
జులై 12 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈ దఫా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముందస్తుగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జులై 12 నుంచి వర్షాకాల భేటీలు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) నిర్ణయించినట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది.
గత ఏడాది వర్షాకాల సమావేశాలు జులై 18న ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జులై 17న రాష్ట్రపతి ఎన్నికలు జరుగనుండటంతో ఎంపీలంతా ఢిల్లీలోనే ఉండేలా (ముందస్తుగా)జులై 12 నుంచే వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని సీసీపీఏ భావింవిస్తున్నట్లు తెలిసిందే. ఈ మేరకు జూన్ 20లోగా సీసీపీఏ చైర్మన్ రాజ్‌నాథ్ సింగ్ ఒక ప్రకటన చేస్తారని సమాచారం.
రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైన పక్షంలో ఆ అంశంతోపాటు దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలు, కశ్మీర్ కల్లోలం తదితర ఘటనలపై పార్లమెంటులో వాడీవేడీ చర్చ జరిగే అవకాశం ఉంది.