‘పార్లమెంట్‌ భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలి’ | Gaddar Asked Revanth To Name Parliament Building After Ambedkar | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలి: గద్దర్‌

Published Wed, Sep 7 2022 3:01 AM | Last Updated on Wed, Sep 7 2022 6:24 PM

Gaddar Asked Revanth To Name Parliament Building After Ambedkar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తోన్న పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌.బి.ఆర్‌.అంబేడ్కర్‌ పేరు పెట్టాలని ప్రజాగాయకుడు గద్దర్‌ కోరారు. ఈ మేరకు ఆలిండియా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర చైర్మన్‌ మహేశ్‌రాజ్, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లురవితో కలిసి గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

రేవంత్‌ స్పందిస్తూ గద్దరన్న  వినతిపై కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ కమిటీ నివేదికపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయి అఖిలపక్షం తీర్మానాన్ని సోనియాగాంధీకి అందజేస్తానని, పార్లమెంటులో ఈ అంశంపై చర్చ జరిగి నూతన పార్లమెంటు భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టేలా కృషి చేస్తానని రేవంత్‌ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: బీజేపీవి వేషాలు.. టీఆర్‌ఎస్‌ది అతి తెలివి: రేవంత్‌ రెడ్డి

   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement