతకుముందున్న 42 స్థానాలను ఆంధ్రప్రదేశ్‌కు 25, తెలంగాణకు 17గా విభజించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1; తెలంగాణాలో ఎస్సీలకు 3, ఎస్టీలకు 2 ప్రత్యేక స్థానాలను కేటాయించారు. లోక్‌సభకు ఇప్పటివరకూ పదహారు సార్లు (1952, 1957, 1962, 1967, 1971, 1977, 1980, 1984, 1989, 1991, 1996, 1998, 1999, 2004, 2009, 2014) ఎన్నికలు నిర్వహించారు. వీటిలో ఆరుసార్లు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1971లో మొదటిసారి మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు. 1971లో ఏర్పడిన అయిదో లోక్‌సభ అధిక కాలం కొనసాగింది. 1998లో ఏర్పడిన 12వ లోక్‌సభ తక్కువ కాలం కొనసాగింది. మొదటి లోక్‌సభకు ఎన్నికైన మహిళా సభ్యుల సంఖ్య 22 మంది. ప్రస్తుత 16వ సభలో 65 మంది మహిళలు ఉన్నారు. మొదటి లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 17.32 కోట్లు కాగా, 16వ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 81.45 కోట్లు. కాలపరిమితి: నిబంధన 83 ప్రకారం లోక్‌సభ సాధారణ కాల పరిమితి ఐదేళ్లు. అత్యవసర సమయంలో ఏడాదిపాటు పొడిగించుకోవచ్చు. నిబంధన 85 ప్రకారం రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ముందుగానే దీన్ని రద్దు చేయవచ్చు. 1976లో 42వ సవరణ ద్వారా ఐదేళ్ల నుంచి ఆరు సంవత్సరాలకు పొడిగించి, 1978లో 44వ సవరణ ద్వారా ఆరేళ్ల నుంచి ఐదు సంవత్సరాలకు తగ్గించారు. రాజ్యసభ రాజ్యసభను ‘ఎగువ సభ’, ‘రాష్ట్రాల ప్రాతినిధ్య సభ’ అని పేర్కొంటారు. ఇది శాశ్వత సభ. ఇది 1952లో ఏర్పడింది. దీని నిర్మాణం గురించి నిబంధన 80 తెలియజేస్తుంది. గరిష్ట సభ్యుల సంఖ్య 250 మంది. వీరిలో 238 మంది.. ఎమ్మెల్యేలతో నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నికవుతారు. నిబంధన 80(3) ప్రకారం.. సాహిత్యం, కళలు, క్రీడలు, సాంఘిక సేవలు, సాంకేతిక పరిజ్ఞానం తదితర రంగాల నుంచి 12 మంది ప్రముఖులను రాష్ట్రపతి నియమిస్తారు. రాజ్యసభ ప్రస్తుత సభ్యుల సంఖ్య 245 మంది. వీరిలో 233 మంది ఎన్నికవుతున్నారు. మిగిలిన 12 మంది రాష్ట్రపతితో నియామకమవుతున్నారు. ఈ 233 మందిలో రాష్ట్రాల నుంచి 229 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నలుగురు (ఢిల్లీ-3, పాండిచ్చేరి-1) ఎన్నికవుతున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 31 మంది ఎన్నికవుతుండగా.. మహారాష్ర్ట- 19, తమిళనాడు- 18, పశ్చిమ బెంగాల్-16, బీహార్-16 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అతితక్కువగా సిక్కిం, గోవా, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ల నుంచి (ఒక్కొక్కరు) ఎన్నికవుతున్నారు. రాజ్యసభ మొత్తం సభ్యుల్లో ప్రతి రెండేళ్లకు 1/3వ వంతు మంది పదవీ విరమణ చేయగా.. మరో 1/3వ వంతు మందిని ఎన్నుకుంటారు. అంటే సభ్యుల పదవీ కాలం ఆరేళ్లు. పదవీ రీత్యా ఉపరాష్ట్రపతి రాజ్యసభ అధ్యక్షులుగా కొనసాగుతారు. సభ్యుల నుంచి ఒకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. మొదటి ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి. ప్రస్తుతం పి.జె. కురియన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు నిబంధన 85 ప్రకారం పార్లమెంట్ ఆరు నెలలకు ఒకసారి, సంవత్సరానికి రెండుసార్లు సమావేశం కావాలి. ప్రస్తుతం ఆనవాయితీగా సంవత్సరానికి మూడుసార్లు సమావేశాలను నిర్వహిస్తున్నారు. గరిష్ట సమావేశాలపై పరిమితి లేదు. అవసరాన్ని బట్టి ఎన్ని రోజులైనా నిర్వహించుకోవచ్చు. కనీసం వంద రోజులు నిర్వహించాలని పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొదటి సమావేశం 1952 మే 13న జి.వి. మౌళాంకర్ అధ్యక్షతన జరిగింది. పార్లమెంట్ - కోరం: కోరం అంటే సభ సమావేశాల నిర్వహణకు హాజరు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య. నిబంధన 100 ప్రకారం పార్లమెంట్ కోరం 1/10వ వంతు మంది (అధ్యక్షులతో కలిపి)గా నిర్ణయించారు. ఎంపీ పదవికి కావాల్సిన అర్హతలు: నిబంధన 84 పార్లమెంట్ సభ్యుడిగా నిలిచే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతల గురించి వివరిస్తోంది. అవి: 1. భారతీయ పౌరుడై ఉండాలి. 2. లోక్‌సభకు 25 ఏళ్లు, రాజ్యసభకు 30 ఏళ్లు నిండి ఉండాలి. 3. ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవిలో ఉండరాదు. 4. మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. 5. ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకొని ఉండాలి. పోటీ చేసే అభ్యర్థి రూ.25,000 నామినేషన్ ఫీజుగా చెల్లించాలి. ఓడిపోయిన అభ్యర్థికి ఈ డిపాజిట్ తిరిగి రావాలంటే పోలై, చెల్లిన ఓట్లలో 1/6వ వంతు రావాలి. స్పీకర్ ప్రకరణ 93 ప్రకారం లోక్‌సభకు స్పీకర్ ఉంటాడు. ఇతడే లోక్‌సభ అధ్యక్షుడిగా కొనసాగుతాడు. లోక్‌సభ సభ్యులు వారిలో ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్‌తో పదవీ స్వీకార ప్రమాణం చేయించేది రాష్ర్టపతి లేదా ఆయన నియమించే ప్రొటెమ్ స్పీకర్. రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌కు సమర్పించాలి. స్పీకర్ కాలపరిమితి ఐదేళ్లు. లోక్‌సభ ముందుగానే రద్దయినప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాదు. నూతన లోక్‌సభ ఏర్పడేంత వరకూ పదవిలో కొనసాగుతాడు. తిరిగి ఎన్నిసార్లయినా పదవి చేపట్టవచ్చు. ఎక్కువకాలం బలరాం జక్కర్, తక్కువ కాలం బలీరాం భగత్ స్పీకర్ పదవిలో కొనసాగారు. స్పీకర్ జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. దీన్ని సంఘటితనిధి నుంచి చెల్లిస్తారు. ప్రస్తుతం స్పీకర్‌కు రూ. 1,25,000; డిప్యూటీ స్పీకర్‌కు రూ. 90,000 చెల్లిస్తున్నారు. స్పీకర్‌ను తొలగించే విధానం: స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే నిబంధన 94 ప్రకారం లోక్‌సభ అభిశంసన తీర్మానం ద్వారా తొలగిస్తుంది. ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు 50 మంది సభ్యుల మద్దతుతో 14 రోజుల ముందు నోటీస్ జారీ చేయాలి. అనంతరం చర్చ జరుగుతుంది. తర్వాత ఓటింగ్ నిర్వహిస్తారు. దీంట్లో సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే స్పీకర్ పదవి కోల్పోతాడు. ఈ తీర్మానం చర్చకు వచ్చినప్పుడు సభాధ్యక్షుడిగా డిప్యూటీ స్పీకర్ కొనసాగుతాడు. మొదటి స్పీకర్ జి.వి. మౌళాంకర్, తొలి డిప్యూటీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్. ప్రస్తుత స్పీకర్ సుమిత్రా మహాజన్, డిప్యూటీ స్పీకర్ తంబిదొరై. స్పీకర్ విధులు, అధికారాలు: లోక్‌సభ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమావేశాలను నిర్వహిస్తాడు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించే సభ్యులపై చర్య తీసుకుంటాడు. సభ్యుల హాజరు పట్టికను పరిశీలించి ఎవరైనా సభ్యుడు 60 రోజులు గైర్హాజరైతే సభ్యత్వాన్ని రద్దు చేస్తాడు.పార్లమెంట్, రాష్ట్రపతి, మంత్రి మండలికి మధ్య సంధానకర్తగా పనిచేస్తాడు. ఏదైనా బిల్లును స్వభావం ఆధారంగా ఆర్థికమైందా, సాధారణమైందా అని నిర్ణయిస్తాడు. పార్లమెంట్ ఉభయ సభల సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. సభలో బిల్లులు, తీర్మానాలపై ఓటింగ్ నిర్వహిస్తాడు. ఓట్లు సమానంగా వచ్చినప్పుడు నిర్ణయాత్మక ఓటు హక్కును వినియోగించుకుంటాడు. కొన్ని పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షుడిగా కొనసాగుతాడు. కామన్వెల్త్ స్పీకర్స ఫోరమ్‌లో సభ్యుడిగా కొనసాగుతాడు. 1. రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ ఎవరు? 1) కె. రహమాన్‌ఖాన్ 2) కరియా ముండా 3) షంషేర్ కె. షరీఫ్ 4) పి.జె. కురియన్ 2. కిందివాటిలో దేన్ని ‘పార్లమెంట్ల మాతృక’గా పేర్కొంటారు? 1) భారత పార్లమెంట్ 2) బ్రిటన్ పార్లమెంట్ 3) యూఎస్ కాంగ్రెస్ 4) స్విస్ ఫెడరల్ అసెంబ్లీ 3. భారత రాజ్యాంగంలోని ఎన్నో అధికరణలో వార్షిక ఆర్థిక ప్రకటన అనే పదాన్ని ప్రస్తావించారు? 1) 116 2) 265 3) 112 4) 266 4. రాజ్యసభ చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు? 1) ఉపరాష్ట్ట్రపతి 2) లోక్‌సభ స్పీకర్ 3) రాజ్యసభ సభ్యులు ఎన్నుకున్న వ్యక్తి 4) మెజార్టీ పార్టీ నాయకుడు 5. భారత రాజ్యాంగం ప్రకారం లోక్‌సభలో కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధుల సంఖ్య ఎంతకు మించకూడదు? 1) 10 2) 25 3) 15 4) 20 సమాధానాలు: 1) 4 2) 2 3) 3 4) 1 5) 4