నిర్మల్ : దిలావర్ పూర్‌లో ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ స్థానికులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీసింది తెలిసిందే. దీంతో కలెక్టర్ పనులను ఆపేయించారు. అయితే ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా.. కాంగ్రెస్ కౌంటర్‌కు దిగింది.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘దిలావర్‌పూర్ ఇథనాల్ పరిశ్రమ బీఆర్‌ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడిదే. ఇథనాల్ ఫ్యాక్టరీతో జనాల్ని ముంచాలని కేసీఆర్ చూశారు. అందుకే తలసాని కొడుకు సాయి సంస్థకు అప్పగించారు. కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది కేసీఆర్, కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వానికి, ఆ ఇథనాల్ కంపెనీకి సంబంధం ఏంటి? ఇథనాల్ ఫ్యాక్టరీ ఎవరిదో తేల్చుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు దిలావర్ పూర్‌కి రావాలి. వారితో పాటు మేమూ వస్తాం. అక్కడికి వెళ్లి తప్పెవరిదో? తేల్చుకుందాం’ అని అన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీపై పూర్వపరాలు పరిశీలించాకే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారాయన.
కాగా, నిర్మల్ జిల్లా దిలావర్ పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీస్‌స్టేషన్ నుంచి నిర్మల్ - భైంసా రహదారి వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానికుల నిరసనతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనలో భారీగా పాల్గొన్న మహిళలు. ఇథనాలు పరిశ్రమను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చిరించారు. దీంతో అధికార యంత్రాగం పనుల్ని ఆపేయించి.. చర్చలకు పిలిచింది. అదే సమయంలో..
ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. గత ప్రభుత్వ హయాంలో ఈ అనుమతులు జారీ అయ్యాయని గుర్తించింది. ఫ్యాక్టరీ అనుమతులపై సమీక్షించి.. అవసరమైతే వాటిని రద్దు చేయాలని యోచిస్తోన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment