సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కల్వ కుంట్ల కుటుంబంలోని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్, ఎంపీ సంతోష్ పోటీ చేయాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు సవాల్ విసిరారు. వీరంతా పోటీచేసినా ఓటమి చెందుతారని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గుర్తింపు కోల్పోవడం ఖాయమన్నారు. శనివారం రఘునందన్‌రావు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ ఉందా.. అని మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ నేతలకు పార్టీ సత్తా ఏంటో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూపెడ తామన్నారు. ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
టికెట్లు అమ్ముకోవడం బీఆర్‌ఎస్‌కు అలవాటు
పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా రూ.వందల కోట్లు సమర్పించుకున్న వారికే టికెట్లు అమ్ముకోవడం బీఆర్‌ఎస్ అధినా యకులకు అలవాటని రఘునందన్ ఆరోపించారు. పార్టీనే నమ్ము కున్న ఎర్రోళ్ల శ్రీనివాస్ వంటి వాళ్లకు టికెట్లు ఇవ్వరని వ్యాఖ్యా నించారు. టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకున్న ప్పుడే తెలంగాణతో ఆ పార్టీ పేగు బంధం తెగిపోయిందన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే హుస్సేన్ సాగర్‌లో వేసినట్టేనన్నారు.
ఆ విషయంపై హరీశ్ సమాధానం చెప్పాలి
కేఆర్‌ఎంబీకి రాష్ట్రంలోని ప్రాజెక్టులు అప్పజెప్పడం వల్ల నష్టం జరుగుతుందంటూ, భవిష్యత్తులో కృష్ణా జలాల్లో తెలంగాణకు నీటివాటా లభ్యం కాదంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడడం సరికాదని రఘునందన్ అన్నారు. 2014–2019 మధ్య నాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమ క్షంలో... కృష్ణానదీ జలాల పంపకాల సమావేశంలో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ హాజరై 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు చా లని సంతకం పెట్టింది వాస్తవమా.. కాదా..? అని నిలదీశారు. ఈ విషయమై హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌కు ఈ విషయాలు తెలియవా అని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment