సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వచ్చే నెలలో ప్రారంభంకానున్నాయి. జూలై 19 న ప్రారంభమై ఆగస్టు 13 తో ముగియనున్నాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ సెషన్ జరగనుంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సిఫారసు చేసింది. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలో కోవిడ్‌కు సంబంధించిన అన్ని ప్రోటోకాల్‌లు పాటిస్తారు. అలాగే సభ్యులంతా కనీసం ఒక మోతాదు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని భావిస్తున్నారు. సాధారణంగా పార్లమెంటు మాన్‌సూన్ సెషన్ జూలై మూడవ వారంలో ప్రారంభమవుతుంది. ఆగస్టు15 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment