monsoon sessions
-
కేసీఆర్ ఎవరి శిష్యుడు? రఘునందన్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా సీఎంల పేర్లతో మరోసారి పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందరావు విమర్శలు గుప్పించారు. బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కిరణ్‌కుమార్‌రెడ్డి శిష్యుడంటూ చేస్తున్న ప్రచారంపైనా రఘునందన్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ సంజయ్ గాంధీ శిష్యుడు కదా?.. నేర్చుకునేటప్పుడు ఎవరు ఎవరికైన శిష్యుడిగా ఉండొచ్చు. ఆంధ్ర సీఎంల పేర్లతో కేసిఆర్ మరోసారి పబ్భం గడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే పని చేయన్నోల్లు మహారాష్ట్రలో ఏమీ చేస్తారు ?. మహారాష్ట్ర స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన స్థానాలు ఎన్ని? అంటూ సెటైర్లు సంధించారు రఘునందన్. నగర కమిషన్ వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసే పరిస్థితి హైదరాబాద్‌లో ఉంది. అసలు చిన్న వానకే ట్రాఫిక్ ఎందుకు అవుతుందని సమీక్ష చేసారా?. ఇదేనా భాగ్యనగర్ ఎదుగుదల?. మున్సిపల్ మీటింగ్‌లకు ఆ శాఖ మంత్రే హాజరు కావడం లేదు. అందుకే.. సభలో వరదల మీద చర్చ జరపాలి. రైతు రుణ మాఫీ అనేది బ్యాంకులు చేయవు. ప్రభుత్వం చేస్తుంది. రుణ మాఫీ చేయకుంటే సెక్రటేరియట్ ముందు లేదా ఆ శాఖ మంత్రి ఇంటి ముందు ధర్నా చేయాలి. ఇది కాంగ్రెస్ కు తెలీదు. ఎందుకంటే.. ఇదంతా ఎన్నికల ముందు కాంగ్రెస్-బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామా కాబట్టి. కార్మికులు, ఉద్యోగుల సమస్యపైనా.. తెలంగాణ వస్తే.. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరని చెప్పారు కదా?. మరి మీ సొంత జిల్లాలో ఎంత మంది కాంట్రాక్ట్ కార్మికులు సంఖ్య ఎంత? పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య ఎంత? చర్చకు సిద్ధమా?. కాళేశ్వరం రుణాలపై చర్చ సభలో పెట్టండి. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు మీదా సభలో మాట్లాడాలి. ప్రతి మండలంలో పంచాయతీ కార్మికులు ధర్నా చేస్తున్నారు. వాటి మీద చర్చిద్దాం. హైదరాబాద్‌లో అమ్మిన భూములు ఎంత? దాని విలువ ఎంత? ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు ?. మైనారిటీ బంధు ఇస్తామంటున్నారు. రాష్ట్రంలో అధిక జనాభా బీసీ బందు ఎందుకు ఇవ్వరు?.. సర్కార్ కొలువున్నా.. హుజూరాబాద్ లో దళిత బంధు ఇచ్చారు. అదే విధంగా అన్ని నియోజకర్గాల్లోనూ ఇవ్వాలి. గృహలక్ష్మి అంటున్నరు.. అందులో కేంద్రం వాటా చెప్పరు. కట్టిన ఇళ్ళ రంగులు పోతున్నాయి..పేదలకు మాత్రం ఇవ్వట్లేదు. Ghmc లో ఎన్ని డబుల్ ఇళ్లు కావాలనే అంచనా మీకుందా? అని ప్రభుత్వాన్ని నిలదీశారాయన. నాతో చెప్పించుకోవడం సిగ్గు చేటు మేము నిర్ణయించిన రోజులే శాసన సభ జరగాలి అనేది మూర్ఖపు ఆలోచన. ప్రతిపక్షం అంటేనే ప్రజల గొంతుక. ఎన్నికలు ఎప్పుడొస్తాయో మీకు తెలుసు. ఇవే చివరి సమావేశాలు కాబట్టి.. రోజుకో అజెండాతో శాసన సభ 30 రోజులు నడపాలి. ప్రతిపక్ష సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రజా సమస్యలు చర్చించే శాసన సభను నెల రోజులు నడపకపోవడం దురదృష్టకరం. ఈ విషయంలో కేంద్రాన్ని చూసి నేర్చుకోవాలి. సంప్రదాయాలు పాటించరు! బీఎస్సీ మీటింగ్‌కు పిలవురు. ఈ విధంగా సభ నిర్వహించడం బాధాకరం. ఉన్న ముగ్గురికి సభలో మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు భయమెందుకు? బలం మీదే అని అంటున్నప్పుడు.. నెలపాటు సభ నడపడానికి అభ్యంతరం ఏంటి?. నాలాంటి కొత్త సభ్యులతో ఇలాంటి సూచన చెప్పించుకోడం సిగ్గు చేటు. 30రోజులు సభ నడపాలని బీజేపీ తరపున సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తున్నాం. నేరుగా లేఖ ఇచ్చే అవకాశం మాకు లేదు కాబట్టి మీడియా ముఖంగా ఈ లేఖ రాస్తున్నాం. కేంద్ర నిధుల మీద అఖిల పక్షం మీటింగ్ పెట్టాలి. చర్చించేందుకు మేము సిద్ధం అని ఎమ్మెల్యే రఘునందర్ స్పష్టం చేశారు. -
సభ ముందుకు ఏడు బిల్లులు.. ఈటెలపై చర్యలకు పట్టు?
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6న సమావేశమై వాయిదా పడిన తెలంగాణ శాసనసభ, శాసన మండలి వానాకాలం సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆరో తేదీన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నెల 12, 13 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. సోమవారం ఏడు బిల్లులు, పలు పత్రాలు సభ ముందుకు రానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైన వెంటనే 6న జరిగిన బీఏసీ సమావేశం నివేదికను సీఎం కేసీఆర్ సభకు సమర్పిస్తారు. అనంతరం తెలంగాణ సదరన్ డిస్కమ్, ట్రాన్స్‌కో, టీఎస్ రెడ్కో వార్షిక నివేదికలు, తెలంగాణ సమగ్ర శిక్షా 2020–21 ఆడిట్ రిపోర్ట్, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రెగ్యులేషన్స్ పత్రాలను సంబంధిత శాఖల మంత్రులు సభకు సమర్పిస్తారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు మృతిపై స్పీకర్ స్థానం నుంచి సంతాప ప్రకటన ఉంటుంది. జీఎస్టీ సవరణ బిల్లుతో పాటు.. తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు 2022, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా బిల్లు 2022, తెలంగాణ మున్సిపల్ చట్టాలు 2022 సవరణ బిల్లు సభ ముందుకు వస్తాయి. వీటితో పాటు తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ బిల్లు, తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు, తెలంగాణ మోటారు వాహనాల టాక్సేషన్ సవరణ బిల్లులను సంబంధిత శాఖల మంత్రులు సమర్పిస్తారు. శాసనసభ, మండలిలో ‘కేంద్ర విద్యుత్ బిల్లు.. పర్యవసానాలు అంశం’పై స్వల్ప కాలిక చర్చ జరుగుతుంది. ఈటలపై చర్యలకు అధికార పక్షం పట్టు? బీఏసీ సమావేశానికి బీజేపీ సభ్యులను ఆహ్వానించక పోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్‌పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ సభ్యులు ప్రస్తావించే అవకాశం ఉంది. సభ్యుల ప్రవర్తనా నియమావళికి ఈటల వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటలపై చర్యలు తీసుకోవాలంటూ టీఆర్ఎస్ సభ్యులు పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇదీ చదవండి: Krishnam Raju: రారాజు ఇకలేరు -
పార్లమెంట్ సమావేశాలు వాయిదాపై వివరణ ఇచ్చిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఎంపీల వినతి మేరకే షెడ్యూల్‌కు రెండు రోజులు ముందుగానే నిరవధికంగా వాయిదా వేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పార్లమెంట్ సమావేశాలను షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 12 కంటే ముందుగానే ముగించడం తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని, సభను నడిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదని కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. సభలో చర్చ జరగాలంటూ బయటకు చెప్పుకుంటూ అంతరాయం కలిగించడం, వాకౌట్ చేయడం ప్రతిపక్షాల ఎజెండాగా మారిందని విమర్శించారు. ‘ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా వర్షాకాల సమావేశాలను షెడ్యూల్ కంటే 4 రోజులు కాదు, 2 రోజులు ముందుగా వాయిదా వేశాం. ప్రతిపక్ష సభ్యులు సహా పలువురు ఎంపీలు చేసిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని పేర్కొన్నారు. చదవండి: నితీశ్‌కు వెన్నుపోటు అలవాటే: బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ సభలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలపై ఆయన స్పందిస్తూ..‘అవినీతి ఆరోపణలకు సంబంధించి ఒక కుటుంబం వ్యక్తిగత సమస్యలపై పార్లమెంట్ సమయాన్ని వృథా చేశారు. ప్రజాప్రయోజనాల కంటే ఒక కుటుంబాన్ని రక్షించడానికే ఎక్కువ ఆసక్తి చూపారు’అని ఎత్తిపొడిచారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్‌ని ఈడీ పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. చదవండి: నలుగురికి కోవిడ్ పాజిటివ్.. భారత పర్యాటకులపై నేపాల్ నిషేధం TMC leader @derekobrienmp should stop preaching about democratic values and the sanctity of institutions. The people of Bengal have elected BJP as the main opposition but TMC, in its arrogance, has denied BJP the post of PAC Chairman. https://t.co/YeKpYJdXWE — Pralhad Joshi (@JoshiPralhad) August 8, 2022 -
రాజ్యసభ సభ్యులుగా 27 మంది ప్రమాణం
న్యూఢిల్లీ: రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన 57 మందిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయెల్ సహా 27 మంది సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు రాజ్యాంగానికి విధేయులుగా ఉంటామంటూ వారితో ప్రమాణం చేయించారు. 10 రాష్ట్రాలకు చెందిన 27 మంది సభ్యులు తెలుగు తదితర 9 భాషల్లో ప్రమాణం చేశారు. కొత్తగా ఎన్నికైన 57 మందిలో నలుగురు ఇప్పటికే ప్రమాణం చేశారు. మిగతా వారు వర్షాకాల సమావేశాల మొదటి రోజు ప్రమాణం చేయనున్నారు. ఇంకా ప్రమాణం చేయని కొత్త సభ్యులు కూడా 18వ తేదీన జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చైర్మన్ వెంకయ్యనాయుడు అనంతరం స్పష్టతనిచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో విజేతల పేర్లను నోటిఫికేషన్లో ప్రకటించిన నాటి నుంచి వారిని సభ్యులుగానే పరిగణిస్తామన్నారు. సభా కార్యక్రమాలు, కమిటీల సమావేశాల్లో పాల్గొనేందుకు మాత్రం ప్రమాణం చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. తాజాగా ప్రమాణం చేసిన వారిలో కాంగ్రెస్‌కు చెందిన జైరాం రమేశ్, వివేక్ కె.తన్ఖా, ముకుల్ వాస్నిక్‌తోపాటు బీజేపీ నుంచి సురేంద్ర సింగ్ నాగర్, కె.లక్ష్మణ్, లక్ష్మీకాంత్ వాజ్‌పేయి తదితర 18 మంది ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేస్తున్న గోయల్ -
లక్ష మందితో పార్లమెంటును ముట్టడిస్తాం: ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్(హైదరాబాద్): ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో బీసీ సంఘాల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో సోమవారం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని బీసీ, కుల, ఉద్యోగ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెల 27న బీసీల డిమాండ్లపై లక్షమందితో పార్లమెంట్‌ను ముట్టడిస్తామన్నారు. ఆదివారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో 48 బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఏడాది పాటు అనర్హత వేటు
ముంబై: ప్రతిపక్ష పార్టీల నిరసనల మధ్య మహారాష్ట్ర వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఓబీసీ కోటాపై సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. స్పీకర్‌ని దూషిండచడమే కాక కొట్టారనే ఆరోపణలపై .. 12 మంది బీజేపీ ఎమ్మేల్యేలపై ఏడాది పాటు అనర్హత వేటు వేశారు. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో ఓబీసీ కోటాపై చర్చ ప్రారంభమైంది. ఈ క్రమంలో దీనిపై మాట్లాడేందుకు అసెంబ్లీ స్పీకర్ భాస్కర్ జాధవ్ తమకు తగినంత సమయం ఇవ్వలేదని భావించిన బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి ఆందోళన చేశారు. అనంతరం ఆయన క్యాబిన్లోకి వెళ్లి స్పీకర్‌ని దూషించడమేకాక కొట్టడానికి ప్రయత్నించినట్లు సమాచారం. దాంతో సదరు బీజేపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడమే కాక.. సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘‘మా ఎమ్మెల్యేలపై చేస్తున్నవన్ని అసత్య ఆరోపణలు. స్పీకర్‌ని దూషించడం, దాడి చేయడం అనేది అధికార పార్టీ అల్లిన కట్టుకథ. ఓబీసీల కోసం మేం మరికొంత మంది ఎమ్మెల్యేలను కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. స్పీకర్ కూడా మా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు’’ అన్నారు. ఈ ఘటనపై అఎంబ్లీ స్పీకర్ జాధవ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్ష నాయకులు నా క్యాబిన్ దగ్గరకు వచ్చి అనుచిత వ్యాఖ్యలు చూస్తూ.. దూషించారు. ఇదంతా దేవంద్ర ఫడ్నవీస్, సీనియర్ నాయకుడు చంద్రకాంత్ పాటిల్ ఎదురుగానే జరిగింది. కొందరు నాయకులు నా మీద చేయి చేసుకున్నారు. అందుకే ఆ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశాను. దీనిపై పూర్తి స్థాయిలో విచారించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మినిస్టర్‌ని కోరాను’’ అని తెలిపారు. -
త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వచ్చే నెలలో ప్రారంభంకానున్నాయి. జూలై 19 న ప్రారంభమై ఆగస్టు 13 తో ముగియనున్నాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ సెషన్ జరగనుంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సిఫారసు చేసింది. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలో కోవిడ్‌కు సంబంధించిన అన్ని ప్రోటోకాల్‌లు పాటిస్తారు. అలాగే సభ్యులంతా కనీసం ఒక మోతాదు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని భావిస్తున్నారు. సాధారణంగా పార్లమెంటు మాన్సూన్ సెషన్ జూలై మూడవ వారంలో ప్రారంభమవుతుంది. ఆగస్టు15 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ముగుస్తుంది. -
ముగిసిన పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రకటిత సమయం కన్నా 8 రోజుల ముందే ఈ సమావేశాలు ముగిశాయి. మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్లు ఆమోదం అనంతరం లోక్‌సభను బుధవారం సాయంత్రం స్పీకర్ ఓం బిర్లా నిరవధికంగా వాయిదా వేశారు. ఆ సమయంలో ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బుధవారం మధ్యాహ్నమే చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. చివరిరోజైన బుధవారం కార్మిక సంస్కరణలకు సంబంధించిన మూడు బిల్లులు సహా పలు కీలక బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. సెప్టెంబర్ 14న వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.. మరోవైపు, ఎంపీల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న ఆందోళనలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో 8 రోజుల ముందే ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల మౌన నిరసన వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు నిరసనగా విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం పార్లమెంటు ప్రాంగణంలో మౌన నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ‘సేవ్ ఫార్మర్స్’, ‘సేవ్ వర్కర్స్’, ‘సేవ్ డెమొక్రసీ’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో విపక్ష సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ.. తదితర పార్టీల సభ్యులు పాల్గొన్నారు. కార్మిక బిల్లుల ఆమోదంపై ప్రధాని హర్షం కార్మిక రంగంలో సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లులు బుధవారం పార్లమెంటు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లులు కార్మికుల సంక్షేమానికి, ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తాయన్నారు. కనీస వేతనాలు, సరైన సమయానికి వేతనాలు ఇవ్వడం, కార్మికుల భద్రతకు ప్రాధాన్యతనివ్వడం.. తదితర అంశాలకు ఈ బిల్లులు హామీ ఇస్తున్నాయన్నారు. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలనకు ఈ బిల్లులు ఉదాహరణ అన్నారు. ఈ సంస్కరణలతో వ్యాపార నిర్వహణ మరింత సులభతరమవుతుందన్నారు. ‘ఇవి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బిల్లులు. వీటితో అనవసర జాప్యం, అధిక ప్రభుత్వ పర్యవేక్షణ తగ్గుతాయి’ అన్నారు. కంపెనీల మూసివేతలో అడ్డంకులను తొలగించడం, 300 మంది వరకు కార్మికులున్న కంపెనీలు తమ ఉద్యోగులను ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండానే తొలగించే వెసులుబాటు.. తదితర ప్రతిపాదనలు ఆ బిల్లుల్లో ఉన్నాయి. ఈ నిర్ణయాల వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా, పార్లమెంటు ఆమోదం పొందిన 3 బిల్లులతో పాటు, 29 కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి 4 సమగ్ర చట్టాలుగా రూపొందించారు. -
ఎంపీలకు కరోనా పరీక్షలు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు 72 గంటల ముందే లోక్‌సభ సభ్యులందరూ కోవిడ్–19 పరీక్షలు చేయించుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కోరారు. వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 14 న ప్రారంభమై, అక్టోబర్ 1కి ముగియనున్నాయి. ఎంపీలతో పాటు, పార్లమెంటు ఆవరణలోనికి ప్రవేశించే వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు, మీడియా ప్రతినిధులు, లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్ సిబ్బంది అంతా సమావేశాల ప్రారంభానికి ముందే పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ కోరారు. పార్లమెంటరీ సమావేశాల ఏర్పాట్లను ఖరారు చేయడానికి ఆరోగ్యమంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్, ఎయిమ్స్, డీఆర్డీఓ, ఢిల్లీ ప్రభుత్వ అధికారులతో లోక్‌సభ స్పీకర్ శుక్రవారం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభ్యులెవ్వరినీ ముట్టుకోకుండా, జీరో టచ్ సెక్యూరిటీ చెక్ ఏర్పాట్లు చేస్తున్నామని స్పీకర్ తెలిపారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు అవసరమైతే కోవిడ్ పరీక్షలు సైతం నిర్వహిస్తామని స్పీకర్ చెప్పారు. రెండు షిఫ్టులలో ఉదయం, సాయంత్రం వర్షాకాల సమావేశాలు జరగనున్నట్టు ఆయన వెల్లడించారు. పార్లమెంటు భవనానికి లోక్‌సభ స్పీకర్ సంరక్షకుడు కాగా, ఈ భవనానికి లోక్‌సభ సెక్రటేరియట్ నోడల్ అథారిటీగా వ్యవహరిస్తుంది. కనుక పార్లమెంటులో అన్ని ఏర్పాట్లు చేసే బాధ్యత లోక్‌సభ సెక్రటేరియట్ మీదనే ఉంటుంది. ప్రశ్నలడిగే అధికారాన్ని హరించవద్దు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల పార్లమెంటరీ సమావేశాల్లో ప్రశ్నలు అడిగే, ప్రజాసమస్యలను ప్రస్థావించే సభ్యుల అధికారాలను హరించరాదంటూ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకి, కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌధరి లేఖ రాశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని, జీరో అవర్లను కుదించటం, ప్రత్యేకించి కోవిడ్ సంక్షోభ కాలంలో మంచిది కాదని ఛౌదరి స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. రానున్న సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్నీ, జీరో అవర్ సమయాన్నీ కుదించే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోందనీ, సభ్యులు అడిగే ప్రశ్నల సంఖ్యను కూడా కుదించే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. జీరో అవర్‌లో, జాతీయ, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను సభ్యులు లేవనెత్తటం సహజంగా జరిగే ప్రక్రియ అని, ఆయన రాసిన లేఖలో తెలిపారు. ఎక్కువ ప్రశ్నలు అడగకుండా, ప్రశ్నోత్తరాల సమయాన్నీ, జీరో అవర్ సమయాన్నీ కుదించటం ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రయోజనాలకనుగుణంగా లేవని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు యథావిధిగా ప్రశ్నలడిగే అవకాశం కల్పించాలని స్పీకర్‌కి రాసిన లేఖలో కోరారు. -
సెప్టెంబర్‌లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకూ సమావేశాలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఉదయం లోక్‌సభ, మధ్యాహ్నం రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ ఇరు సభలలో సభ్యులకు స్ధానాలను కేటాయిస్తారు. ఇక లోకసభ సభ్యులందరూ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశమవుతారని, రాజ్యసభ సభ్యులు మాత్రం లోకసభ, రాజ్యసభలో కొలువుతీరుతారు. అయితే పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలందరికీ ‘ఆరోగ్య సేతు’ యాప్ కచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలని నిబంధన విధిస్తారని సమాచారం. సభ్యులకు స్క్రీనింగ్ నిర్వహణతో పాటు శానిటైజింగ్ వ్యవస్థ ప్రతి చోటా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఆయా సభ్యుల వ్యక్తిగత సిబ్బందికి మాత్రం పార్లమెంట్‌లోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఆరునెలలకు ఒకసారి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలన్న రాజ్యాంగ నిబంధనకు అనుగుణంగా కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలోనూ పార్లమెంట్ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఈ ఏడాది మార్చిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ 12 బిల్లులను ఆమోదించింది. ఆ సెషన్స్‌లో రెండు సభల్లో 19 బిల్లులను ప్రవేశపెట్టారు. ఫైనాన్స్ బిల్లుతో పాటు బడ్జెట్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఇరు సభలూ నిరవధికంగా వాయిదాపడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనతో సమావేశాలకు అర్థంతరంగా తెరపడింది. చదవండి : ఇదేదో బాగుంది అధ్యక్షా! -
7 నుంచి అసెంబ్లీ..
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను వచ్చే నెల 7 నుంచి నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సోమవారం ప్రగతి భవన్లో ఈ అంశంపై పలువురు మంత్రులతో ఆయన చర్చించారు. రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందున సెప్టెంబర్‌లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం వల్ల ముఖ్యమైన అంశాలపై సమగ్ర చర్చ జరిపే అవకాశముంటుందని సీఎం, మంత్రులు అభిప్రాయపడ్డారు. 15 రోజుల పనిదినాలైనా ఉండేలా చూడాలన్నారు. (వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష) పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశపెట్టడంతో పాటు విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉంటుందని, అన్నివిధాలుగా సిద్ధం కావాలని మంత్రులు, అధికారులకు సీఎం సూచించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, సభ్యులు భౌతిక దూరం పాటించేందుకు ఏర్పాట్లు చేయాలని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహా చార్యులను సీఎం ఆదేశించారు. -
షిఫ్ట్ పద్ధ్దతిలో పార్లమెంట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముందని రాజ్యసభ సెక్రటేరి యట్ వర్గాలు తెలిపాయి. కోవిడ్–19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని మొదటిసారిగా పలు ముందు జాగ్రత్త చర్యలు, ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. దీన్లో భాగంగా, ఈసారి ఉభయ సభలు ఒకదాని తర్వాత మరోటి సమావేశం కానున్నాయి. ఉదయం ఒక సభ జరిగితే, మరో సభ సాయంత్రం సమావేశమవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మార్చి 23వ తేదీన అర్ధంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం.. పార్లమెంట్ చివరి సమావేశాలు జరిగిన ఆరు నెలల్లోగా సమావేశాలు జరగాల్సి ఉంది. 1952 తర్వాత ఇదే ప్రథమం..! రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జూలై 17వ తేదీన సమావేశమై పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించిన అనంతరం ఈ మేరకు నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ వరకు ఏర్పాట్లు పూర్తయితే, ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం తుదిమెరుగులు దిద్దాల్సి ఉంటుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సెక్రటేరియట్ అధికారులు రెండు వారాలుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భౌతికదూరం పాటిస్తూ ఏర్పాటు చేసిన సీట్ల అమరిక కారణంగా ఉభయ సభల చాంబర్లతోపాటు గ్యాలరీల్లోనూ రాజ్యసభ సభ్యులు కూర్చుంటారు. రాజ్యసభ చాంబర్లో 60 మంది, గ్యాలరీల్లో 51 మంది, మిగతా 132 మంది సభ్యులు లోక్‌సభ చాంబర్లో కూర్చుంటారు. 1952వ సంవత్సరం తర్వాత ఇలాంటి ఏర్పాటు చేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే ప్రథమమని రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. భారీ డిస్ప్లే స్క్రీన్లు రాజ్యసభ చాంబర్లో 4 భారీ డిస్ప్లే స్క్రీన్లు, నాలుగు గ్యాలరీల్లో కలిపి 6 చిన్న స్క్రీన్లు, గ్యాలరీల్లో ఆడియో కన్సోల్స్, సూక్ష్మక్రిములను చంపే అల్ట్రా వయొలెట్ పరికరాలు, ఆడియో విజువల్ సిగ్నల్స్ కోసం ఉభయ సభలను కలుపుతూ ప్రత్యేక కేబుళ్లు, అధికారుల గ్యాలరీని చాంబర్‌తో వేరు చేస్తూ ప్రత్యేక ప్లాస్టిక్ షీట్ల అమరిక వంటివి ఇందులో ఉన్నాయని రాజ్యసభ సెక్రటేరియట్ అధికారులు తెలిపారు. కోవిడ్–19 వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం నిబంధనలను దృష్టిలో ఉంచుకుని వీటిని చేపట్టినట్లు పేర్కొన్నారు. లోక్‌సభ సెక్రటేరియట్ కూడా ఇవే రకమైన ఏర్పాట్లను చేపట్టింది. సీట్ల అమరిక ఇలా... వివిధ పార్టీల సభ్యుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రాజ్యసభలో కొందరికి, మరికొందరికి లోక్‌సభలోని అధికార పక్షం, ఇతరులు కూర్చునే రెండు బ్లాకులను ప్రత్యేకించారు. రాజ్యసభ చాంబర్లో ప్రధానమంత్రి, విపక్ష, అధికార పక్షం నేతలు, ఇతర పార్టీల వారికి సీట్లు కేటాయించారు. మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, రాజ్యసభ సభ్యులైన కేంద్ర మంత్రులు రాంవిలాస్ పాశ్వాన్, రాందాస్ అథవలేలకు కూడా చాంబర్లోనే చోటు కల్పించారు. మిగతా మంత్రులకు అధికార పక్షం సభ్యుల సీట్లే కేటాయించారు. సభ్యులు తమ సీట్ల నుంచే సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా అన్ని సీట్లకు హెడ్ఫోన్లు, తదితర పరికరాలను అమర్చారు. రాజ్యసభలోని ప్రతి గ్యాలరీలో ఆయా పార్టీలకు కేటాయించిన సీట్ల వద్ద ప్లకార్డులను ఏర్పాటు చేశారు. రాజ్యసభలో బ్యాక్టీరియా, వైరస్‌ను నాశనం చేసేందుకు ‘అల్ట్రా వయొలెట్ జెర్మిసైడల్ ఇర్రేడియేషన్’ వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరిమితంగానే అధికారులకు అవకాశం రాజ్యసభలోకి సెక్రటేరియట్‌కు చెందిన అధికారులను పరిమితంగా 15 మందినే అనుమతిస్తారు. అదేవిధంగా, విదేశీ ప్రతినిధులకు కేటాయించిన ప్రత్యేక బాక్స్‌లో రిపోర్టర్లకు చోటు కల్పించారు. భౌతిక దూరం పాటిస్తూ, 15 మంది మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. రాజ్యసభ టీవీ, లోక్‌సభ టీవీలు కూడా ఉభయసభల్లో కార్యక్రమాలను ప్రస్తుతమున్న ఏర్పాట్ల ప్రకారమే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. దీంతోపాటు, వివిధ అధికార పత్రాలను సభ్యులకు భౌతికంగా అందజేసే అవసరాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించేలా ఏర్పాట్లు చేçపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. -
సందిగ్ధంలో పార్లమెంట్ సెషన్స్
-
షెడ్యూల్ ప్రకారమే పార్లమెంట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ షెడ్యూల్ ప్రకారమే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సమావేశాలను వాయిదా వేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే ఏ తేదీన ప్రారంభించాలనేది పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా పార్లమెంట్ వర్షకాల సమావేశాలను వాయిదా వేసే అవకాశం ఉందంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. జూన్ మొదటి లేదా రెండో వారంలో సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. -
ఫలప్రదంగా జరిగాయ్!!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిసి, నిరవధికంగా వాయిదాపడ్డాయి. జూలై 18వ తేదీ నుంచి మొదలయిన ఈ సమావేశాల సందర్భంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దీంతోపాటు కీలకమైన ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అనంతరం ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో అభ్యంతరకర వ్యాఖ్యలుండటంతో వాటిని రికార్డుల నుంచి తొలగించటం గమనార్హం. అయితే, ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో మెజారిటీ లేనికారణంగా ప్రవేశపెట్టలేకపోయింది. ఈ సమావేశాల్లో లోక్‌సభ కార్యకలాపాలు ఫలవంతంగా సాగడంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతృప్తి వ్యక్తం చేశారు. అవిశ్వాసం.. కీలక బిల్లులు గత బడ్జెట్ సమావేశాలతో పోలిస్తే ఈసారి ‘సంతృప్తికరం, ఫలప్రదం’గా జరిగాయని స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఓడిపోయింది. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లు, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే కీలక బిల్లులతోపాటు అవినీతి నిరోధక, క్రిమినల్ లా, ఆర్థిక ఎగవేతదారుల బిల్లు, బాలలకు ఉచిత, నిర్బంధ హక్కు బిల్లు, మనుషుల రవాణా వ్యతిరేక బిల్లు వంటివి 21 బిల్లులు ఆమోదం పొందాయన్నారు. ఈ సమావేశాల్లో సభ్యులు అడిగిన 4,140 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చిందన్నారు. ఇందులో 75 ప్రశ్నలకు సభలో మంత్రులు సమాధానం ఇచ్చారని తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అందజేసిన 62 నివేదికలతోపాటు సభ్యులు 128 ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారని వివరించారు. వివిధ అంశాలపై సభ్యుల నిరసనల కారణంగా 27 గంటల సభాకాలం వృథా అయింది. ‘ట్రిపుల్ తలాక్’ను చర్చించని రాజ్యసభ రాఫెల్ ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టడంతో శుక్రవారం రాజ్యసభ సజావుగా సాగలేదు. త్రిపుల్ తలాక్ బిల్లుకు సవరణలు చేయాలని, పార్లమెంట్ సెలక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో చర్చకు తీసుకోవట్లేదని రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. త్వరలో దీనిపై ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీలకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన సౌకర్యాలు, రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగాన్ని సవరించాలంటూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు విశంభర్ ప్రసాద్ నిషాద్ ప్రవేశపెట్టిన బిల్లును సభ తిరస్కరించింది. అత్యంత ఫలప్రదం జూలై 18వ తేదీ నుంచి మొదలైన వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగాయి. ఈ సెషన్లో భాగంగా 24 రోజుల్లో 17 సార్లు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఎజెండా ప్రకారం లోక్‌సభ 118 శాతం, రాజ్యసభ 74 శాతం సమర్ధంగా నడిచింది. లోక్‌సభ 21 బిల్లులు, రాజ్యసభ 14 బిల్లులను ఆమోదించాయి. 21 బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో అనువాదకుల సాయంతో ఏకకాలంలో వినే సౌకర్యం సభ్యులకు మొదటిసారిగా కల్పించారు. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా, ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లులను ఆమోదించిన ఈ సమావేశాలను సామాజిక న్యాయ ఉత్సవంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ అభివర్ణించారు. ఈ సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగటం 2000 సంవత్సరం తర్వాత ఇదే ప్రథమమని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చి సంస్థ పేర్కొంది. 16వ లోక్‌సభలో ఇదే రికార్డు. మొత్తం బిల్లుల్లో 26శాతం మాత్రమే పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు ప్రభుత్వం పంపగా ఇది 15వ లోక్‌సభలో 71శాతం, 14వ లోక్‌సభలో 60శాతం వరకు ఉంది. మొత్తం 999 ప్రైవేట్ బిల్లులను సభలో ప్రవేశపెట్టడం కూడా 2000 సంవత్సరం తర్వాత ఇదే ప్రథమం. రికార్డుల నుంచి ప్రధాని వ్యాఖ్యలు తొలగింపు కాంగ్రెస్ సభ్యుడు బీకే హరిప్రసాద్‌పై ప్రధాని మోదీ గురువారం చేసిన వ్యాఖ్యలను అభ్యంతరకరమైనవిగా భావిస్తూ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య చెప్పారు. మోదీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం అధికార పార్టీని తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టినట్లయింది. ప్రధాని మాటలను, అభ్యంతరకరంగా ఉన్నాయనే ఆరోపణలతో రికార్డుల నుంచి తీసివేయడం దేశ పార్లమెంటరీ చరిత్రలో ఇదే తొలిసారని రాజ్యసభ వర్గాలు అంటున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యర్ధిగా ప్రతిపక్షం బలపరిచిన హరిప్రసాద్‌పై ఎన్డీఏ అభ్యర్ధి హరివంశ్ గెలుపు సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ పేరులోని ‘బి.కె.’ కలిసి వచ్చేలా అమర్యాదకరమైన 3 హిందీ పదాలను వాడారు. దీంతో ఆ వ్యాఖ్యలను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మంత్రి రాందాస్ అథవలే చేసిన వ్యాఖ్యలను కూడా రికార్డుల నుంచి తొలగించినట్లు రాజ్యసభ వర్గాలు తెలిపాయి. -
ముగిసిన పార్లమెంట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. పాలక, విపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా సాగిన ఉభయ సభలూ శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇక ప్రస్తుత సమావేశాల్లో చేపట్టిన బిల్లులు, సవరణలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ సభకు వివరించిన అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగంలో వివాదాస్పద వ్యాఖ్యలను సెక్రటేరియట్ అధికారులు రికార్డుల నుంచి తొలిగించారు. డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థిగా హరివంశ్, విపక్ష అభ్యర్థిగా హరిప్రసాద్ పోటీపడ్డారు. హరివంశ్ విజయం తర్వాత ప్రసంగించిన ప్రధాని మోదీ.. డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ఇద్దరు హరిలు పోటీపడ్డారన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిని విపక్ష అభ్యర్థి హరిప్రసాద్ తప్పుపట్టారు. చైర్ హుందాతనాన్ని ప్రధాని దిగజార్చారని ఆరోపించారు. ఈ క్రమంలో మోదీ ప్రసంగంలోని కొన్నిపదాలను రాజ్యసభ సెక్రటేరియట్ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. పదప్రయోగంతో విపక్ష అభ్యర్థి ఇబ్బందిపడిన కారణంగా.. వివాదాస్పద వ్యాఖ్యలను తొలిగించిన్నట్లు అధికారులు తెలిపారు. పార్లమెంట్లో ప్రధాని ప్రసంగం నుంచి కొన్ని పదాలను తొలగించడం ఇదే తొలిసారి. పెద్దల సభలో చర్చకు రాని ట్రిపుల్ తలాఖ్.. వర్షాకాల సమావేశాల్లోనూ ప్రతిష్ఠాత్మక ట్రిపుల్‌తలాఖ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించలేదు. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టలేదు. సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేసినందున ట్రిపుల్ తలాఖ్ బిల్లును చేపట్టలేమని చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభలో తెలిపారు. ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు గతేడాదే లోక్‌సభ ఆమోదం లభించింది. రాజ్యసభలో ప్రభుత్వానికి తగిన మెజార్టీ లేకపోవడంతో వ్యతిరేకత ఎదురైంది. ఎగువసభలో అడ్డంకులను అధిగమించేందుకు ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు నిన్న కేంద్ర కేబినెట్ మూడు కీలక సవరణలు కూడా చేసింది. కానీ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రాజ్యసభ బిల్లుపై చర్చ చేపట్టలేదు. బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించనందున.. కేంద్రం ట్రిపుల్ తలాఖ్ ఆర్డినెన్స్ తీసుకురానుందని సమాచారం. -
ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు?
సాక్షి, అమరావతి : అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెలలోనే పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా బీజేపీపై ఎదురుదాడి చేసేందుకు వీలుంటుందని భావిస్తోంది. దీనిపై ఈ నెల 12న జరిగే టీడీపీ విస్తృత స్థాయి సమావేశం, టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు ఇప్పటికే టీడీపీ ముఖ్యులతో చర్చలు జరిపారు. పార్లమెంటు సమావేశాలు ఈ నెలలో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిపితే ఉపయోగం ఉంటుందని నాయకుల వద్ద సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం. 15 నుంచి 18 రోజులు సమావేశాలు జరుపుదామని పేర్కొన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన చట్టం హామీల అమలుపై పార్లమెంటులో పార్టీ ఎంపీలతో హడావుడి చేయిస్తూ.. అదే సమయంలో అవే అంశాలపై అసెంబ్లీలో చర్చించడం ద్వారా విస్తృతంగా ప్రచారం లభిస్తుందని టీడీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాగూ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదని, ఏకపక్షంగా అన్ని విషయాలపైనా మాట్లాడవచ్చని, ఒకవైపు బీజేపీపై ఎదురుదాడి చేస్తూనే మరోవైపు వైఎస్సార్సీపీపైనా విమర్శలు చేయవచ్చని వారు భావిస్తున్నారు. -
జులై 12 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈ దఫా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముందస్తుగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జులై 12 నుంచి వర్షాకాల భేటీలు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) నిర్ణయించినట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది. గత ఏడాది వర్షాకాల సమావేశాలు జులై 18న ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జులై 17న రాష్ట్రపతి ఎన్నికలు జరుగనుండటంతో ఎంపీలంతా ఢిల్లీలోనే ఉండేలా (ముందస్తుగా)జులై 12 నుంచే వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని సీసీపీఏ భావింవిస్తున్నట్లు తెలిసిందే. ఈ మేరకు జూన్ 20లోగా సీసీపీఏ చైర్మన్ రాజ్‌నాథ్ సింగ్ ఒక ప్రకటన చేస్తారని సమాచారం. రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైన పక్షంలో ఆ అంశంతోపాటు దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలు, కశ్మీర్ కల్లోలం తదితర ఘటనలపై పార్లమెంటులో వాడీవేడీ చర్చ జరిగే అవకాశం ఉంది. -
ఏపీ శాసన సభ సమావేశాలకు సర్వం సిద్ధం!
-
వివాదాలు.. నినాదాలు!
పతిపక్షం పట్టు విడవలేదు. ప్రభుత్వం బెట్టు వీడలేదు. పంతాలపై ఎవరూ తగ్గలేదు. పార్లమెంటు స్తంభించిపోయింది. నినాదాలతో దద్దరిల్లింది. వాగ్వాదాలతో గందరగోళంగా మారింది. వాయిదాలపై వాయిదాలతో గడచిపోయింది. వర్షాకాల సమావేశాల్లో బుధవారం రెండో రోజూ ఏ చర్చా లేకుండానే తుడిచిపెట్టుకుపోయింది. ప్రతిపక్షాల దాడిని.. కాంగ్రెస్ పాలనలోని రాష్ట్రాల్లో అవినీతి ఆరోప ణలను ప్రస్తావిస్తూ అధికారపక్షం ఎదురు దాడిని ఉధృతం చేసింది. కోల్‌స్కాం నిందితుడికి పాస్‌పోర్ట్ ఇప్పించాలంటూ తనను ఒత్తిడి చేశారని సుష్మా.. ఉత్తరాఖండ్ సీఎం హరీశ్‌రావత్‌పై స్టింగ్ ఆపరేషన్ సీడీలను బయటపెట్టిన నిర్మలాసీతారామన్.. వెరసి.. ప్రభుత్వంపై విపక్షం దాడి, అధికారపక్షం ఎదురు దాడిగా ఘర్షణ మరింతగా ముదురుతోంది. * పార్లమెంటులో ప్రతిష్టంభన * ఉభయసభలూ వాయిదా * వ్యాపమ్, లలిత్‌గేట్‌లపై లోక్‌సభ వెల్‌లో విపక్షాల ఆందోళన * సుష్మా, రాజే, చౌహాన్లు రాజీనామా చేయాలని డిమాండ్: నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన * సభ్యులపై స్పీకర్ ఆగ్రహం.. క్రమశిక్షణ చర్యలకు హెచ్చరిక; అధికార పక్షం ఎదురుదాడి * కాంగ్రెస్ రాష్ట్రాల సీఎంల అవినీతిపై చర్చిద్దామన్న జైట్లీ సాక్షి, న్యూఢిల్లీ: లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ కుంభకోణాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలను పదవుల నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయసభల్లోనూ తీవ్రస్థాయిలో నిరసనకు దిగాయి. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌లు పదవులకు రాజీనామా చేయనిదే ఎటువంటి చర్చనూ జరగనివ్వబోమని లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్, వామపక్షాలు, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ తదితర పార్టీలు రెండోరోజూ భీష్మించాయి. ఆ పార్టీల సభ్యులు తమ డిమాండ్లతో వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేస్తుంటే.. అధికారపక్షం ప్రతి నినాదాలకు దిగింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఆరోపణలను ప్రస్తావిస్తూ ఎదురుదాడి చేసింది. గందరగోళాల మధ్య ఉభయసభలూ ఎటువంటి కార్యకలాపాలూ జరపకుండానే గురువారానికి వాయిదాపడ్డాయి. లోక్‌సభలో విపక్షాల హోరు... బుధవారం ఉదయం 11 గంటలకు సభ సమావేశమైన తర్వాత వివిధ ప్రాంతాల్లో ప్రమాదాలు, దుర్ఘటనల్లో మరణించిన వారికి నివాళులర్పించింది. రాజమండ్రి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన 29 మందికి కూడా నివాళులు తెలిపింది. ఆ తరువాత విపక్షాల ఆందోళన, నిరసనలతో సభ హోరెత్తింది. తొలుత టీఆర్ఎస్ సభ్యులు తెలంగాణకు తక్షణమే ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఆ వెంటనే కాంగ్రెస్, వామపక్షాలు, ఎన్సీపీ తదితర పార్టీల సభ్యులు వ్యాపమ్, లలిత్‌గేట్ వివాదాలపై నినాదాలు చేస్తూ దూసుకొచ్చారు. తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యులు వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంలో స్పీకర్ సుమిత్రా మహాజన్.. వివిధ అంశాలపై వాయిదా తీర్మానాల కోసం సభ్యులు ఇచ్చిన నోటీసులను తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. ‘బడే మోదీ మెహర్బాన్, తో చోటే మోదీ పెహల్వాన్’ (బలవంతుడైనవ్యక్తి మద్దతుతో చిన్న వ్యక్తి కూడా బలవంతుడవుతాడనే హిందీ సామెతను నరేంద్రమోదీ, లలిత్మోదీలకు అన్వయించిన నినాదం), ‘ప్రధాని మౌనం వీడాలి’, ‘మోదీ గారూ 56 అంగుళాలు చూపండి.. సుష్మా, రాజేలను త్వరగా తొలగించండి’ అనే నినాదాలు రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు. సుష్మా అధికారపక్షం వైపు మొదటి వరుసలో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, రవాణామంత్రి నితిన్గడ్కారీల పక్కన కూర్చున్నారు. కాంగ్రెస్ సభ్యులు తమ చేతులపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులు ప్రదర్శించవద్దని స్పీకర్ హెచ్చరించినా వారు వాటిని కొనసాగించారు. నిరసన తెలుపుతున్న సభ్యుల చర్యను స్పీకర్ తప్పుపట్టారు. గందరగోళం కొనసాగటంతో ప్రారంభమైన 9 నిమిషాలకే సభను స్పీకర్ 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. క్రమశిక్షణ చర్యలకు స్పీకర్ హెచ్చరిక... సభ తిరిగి 12 గంటలకు ప్రారంభమైన తర్వాత.. సానియామీర్జా సహా అంతర్జాతీయ విజయాలు సాధించిన పలువురు క్రీడాకారులకు స్పీకర్ అభినందనలు తెలిపారు. అనంతరం.. సభలో వ్యవహరించాల్సిన తీరు, సభామర్యాదలకు సంబంధించి స్పీకర్ ప్రకటన చేస్తూ 349, 351, 352 నిబంధనలను చదివి వినిపించారు. సభ్యులు వీటికి కట్టుబడి ఉండడం లేదని, వీటిని అనుసరించని పక్షంలో తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పీకర్ హెచ్చరించారు. దీంతో కాంగ్రెస్, వామపక్షాల ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లయింది. వారు మళ్లీ వెల్‌లోకి దూసుకెళ్లారు. టీఆర్ఎస్ సభ్యులు కూడా తమ ప్రత్యేక హైకోర్టు డిమాండ్‌తో వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో పది నిమిషాల్లోనే స్పీకర్ సభను 2 గంటల పాటు వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు సభ సమావేశమైన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగటంతో రెండు నిమిషాలకే ఉప సభాపతి ఎం.తంబిదురై సభను గురువారానికి వాయిదా వేశారు. ఈ గందరగోళం మధ్యలోనే.. భూసేకరణ బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లీమెంటరీ సంఘం గడువును పొడిగించాలన్న తీర్మానానికి ఆమోదం తెలిపారు. రాజ్యసభలో వాగ్వాదాల జోరు: అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి. బుధవారం ఉదయం సమావేశమయ్యాక.. వివిధ ప్రమాదాల్లో మృతిచెందిన వారికి నివాళులు అర్పించిన వెంటనే కాంగ్రెస్, బీఎస్పీ, వామపక్షాలు సుష్మా, వసుంధర, చౌహాన్లు పదవులకు రాజీనామాలు చేయనిదే సభలో ఎలాంటి చర్చా సాధ్యం కాదని భీష్మించాయి. సాధారణ కార్యకలాపాలను నిలిపివేసి లలిత్‌మోదీ, వ్యాపమ్స్కాంపై చర్చ జరపాలని 267 నిబంధన కింద నోటీసులు ఇచ్చినట్లు సతీశ్చంద్రమిశ్రా (బీఎస్పీ), నరేశ్అగర్వాల్ (ఎస్పీ), తపన్కుమార్సేన్ (సీపీఎం), డి.రాజా (సీపీఐ)లు తెలిపారు. లలిత్‌కు సాయం చేయటంలో చట్టంలోని ఏ ఒక్క నిబంధనను సుష్మా ఉల్లంఘించారో స్పష్టంగా చెప్పాలని.. సభా నాయకుడు అరుణ్‌జైట్లీ విపక్షాలను ప్రశ్నించారు. విపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. వాయిదానోటీసులు ఇచ్చిన సభ్యు లు మాట్లాడేందుకు అనుమతించాలని పేర్కొనగా.. అందుకు జైట్లీ నిరసన వ్యక్తం చేస్తూ ఇటువంటి ఆచరణను ప్రతిరోజూ అనుమతించవచ్చా అని ప్రశ్నించారు. ‘‘నినాదాల రాజకీయాలు చాలు. మీరు చర్చ ప్రారంభించండి.’’ అని అన్నారు. వారు రాజీనామా చేయాలి: విపక్ష నేతలు ‘నేను తినను, తిననివ్వను’ అని బీరాలు పోయిన వారి బండారాన్ని వ్యాపమ్స్కాం బయటపెట్టిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రధానిపై విమర్శలు ఎక్కుపెట్టారు. వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాలని జేడీయూ నేత శరద్‌యాదవ్ పేర్కొన్నారు. దర్యాప్తులో వారు నిర్దోషులుగా తేలితే వారు మరింత బలపడతారని వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణగా.. 1990ల్లో జైన్ హవాలా కేసులో తమ పేర్లు వచ్చినపుడు తాను, బీజేపీ నేత అద్వానీ రాజీనామాలు చేసిన ఉదంతాన్ని ప్రస్తావించారు. ‘వ్యాపమ్’ ఒక రాష్ట్ర అంశం: జైట్లీ వ్యాపమ్ కుంభకోణం అనేది ఒక రాష్ట్ర అంశమని.. రాష్ట్ర అంశాలను పార్లమెంటులో చర్చించేలా నిబంధనలు మార్చి, కొత్త సంప్రదాయాలు నెలకొల్పాలని విపక్షం భావిస్తే.. తొలుత కేరళ, హిమాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరీ అస్సాం, గోవాలకు సంబంధించిన అంశాలను చర్చించాలని.. జైట్లీ ఎదురుదాడికి దిగారు. సుష్మాస్వరాజ్‌కు సంబంధించిన విషయాన్ని చర్చించాలని ప్రతిపక్షాలు కోరుకుంటే.. ఆ చర్చను ప్రారంభించాలన్నారు. అయితే.. వ్యాపమ్ ఒక రాష్ట్రానికి పరిమితమైన అంశం కాదని, ఆ స్కాంతో సంబంధమున్న వారు మధ్యప్రదేశ్‌కు వెలుపల అనుమానాస్పదంగా చనిపోయారని సీపీఎం నేత సీతారాం ఏచూరి వాదించారు. సభ కొనసాగినంతసేపూ, వాయిదాలు వాగ్వివా దాలతోనే సాగింది. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ రెండో రోజు కూడా ఎలాంటి కార్యక్రమాలు జరగకుండానే గురువారానికి వాయిదా పడింది. పార్లమెంటులో పరిశోధన విభాగం: పార్లమెంట్లో కొత్తగా ఒక పరిశోధన విభాగం ఏర్పడనుంది. పార్లమెంట్లో జరిగే చర్చల్లో పాల్గొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ పలువురు ఎంపీలు స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు విజ్ఞప్తి చేయడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హైకోర్టు కోసం టీఆర్ఎస్ ఎంపీల నిరసన తెలంగాణ రాష్ట్రానికి తక్షణమే ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు బుధవారం లోక్‌సభలో ఆందోళనకు దిగారు. సభ సమావేశమైన వెంటనే.. టీఆర్ఎస్ ఎంపీలు పది మంది వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు మొదలుపెట్టారు. ప్రత్యేక హైకోర్టు డిమాండ్‌తో ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి తమ తమ స్థానాల్లో నిల్చొని ప్రత్యేక హైకోర్టు కావాలని ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రం విడిపోయి సంవత్సరమైంది. ఇప్పటివరకు పార్లమెంటు నాలుగు పర్యాయాలు సమావేశమైంది. ప్రతి సమావేశాల్లోనూ ప్రత్యేక హైకోర్టు ఇవ్వాలని అడుగుతున్నాం. మా ముఖ్యమంత్రి.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, న్యాయమంత్రి, హోంమంత్రిని కలిశారు. తప్పకుండా చేస్తామన్నారు. కానీ చేయలేదు. రాష్ట్రం విడిపోయినప్పుడు మొట్టమొదట హైకోర్టు ఏర్పాటుచేస్తారు. కానీ కేంద్ర కేబినెట్ మంత్రులు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతూ రావాల్సిన హైకోర్టు రాకుండా చేస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. తెలంగాణ కేసులన్నీ కూడా ఆంధ్రా హైకోర్టు న్యాయమూర్తుల వద్దకు వెళితే మాకు న్యాయం జరగడం లేదని మొదటి నుంచి చెప్తున్నాం. హైకోర్టు మాకు వచ్చేంతవరకు మేం నిరసన తెలుపుతాం’’ అని పేర్కొన్నారు. ఎంపీ కె.కవిత మాట్లాడుతూ ‘‘ఈ ప్రధానమంత్రి కేబినెట్లోని సీనియర్ మంత్రులు కొందరు హైకోర్టు విభజన కాకుండా ఆపుతున్నారని తెలిసింది. అందువల్ల ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన తెలంగాణ ప్రజల పక్షాన నిలుస్తారని ఆశిస్తున్నాం. ఈ సమావేశాలు ముగిసేంతవరకు రోజూ నిరసన కొనసాగిస్తాం. పార్లమెంటును స్తంభింపజేసేందుకు ప్రయత్నిస్తాం’’ అని చెప్పారు. కోల్గేట్ నిందితుడికి పాస్‌పోర్ట్ కోసం ఒత్తిడి చేశారు: సుష్మా న్యూఢిల్లీ: కోల్గేట్ కుంభకోణంలో నిందితుడు సంతోష్ బగ్రోదియాకు ‘డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్’ ఇప్పించాలంటూ కాంగ్రెస్ నేత ఒకరు తనపై ఒత్తిడి తెచ్చారంటూ కేంద్రమంత్రి సుష్మ ట్విటర్లో బాంబు పేల్చారు. ‘‘కోల్ స్కాం నిందితుడు సంతోష్ బగ్రోదియాకు డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఇప్పించాల్సిందిగా కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు నాపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ నేతపేరును పార్లమెంటులో వెల్లడిస్తా..’’అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. పార్లమెంటు ఆవరణలో చేపట్టదలచిన మౌన దీక్షను కాంగ్రెస్ వాయిదా వేసుకుంది.