President Should Inaugurate New Parliament Building, Not PM: Rahul Gandhi - Sakshi
Sakshi News home page

పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది ప్రధాని కాదు: రాహుల్‌ గాంధీ

Published Sun, May 21 2023 4:43 PM | Last Updated on Sun, May 21 2023 5:08 PM

Rahul Gandhi Says President Should Inaugurate New Parliament Building - Sakshi

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం కొత్త పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. కాగా, నూతన పార్లమెంట్‌ భవనాన్ని ఈనెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో​  కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం, రాహుల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాగా, రాహుల్‌ ట్విట్టర్‌ వేదికగా.. ‘కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలి. ప్రధానమంత్రి కాదు’ అంటూ కామెంట్స్‌ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా దీనిపై స్పందించింది. అదే రోజున వీడీ సావర్కర్‌ జయంతి. కేంద్రం చర్య జాతి నిర్మాతలను అవమానించడమేనని కాంగ్రెస్‌ అభిప్రాయపడింది.

ఇదిలా ఉండగా, అంతకుముందు.. పార్లమెంట్‌ కొత్త భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడంపై ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు.  ప్రధాని పార్లమెంట్‌ను ప్రారంభించడమేంటని ప్రశ్నించారు. ప్రధాని కార్యనిర్వహక వర్గానికి అధిపతి అని, రాజ్యాంగం ప్రకారం అధికారాల విభజన స్పష్టంగా ఉందన్నారు. పార్లమెంట్‌కు అధిపతులు లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌ అని, వారితో పార్లమెంట్‌ను ప్రారంభించవచ్చన్నారు. 

ఇది కూడా చదవండి: కవిత అరెస్ట్‌ మా చేతుల్లో లేదు: కిషన్‌రెడ్డి సంచలన కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement