సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా సీఎంల పేర్లతో మరోసారి పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందరావు విమర్శలు గుప్పించారు. బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కిరణ్‌కుమార్‌రెడ్డి శిష్యుడంటూ చేస్తున్న ప్రచారంపైనా రఘునందన్ కౌంటర్ ఇచ్చారు.
కేసీఆర్ సంజయ్ గాంధీ శిష్యుడు కదా?.. నేర్చుకునేటప్పుడు ఎవరు ఎవరికైన శిష్యుడిగా ఉండొచ్చు. ఆంధ్ర సీఎంల పేర్లతో కేసిఆర్ మరోసారి పబ్భం గడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే పని చేయన్నోల్లు మహారాష్ట్రలో ఏమీ చేస్తారు ?. మహారాష్ట్ర స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిచిన స్థానాలు ఎన్ని? అంటూ సెటైర్లు సంధించారు రఘునందన్.
నగర కమిషన్ వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసే పరిస్థితి హైదరాబాద్‌లో ఉంది. అసలు చిన్న వానకే ట్రాఫిక్ ఎందుకు అవుతుందని సమీక్ష చేసారా?. ఇదేనా భాగ్యనగర్ ఎదుగుదల?. మున్సిపల్ మీటింగ్‌లకు ఆ శాఖ మంత్రే హాజరు కావడం లేదు. అందుకే.. సభలో వరదల మీద చర్చ జరపాలి.
రైతు రుణ మాఫీ అనేది బ్యాంకులు చేయవు. ప్రభుత్వం చేస్తుంది. రుణ మాఫీ చేయకుంటే సెక్రటేరియట్ ముందు లేదా ఆ శాఖ మంత్రి ఇంటి ముందు ధర్నా చేయాలి. ఇది కాంగ్రెస్ కు తెలీదు. ఎందుకంటే.. ఇదంతా ఎన్నికల ముందు కాంగ్రెస్-బీఆర్‌ఎస్ కలిసి ఆడుతున్న డ్రామా కాబట్టి.
కార్మికులు, ఉద్యోగుల సమస్యపైనా..
తెలంగాణ వస్తే.. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరని చెప్పారు కదా?. మరి మీ సొంత జిల్లాలో ఎంత మంది కాంట్రాక్ట్ కార్మికులు సంఖ్య ఎంత? పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య ఎంత? చర్చకు సిద్ధమా?. కాళేశ్వరం రుణాలపై చర్చ సభలో పెట్టండి. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు మీదా సభలో మాట్లాడాలి. ప్రతి మండలంలో పంచాయతీ కార్మికులు ధర్నా చేస్తున్నారు. వాటి మీద చర్చిద్దాం. హైదరాబాద్‌లో అమ్మిన భూములు ఎంత? దాని విలువ ఎంత? ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు ?. మైనారిటీ బంధు ఇస్తామంటున్నారు. రాష్ట్రంలో అధిక జనాభా బీసీ బందు ఎందుకు ఇవ్వరు?..
సర్కార్ కొలువున్నా.. హుజూరాబాద్ లో దళిత బంధు ఇచ్చారు. అదే విధంగా అన్ని నియోజకర్గాల్లోనూ ఇవ్వాలి. గృహలక్ష్మి అంటున్నరు.. అందులో కేంద్రం వాటా చెప్పరు. కట్టిన ఇళ్ళ రంగులు పోతున్నాయి..పేదలకు మాత్రం ఇవ్వట్లేదు. Ghmc లో ఎన్ని డబుల్ ఇళ్లు కావాలనే అంచనా మీకుందా? అని ప్రభుత్వాన్ని నిలదీశారాయన.
నాతో చెప్పించుకోవడం సిగ్గు చేటు
మేము నిర్ణయించిన రోజులే శాసన సభ జరగాలి అనేది మూర్ఖపు ఆలోచన. ప్రతిపక్షం అంటేనే ప్రజల గొంతుక. ఎన్నికలు ఎప్పుడొస్తాయో మీకు తెలుసు. ఇవే చివరి సమావేశాలు కాబట్టి.. రోజుకో అజెండాతో శాసన సభ 30 రోజులు నడపాలి. ప్రతిపక్ష సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రజా సమస్యలు చర్చించే శాసన సభను నెల రోజులు నడపకపోవడం దురదృష్టకరం. ఈ విషయంలో కేంద్రాన్ని చూసి నేర్చుకోవాలి. సంప్రదాయాలు పాటించరు! బీఎస్సీ మీటింగ్‌కు పిలవురు. ఈ విధంగా సభ నిర్వహించడం బాధాకరం. ఉన్న ముగ్గురికి సభలో మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు భయమెందుకు? బలం మీదే అని అంటున్నప్పుడు.. నెలపాటు సభ నడపడానికి అభ్యంతరం ఏంటి?. నాలాంటి కొత్త సభ్యులతో ఇలాంటి సూచన చెప్పించుకోడం సిగ్గు చేటు.
30రోజులు సభ నడపాలని బీజేపీ తరపున సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తున్నాం. నేరుగా లేఖ ఇచ్చే అవకాశం మాకు లేదు కాబట్టి మీడియా ముఖంగా ఈ లేఖ రాస్తున్నాం. కేంద్ర నిధుల మీద అఖిల పక్షం మీటింగ్ పెట్టాలి. చర్చించేందుకు మేము సిద్ధం అని ఎమ్మెల్యే రఘునందర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment