President should inaugurate new Parliament building, not PM: PIL filed in Supreme Court - Sakshi
Sakshi News home page

‘రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు.. ఆ ఆదేశాలు ఇవ్వండి’..సుప్రీం కోర్టులో పిల్‌

Published Thu, May 25 2023 2:00 PM | Last Updated on Thu, May 25 2023 2:55 PM

PIL filed in Supreme Court Over Pm Inaugurate Parliament - Sakshi

ఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ కొనసాగుతోంది.  ఈ క్రమంలో మరో పరిణామం చోటుచేసుకుంది.  దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఓ పిల్ దాఖలైంది. ప్రధాన మంత్రితో కాకుండా.. రాష్ట్రపతి చేత పార్లమెంట్‌ను ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ఈ నెల 28న నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనున్నట్లు లోక్‌సభ కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది. ప్రారంభోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి.

ఈ లోపు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (Public interest litigation - PIL, పిల్) దాఖలైంది. పార్లమెంట్‌ను ప్రారంభించాల్సింది రాజ్యాంగానికి అధినేతగా ఉన్న రాష్ట్రపతి. అంతేగానీ ప్రధాని కాదు అంటూ పిల్‌లో పేర్కొన్నారు. 

ఈ విషయంలో లోక్‌సభ సెక్రటేరియేట్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియెట్‌ను, కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్‌ నూతన భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభింపజేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్‌లో కోరారు. ఈ కారణం చేతనే విపక్షాలు కూడా ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement