సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని లుటియెన్స్ జోన్‌లో కొత్త పార్లమెంట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించే సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిలిపివేయాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురవారం కొట్టివేసింది. ‘ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఇప్పటికే ఒక పిటిషన్ పెండింగ్‌లో ఉంది. కరోనా వైరస్(కోవిడ్-19) వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇది అత్యవసరం కాదు’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే స్పష్టం చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పేరుతో పార్లమెంటు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన విషయం తెలిసిందే. కేంద్రం రెండు వేల కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణానికి వ్యతిరేకంగా పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం భూ వినియోగ మార్పిడి చేస్తూ రీ డెవలప్‌మెంట్ ప్లాన్ చేసింది. కేంద్రం చేసిన భూ వినియోగ మార్పిడిని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా ఈ పిటిషన్‌పై గురువారం సుప్రీకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బాబ్డే, జస్టిస్ అనిరుద్ద బోస్‌ల ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చెపట్టింది. ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్‌ను నిర్మిస్తున్నప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు. పిటిషనర్ల వాదనలు విన్న సుప్రీంకోర్టు కొత్త పార్లమెంటు నిర్మాణం ప్రాజెక్టుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
Comments
Please login to add a commentAdd a comment