
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ షెడ్యూల్ ప్రకారమే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సమావేశాలను వాయిదా వేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే ఏ తేదీన ప్రారంభించాలనేది పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా పార్లమెంట్ వర్షకాల సమావేశాలను వాయిదా వేసే అవకాశం ఉందంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. జూన్ మొదటి లేదా రెండో వారంలో సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment