ముషీరాబాద్(హైదరాబాద్): ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో బీసీ సంఘాల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో సోమవారం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని బీసీ, కుల, ఉద్యోగ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెల 27న బీసీల డిమాండ్లపై లక్షమందితో పార్లమెంట్‌ను ముట్టడిస్తామన్నారు. ఆదివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో 48 బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment